vote for cash
-
నేడు సుప్రీంలో ‘ఓటుకు నోటు’ విచారణ
న్యూఢిల్లీ, సాక్షి: దాదాపు దశాబ్దం కిందట.. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు రేపిన ఓటుకు నోటు కేసు నేడు సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అనుముల రేవంత్ రెడ్డి.. ప్రస్తుతం ముఖ్యమంత్రి గా ఉండడంతో ఈ కేసు విచారణ వేరే ప్రాంతానికి బదిలీ చేయాలంటూ పిటిషన్ దాఖలైన సంగతి తెలిసే ఉంటుంది.బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఈ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను జస్టిస్ బి.ఆర్ గవాయి, జస్టిస్ సతీష్ చంద్ర మిశ్రా, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం విచారణ జరపనుంది.2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బు ఎర చూపి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. నాటి టీడీపీ నేత రేవంత్‌రెడ్డిని ఇందుకు మధ్యవర్తిగా నియమించారు. టీడీపీ అభ్యర్థికి ఓటేయాలంటూ నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్సన్కు డబ్బు ఇస్తూ రేవంత్ తెలంగాణ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. తదనంతర పరిణామాల్లో.. ఆయన అరెస్ట్ కూడా అయ్యారు.చంద్రబాబు ప్రలోభ పర్వాన్ని తెలంగాణ ఏసీబీ బయటపెట్టింది. ఫోన్లో మాట్లాడుతూ.. ‘‘మనోళ్లు బ్రీఫ్డ్ మీ’’ అని చంద్రబాబున్నారు. ఆ గొంతు బాబుదేనని ఫోరెన్సిక్ సైతం నిర్ధారించింది. మరోవైపు ఈ కేసులో చంద్రబాబునాయుడును నిందితుడిగా చేర్చాలంటూ ఆళ్ల గడ్డ రామకృష్ణారెడ్డి(ఆర్కే) వేసిన పిటిషన్ సుప్రీం కోర్టులో విచారణ జరుగుతోంది. తెలంగాణ ఏసీబీ ఈ కేసు ఛార్జిషీట్లో చంద్రబాబు పేరును 22 సార్లు ప్రస్తావించింది. అయినా కూడా ఆయన పేరును నిందితుడిగా చేర్చకపోవడాన్ని ఆర్కే తన పిటిషన్ ద్వారా లేవనెత్తారు.సంబంధిత వార్త: అందుకే సీబీఐ ఈ కేసు దర్యాప్తు చేయాలి -
ఓటేయకుంటే జరిమానా, లైసెన్స్ రద్దు!
కరీంనగర్ అర్బన్: మన దేశంలో కొన్నిచోట్ల 60 శాతం ఓటింగ్ జరిగితే గొప్పగా చెప్పుకునే పరిస్థితి ఉంది. అందుకే దీన్ని హక్కుగా చూడకుండా బాధ్యతగా తీసుకోవాలని ఎన్నికల సంఘం సూచిస్తోంది. ఓటు వేయడాన్ని తప్పనిసరి చేయాలన్న డిమాండ్ కూడా ప్రజాస్వామ్యవాదుల నుంచి బలంగా వినిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 31 దేశాల్లో ఓటు వేయడం తప్పనిసరి. వేయకుంటే కొన్ని దేశాలు జరిమానా విధిస్తుండగా, మరికొన్ని ప్రభుత్వ సాయాన్ని, సదుపాయాలను నిలిపివేస్తున్నాయి. ఇంకొన్ని దేశాల్లోనైతే అలాంటి వారికి ఏకంగా ఓటుహక్కును తొలగించేస్తున్నారు. ఎందుకు ఓటు వేయలేకపోయారో సరైన కారణం చూపితే గానీ మళ్లీ ఆ హక్కును కల్పించరు. తప్పనిసరిగా ఓటు వేయాల్సిన దేశాల్లో బెల్జియం, అమెరికా, ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, అర్జెంటీనా, బొలీవియా, ఉక్రెయిన్, బ్రెజిల్, ఈజిప్టు, గ్రీస్, ఇటలీ, మెక్సికో, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయిలాండ్, టర్కీ, స్విట్జర్లాండ్, న్యూజిలాండ్ తదితరాలు ఉన్నాయి. బెల్జియం : 10 వేల యూరోల వరకు జరిమానా ఈ దేశంలో ఓటరు జాబితాలో పేరు ఉండి, వరుసగా నాలుగుసార్లు ఓటెయ్యకపోతే.. పదేళ్ల వరకు ఓటుహక్కు తొలిగిస్తారు. మొదటిసారి ఓటు వేయకపోతే 2 వేల నుంచి 4 వేల యూరోల వరకు, రెండోసారి 10 వేల యూరోల వరకు జరిమానా విధిస్తారు. పైగా సర్కారు ఉద్యోగావకాశాలు, పథకాలు, సదుపాయాల్లో ప్రాధాన్యం తగ్గిస్తారు. ఎన్నికలు జరిగిన వారం రోజుల్లో సంబంధిత ఓటర్లపై చర్యలు తీసుకుంటారు. అమెరికా : ఎన్నికల రోజు సెలవు ఉండదు ఇక్కడ ఓటు వేయడంపై ఎలాంటి ఆంక్షలూ లేవు. అయినా ఇక్కడ 85 శాతం వరకు ఓటింగ్ నమోదవుతుంది. పోలింగ్ రోజు సెలవు ఉండదు. ఉద్యోగులు, ప్రజలు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తమ ఓటుహక్కు వినియోగించుకోవచ్చు. ఓటు విలువ పట్ల అమెరికన్లలో చైతన్యం ఎక్కువ. బొలీవియా : గుర్తింపు కార్డు ఉంటేనే సౌకర్యాలు ఈ దేశంలో ఓటు వేసినవారికి గుర్తింపు కార్డు జారీ చేస్తారు. అది ఉన్నవారికే ప్రభుత్వ సౌకర్యాలను కల్పిస్తారు. రేషన్, విద్యుత్, తాగునీటి వసతి పొందాలంటే ఈ కార్డును సంబంధిత అధికారులకు చూపించాల్సిందే. ప్రభుత్వ ఉద్యోగులు ఓటు వేయకపోతే.. వేతనాలు సరిగా అందవు. చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఆస్ట్రేలియా : వారం రోజుల్లో విచారణ ఇక్కడ అర్హులైన ప్రతిఒక్కరూ తమ పేరును ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలి. ఎన్నికల రోజున వీరంతా తప్పకుండా ఓటు వేయాలి. వేయకుంటే జరిమానా విధిస్తారు. ఎన్నికలు జరిగిన వారంలోగా విచారణ చేపట్టి, అపరాధ రుసుము ఎంతన్నది నిర్ణయిస్తారు. ఇక్కడ 96 శాతం ఓటింగ్ నమోదవుతుంది. ఎన్నికలకు చాలా ముందు నుంచే ఓటుహక్కు వినియోగంపై ప్రభుత్వం చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తుంది. గ్రీస్ : డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్టు రద్దు ఇక్కడ ఓటు వేయకపోతే డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్టు రద్దవుతాయి. లేదంటే వాటి మంజూరును నిలిపివేస్తారు. ఓటు వేయకపోవడానికి గల కారణాలను అధికారులకు ఆధారాలతో చూపించాల్సి ఉంటుంది. వారు పూర్తిస్థాయిలో సంతృప్తి చెందితేనే మళ్లీ ఓటుహక్కు పునరుద్ధరిస్తారు. ప్రభుత్వం నుంచి పొందే సౌకర్యాలపై ఆంక్షలు విధిస్తారు. సింగపూర్ : పేరు తొలగిస్తారు అభివృద్ధికి మారుపేరుగా నిలిచే సింగపూర్‌లో ఓటు వేయడం తప్పనిసరి. వేయనివారి పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగిస్తారు. ఓటు వేయకపోవడానికి గల కారణానికి ఆధారాలను అధికారులకు చూపిస్తే పునరుద్ధరిస్తారు. ఎక్కువ మంది ప్రజలు కోరుకునే ప్రభుత్వం అధికారంలోకి రావడం వల్లే సింగపూర్ అభివృద్ధిలో ముందుందన్న వాదనలున్నాయి. ఇక్కడా తప్పనిసరి చేయాలి.. ఎన్నికలు ప్రగతికి బాటలు వేస్తాయి. మంచి ప్రభుత్వం రావడానికి దోహదపడతాయి. అందుకే అయిదేళ్లకోసారి ఎలక్షన్ కమిషన్ ఎన్నికలు నిర్వహిస్తోంది. అయితే, చాలా ప్రాంతాల్లో అర్హులైన అనేక మంది వివిధ కారణాలతో తమ ఓటుహక్కు వినియోగించుకోవడం లేదు. వందశాతం లక్ష్యంగా ఎన్నికల సంఘం అధికారులు కృషి చేస్తున్నారు. అర్హులైన ప్రతీ ఓటరు ఓటు వేసేలా ప్రచారం, ఓటరు చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మన దగ్గర కూడా ఓటు వేయడం తప్పనిసరి చేయాలి. ఇతర దేశాల తరహా ప్రత్యేక చట్టాలను తీసుకురావాలని ప్రజాస్వామ్యవాదులు అంటున్నారు. -
Babu Case : లోకేషా.. ఈ ప్రశ్నలకు జవాబేదీ?
తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, చంద్రబాబు తనయుడు నిన్న ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. కొన్ని ప్రకటనలు చేశారు. ఇంతకీ ఆయన చేసిన ప్రకటనలేంటీ? వాటి అంతరార్థమేంటీ? లోకేష్ : తెలుగుదేశం పార్టీ ఏనుగు లాంటిది. సిద్ధమవడానికి సమయం పడుతుంది. సందేహాలు : పార్టీని ఏనుగులా పోల్చడమేంటీ? అసలు ఏనుగు అనడంలో లోకేష్ ఉద్దేశ్యమేంటీ? ఎవరూ కదలలేకపోతున్నారనా? లేక పార్టీ బలంగా ఉందని చెప్పడమా? తెలుగుదేశం పార్టీ ఒకవేళ ఏనుగే అనుకుంటే, సిద్ధమవడానికి సమయం పడుతుందనుకొందాం. కానీ తెలుగుదేశం పార్టీ కొత్తగా వచ్చింది కాదు కదా. దాదాపు 40 ఏళ్లుగా ఉన్న ఒక పార్టీలో చంద్రబాబు అనే ఒకే ఒక వ్యక్తి అవినీతి పాలయి జైల్లోకి వెళ్లాడు. ఒక్క అరెస్ట్‌తోనే పార్టీ తలకిందులయిందన్నది లోకేష్ ఉద్దేశ్యమా? లేక పార్టీ నిద్రాణంగా ఉందన్న భావనలో ఉన్నారా? లోకేష్ : చేయని తప్పుకు శిక్షించే వ్యవస్థ ఉండకూడదన్న ఉద్దేశ్యంతో, ఆ వ్యవస్తను మార్చడానికే నేను రాజకీయాల్లోకి వచ్చాను. సందేహాలు : లోకేష్ రాజకీయాల్లోకి 2014 తర్వాత వచ్చాడు. రాజకీయాల్లోకి వచ్చాను అని చెప్పుకుంటున్న లోకేష్ ముందెక్కడ పోటీ చేయలేదు. అప్పటికే పార్టీ అధికారంలో ఉంది. తండ్రి ముఖ్యమంత్రి కావడంతో లోకేష్ నేరుగా ఎమ్మెల్సీ అయ్యాడు. దొడ్డిదారిన ఎమ్మెల్సీ పదవి తీసుకున్నాడు. పార్టీ చెప్పుచేతల్లో ఉంది కాబట్టి జాతీయ కార్యదర్శి పదవి తీసుకున్నాడు. అధికారం తమదే కాబట్టి క్యాబినెట్ మినిస్టర్ అయ్యాడు. అంతే తప్ప.. ఎక్కడ ఎన్నికల్లో పోటీ చేసి పదవులు సాధించుకోలేదు. తెలుగు రాజకీయాలను భ్రష్టు పట్టించి ఓటుకు కోట్లు కెమెరాల సాక్షిగా ఇస్తూ అడ్డంగా దొరికి, లంచం ఇవ్వడం తప్పు కాదని వాదించే మీలాంటి నాయకులు ఉండడం వల్లే రాజకీయాల్లోకి కొత్తగా ఎవరూ రావడం లేదు. ఇంకొక ముఖ్యమైన విషయం గమనించాల్సింది ఏంటంటే.., లోకేష్ రాజకీయాల్లోకి వచ్చేసమయంలో లోకేష్ గానీ, లోకేష్ తండ్రి చంద్రబాబు గానీ జైల్లో లేరు. నిజానికి ఆ సమయంలో చేయని తప్పుకు కేసులు పెట్టి జైలుకు పంపింది వైఎస్ జగన్మోహన్ రెడ్డిని. కాంగ్రెస్ కక్ష కడితే, దానికి చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం వంత పాడి కేసుల్లో ఇంప్లీడ్ అయి తప్పుడు అభియోగాలు బనాయించి వైఎస్ జగన్మోహన్రెడ్డిని అక్రమంగా జైలుకు పంపించారు. ఈ కేసులు తప్పని ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టే.. 2014లో 67 స్థానాలు, 2019లో 151 స్థానాలు కట్టబెట్టారు. అంటే లోకేష్ చెప్పే అరెస్ట్ ఇదేనా.? తాము అక్రమంగా అరెస్ట్ చేసి పంపామన్న అపరాధన భావనలో ఉన్నాడా? లోకేష్ : మేం ఎనిమిదేళ్లుగా ఆస్తులు ప్రకటిస్తున్నాం. మాకు హైదరాబాద్/సైబరాబాద్‌లో ఎకరం జాగా లేదు. అసలు నిజాలు : లోకేష్, చంద్రబాబు ఆస్తుల వెల్లడి అన్న కార్యక్రమం ఎంత కామెడీనో తెలుగు ప్రజలందరికీ తెలుసు. హైదరాబాద్‌లోని అత్యంత ఖరీదైన జూబ్లీహిల్స్‌లో కట్టిన రాజసౌధం విలువ లక్షల్లోచూపిస్తావు. ఏంటంటే.. కొన్నప్పుడు అంతే ఉందంటావు. ఇక అసలు మాకు ఒక్క గజం భూమి ఉన్నా.. ఇచ్చేస్తానంటావు. మరి మదీనాగూడలో 14 ఎకరాల్లో ఉన్న ఫాంహౌజ్ సంగతేంటీ? అంత ఖరీదైన లోకేషన్లో అంత భూమి ఎలా వచ్చింది? ఖరీదైన స్థలాలన్నీ మీ నానమ్మ నీ ఒక్కరికే ఎందుకు గిఫ్ట్‌గా ఇచ్చింది? ఇందులో క్విడ్ ప్రో కోల గురించి ఎప్పుడైనా వివరణలిస్తావా? దీని గురించి వేసిన కేసుల్లో విచారణ జరగకుండా స్టేలు ఎందుకు తెచ్చుకున్నారు? మీకు, మీ కొడుకు దేవాన్ష్ కు ఇచ్చిన బహుమతులు అమ్మణ్ణమ్మ, బాలకృష్ణ ఐటీ రిటర్నులు, ఎన్నికల అఫిడవిట్లలో ఎందుకు లేవు? లోకేష్ : మా నాన్న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండడం వల్ల మా సంస్థ హెరిటేజ్ నిదానంగా ఎదిగింది. లేదంటే సంస్థ విలువ ఇప్పటికీ మూడు రెట్లు పెరిగేది. అసలు నిజాలు : హెరిటేజ్ విలువ ఎంత? ఆ సంస్థ అంచలంచెలుగా ఎలా ఎదిగింది అన్నది చిత్తూరు నుంచి విజయనగరం వరకు ఎవరిని అడిగినా చెబుతారు. పదవిని అడ్డు పెట్టుకుని హెరిటేజ్ కోసం చిత్తూరు డెయిరీని దివాళా తీయించినప్పుడే వ్యవస్థలను ముంచే మీ ప్రతిభ అర్థం చేసుకోవాలి. అయినా హెరిటేజ్ అసలు లెక్కలు ఎప్పుడయినా బయటపెట్టారా? ఇందులో మీ కుటుంబ సభ్యులు కాకుండా ఇంకెవరయినా కీలక స్థానాల్లో ఉన్నారా? ఈ మధ్యే మీ అమ్మ భువనేశ్వరీ ఏం చెప్పారు? మా సంస్థ హెరిటేజ్‌లో 2% షేర్లు అమ్మినా మాకు రూ.400 కోట్లు వస్తాయన్నారు. అంటే ఈ లెక్క ప్రకారం మీ సంస్థ విలువ రూ.20వేల కోట్లు. కేవలం పాలు, డెయిరీ ప్రొడక్ట్‌లు, సూపర్ మార్కెట్ల ద్వారా రూ.20వేల కోట్ల సామ్రాజ్యాన్ని నెలకొల్పిన మానవ మాత్రుడు ఎవరయినా ప్రపంచంలో ఉంటారా? మీరు తప్ప. ఇందులో అక్రమ సంపాదన ఎంత? వ్యవస్థలను ముంచిందెంత? మీ సంస్థ బాగు కోసం ఎవరెవరిని తొక్కేశారు. కొంచెం లెక్కలు వివరంగా చెబితే అందరూ నోళ్లు వెల్లబెట్టి వింటారు. లోకేష్ : రాజకీయాల్లోకి బ్రాహ్మణి రావడం ఆమె ఇష్టం. మేం మా దారులు ఎంచుకొన్నాం. అసలు నిజమేంటీ : పార్టీ లోడు నువ్వెత్తడం లేదని విషయం స్పష్టమయిన తర్వాతే మీ నాన్న చంద్రబాబు పవన్ కళ్యాణ్‌ను ఎంచుకున్నారని తెలుగుదేశంలో ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు గత మూడు వారాలుగా మీకు సంబంధించిన ఎల్లో మీడియాలోనే బ్రాహ్మణి పేరు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. బ్రాహ్మణి రావాలి, పాదయాత్ర చేయాలి, పార్టీని నడిపించాలని ప్రచారం చేస్తున్నారు. అంటే దానర్థమేంటన్నది మీ స్టాన్ఫోర్డ్ బ్రెయిన్‌కు అర్థం కానంత గొప్పదేం ఉండదు. మీరు తారా స్థాయిలో రాజకీయాలు నడిపితే బ్రాహ్మణి పేరు ముందుకు ఎందుకు వస్తుంది? హెరిటేజ్ సంస్థను విడిచిపెట్టి బ్రాహ్మణి రాజకీయాల్లోకి రావాలి అని పచ్చమీడియా పిచ్చిగా ప్రచారం చేస్తోందంటే ఇంతకు మించిన అర్థం ఇంకేముంటుంది? (Courtesy : Nidhi) లోకేష్ : స్కిల్ డెవలప్మెంట్, రింగ్‌రోడ్డు అక్రమ అలైన్మెంట్, ఫైబర్ గ్రిడ్.. ఈ మూడు ప్రాజెక్టులు నా మంత్రిత్వ పరిధిలోనివి కావు, కాబట్టి వాటికి నేను బాధ్యుడిని కాదు సందేహాలేంటీ : మొన్నటి వరకు ఏం వాదించారు.? బ్యాంకు మేనేజర్ తప్పు చేస్తే బ్యాంకు ఓనర్‌ను అరెస్ట్ చేస్తారా? అని ఎదురు ప్రశ్నించారు. అంటే అర్థమేంటీ? తప్పు జరిగింది కానీ మాది బాధ్యత కాదంటున్నావు. ఇక ఈ మూడు ప్రాజెక్టులకు సంబంధించిన శాఖలకు కూడా నేను మంత్రిగా పని చేయలేదంటున్నావు. అంటే అర్థమేంటీ? కుంభకోణం జరిగింది కానీ నా ప్రమేయం ప్రత్యక్షంగా లేదని అర్థమా? స్కిల్ డెవలప్మెంట్ మీ నాన్న శాఖలోనిది అయితే మీ ప్రమేయం అంతగా ఎందుకుంది? ఫైబర్ గ్రిడ్‌కు మీకు సంబంధం లేకుంటే.. మీవైపే అన్ని ఆధారాలు ఎందుకు చూపిస్తున్నాయి? మీ సంస్థ భూములు రింగ్‌రోడ్డు చుట్టే భూములు కొనాలని మీకు కలలో ఐడియా వచ్చిందా? పైగా మీ బెయిల్ పిటిషన్లో మీ అడ్వొకేట్ దమ్మాలపాటి శ్రీనివాస్ ఏం వాదించారు? కరకట్టపై ఉన్న లింగమనేని గెస్ట్ హౌజ్‌లో తండ్రి చంద్రబాబుతో కలిసి ఉన్నందుకు నాపై కేసు ఎలా పెడతారని కోర్టు ముందు వాదించారు. అంటే మునగాల్సి వస్తే తండ్రిని కూడా వదిలేస్తారా? ఇవేనా మీరు నేర్చుకున్న కుటుంబ విలువలు? అసలు నోటీసులు రాకముందే ఢిల్లీకి ఎందుకు వెళ్లిపోయారు? సుప్రీంకోర్టు లాయర్లతో మాట్లాడాల్సిన మంతనాలకు ఇన్ని రోజులు పడుతుందా? అయినా న్యాయశాస్త్రంలో మీరేమీ డాక్టరేట్ చేయలేదు కదా.. మీకున్న ప్రతిభకు సాల్వే, లూథ్రా లాంటి సీనియర్ లాయర్లకు ఏం సూచనలు చేస్తారు? రాజమండ్రిలో కుటుంబాన్ని వదిలేసి ఢిల్లీ హోటళ్లలో ఉంటూ వీడియో కాన్ఫరెన్స్‌లు పెట్టేకంటే.. పాదయాత్ర ద్వారా ప్రజల్లో ఉండడం మిమ్మల్ని నాయకుడిగా నిలిపేది కదా. పైగా నన్ను అరెస్ట్ చేసే అవకాశముంది కాబట్టి ఏపీ నుంచి ఢిల్లీ వచ్చానని నిజాయతీగా చెబితే సగటు తెలుగు ప్రజలకు కనీసం సానుభూతి అయినా వచ్చేది కదా. ఇంత చిన్న పాయింట్ ఎలా మిస్సయ్యారు? -
రూ.5 వేలిచ్చి.. రూ.30 వేలు బంద్ పెట్టారు
మద్దూరు/దౌల్తాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబంధు పేరిట రూ.5 వేలిచ్చి.. రూ.30 వేల వరకు వచ్చే సబ్సిడీ పథకాలను బంద్ పెట్టారని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల ధ్వజమెత్తారు. షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం యాత్ర శనివారం నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలోకి ప్రవేశించింది. అంతకుముందు వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ నుంచి ప్రారంభమైన ప్రజాప్రస్థానం యాత్ర గోకఫసల్వాద్, దేవర్ఫసల్వాద్ మీదుగా మద్దూరు వరకు సాగింది. దమ్‌గాన్‌పూర్ పంచాయతీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటుచేసిన మాట– ముచ్చట కార్యక్రమంలో ఆమె ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ ఎనిమిదేళ్లుగా ఉద్యోగ నోటిఫికేషన్లు లేవన్నారు. తెలంగాణ వచ్చినా ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, అయినా కేసీఆర్‌లో చలనం లేదన్నారు. ‘ఈసారి మాత్రం ఆలోచించి ఓటెయ్యండి. ఓటును మాత్రం అమ్ముకోవద్దు. డబ్బులిస్తే తీసుకోండి. ప్రాజెక్టుల పేరుమీద దోచుకున్న మీడబ్బులే అవి. వైఎస్సార్ బిడ్డగా మాటిస్తున్నా.. వైఎస్సార్ సంక్షేమ పథకాలన్నీ అమలుచేస్తా. నా మొదటి సంతకం భారీగా ఉద్యోగాల కల్పన మీదనే’ అని చెప్పారు. చదవండి: బీజేపీ, కాంగ్రెస్ దుష్ప్రచారాలను ఎలా తిప్పికొట్టాలి? -
'ఓటు వేస్తే డబ్బులు ఇస్తాం..భయపడాల్సిందేమీ లేదు'
ఖమ్మం : ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటు వేస్తే డబ్బులు ఇస్తామంటూ బహిరంగ వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకి వెళితే.. రెండు రోజుల క్రితం వైరాలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాములు నాయక్..ఓటర్లకు డబ్బులు పంచాలని బహిరంగంగానే నేతలకు సూచించారు. ఆఫ్ ద రికార్డ్ గా చెబుతున్నా..'ఓటు వేస్తే డబ్బులు ఇస్తాం' ఇందులో భయపడాల్సిన పనేం లేదని పేర్కొన్నారు. ‘ఓటర్లను ఏ, బీ, సీ, డీ గా విభజించండి. వారిలో ఓటు వేయరనుకునే వాళ్లను, అనుమానం ఉన్నవాళ్లను గుర్తించండి. వారికి డబ్బులు పంపిణీ చేయాలని కార్యకర్తలకు సూచించారు. ప్రస్తుతం రాములు నాయక్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్‌హల్‌గా మారాయి.డబ్బుతో ఓటర్లను మభ్య పెడుతున్నారంటూ ఎమ్మెల్యే రాములు నాయక్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా రేపు (ఆదివారం)ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలీంగ్ జరగనుంది. చదవండి : (ఎమ్మెల్సీ ఎన్నికలు: ఈ విషయాలు తెలుసా?) (తెలంగాణ అసెంబ్లీ గరంగరం!) -
స్థానిక ఎన్నికలు: బీజేపీ.. ఓటుకు రేటు
కావలి(నెల్లూరు జిల్లా): ఎన్నికల్లో ఉనికి కోసం బీజేపీ ఓటుకు రేటు నిర్ణయించి విచ్చలవిడిగా ఓట్ల కొనుగోలుకు తెగబడుతోంది. కావలి నియోజకవర్గంలో కావలి, అల్లూరు, బోగోలు, దగదర్తి మండలాల పరిధిలో 63 పంచాయతీలు ఉండగా 386 మంది అభ్యర్థులు సర్పంచ్ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేశారు. 636 వార్డులకు 1,617 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. వీరిలో బీజేపీ మద్దతుదారులుగా నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులు చాలా మంది రాజకీయాలకు పూర్తిగా కొత్త. స్థానికంగా వీరికి ఎటువంటి మద్దతు కూడా లేదు. (చదవండి: ‘దొంగ’దెబ్బ.. ఇది టీడీపీ పనేనా?) కేవలం ఓట్ల కొనుగోలే లక్ష్యంగా బీజేపీ నాయకులు వీరిని బరిలో నిలిపారు. ఓటుకు రూ. 5 వేల వంతునైనా ఇచ్చి ఉనికి కాపాడుకోవాలనే ఉద్దేశంతో గ్రామాల్లో నోట్ల కట్టలు వెదజల్లుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కావలి మండలం లక్ష్మీపురం పంచాయతీలోని గిరిజనులకు ఓటుకు రూ. 5వేల వంతున బలవంతంగా ఇచ్చే ప్రయత్నం చేయడంతో గిరిపుత్రుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. బీజేపీ నాయకులు మంచాలపై పెట్టి వెళ్లిన డబ్బులను రూ.1.24 లక్షలు అధికారులకు అప్పగించి ఫిర్యాదు చేశారు.(చదవండి: పల్లెల్లో చిచ్చు: టీడీపీ-జనసేన అడ్డదారులు..) బీజేపీ జిల్లా అధ్యక్షుడి స్వగ్రామంలోనే.. కావలి మండలం నెల్లూరు–ప్రకాశం జిల్లాల సరిహద్దులో ఉన్న కావలి మండలం లక్ష్మీపురం బీజేపీ జిల్లా అధ్యక్షుడు గుండ్లపల్లి భరత్‌కుమార్ స్వగ్రామం. ఆయన తన స్వగ్రామంలో బీజేపీ సర్పంచ్ అభ్యర్థిని గెలిపిస్తానని కొద్ది రోజులుగా సవాళ్లు విసురుతున్నాడు. జనవరి 31వ తేదీ అర్థరాత్రి భరత్‌కుమార్ కుటుంబ సభ్యులు గ్రామంలోని గిరిజన కాలనీలో ఓటరు జాబితాలో పేర్లు ఉన్న వారి ఇంటికి వెళ్లి ఓటుకు రూ.5 వేల చొప్పున ఇవ్వసాగారు. గాఢ నిద్రలో ఉన్న గిరిజనులు లేచి బయటకు రాగానే ఈ మాట చెప్పే సరికి, తమకు డబ్బులు వద్దని చెప్పినా బీజేపీ నాయకులు బలవంతంగా ఇళ్లల్లో మంచాలపై నగదు పెట్టేసి వెళ్లిపోయారు. ఇలా రూ.1.25 లక్షలు పంపిణీ చేశారు. అయితే గిరిజనులు తాము డబ్బులు తీసుకొని ఓటు వేస్తే అభివృద్ధి పనులు అడగలేమని ఆ డబ్బులు మాకొద్దని తీసుకెళ్లమని గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు బూచి మాల్యాద్రి, మద్దూరి రవి, గుండ్లపల్లి లక్ష్మీనారాయణకు మొర పెట్టుకున్నారు. అయినప్పటికీ బీజేపీ నాయకులు ఆ డబ్బులు తీసుకోకపోగా, చాలకపోతే రూ.10 వేల చొప్పున ఇస్తామని అనడంతో గిరిజనులు నిర్ఘాంతపోయారు. ఇక చేసేది లేక ఈ విషయాన్ని బుధవారం అధికారులకు తెలియజేశారు. ఇదే విషయాన్ని కావలిలోని బీజేపీ నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు భరత్‌కుమార్ ఇంటికి వచ్చి చెప్పినా, ఆయన వినిపించుకోలేదు. దీంతో ఈ విషయాన్ని పోలీసులు, రెవెన్యూ అధికారులు లక్ష్మీపురం గ్రామంలోని గిరిజన కాలనినీకి చేరుకుని వారి నుంచి ఫిర్యాదును అందుకొని నగదును స్వాధీనం చేసుకొన్నారు. -
క్వార్టర్ పట్టు.. ఓటు కొట్టు!
సాక్షి, చీరాల టౌన్ (ప్రకాశం): మీ ఓట్లు మాకే వేయండి.. మీ సంక్షేమంతో పాటు ఏం కావాలన్నా మేము చూసుకుంటాం..అంటూ టీడీపీ నేతలు గ్రామాల్లో ప్రలోభాలకు తెరలేపుతున్నారు. ఉదయం పూట గ్రామాలు, వార్డుల్లో మంతనాలు చేయించడంతో పాటు రాత్రి వేళల్లో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఓటర్లను తాగుబోతులుగా తయారుచేసేందుకు తమ నాయకులతో కలిసి రాత్రి వేళల్లో ఇంటికో క్వార్టర్ మద్యం బాటిల్ పంపిణీ చేస్తూ టీడీపీకి ఓట్లేయాలని డిమాండ్ చేస్తున్నారు. చీరాల నియోజకవర్గంలోని 33 వార్డులు, 24 గ్రామ పంచాయతీల్లోని ఓటర్లను ప్రలోభాలకు టీడీపీ నేతలు తమ అనుచరులను రంగంలోకి దింపి మద్యం పంపకాలు చేస్తున్నారు. మున్సిపాలిటీలోని వార్డుకు ముగ్గురు టీడీపీ ఇన్చార్జులను నియమించుకుని పగలు ఓటర్లతో మంతనాలు చేసుకుంటూ రాత్రి వేళల్లో మాత్రం పంపకాలకు తెరలేపుతున్నారు. ఇంటికి ఒక క్వార్టర్ పంపకాలు చేస్తున్నారు. ఏప్రిల్ 11న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఒక్కో కుటుంబంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఎంతకు ఓట్లు కొనవచ్చు, ఏ విధంగా ఓటర్లను ప్రలోభాలకు గురిచేసి తమవైపు తిప్పుకోవాలో ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు టీడీపీ నేతలు, టీడీపీ నాయకులు గ్రామాలు, వార్డుల్లో ఇంటికి ఒక క్వార్టర్‌ను రాత్రివేళల్లో పంపకాలు చేస్తూ టీడీపీకి ఓట్లేయాలని వార్డు స్థాయి టీడీపీ నేతలు ఓటర్లకు వల విసురుతున్నారంటే ఏవిధంగా ప్రలోభాలకు పాల్పడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఓటుకు అమ్ముడు పోవాలా? చీరాల టౌన్: సార్వత్రిక ఎన్నికల ప్రచార జాతర ముగియక ముందే నియోజకవర్గంలో నోట్ల జాతర మొదలైంది. సార్వత్రిక పోరులో పోటీ నెలకొని ఉండటంతో నేతలు నోట్లు పంపిణీ చేస్తుండటంతో ఓటర్ల జేబులు కళకళలాడుతున్నాయి. ఈ ఎన్నికల్లో మాత్రం ఒక్కో ఓటు రూ. 2000 పైగా పలుకుతోంది. పురపాలక సంఘంలోని అన్ని వార్డుల్లో, రూరల్ గ్రామాల్లో టీడీపీ నేతలు ఓటర్లకు డబ్బుల పంపిణీలో నిమగ్నమయ్యారు. ప్రచారాల ముగింపునకు మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే సమయం ఉండటంతో ఓ వైపు ప్రచారాలు చేస్తూనే మరో వైపు ఓటర్లకు నోట్లు పంపిణీలు చేస్తున్నారు. డిమాండ్ ఉన్న ఓటుకు రూ.2,500 నుంచి రూ.3000 చొప్పున పంపిణీ జరిగింది. మున్సిపాలిటీలో మొత్తం 33 వార్డులకు, రూరల్ గ్రామాల్లో ఓటుకు నోటు పంపిణీతో హోరెత్తింది. రాత్రి వేళల్లో పొలీసుల హడావుడి ఉంటుందేమోనని ఈ సారి మాత్రం పట్టపగలే ఓటుకు నోట్లు పంచారు. వార్డుకు నాలుగు బృందాలు వెళ్లి నోట్లు పంపిణీ తంతు పూర్తిచేశారు. అయితే ఓటరు మాత్రం ఎవరికి ఓటు వేస్తారో చూడాల్సిందే. అలాగే టీడీపీ నేతలు ఇంటికో క్వార్టర్ మద్యాన్ని పంపిణీ చేస్తున్నారు. ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన నాటినుంచి నామినేషన్లు, ప్రచారాలకు కావాల్సిన అద్దె కార్యకర్తలకు నోటు, క్వార్టర్ మద్యాన్ని పంచారు. -
ఇంకెన్నాళ్లు నీతులు !
-
ఓటుకు కోట్లు కేసులో కొనసాగుతోన్న విచారణ
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో ఏ-1గా ఉన్న రేవంత్ రెడ్డిని ఈడీ అధికారులు ఆరు గంటలుగా విచారిస్తున్నారు. మనీ ల్యాండరింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈడీ రేవంత్ రెడ్డిని ఆరా తీస్తున్న సంగతి తెల్సిందే. స్టీఫెన్సన్కు ఇవ్వజూపిన రూ.50 లక్షలతో పాటు ఇస్తామన్న రూ. 4.5 కోట్లపై ఈడీ ఆరా తీస్తోంది. బ్యాంక్ స్టేట్మెంట్స్, ఏసీబీ ఇచ్చిన ఆధారాలు ముందు ఉంచి ఈడీ విచారిస్తోంది. ఏసీబీ చార్జ్‌షీట్ ఆధారంగా నిందితులు అందరినీ ఈడీ విచారిస్తోంది. డాక్యుమెంట్స్ ఉన్న కారణంగా వాటిని వేరిఫై చేసుకోవడానికి ఈడీ అధికారులు సమయం ఎక్కువగా తీసుకుంటున్నారు. ఈడీ జేడీ, డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ నేతృత్వంలో విచారణ సాగుతోంది. రేవంత్ విచారణ సమయంలో ఐటీ, ఏసీబీ అధికారులు ఈడీ కార్యాలయానికి రావాలని ఈడీ అధికారులు కోరారు. గతంలోనే ఓటుకు నోటు కేసులో ఏసీబీ చార్జిషీటు దాఖలు చేసింది. కొద్ది రోజుల క్రితమే ఐటీ అధికారులు రేవంత్‌ను విచారించారు. రేవంత్‌ను విచారించే సమయంలో చార్టెడ్ అకౌంటెంట్లు అందుబాటులో ఉన్నట్లు తెలిసింది. -
రేవంత్ గుట్టంతా ఆ హార్డ్‌డిస్క్‌లో ఉందా?
సాక్షి, హైదరాబాద్ : టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఇంట్లో ఐటీ సోదాల్లో భాగంగా పలువురికి నోటీసులిచ్చిన అధికారులు విచారణను వేగవంతం చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రేవంత్ అనుచరుడు, ఓటుకు కోట్లు కేసు నిందితుడు ఉదయ్ సింహ బంధువు రణధీర్ రెడ్డి వద్ద దొరికిన హార్డ్‌డిస్క్ హాట్ టాపిక్ అయింది. రెండు రోజుల క్రితం ఐటీ అధికారులమంటూ రణదీర్ రెడ్డిని తీసుకెళ్లిన టాస్క్ ఫోర్స్ పోలీసులు.. అతన్ని రాత్రి 12 గంటలకు తన నివాసం వద్ద వదిలివెళ్లారు. రణధీర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఉదయ సింహ ఇళ్లు ఖాళీ చేస్తున్న సమయంలో తనకు ఓ కవర్ ఇచ్చాడని, అందులో ఒక హార్డ్ డిస్క్, అతని తల్లి బ్యాంక్ కీ ఉందని చెప్పారు. ఇక తనను తీసుకెళ్లింది టాస్క్‌ఫోర్స్ పోలీసులని, ఏ కేసు విషయంలో తనని తీసుకెళ్లారో తెలియదన్నారు. పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పానని, ఆ విషయాలు పోలీసులే మీడియాకు తెలియజేస్తారన్నారు. ఉదయ్ సింహా తనకు ఫ్యామిలీ ఫ్రెండ్ అని, అతను ఇచ్చిన హార్డ్ డిస్క్‌లో ఏముందో తనకు తెలియదన్నారు. పోలీసులు తనకు నోటీసులు ఇచ్చారని, మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని చెప్పారని, ఆ నోటీసులు అక్కడే మర్చిపోయానన్నారు. ఇప్పుడు స్టేషన్‌కు వెళ్లి తీసుకుంటానని తెలిపారు. ఆ హార్డ్ డిస్క్‌లో ఏముంది? రేవంత్ ప్రధాన అనుచరుడైన ఉదయసింహా ఇచ్చిన ఆ హార్డ్‌డిస్క్‌లో ఏముంది? అని, మూడు నెలల ముందే ఆ హార్డ్‌డిస్క్ రణదీర్ రెడ్డికి ఎందుకు ఇచ్చారు, రేవంత్ సంబంధించిన వ్యవహారాలు ఏమన్నా అందులో ఉన్నాయా? అనే అనుమానం కలుగుతోంది. ప్రస్తుతం ఈ కేసు ఈ హార్డ్‌డిస్క్ చుట్టే తిరుగుతోంది. -
‘ఓటుకు కోట్లు కేసులో భాగంగానే ఐటీ దాడులు’
సాక్షి, హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసులో భాగంగానే తనపై ఐటీ దాడులు జరిగాయని ఈ కేసులో నిందితుడైన సెబాస్టియన్ తెలిపారు. విచారణకు హాజరు కావాలని ఇచ్చిన నోటీసుల నేపథ్యంలో ఆయన సోమవారం ఐటీ కార్యాలయంలో అధికారుల ముందు హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సీబీఐ, ఈడీ సూచన మేరకే ఐటీ దాడులు జరిగాయన్నారు. స్టీఫెన్సన్కు ఇవ్వ జూపిన రూ. 50 లక్షలు ఎక్కడి నుంచి తెచ్చారని, తర్వాత ఇస్తామన్న రూ. 4.50 కోట్లు ఎక్కడున్నాయని తనని ప్రశ్నించారని చెప్పారు. ఆ డబ్బుతో తనకు సంబంధం లేదని, స్టీఫెన్సన్ ఇంట్లో నోట్ల కట్టలు చూడగానే అక్కడి నుంచి వెళ్లిపోయానని, ఆ తర్వాతే తనను పిలిచి అరెస్ట్ చేశారని వారికి వివరించినట్లు సెబాస్టియన్ తెలిపారు. -
ఎమ్మెల్యేలకు డబ్బులు.. కోర్టుకు విపక్షం
చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం హైకోర్టుకు చేరింది. దీనిపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని కోరుతూ ప్రతిపక్ష డీఎంకే మంళగవారం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేసింది. ముడుపుల బాగోతంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)తో విచారణ జరిపించాలని డిఎంకే డిమాండ్ చేసింది. ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకునేందుకు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలకు శశికళ, పన్నీర్ సెల్వం భారీ మొత్తంలో డబ్బులు ముట్టచెప్పినట్టు టైమ్స్ నౌ, మూన్ టీవీ సంయుక్తంగా నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో వెల్లడైంది. ఈ నేపథ్యంలో డీఎంకే కోర్టుకు వెళ్లింది. మరోవైపు డీఎంకే ఎమ్మెల్యేలు ఈ సాయంత్రం 5 గంటలకు స్టాలిన్ ఆధ్వర్యంలో సమావేశం కానున్నారు. కాగా, తనపై చేసిన ఆరోపణలు చేసిన దక్షిణ మధురై ఎమ్మెల్యే ఎస్ఎస్ శరవణన్‌ను పన్నీర్ సెల్వం వివరణ కోరారు. విశ్వాస పరీక్ష నెగ్గేందుకు పన్నీర్ సెల్వం తనకు డబ్బులు ముట్టచెప్పారని శరవణన్ ఆరోపించారు.