సాక్షి, హైదరాబాద్: ఈఎస్‌ఐలోని ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ (ఐఎంఎస్) డైరెక్టర్ దేవికారాణి రూ.వందల కోట్ల కుంభకోణం నడిపిందంటే.. సిబ్బంది–కారి్మక సంఘాలు విశ్వసించడం లేదు. కేవలం ఆమె తన ముఠా సభ్యులతో కలిసి ఇన్ని వందల కోట్లను యధేచ్ఛగా మింగుతూ పోతుందంటే.. తప్పకుండా రాజకీయ సహకారం ఉండే ఉంటుందని ఆరోపిస్తున్నారు. నాలుగేళ్లుగా ఆమె దందా సాగుతున్నా ఎవరూ ఎందుకు నోరు మెదపలేదు? విడుదలవుతు న్న నిధులకు అదనంగా నిధులు ఎందుకు కేటాయిం చాల్సి వచి్చంది? నాలుగేళ్లుగా నాన్ రేటెడ్ కంపెనీలకు (ఎన్‌ఆర్‌సీ) మందుల కొనుగోళ్లు కాంట్రాక్ట్ ఎం దుకు ఇవ్వాల్సి వస్తోంది? 2014లో రూ.700 కోట్ల మేరకు కొన్న మందుల్లో రూ.300 కోట్లకుపైగా దేవికారాణి, ఆమె ముఠా మింగేశారంటే తప్పకుండా వారి వెనక మరెవరో ఉన్నారనే అనుమానాలు రోజురోజు కు బలపడుతున్నాయి. 2015 నుంచి 2019 వరకు రాష్ట్ర బడ్జెట్‌లో ఈఎస్‌ఐకి కేటాయించిన (రూ.1,278 కోట్లు) నిధుల కంటే అధికంగా (రూ.1,616.93 కోట్లు) నిధులు ఖర్చు అయ్యాయి. ఈఎస్‌ఐలోని మందుల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయంటూ 2018, 19లలో విజిలెన్స్ రెండుసార్లు నివేదిక ఇచ్చినా ఈ వ్యవహారాన్ని పట్టించుకోకపోవడానికి పెద్ద తలలే కారణమన్న వాదనలు వినిపిస్తున్నాయి.
సంబంధం ఉన్న కంపెనీలివే..!
దేవికారాణి పలు కంపెనీలతో మందుల కొనుగోళ్లు జరిపింది. వీటిలో అక్రమంగా కాంట్రాక్టులు దక్కించుకున్న పలు కంపెనీల ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. ఈఎస్‌ఐ కాంట్రాక్టు దక్కగానే అవన్నీ ఆర్థికంగా బలపడ్డాయి. ఆర్థికంగా చితికిపోయిన తేజ ఫార్మా కంపె నీ దేవికారాణితో చేతులు కలిపాక లాభపడింది. పలు బినామీ కంపెనీలతోపాటు తన కొడుకుని ఆరిజిన్, సెరిడియా, తేజ ఫార్మాల్లో స్లీపింగ్ పార్ట్‌నర్‌గా చేసింది. పృథ్వి ఎంటర్‌ప్రైజెస్, మైత్రి ఫార్మా, మహీధర మెడికల్ అండ్ సర్జికల్స్, ఆర్‌ఆర్ ట్రేడర్స్, వైష్ణవ ఎంటర్‌ప్రైజెస్, గాయత్రి ఫార్మా, వసుధ మార్కెటింగ్ ఫార్మాస్యూటికల్స్ అండ్ సర్జికల్ డి్రస్టిబ్యూటర్స్, సీకోట్రిక్ ఫార్మా, స్వస్తిక్ ఫార్మాస్యూటికల్స్, హిమాలయా ఫార్మసీ, శ్రీరామ ఫార్మా డి్రస్టిబ్యూటర్స్ పేరిట దేవికారాణి తన బినామీలతో నడుపుతోందని ఏసీబీ డీజీకి ఫిర్యాదులు అందాయి.
ముగ్గురు బినామీలు..
దేవికారాణి మొత్తం వ్యవహారాన్ని ముగ్గురు వ్యక్తులతో నడిపిందని, వీరే కాలక్రమంలో ఆమెకు
బినామీలుగా మారారని లేఖలో ఆరోపించారు. ఈ ముగ్గురి గురించి లేఖలో ఇంకా ఏమన్నారంటే?
మొదటి బినామీ
ఫార్మాసిస్ట్ నాగలక్ష్మి దేవికారాణికి మొదటి బినామీ. పర్చేస్ డిపార్ట్‌మెంట్‌లో ఈమె విధులు నిర్వహించేది. దేవికారాణికి ఈమె కుడి భుజం. ఆమె ఆదేశాల మేరకు 5 బినామీ కంపెనీలు నడిపిస్తున్నట్లు సమాచారం. అర్హతలు లేకున్నా ఈమెను దేవికారాణి పలుకుబడి ఉపయోగించి సెంట్రల్ డ్రగ్ స్టోర్‌లో నియమించిందని సిబ్బంది ఆరోపిస్తున్నారు. ఈమె ఆస్తుల విలువ దాదాపుగా రూ.50 కోట్లు దాటి ఉంటుందని సమాచారం. ఇదిలావుండగా.. ఈమెను ఏసీబీ అ«ధికారులు ఈ నెల 7వ తేదీన అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
రెండో బినామీ
ఇతను సెంట్రల్ డ్రగ్ స్టోర్‌లో ఉద్యోగి. దేవికారాణి బినామీ కంపెనీల సమస్త సమాచారం ఇతని వద్ద ఉంది. కుంభకోణంలో అక్రమంగా సంపాదించిన డబ్బు ద్వారా సంగారెడ్డి, బీహెచ్‌ఈఎల్, గచి్చ»ౌలి ప్రాంతాల్లో రూ.30 కోట్ల విలువ చేసే భూములు కొన్నట్లు సమాచారం. ఇతని ఇంట్లో ఇటీవల సోదాలు చేసిన ఏసీబీ త్వరలోనే అరెస్టు చేసే అవకాశం ఉంది.
మూడో బినామీ
సూపరింటెండెంట్ వీరన్న. ఈఎస్‌ఐ అకౌంట్స్ శాఖలో పనిచేస్తోన్న వీరన్న వద్ద కూడా బినామీ కంపెనీల సమాచారం ఉంది. వీరన్న బంధువుల పేరిట దాదాపు రూ.40 కోట్ల విలువ చేసే ఆస్తులు కొన్నాడు. ఇతని ఇంట్లోనూ ఇటీవల ఏసీబీ సోదాలు చేసి పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకుంది. ఇతన్ని కూడా త్వరలో అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయి.
ఆస్తులివి...
1.రాజ్‌భవన్‌లోని సేథీ బిల్డర్‌లో అత్యాధునిక ప్లాట్ విలువ రూ.3 కోట్లు
2. షేక్‌పేట గ్రామంలో ఆదిత్య బిల్డర్స్‌లోని విల్లా విలువ రూ.9.50 కోట్లు సమీపంలో 10 వేల గజాల స్థలం
4.ఉప్పల్ సమీపంలో నారపల్లిలో మూడు ఎకరాల స్థలం
5.మహేశ్వరం మండలంలోని కందుకూరు సమీపంలో 20 ఎకరాల స్థలం
6. రూ.2 కోట్ల విలువైన వజ్రాలు
Comments
Please login to add a commentAdd a comment