సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో పెనుదుమారం రేపిన ఓటుకు కోట్లు కేసులో ఏసీబీ కోర్టు మంగళవారం విచారణ కొనసాగించింది. వాదనలు విన్న ధర్మాసనం విచారణను ఏప్రిల్ 20కి వాయిదా వేసింది. ఈ కేసులో ఏ2 నిందితుడిగా ఉన్న సెబాస్టియన్ కోర్టుకు హాజరయ్యారు. (తెరపైకి మరోసారి ఓటుకు కోట్లు కేసు)
కోర్టుకు హాజరయిన అనంతరం సెబాస్టియన్ ‘సాక్షి’తో మాట్లాడుతూ.. తనను ఈ కేసులో అన్యాయంగా ఇరికించి.. అసలు దోషులను వదిలేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ప్రాణ ఉందని.. రక్షణ కల్పించాలని కోరారు. బెదిరింపులు, దాడులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. టీడీపీ తనను ఈ కేసులో ఇరికించిందన్నారు. ఆడియో టేపుల ఫోరెన్సిక్ రిపోర్ట్‌పై విచారణ జరిగితే కీలక వ్యక్తులు వెలుగులోకి వస్తారని చెప్పారు. స్టీఫెన్‌సన్‌కు ఇవ్వజూపిన నగదు ఎక్కడ నుంచి వచ్చిందో విచారణ జరగాలన్నారు. ఈ కేసులో అసలు సూత్రధారి ఎవరో ప్రజలందరికి తెలుసన్నారు. నిజనిజాలన్ని కోర్టుకు తెలుపుతానని అందుకే సూత్రధారులతో ప్రాణహాని ఉందని సబాస్టియన్ పేర్కొన్నారు. (రేవంత్ మెడ చుట్టూ బిగుస్తున్న కేసుల ఉచ్చు)
Comments
Please login to add a commentAdd a comment