కృష్ణానది ఒడ్డున అక్రమ నిర్మాణాలపై సర్కారుకు హైకోర్టు ప్రశ్న
సాక్షి, హైదరాబాద్: కృష్ణానది ఒడ్డున పెద్దఎత్తున జరుగుతున్న అక్రమ నిర్మాణాల విషయంలో ఏం చర్యలు తీసుకున్నారో తెలపాలని హైకోర్టు సోమవారం రాష్ట్ర నీటిపారుదలశాఖ అధికారుల్ని ఆదేశించింది. ముఖ్యంగా నిర్మాణదారులకు సంబంధిత తహసీల్దార్ నోటీసులు జారీ చేసిన తరువాత ఈ వ్యవహారంలో ఏం పురోగతి ఉందో చెప్పాలని స్పష్టం చేసింది.
తదుపరి విచారణను వచ్చేవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్టులో ఈ పిల్ దాఖలు చేశారు.
ఏం చర్యలు తీసుకున్నారు?
Published Tue, Mar 1 2016 1:43 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM
Advertisement
Advertisement