releasing
-
చేయి పోయినా ఆత్మవిశ్వాసంతో సినిమా పూర్తి చేశాను
రక్షిత్ అట్లూరి హీరోగా నటించిన తాజా చిత్రం ‘నరకాసుర’. సెబాస్టియన్ నోవా అకోస్టా జూనియర్ దర్శకత్వంలో డా.అజ్జా శ్రీనివాస్ నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా గురువారం విలేకర్ల సమావేశంలో సెబాస్టియన్ నోవా మాట్లాడుతూ– ‘‘దర్శకుడు కావాలనేది నా కల. ఓ ఫిల్మ్ స్కూల్లో శిక్షణ తీసుకుని అవకాశాల కోసం ప్రయత్నించినా కుదర్లేదు. టెక్నాలజీపై అవగాహన కోసం 2012లో ప్రసాద్ ల్యాబ్‌లో చేరాను. అక్కడ రిలీజ్‌కు నోచుకోని సినిమాలు కనిపించాయి. దీంతో సినిమా తీయడం కాదు.. తీసిన సినిమాను మార్కెట్ చేసుకోవడం ముఖ్యమని భావించి సాయి కొర్రపాటిగారి సహాయంతో డిస్ట్రిబ్యూషన్ రంగంలో చేరాను. ఆ తర్వాత నా దర్శకత్వంలో సినిమా కోసం కథ రెడీ చేసుకున్నాను. చిన్నతనంలో నేను తప్పిపోతే ట్రాన్స్‌జెండర్స్ నన్ను మా కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ కథకు ఈ సంఘటన ఓ స్ఫూర్తి. ఇక దర్శకుడిగా తొలి అవకాశమే కష్టం అనుకుంటే.. ‘నరకాసుర’ చిత్రీకరణ టైమ్‌లో ఒరిస్సాలో షూటింగ్ పూర్తి చేసుకుని జబల్పూర్ వెళ్తుంటే ప్రమాదం జరిగి, నా చేయి పోయింది. ప్రమాదం జరిగిన తర్వాత 27వ రోజు నేను సెట్స్‌లోకి వచ్చి, ఆత్మవిశ్వాసంతో సినిమాను పూర్తి చేశాను. ఇక మాధవన్, అరుణ్ విజయ్, వివేక్ ఒబెరాయ్, టొవినో థామస్ వంటి స్టార్స్‌తో ట్రైబల్ నేపథ్యంలో ఓ సినిమా ΄్లానింగ్లో ఉంది. మూడు భాషల్లో చిత్రీకరిస్తాం’’ అన్నారు. -
రాగిణి విడుదల ఆలస్యం
యశవంతపుర: డ్రగ్స్ కేసులో అరెస్టయిన నటి రాగిణికి సుప్రీంకోర్టులో బెయిల్ లభించిన విషయం తెల్సిందే. అయితే రూ.2 లక్షల బాండ్ ఇవ్వటంలో జాప్యం జరగడంతో ఆమె విడుదల ఆలస్యమవుతోంది. కరోనా నేపథ్యంలో జామీనుదారుడు ష్యూరిటీ నగదు నేరుగా చెల్లించడానికి వీలు కావడం లేదు. వీడియో ద్వారా విచారణ జరుపుతున్నందున బాండ్‌ను జడ్జికి చూపించాలి. జడ్జి బాండ్‌ను పరిశీలించిన తరువాతనే రాగిణిని విడుదల చేయనున్నారు. మంగళవారం రిపబ్లిక్‌డే ఉండటంతో బుధవారం విడుదలయ్యే అవకాశం ఉంది. చదవండి: డ్రగ్స్ కేసులో సినీ నటి ద్వివేదికి బెయిల్ -
ఒమన్‌లో వలస కార్మికులకు క్షమాభిక్ష
సాక్షి, జగిత్యాల: ఉపాధి కోసం వచ్చి సరైన పత్రాలు లేక చట్టవిరుద్ధంగా తమ దేశంలో ఉంటున్న వలస కార్మికులకు ఒమన్ ప్రభుత్వం క్షమాభిక్ష ప్రకటించింది. ఈ నిర్ణయంతో వేలాదిమంది కార్మికులకు ఊరట లభించనుంది. వీసా గడువు ముగిసిన కార్మికులు తమ స్వదేశానికి వెళ్లేందుకు డిసెంబర్ 31లోగా దరఖాస్తు చేసుకోవాలని ఒమన్ ప్రభుత్వం ప్రకటించింది. వీసా గడువు ముగిసి, చట్టవిరుద్ధంగా ఉంటున్న వారంతా అక్కడి ప్రభుత్వం విధించిన జరిమానా చెల్లించి, జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. కానీ లక్షల సంఖ్యలో చట్టవిరుద్ధంగా ఉంటున్న వారితో తమ ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఒమన్ ప్రభు త్వం భావిస్తోంది. దీంతో అలాంటి వారందరికి క్షమాభిక్ష ద్వారా తమ స్వదేశాలకు వెళ్లేలా వెసులుబాటు కల్పించింది. 25 లక్షల మంది వలసదారులు ఒమన్ దేశంలో భారత్, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, శ్రీలంకతోపాటు పలు ఇతర దేశాలకు చెందిన సుమారు 25 లక్షల మంది వలస కార్మికులు ఉపాధి పొందుతున్నారు. క్షమాభిక్ష ద్వారా చట్టవిరుద్ధంగా ఉంటున్న వారిని స్వదేశాలకు పంపిస్తే స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని ప్రభుత్వం భావిస్తోంది. కాగా, స్వస్థలాలకు తిరిగి వచ్చే వలస కార్మికులకు సాయం అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక నోడల్ ఆఫీసర్‌ను ప్రత్యేకంగా నియమించాలని, ఎమర్జెన్సీ సర్టిఫికెట్లు అందించి అవుట్ పాస్‌పోర్టు జారీ చేయాలని భారత కార్మికులు కోరుతున్నారు. ఉచిత విమాన సదుపాయం కల్పించి కార్మికులను ఆదుకోవాలని ఒమన్–తెలంగాణ ఫ్రెండ్స్ సంస్థ సభ్యుడు నరేంద్ర పన్నీర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. -
పెట్టు‘బడి’కష్టమే..!
ఉపా«ధ్యాయుల అవస్థలు పంపిణీకి నోచుకోని పాఠశాల, నిర్వహణ నిధులు విద్యా కమిటీల కోసం నిలిపివేత సుద్దముక్కలు కూడా కరువే.. పిఠాపురం : విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటనలు చేయడమే తప్ప ఆచరణలో మాత్రం చర్యలు తీసుకోవడం లేదు. పాఠశాలల నిర్వహణకు గతేడాది ఒక్కరూపాయి కూడా విడుదల చేయని ప్రభుత్వం.. ఆ నిధులను ఈ ఏడాది విడుదల చేసినట్లు చెబుతున్నా పంపిణీ మాత్రం జరగలేదు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో పాఠశాలల నిర్వహణ కష్టసాధ్యంగా మారింది. రాష్రీ్ట్రయ మాథ్యమికశిక్షాభియాన్ (ఆర్‌ఎంఎస్‌ఏ)కు సంబంధించిన పాఠశాలల నిర్వహణ ఖర్చులు విడుదల కాకపోవడంతో వాటి నిర్వహణ ఇబ్బందిగా మారిందని ఉపాధ్యాయులు గగ్గోలుపెడుతున్నారు. బోధనోపకరణాల కోసం ఉపాధ్యాయులకు ఇచ్చే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ (టీఎల్ఎం) నిధులు సైతం విడుదల కాకపోవడంతో ప్రాథమిక పాఠశాలల్లోనూ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. జిల్లాలో పాఠశాలలు జిల్లాలో 4,412 పాఠశాలలు ఉండగా ప్రాథమిక పాఠశాలలకు సంబంధించి ఒక్కొ ఉపాధ్యాయుడికి రూ.500 చొప్పున విడుదల కావాల్సి ఉంది. ఆ సొమ్ముతో సుద్దముక్కలు, ఇతర అవసరాలను తీర్చుకుంటారు. కానీ రెండేళ్లుగా ఈ నిధులు ఇవ్వడం లేదు. వీటితో పాటు పాఠశాలల నిర్వహణ ఖర్చుల కింద అదనపు వనరులు సమకూర్చుకోవడానికి ఒక్కొక్క పాఠశాలకు రూ.5 వేలు విడుదల కావాల్సి ఉంది. మూడు గదులున్న పాఠశాలలకు రూ.5 వేలు, అంతకంటే ఎక్కు వ ఉన్న పాఠశాలలకు రూ.10 వేలు కేటాయించారు. కానీ ఆ నిధులు విడుదల కాలేదు. నిధుల వినియోగం ఇలా.. ఉన్నత పాఠశాలలకు సంబంధించి గతంలో ఒక్కొక్క పాఠశాలకు రూ.12 వేలు ఉండగా, వాటిని రూ.34 వేలకు పెంచారు. వీటిలో రూ.17 వేలును ఆయా పాఠశాలల తరగతి గదుల మరమ్మతులకు, రూ.12 వేలు సైన్స్ పరికరాలు, ల్యాబ్ నిర్వహణకు వినియోగించాలి. రూ.1000 అవసరమైన పుస్తకాలు కొనుగోలు చేసేందుకు, రూ.2 వేలు ఆయా పాఠశాలల విద్యుత్ బిల్లులకు వినియోగించుకునేందుకు నిర్ణయించారు. ఏటా జూన్ నుంచి ఏప్రిల్ వరకు ఉన్న విద్యా సంవత్సరంలో జూన్ నెలలోనే పాఠశాల ప్రారంభ దశలోనే ఈ నిధులు విడుదల కావల్సి ఉంది. గత 2015–16 విద్యా సంవత్సరానికి సంబంధించి జిల్లాలో 4412 పాఠశాలలకు రూ.17 వేల చొప్పున నిర్వహణ ఖర్చులకు మాత్రమే (మరో రూ 17 వేలు భవనాల మరమ్మతులకు నిధులు విడుదల కాలేదు) రూ 7.50 కోట్లు ఈ ఏడాది మంజూరైంది. కానీ ఆ నిధులు ఆయా ఉపాధ్యాయుల ఖాతాల్లో వేయలేదు. 2016–17కు సంబంధించి స్కూలు గ్రాంటు, స్కూలు మేనేజ్మెంటు గ్రాంటు, పాఠశాల మరమ్మతులు, అదనపు తరగతి గదుల నిర్మాణం తదితర పనులకు రూ.200 కోట్లకు ప్రణాళికలు సిద్ధం చేసిన అధికారులు ప్రభుత్వానికి నివేదికలు పంపించారు. గత ఏడాది నిధులే ఇప్పటి ఇవ్వక పోగా ఈ ఏడాది నిధులు ఎప్పుడు వస్తాయో అసలు ఇస్తారో లేదో తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నామని ఉపాధ్యాయులు వాపోతున్నారు. కొత్త విద్యాకమిటీల కోసమేనా! ఈ నిధులన్ని ఆయా పాఠశాలల ఉపాధ్యాయుల బ్యాంకుఖాతాలకు జమ చేయాల్సి ఉంది. ప్రస్తుతం పాఠశాల యాజమాన్య కమిటీల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కొత్త కమిటీలు వచ్చిన వెంటనే ఆ నిధులు వారి జాయింట్ ఎక్కౌంటు ద్వారా వేయడానికి తద్వారా ఆనిధుల వినియోగంపై కమిటీలకు పెత్తనం కట్టబెట్టడానికి ప్రభుత్వం నిధుల పంపిణీని నిలిపివేసినట్లు సమాచారం. గత ఏడాది పాఠశాల నిర్వహణకు పెట్టుబడి తాము పెడితే నిధులు విద్యాకమిటీల ద్వారా ఇవ్వడమేమిటని ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. టీచర్ల జేబులకు చిల్లులు ఈ ఏడాది ఇప్పటి వరకు నిధులు విడుదల కాకపోవడంతో పలు పాఠశాలల్లో సుద్ద ముక్కలుకూడా కరువయ్యాయి. ఉపాధ్యాయులే పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. కనీసం కాగితం కావాలన్నా వారి జేబుల్లోంచి డబ్బులు తీయాల్సి వస్తోంది. పలు పాఠశాలల్లో బిల్లులు చెల్లించక విద్యుత్ కనెక్షన్లు కట్ అవుతున్నాయి. సైన్స్ ల్యా»Œ ల్లో పరికరాలు లేక ప్రయోగాలు చేసే అవకాశం లేకుండా పోతోంది. దీనిపై సర్వశిక్షా అభియాన్ పీఓ టీవీజే కుమార్‌ను వివరణ కోరగా త్వరలోనే నిధుల పంపిణీకి చర్యలు తీసుకుంటున్నామన్నారు. -
8న ఇసుక రీచ్‌లకు టెండర్ల నోటిఫికేషన్
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక పాలసీపై సబ్‌కమిటీ మార్గదర్శకాలను ప్రభుత్వం ఖరారు చేసింది. విశాఖ కలెక్టరేట్లో సమావేశం అనంతరం ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు మీడియాకు వెల్లడించారు. 1.5 లక్షల కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుకను వేలంలో ఉంచనున్నట్టు, క్యూబిక్ మీటర్ ధరను రూ.500 గా నిర్ణయించామన్నారు. ఈ నెల 8న ఇసుక రీచ్‌లకు టెండర్ల నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. వేలంతోపాటు, టెండర్లను కూడా ఆహ్వానిస్తామని, ఎక్కువ ధర వేసిన వారికే ఖరారు చేస్తామని యనమల చెప్పారు. చిన్న చిన్న వాగుల నుంచి రైతులు ఎడ్లబండ్లపై ఇసుకను ఉచితంగా తీసుకెళ్లవచ్చునన్నారు. అలాగే, రిటైల్ రంగంపై విధానాన్ని రూపొందిస్తున్నట్టు పేర్కొన్నారు. విశాఖలో 10 వ తేదీ నుంచి మూడు రోజుల పాటు జరగనున్న సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్, సన్‌రైజ్ ఆఫ్ ఏపీ ఇండస్ట్రియల్ సదస్సుల్లో 250 ఎంవోయూలు జరగనున్నట్లు యనమల తెలిపారు. -
భారీ అంచనాలతో 'ఆగడు'
ఆగడు విడుదల తేదీ 19-09-14 భాష- తెలుగు దర్శకుడు-శ్రీను వైట్ల నిర్మాతలు-అనిల్ శర్మ, ఆచంట గోపీనాథ్, ఆచంట రాము నటీ నటులు-మహేష్ బాబు, తమన్నా, బ్రహ్మానందం శుక్రవారం విడుదల కానున్న ఆగడు సినిమాపై అభిమానులే కాదు.. మహేష్ బాబు కూడా భారీ అంచనాలే పెట్టుకున్నాడు. ఈ చిత్రం తన కెరీర్ లో మరో టర్నింగ్ పాయింట్ అవుతుందని మహేష్ భావిస్తున్నాడు. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఆగడు ఈ నెల 19న విడుదలవుతోంది. మిల్క్ బ్యూటీ తమన్నాకు మహేశ్ బాబు తో తొలిచిత్రం. ఇప్పటికే 'ఆగడు' చిత్రం విడుదల విషయంలో కూడా రికార్డులు సృష్టిస్తోంది. ఒక్క అమెరికాలోనే ఏకంగా 159 స్క్రీన్లలో దీన్ని విడుదల చేస్తున్నారు. ఇప్పటివరకు ఏ తెలుగు సినిమా అమెరికాలో ఇంత విస్తృత స్థాయిలో విడుదల కాకపోవడం గమనార్హం. ఖూబ్ సూరత్ విడుదల తేదీ 19-09-14 భాష- హిందీ దర్శకుడు-శశాంక ఘోష్ నిర్మాతలు-అనిల్ కపూర్, రియా కపూర్, సిద్ధార్ధ రాయ్ కపూర్ నటీ నటులు-ఫవాడ్ ఖాన్, సోనమ్ కపూర్, కిరణ్ ఖేర్ దావత్-ఈ-ఇష్క్ విడుదల తేదీ 19-09-14 భాష-హిందీ దర్శకుడు-హబీబ్ ఫైజల్ నిర్మాతలు-ఆదిత్య చోప్రా, యోగేంద్ర మోగ్రే నటీ నటులు-ఆదిత్య రాయ్ కపూర్, పరిణితీ చోప్రా -
నేడు సాగర్ నుంచి నీటి విడుదల
ఎగువ ప్రాంతంలో వరద నీటితో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్టు దాదాపుగా నిండిపోగా, నాగార్జునసాగర్ కూడా బుధవారం నాటికి నిండిపోనుంది. దీంతో పైనుంచి వస్తున్న భారీ వరద నీటిని కిందకు వదిలివేయనున్నారు. బుధవారం నుంచి దశలవారీగా నీటిని ప్రకాశం బ్యారేజీకి విడుదల చేయాలని నిర్ణయించారు. బుధవారం ఉదయం 50 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తారని అధికారులు చెబుతున్నారు. దానిని దశలవారీగా పెంచే అవకాశముందని పేర్కొంటున్నారు. భారీగా వరద వస్తుందని తెలిసినా ప్రభుత్వం ఇప్పటివరకు కృష్ణాడెల్టాకు నీరివ్వడానికి ముందుకు రాలేదు. దీంతో జిల్లాలో పలుచోట్ల వేసిన నారు ఎండిపోయి, పొలాలు నైచ్చే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఒక్కసారిగా భారీగా నీటిని విడుదల చేయనుండటంతో ఆ నీరు మొత్తం సముద్రంలోకి వెళ్లిపోయే పరిస్థితి ఏర్పడనుంది. ప్రస్తుతం బ్యారేజీకి పదివేల క్యూసెక్కులు మాత్రమే వస్తుండటంతో ఏడువేలు తూర్పు డెల్టాకు, మూడు వేల క్యూసెక్కులు పశ్చిమ డెల్టాకు విడుదల చేస్తున్నారు. బుధవారం ఉదయం విడుదల చేసే వరద నీరు గురువారం సాయంత్రానికి ప్రకాశం బ్యారేజీకి చేరుకునే అవకాశముంది. దిగువకు 3.30 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ బుద్ధప్రకాష్ ఎం.జ్యోతి ప్రజలను కోరారు. పస్తుతం శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం 580.4 అడుగులు ఉంది. శ్రీశైలం పూర్తి నీటిమట్టం స్థాయి 590 అడుగులు కాగా, శ్రీశైలం ప్రాజెక్టుకు 3,76,608 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. దీంతో 3,51,826 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం నాగార్జునసాగర్‌కు ఇన్‌ఫ్లో 2,50,793 వస్తోంది. సాగర్ కుడి, ఎడమ కాల్వలతో పాటు దిగువకు 27,237 క్యూసెక్కుల నీటిని వదలనున్నారు. సాగర్‌కు ఇంకా 30 టీఎంసీల నీరు వస్తే ప్రాజెక్టు పూర్తిగా నిండిపోతుంది. ప్రస్తుతం వస్తున్న ఇన్‌ఫ్లోను బట్టి సాగర్ ఒక్కరోజులో నిండిపోతుంది. దీంతో నీటిని దిగువకు విడుదల చేయాలని నిర్ణయించారు. -
ఇవాళే 'లవ్ ఇన్ బాంబే' రిలీజ్