ఓటుకు నోటు కేసులో పట్టుబడ్డ నిందితుల ఇళ్లల్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు తనీఖీలు నిర్వహిస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, ఉదయసింహల ఇళ్లల్లో ఏసీబీ శాఖ అధికారులు మంగళవారం ఉదయం సోదాలు ప్రారంభించారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ని ప్రలోభపెట్టే ప్రయత్నం చేసిన కేసులో రేవంత్, సెబాస్టియన్, ఉదయసింహ అరెస్టయిన విషయం తెలిసిందే.