సాక్షి, హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసులో భాగంగానే తనపై ఐటీ దాడులు జరిగాయని ఈ కేసులో నిందితుడైన సెబాస్టియన్ తెలిపారు. విచారణకు హాజరు కావాలని ఇచ్చిన నోటీసుల నేపథ్యంలో ఆయన సోమవారం ఐటీ కార్యాలయంలో అధికారుల ముందు హాజరయ్యారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సీబీఐ, ఈడీ సూచన మేరకే ఐటీ దాడులు జరిగాయన్నారు. స్టీఫెన్‌సన్‌కు ఇవ్వ జూపిన రూ. 50 లక్షలు ఎక్కడి నుంచి తెచ్చారని, తర్వాత ఇస్తామన్న రూ. 4.50 కోట్లు ఎక్కడున్నాయని తనని ప్రశ్నించారని చెప్పారు. ఆ డబ్బుతో తనకు సంబంధం లేదని, స్టీఫెన్‌సన్ ఇంట్లో నోట్ల కట్టలు చూడగానే అక్కడి నుంచి వెళ్లిపోయానని, ఆ తర్వాతే తనను పిలిచి అరెస్ట్ చేశారని వారికి వివరించినట్లు సెబాస్టియన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment