రక్షిత్ అట్లూరి, అపర్ణ జనార్థన్, సంకీర్తన విపిన్ హీరో హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘నరకాసుర’. సుముఖ క్రియేషన్స్, ఐడియల్ ఫిలిం మేకర్స్ బ్యానర్స్ లో డాక్టర్ అజ్జా శ్రీనివాస్ నిర్మించిన ఈ చిత్రానికి సెబాస్టియన్ నోవా అకోస్టా జూనియర్ దర్శకత్వం వహించారు. నవంబర్ 3న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకు మంచి స్పందన లభించడంతో.. మరింత మందికి చేరవయ్యేందుకు చిత్ర యూనిట్ కీలక నిర్ణయం తీసుకుంది.
ఒక టికెట్‌పై ఇద్దరు సినిమా చూసే అవకాశాన్ని కల్పించింది. అయితే ఈ ఆఫర్ వచ్చే సోమవారం నుంచి గురువారం వరకు మాత్రమే వర్తిస్తుంది. ఆ తర్వాత యథావిధిగా ఒక టికెట్‌పై ఒకరు మాత్రమే సినిమా చూడాల్సి ఉంటుంది. ఈ మేరకు తాజాగా జరిగిన సక్సెస్ మీట్‌లో మేకర్స్ ఈ విషయాన్ని వెళ్లడించారు.
ఈ సందర్భంగా రక్షిత్ అట్లూరి మాట్లాడుతూ.. , ఈ సినిమాతో నటుడిగా మరో మెట్టు ఎక్కాడనే ప్రశంసలు వస్తున్నాయి. ప్రేక్షకుల నుంచి అప్రిషియేషన్స్ తో పాటు మీడియా నుంచి మంచి రివ్యూస్ వస్తున్నాయి. మా సినిమాలో మెసేజ్ మరింత మంది ప్రేక్షకులకు రీచ్ అవ్వాలని మండే నుంచి థర్స్ డే వరకు ఒక టికెట్ మీద ఇద్దరు ప్రేక్షకులు సినిమా చూసేందుకు అవకాశం కల్పిస్తున్నాం’ అన్నారు.
‘ట్రాన్స్ జెండర్స్ ను చిన్న చూపు చూడకూడదు మనుషులంతా ఒక్కటే అని మేము ఇచ్చిన సందేశం ప్రేక్షకులకు రీచ్ అవుతోంది. ఇది మరింత మంది ప్రేక్షకులకు చేరేలా వచ్చే సోమవారం నుంచి గురువారం వరకు ప్రతి థియేటర్ లో ఒక్కో టికెట్ పై ఇద్దరు ప్రేక్షకులు సినిమా చూడొచ్చు’అని దర్శకుడు సెబాస్టియన్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment