రక్షిత్ అట్లూరి హీరోగా నటించిన తాజా చిత్రం ‘నరకాసుర’. సెబాస్టియన్ నోవా అకోస్టా జూనియర్ దర్శకత్వంలో డా.అజ్జా శ్రీనివాస్ నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా గురువారం విలేకర్ల సమావేశంలో సెబాస్టియన్ నోవా మాట్లాడుతూ– ‘‘దర్శకుడు కావాలనేది నా కల. ఓ ఫిల్మ్ స్కూల్‌లో శిక్షణ తీసుకుని అవకాశాల కోసం ప్రయత్నించినా కుదర్లేదు.
టెక్నాలజీపై అవగాహన కోసం 2012లో ప్రసాద్ ల్యాబ్‌లో చేరాను. అక్కడ రిలీజ్‌కు నోచుకోని సినిమాలు కనిపించాయి. దీంతో సినిమా తీయడం కాదు.. తీసిన సినిమాను మార్కెట్ చేసుకోవడం ముఖ్యమని భావించి సాయి కొర్రపాటిగారి సహాయంతో డిస్ట్రిబ్యూషన్ రంగంలో చేరాను. ఆ తర్వాత నా దర్శకత్వంలో సినిమా కోసం కథ రెడీ చేసుకున్నాను. చిన్నతనంలో నేను తప్పిపోతే ట్రాన్స్‌జెండర్స్ నన్ను మా కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ కథకు ఈ సంఘటన ఓ స్ఫూర్తి. ఇక దర్శకుడిగా తొలి
అవకాశమే కష్టం అనుకుంటే..
‘నరకాసుర’ చిత్రీకరణ టైమ్‌లో ఒరిస్సాలో షూటింగ్ పూర్తి చేసుకుని జబల్‌పూర్ వెళ్తుంటే ప్రమాదం జరిగి, నా చేయి పోయింది. ప్రమాదం జరిగిన తర్వాత 27వ రోజు నేను సెట్స్‌లోకి వచ్చి, ఆత్మవిశ్వాసంతో సినిమాను పూర్తి చేశాను. ఇక మాధవన్, అరుణ్ విజయ్, వివేక్ ఒబెరాయ్, టొవినో థామస్ వంటి స్టార్స్‌తో ట్రైబల్ నేపథ్యంలో ఓ సినిమా ΄్లానింగ్‌లో ఉంది. మూడు భాషల్లో చిత్రీకరిస్తాం’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment