సెప్టెంబర్‌లో ‘నరకాసుర’ | Narakasura Movie Will Release On September 2023 | Sakshi
Sakshi News home page

Narakasura: సెప్టెంబర్‌లో ‘నరకాసుర’

Published Tue, Aug 29 2023 5:07 PM | Last Updated on Tue, Aug 29 2023 5:17 PM

Narakasura Movie Will Release On September 2023 - Sakshi

రక్షిత్‌ అట్లూరి, అపర్ణా జనార్థన్‌, సంకీర్తన విపిన్‌, శత్రు కీలక పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం ‘నరకాసుర’. సెబాస్టియన్‌ దర్శకత్వంలో సుముఖ క్రియేషన్స్‌, ఐడియల్‌ ఫిల్మ్‌ మేకర్స్‌పై ఆజ్జా శ్రీనివాస్‌ నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేశారు. టీజర్‌ చూసిన పలువురు సినీ ప్రముఖులు ‘కాంతారా రేంజ్‌లో ఉందని’ ప్రశంసించారు.

చిత్రీకరణ, నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ రెండో వారంలో  తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ‘నరకాసుర’ అనే రాక్షసుడి జననం నేపథ్యంలో ఈ చిత్రం రూపొందింది. యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం అన్నివర్గాల ప్రేక్షకులను మెప్పిస్తుంది.’ అని దర్శకుడు అన్నారు.సెప్టెంబర్‌ రెండో వారంలో  ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం అని నిర్మాత తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement