mla ramakrishna reddy
-
ఎమ్మెల్యే తీరుపై రగిలిపోతున్న పార్టీ కేడర్
సాక్షి, కాకినాడ: జన్మభూమి సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వర్గాల మధ్య నెలకొన్న వివాదం చిలికిచిలికి గాలివానగా మారి ఆ పార్టీలో అసమ్మతికి తెరలేపింది. ఇప్పటికే ఎమ్మెల్యే తీరుపై తీవ్ర అసహనంతో ఉన్న టీడీపీ కేడర్ ఇప్పుడు బాహాటంగానే తమ అసంతృప్తిని వెళ్ల్లగక్కుతుండడం పార్టీ వర్గాల్లో కలవరం మొదలైంది. ఇది కాస్తా పార్టీ అధినేత చంద్రబాబునాయుడుతో పాటు ఆయన తనయుడు లోకేష్‌కు ఫిర్యాదు చేసేవరకు వెళ్లింది. ఎమ్మెల్యే ఒంటెత్తు పోకడలతో ఇప్పటికే అనపర్తి జెడ్పీటీసీ సభ్యుడు కర్రి ధర్మారెడ్డి (దొరబాబు) పార్టీ కార్యకలాపాలకు చాలాకాలంగా దూరమయ్యారు. ఇటీవల జరిగిన జన్మభూమి సభలకూ ఆయన గైర్హాజరయ్యారు. వారిరువురి మధ్యా ఎమ్మెల్యే తండ్రి మూలారెడ్డి కుదిర్చిన సయోధ్య ఎంతోకాలం నిలువలేదని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. పైగా ఎమ్మెల్యేపై అలకబూనిన జెడ్పీటీసీ సభ్యుడితో పాటు మరికొందరు నేతలు, కార్యకర్తలు ఇటీవల రహస్యంగా సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించి, అదే విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లినట్టు తెలిసింది. ఓ వైపు వైఎస్సార్ సీపీ కో–ఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి ఎమ్మెల్యే అవినీతిపై పోరాటం చేస్తున్న నేపథ్యంలో తాజాగా నెలకొన్న అంతర్గత వివాదం ఆ పార్టీ నేతలకు మింగుడుపడడంలేదు. ఇదిలా ఉంటే ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డికి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ రాకుండా ఆయన బంధువర్గం నుంచి కూడా ప్రయత్నాలు గట్టిగానే జరుగుతున్నాయని టీడీపీ వర్గాల సమాచారం. ప్రస్తుతం జిల్లా స్థాయి పదవిలో ఉన్న బంధువు ప్రస్తుతంగా అంతర్గతంగా నెలకొన్న వ్యవహారాన్ని తనకు అనుకూలంగా మలుచుకునేందుకు పావులుకదుపుతున్నారంటున్నారు. ఈ వ్యవహారం అనపర్తి నియోజకవర్గంతోపాటు జిల్లా టీడీపీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారం ఎలా ముగుస్తుందోనన్న ఆసక్తి ఆ పార్టీ శ్రేణుల్లో నెలకొంది. -
చంద్రబాబుకు ముందే తెలుసు
పెద్దనోట్ల రద్దుపై ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి హాలియా: కేంద్ర ప్రభుత్వం రూ.1000, 500 నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి ముందే తెలుసని ఏపీకి చెందిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు. శనివారం ఆయన మాచర్ల వెళ్తూ నల్లగొండ జిల్లా హాలియాలో తన మిత్రుడి వద్ద కొద్దిసేపు ఆగారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ నోట్ల రద్దుతో సామాన్యులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం నోట్ల కొరతను ముందుగా ఊహించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ఉంటే పేదలకు కష్టాలు ఉండేవికావన్నారు. ఏపీలో దోపిడీ పాలన కొనసాగుతోందని, సీఎం కుమారుడు లోకేశ్ తెరచాటున పైరవీలు చేస్తూ రూ.కోట్లు గడిస్తున్నారని ఆరోపించారు. గుంటూరు సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల భవనాన్ని తిరిగి లీజుకు రారుుంచడంలో లోకేశ్ పాత్ర ఉందన్నారు. మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో వైఎస్ జగన్ ఏనాడూ పైరవీలకు తావివ్వలేదన్నారు. చంద్రబాబు పాలనను ప్రజలు గమనిస్తున్నారని, 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. -
బాబుకు ఆ అర్హత లేదు : ఎమ్మెల్యే ఆర్కే
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన సీఎం చంద్రబాబుకు లీడర్ ఆఫ్ ది హౌస్‌గా కొనసాగే అర్హత లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చెప్పారు. హైదరాబాద్‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. విచారణ అంటే ఎందుకంత భయమని చంద్రబాబును ఎమ్మెల్యే ఆర్కే సూటిగా ప్రశ్నించారు. ఓటుకు కోట్లు కేసులో సీఎం నిజాయితీ నిరూపించుకునేందుకు మంచి అవకాశం వచ్చిందన్నారు. కేసు విచారణ జరగకుండా బాబు స్టే ఎందుకు తెచ్చుకున్నారో చెప్పాలన్నారు. -
బాబుకు ఆ అర్హత లేదు : ఎమ్మెల్యే ఆర్కే
-
ఏం చర్యలు తీసుకున్నారు?
కృష్ణానది ఒడ్డున అక్రమ నిర్మాణాలపై సర్కారుకు హైకోర్టు ప్రశ్న సాక్షి, హైదరాబాద్: కృష్ణానది ఒడ్డున పెద్దఎత్తున జరుగుతున్న అక్రమ నిర్మాణాల విషయంలో ఏం చర్యలు తీసుకున్నారో తెలపాలని హైకోర్టు సోమవారం రాష్ట్ర నీటిపారుదలశాఖ అధికారుల్ని ఆదేశించింది. ముఖ్యంగా నిర్మాణదారులకు సంబంధిత తహసీల్దార్ నోటీసులు జారీ చేసిన తరువాత ఈ వ్యవహారంలో ఏం పురోగతి ఉందో చెప్పాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను వచ్చేవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్టులో ఈ పిల్ దాఖలు చేశారు. -
ప్రకాశం బ్యారేజీ పై రైతుల ఆందోళన
-
ప్రకాశం బ్యారేజిపై ఎమ్మెల్యే ఆర్కే బైఠాయింపు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో బలవంతపు భూసేకరణ ఆపాలంటూ రైతులు ప్రకాశం బ్యారేజిపై నిరసనకు దిగారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ రైతులు కూరగాయలు, పండ్లు, పూలు ఉచితంగా పంపిణీ చేశారు. రైతులకు సంఘీభావం తెలియజేస్తూ మంగళగిరి వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రకాశం బ్యారేజి వద్ద బైఠాయించారు. ఈ ప్రాంతంలో భారీగా పోలీసులు బలగాల మోహరించారు. రాజధాని ప్రాంతంలో భూసేకరణ చట్టం ప్రయోగించనున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. పంట పొలాలను తాము ఇచ్చేదిలేదంటూ రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. -
'ధైర్యం ఉంటే భూసేకరణ చట్టం ప్రయోగించండి'
-
ధైర్యం ఉంటే భూసేకరణ చట్టం ప్రయోగించండి
ఏపీ సర్కారుకు ధైర్యం ఉంటే భూసేకరణ చట్టాన్ని ప్రయోగించి చూడాలని, ఫలితం ఎలా ఉంటుందో చూడాలని మంగళగిరి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) సవాలు చేశారు. ఏపీ ప్రభుత్వం భూసేకరణ చట్టం ప్రయోగిస్తామంటూ రైతులను భయభ్రాంతులకు గురి చేస్తోందన్నారు. హైదరాబాద్‌లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజధాని రైతుల పిటిషన్లో న్యాయం ఉందని కోర్టు భావించినందువల్లే వారికి అనుకూలంగా తీర్పు ఇచ్చిందని ఆయన అన్నారు. ఇప్పటివరకు ల్యాండ్ పూలింగ్ పేరుతో ప్రభుత్వం ఎందుకు దగా చేసిందని ప్రశ్నించారు. భూసేకరణ చట్టాన్ని డిసెంబర్ నెలలోనే ఎందుకు ఉపయోగించలేదని అడిగారు. మేథాపాట్కర్, అన్నాహజారే, శివరామకృష్ణన్ తదితరులు ఏ పార్టీకి చెందినవారని ఆర్కే నిలదీశారు. చంద్రబాబు ఇప్పటికైనా కళ్లు తెరవాలని హితవు పలికారు. ప్రభుత్వం గనక భూసేకరణ చట్టం ప్రయోగిస్తే.. న్యాయస్థానం మెట్లు ఎక్కేందుకు రైతులంతా సిద్ధంగా ఉన్నారని ఆయన స్పష్టం చేశారు.