
ప్రకాశం బ్యారేజిపై ఎమ్మెల్యే ఆర్కే బైఠాయింపు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో బలవంతపు భూసేకరణ ఆపాలంటూ రైతులు ప్రకాశం బ్యారేజిపై నిరసనకు దిగారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ రైతులు కూరగాయలు, పండ్లు, పూలు ఉచితంగా పంపిణీ చేశారు.
రైతులకు సంఘీభావం తెలియజేస్తూ మంగళగిరి వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రకాశం బ్యారేజి వద్ద బైఠాయించారు. ఈ ప్రాంతంలో భారీగా పోలీసులు బలగాల మోహరించారు. రాజధాని ప్రాంతంలో భూసేకరణ చట్టం ప్రయోగించనున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. పంట పొలాలను తాము ఇచ్చేదిలేదంటూ రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.