The scandal
-
దేవికారాణి వెనుక ఎవరు?
సాక్షి, హైదరాబాద్: ఈఎస్ఐలోని ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ (ఐఎంఎస్) డైరెక్టర్ దేవికారాణి రూ.వందల కోట్ల కుంభకోణం నడిపిందంటే.. సిబ్బంది–కారి్మక సంఘాలు విశ్వసించడం లేదు. కేవలం ఆమె తన ముఠా సభ్యులతో కలిసి ఇన్ని వందల కోట్లను యధేచ్ఛగా మింగుతూ పోతుందంటే.. తప్పకుండా రాజకీయ సహకారం ఉండే ఉంటుందని ఆరోపిస్తున్నారు. నాలుగేళ్లుగా ఆమె దందా సాగుతున్నా ఎవరూ ఎందుకు నోరు మెదపలేదు? విడుదలవుతు న్న నిధులకు అదనంగా నిధులు ఎందుకు కేటాయిం చాల్సి వచి్చంది? నాలుగేళ్లుగా నాన్ రేటెడ్ కంపెనీలకు (ఎన్ఆర్సీ) మందుల కొనుగోళ్లు కాంట్రాక్ట్ ఎం దుకు ఇవ్వాల్సి వస్తోంది? 2014లో రూ.700 కోట్ల మేరకు కొన్న మందుల్లో రూ.300 కోట్లకుపైగా దేవికారాణి, ఆమె ముఠా మింగేశారంటే తప్పకుండా వారి వెనక మరెవరో ఉన్నారనే అనుమానాలు రోజురోజు కు బలపడుతున్నాయి. 2015 నుంచి 2019 వరకు రాష్ట్ర బడ్జెట్లో ఈఎస్ఐకి కేటాయించిన (రూ.1,278 కోట్లు) నిధుల కంటే అధికంగా (రూ.1,616.93 కోట్లు) నిధులు ఖర్చు అయ్యాయి. ఈఎస్ఐలోని మందుల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయంటూ 2018, 19లలో విజిలెన్స్ రెండుసార్లు నివేదిక ఇచ్చినా ఈ వ్యవహారాన్ని పట్టించుకోకపోవడానికి పెద్ద తలలే కారణమన్న వాదనలు వినిపిస్తున్నాయి. సంబంధం ఉన్న కంపెనీలివే..! దేవికారాణి పలు కంపెనీలతో మందుల కొనుగోళ్లు జరిపింది. వీటిలో అక్రమంగా కాంట్రాక్టులు దక్కించుకున్న పలు కంపెనీల ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. ఈఎస్ఐ కాంట్రాక్టు దక్కగానే అవన్నీ ఆర్థికంగా బలపడ్డాయి. ఆర్థికంగా చితికిపోయిన తేజ ఫార్మా కంపె నీ దేవికారాణితో చేతులు కలిపాక లాభపడింది. పలు బినామీ కంపెనీలతోపాటు తన కొడుకుని ఆరిజిన్, సెరిడియా, తేజ ఫార్మాల్లో స్లీపింగ్ పార్ట్నర్గా చేసింది. పృథ్వి ఎంటర్ప్రైజెస్, మైత్రి ఫార్మా, మహీధర మెడికల్ అండ్ సర్జికల్స్, ఆర్ఆర్ ట్రేడర్స్, వైష్ణవ ఎంటర్ప్రైజెస్, గాయత్రి ఫార్మా, వసుధ మార్కెటింగ్ ఫార్మాస్యూటికల్స్ అండ్ సర్జికల్ డి్రస్టిబ్యూటర్స్, సీకోట్రిక్ ఫార్మా, స్వస్తిక్ ఫార్మాస్యూటికల్స్, హిమాలయా ఫార్మసీ, శ్రీరామ ఫార్మా డి్రస్టిబ్యూటర్స్ పేరిట దేవికారాణి తన బినామీలతో నడుపుతోందని ఏసీబీ డీజీకి ఫిర్యాదులు అందాయి. ముగ్గురు బినామీలు.. దేవికారాణి మొత్తం వ్యవహారాన్ని ముగ్గురు వ్యక్తులతో నడిపిందని, వీరే కాలక్రమంలో ఆమెకు బినామీలుగా మారారని లేఖలో ఆరోపించారు. ఈ ముగ్గురి గురించి లేఖలో ఇంకా ఏమన్నారంటే? మొదటి బినామీ ఫార్మాసిస్ట్ నాగలక్ష్మి దేవికారాణికి మొదటి బినామీ. పర్చేస్ డిపార్ట్మెంట్లో ఈమె విధులు నిర్వహించేది. దేవికారాణికి ఈమె కుడి భుజం. ఆమె ఆదేశాల మేరకు 5 బినామీ కంపెనీలు నడిపిస్తున్నట్లు సమాచారం. అర్హతలు లేకున్నా ఈమెను దేవికారాణి పలుకుబడి ఉపయోగించి సెంట్రల్ డ్రగ్ స్టోర్‌లో నియమించిందని సిబ్బంది ఆరోపిస్తున్నారు. ఈమె ఆస్తుల విలువ దాదాపుగా రూ.50 కోట్లు దాటి ఉంటుందని సమాచారం. ఇదిలావుండగా.. ఈమెను ఏసీబీ అ«ధికారులు ఈ నెల 7వ తేదీన అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. రెండో బినామీ ఇతను సెంట్రల్ డ్రగ్ స్టోర్‌లో ఉద్యోగి. దేవికారాణి బినామీ కంపెనీల సమస్త సమాచారం ఇతని వద్ద ఉంది. కుంభకోణంలో అక్రమంగా సంపాదించిన డబ్బు ద్వారా సంగారెడ్డి, బీహెచ్ఈఎల్, గచి్చ»ౌలి ప్రాంతాల్లో రూ.30 కోట్ల విలువ చేసే భూములు కొన్నట్లు సమాచారం. ఇతని ఇంట్లో ఇటీవల సోదాలు చేసిన ఏసీబీ త్వరలోనే అరెస్టు చేసే అవకాశం ఉంది. మూడో బినామీ సూపరింటెండెంట్ వీరన్న. ఈఎస్ఐ అకౌంట్స్ శాఖలో పనిచేస్తోన్న వీరన్న వద్ద కూడా బినామీ కంపెనీల సమాచారం ఉంది. వీరన్న బంధువుల పేరిట దాదాపు రూ.40 కోట్ల విలువ చేసే ఆస్తులు కొన్నాడు. ఇతని ఇంట్లోనూ ఇటీవల ఏసీబీ సోదాలు చేసి పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకుంది. ఇతన్ని కూడా త్వరలో అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయి. ఆస్తులివి... 1.రాజ్‌భవన్‌లోని సేథీ బిల్డర్లో అత్యాధునిక ప్లాట్ విలువ రూ.3 కోట్లు 2. షేక్‌పేట గ్రామంలో ఆదిత్య బిల్డర్స్‌లోని విల్లా విలువ రూ.9.50 కోట్లు సమీపంలో 10 వేల గజాల స్థలం 4.ఉప్పల్ సమీపంలో నారపల్లిలో మూడు ఎకరాల స్థలం 5.మహేశ్వరం మండలంలోని కందుకూరు సమీపంలో 20 ఎకరాల స్థలం 6. రూ.2 కోట్ల విలువైన వజ్రాలు -
కదులుతున్న డొంక
ఆ మూడు కాంట్రాక్టుల్లో కుంభకోణం ఎంత?ఎన్నికల ముందేఎందుకీ పనులు?రూ.120 కోట్లుఎవరి జేబుల్లోకెళ్లాయి?విజిలెన్స్ నివేదికనుతొక్కిపెట్టిందెవరు?రాజధాని ప్రాంత విద్యుత్లైన్ల ఏర్పాట్లలో అక్రమాలుప్రభుత్వ పెద్దలు, అధికారులపాత్రపై అనుమానాలు సాక్షి, అమరావతి ఎన్నికల ముందు ఏపీ ట్రాన్స్‌కో ఇచ్చిన మూడు కాంట్రాక్టులు వివాదాస్పదమయ్యాయి. కాంట్రాక్టుల అప్పగింతలో పెద్దఎత్తున ముడుపులు చేతులు మారాయని ఆరోపణలున్నాయి. దీనిపై ఏపీ ట్రాన్స్‌కో విజిలెన్స్‌తో పాటు రాష్ట్ర విజిలెన్స్ విభాగం కూడా ఇందుకు సంబంధించిన వాస్తవాలను ప్రభు త్వం దృష్టికి తెచ్చాయి. అయితే, ఇవేవీ పరిగణన లోనికి తీసుకోకుండానే హడావిడిగా కాంట్రాక్టులు ఇచ్చినట్లు సీఎస్ గుర్తించారు. ఎక్కడా లేని విధంగానిబంధనలు పెట్టడం, కొన్ని కంపెనీలకు మేలుచేసే ప్రయత్నం చేయడం, కాంట్రాక్టులు ఎక్కువ రేటుకు ఇవ్వడం వెనుక ప్రభుత్వ పెద్దలు, అధికారుల పాత్ర ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి. ఈ వ్యవహారంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలిసింది. గత రెండ్రోజులుగా ఇందుకు సంబంధించిన ఫైళ్లను ఆయన పరిశీలించినట్లు సమాచారం. అక్రమాల బాగోతం ఇదీ.. రాజధాని ప్రాంతానికి అన్ని వైపుల నుంచి విద్యుత్ లైన్లు వేయాలని ఏపీ ట్రాన్స్‌కో ప్రతిపాదించింది. ఇందులో భాగంగా ప్రపంచ బ్యాంకు నిధులతో సీఆర్డీఏ చేపట్టే పనులను ముందుకు తీసుకొచ్చారు. గుడివాడ, చిలకలూరిపేట, ఏలూరుల్లో 400 కేవీ సబ్స్టేషన్లు, లైన్లకు సరిగ్గా ఎన్నికల ముందే ట్రాన్స్‌కో టెండర్లు పిలిచింది. నిజానికి చాలా కంపెనీలు పోటీకి సిద్ధమయ్యాయి. తక్కువ రేటుకే పనులు చేసేందుకూ ముందుకొచ్చాయి. గుడివాడ లైన్, సబ్‌స్టేషన్ పనులకు రూ.600 కోట్లను ట్రాన్స్‌కో కోట్ చేస్తే అంతకన్నా తక్కువకే చేస్తామని పలు కంపెనీలు వచ్చాయి. దీంతో ఏపీ ట్రాన్స్‌కో ఎక్కడలేని నిబంధనలు పెట్టింది. ఈ టెండర్లలో పాల్గొనే కంపెనీలు ఎప్పుడైనా, ఎక్కడైనా మౌలిక సదుపాయాల పనులకు సంబంధించిన కాంట్రాక్టును ఏడాదిలో 10 శాతం పూర్తిచేసి ఉండాలనే నిబంధన పెట్టింది. అంటే.. ట్రాన్స్‌కో లైన్లు వేసే కంపెనీలు గృహ నిర్మాణ పనులుచేసి ఉన్నా ఫర్వాలేదని పేర్కొంది. అదే విధంగా లైన్, సబ్‌స్టేషన్ ఒకే కంపెనీ, ఒకేసారి చేసి ఉండాలి. మునుపెన్నడూ కూడా ఈ నిబంధనలు పెట్టలేదు. దీంతో కేవలం మూడే మూడు కంపెనీలు టెండర్లలో పాల్గొన్నాయి. ఈ మూడు కూడబలుక్కుని మరీ టెండర్లు వేశాయి. ఈ మూడింటికీ వేర్వేరు పనులు అప్పగించారు. ఆరు నెలల క్రితం వరకూ ట్రాన్స్‌కో కోట్‌చేసిన ధర కన్నా నాలుగు శాతం తక్కువకే పనులు అప్పగిస్తే, కంపెనీలు రింగ్ అవ్వడంవల్ల ఏకంగా నాలుగు శాతం ఎక్కువకు పనులు ఇచ్చారు. మొత్తం రూ.1200 కోట్ల విలువైన టెండర్లలో కనీసం రూ.120 కోట్లు చేతులు మారినట్టు ఆరోపణలు వచ్చాయి. కాగా, ఎన్నికల కోడ్ సమీపిస్తుండడంతో టెండర్ల ప్రక్రియను హడావుడిగా పూర్తిచేసి మార్చి మొదటి వారంలోనే పనులు అప్పగించారు. వీటన్నింటినీ విజిలెన్స్ విభాగం ప్రభుత్వం దృష్టికి తెచ్చినా పట్టించుకోకపోవడాన్ని ప్రస్తుత సీఎస్ ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. జేఎండీ కథానాయకుడా? ప్రభుత్వాధినేత కనుసన్నల్లో జరిగిన ఈ టెండర్ల వ్యవహారంలో ట్రాన్స్‌కో జేఎండీ కీలకపాత్ర పోషించినట్టు సీఎస్‌కు ఫిర్యాదు అందినట్లు తెలిసింది. ఆదాయ పన్నుశాఖ నుంచి డిప్యుటేషన్‌పై ట్రాన్స్‌కో డైరెక్టర్‌గా వచ్చిన ఆయనకు.. ప్రభుత్వం మొదటి నుంచి పెద్దపీట వేసింది. డైరెక్టర్ స్థాయి నుంచి ఏకంగా ఆయనకు జేఎండీగా పదోన్నతి కల్పించింది. డిప్యూటేషన్ కాలం పూర్తయినా కేంద్ర స్థాయిలో మేనేజ్ చేసి ఆయనను ఇక్కడే ఉంచేందుకు టీడీపీకి చెందిన ఓ ఎంపీ విశ్వప్రయత్నం చేశారు. జేఎండీపై ఆయన మాతృ సంస్థకు ఫిర్యాదులు వెళ్లడంతో తప్పనిసరై ఆయన తిరిగి వెళ్లినట్టు ట్రాన్స్‌కో వర్గాల సమాచారం. ఇదిలా ఉంటే.. మూడు కాంట్రాక్టులు తెరిచి, ఖరారు చేసే వరకూ ఆయన జేఎండీగానే కొనసాగారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత తిరిగి మాతృసంస్థకు వెళ్లారు. ఈ వ్యవహారంలో ఆయనకు ఏవైనా ముడుపులు అందాయా అనే కోణంలోనూ సీఎస్ ఆరా తీస్తున్నట్టు తెలిసింది. -
మట్టిని పిండి.. కోట్లు కొల్లగొట్టి..!
జిల్లాలో టీడీపీ ప్రజాప్రతినిధుల దోపిడీకి పంచ భూతాలూ సమిధలవుతున్నాయి. కొండలు కరిగించేస్తున్నారు. అక్రమ క్వారీలతో మట్టి నుంచి కోట్లు పిండుకుంటున్నారు.యలమంచిలి నియోజకవర్గంలో అధికా పార్టీ ప్రజాప్రతినిధి సాగిస్తున్న దందాతో ప్రభుత్వ భూముల్లో మట్టి మాయమైపో తోంది. రాంబిల్లి మండలంలో నేవల్ బేస్ ఫిల్లింగ్ పనుల కాంట్రాక్టును హైజాక్ చేసి భారీ దోపిడీ సాగిస్తున్నారు. డీపట్టా రైతు లను భయాందోళనలకు గురిచేసి ఏడా దిన్నర వ్యవధిలో రూ.17 కోట్ల విలువైన మట్టిని మింగేశారు. విశాఖపట్నం జిల్లాలోని రాంబిల్లి, ఎస్.రాయవరం మండలాల్లో నెలకొల్పనున్న నేవల్ బేస్ కోసం నేవల్ అధికారులు భూమి ఫిల్లింగ్ పనులు చేపట్టారు. ఫిల్లింగ్ చేయాల్సిన భూముల విస్తీర్ణం ఎక్కువగా ఉన్నందున రెండు దశల్లో పనులు చేపట్టాలని నిర్ణయించారు. మొదటి దశలో సుమారు 15 లక్షల క్యూబిక్ మీటర్లు, రెండో దశలో సుమారు 40 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి అవసరమవుతుందని అంచనా వేశారు. మొదటి దశ పనుల కాంట్రాక్టును ఏడాది క్రితం ఓ సంస్థకు అప్పగించారు. యూనిట్(3 క్యూబిక్ మీటర్లు)కు రూ.650 చొప్పున చెల్లించేందుకు కాంట్రాక్టు కుదురింది. కాగా మట్టి సరఫరాకు డీ పట్టా భూములకు అనుమతి ఇవ్వాలని కూడా నిర్ణయించారు. తమ డీపట్టా భూముల నుంచి మట్టి సరఫరా చేస్తామని 47 రైతులు దరఖాస్తు చేశారు. వారిలో 24 మందికి రెవెన్యూ అధికారుల సిఫార్సు మేరకు గనుల శాఖ అనుమతిచ్చింది. ఈ మేరకు ధర కూడా నిర్ణయించారు. ఒక యూనిట్‌కు (3 క్యూబిక్ మీటర్లు) రైతులకు సగటున రూ.250 చెల్లించేందుకు కాంట్రాక్టరు సమ్మతించారు. అంటే నేవీ నుంచి యూనిట్‌కు రూ.650 తీసుకుంటున్న కాంట్రాక్టు సంస్థ రైతులకు మాత్రం రూ.250 చెల్లిస్తోంది. అదైనా సక్రమంగా జరుగుతోందా అంటే అదీ లేదు. ఇక్కడే యలమంచిలి నియోజకవర్గానికి చెందిన అధికార పార్టీ ప్రజాప్రతినిధి అనుచరులు రంగ ప్రవేశం చేసి భారీ దోపిడీకి తెరతీశారు. అంతా నేనే చూసుకుంటానుఅధికార పార్టీకి చెందిన కీలక ప్రజాప్రతినిధి కన్ను ఈ కాంట్రాక్టుపై పడింది. ‘అంతా నేనే చేసుకుంటాను’ అని కాంట్రాక్టరును తమదైన శైలిలో ప్రభావితం చేశారు. తమ అనుచరులు సరఫరా చేసే మట్టిని తీసుకోవాలని హుకుం జారీ చేశారు. అనంతరం తన అనుచరులను రంగంలోకి దింపారు. నిబంధనల ప్రకారం అనుమతులు పొందిన డీపట్టా భూముల నుంచి రైతులే మట్టి తవ్వి సరఫరా చేయాలి. కానీ ప్రజాప్రతినిధి అనుచరులు డీపట్టా భూములను ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూములపై పడ్డారు. భారీ సంఖ్యలో వాహనాలను మోహరించి ఏడాదిన్నరగా భారీ మట్టి కుంభకోణానికి తెగించారు. కుంభకోణం విలువ రూ.17కోట్లు! మట్టే కదా.. అనుకోవద్దు. ఎందుకంటే అనుమతులు పొందిన రైతులను భయాందోళనకు గురిచేసి దాదాపు ఏడాదిన్నరగా ప్రజాప్రతినిధి నియమించిన బృందమే అక్రమంగా మట్టిని తవ్వి సరఫరా చేస్తోంది. రాంబల్లి మండలంలోని పెద్దకలవలపల్లి, వెలుచూరు, గోవిందపాలెం, హరిపురం తదితర గ్రామాల్లోని ప్రభుత్వ, కొండ పోరంబోకు భూముల్లో యథేచ్ఛగా తవ్వేసి మట్టిని తరలించేశారు. దాని విలువ ఎంతో తెలుసా... దాదాపు రూ.17కోట్లు!... నమ్మశక్యంగా లేదా?.. అయితే ఈ లెక్క చూడండి.. ప్రజాప్రతినిధి నియమించిన బృందం రోజుకు 200 ట్రిప్పుల మట్టిని అనధికారికంగా తవ్వేసి సరఫరా చేసినట్లు అంచనా. ఒక ట్రిప్పుకు 6 యూనిట్లు చొప్పున సరఫరా చేశారు. అంటే 200 ట్రిప్పుల ద్వారా 1,200 యూనిట్లు సరపరా చేశారన్నమాట. ఆ ప్రకారం రోజుకు రూ.3 లక్షల విలువైన మట్టిని కొల్లగొట్టారని స్పష్టమవుతోంది. దాదాపు 15 నెలలుగా ఈ దందా సాగుతోంది. అంటే సగటున రూ.రూ.17 కోట్లు అప్పనంగా దోచేశారు. అదండీ సంగతి. -
గుట్టురట్టు
గత నెలలో ఆత్రేయపురంలో కల్తీ నెయ్యి తయారీ ఘటన మరువకముందే ఆలమూరు మండలంలోని మూలస్థానం అగ్రహారంలో మంగళవారం కల్తీ పాలతయారీ కుంభకోణం బయటపడింది. జాతీయ రహదారి పక్కనే చేస్తున్న కల్తీ పాల తయారీ స్థానికంగా సంచలనం సృష్టించింది. రోజుకు సగటున 500 లీటర్ల కల్తీ పాలు తయారు చేసి హోటళ్లకు సరఫరా చేస్తున్న ముఠా గుట్టును స్థానిక యువకులు రట్టు చేశారు. బయటపడిందిలా.. మూలస్థానం అగ్రహారంలోని స్థానిక చర్చి పక్క వీధిలో గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన గానుగపల్లి వెంకటేశ్వరరావు, ఆలమూరు మండలంలోని పెనికేరుకు చెందిన లంకలపల్లి ఫణికుమార్ ఒక ఇల్లును అద్దెకు తీసుకున్నారు. వారిద్దరూ గత నెల 25న పాలతో పన్నీర్, పాలకోవా తయారు చేసుకుని విక్రయించుకుని జీవనోపాధి పొందుతామని తెలపడంతో ఇంటి యజమాని మురమండ శ్రీనివాసు తన ఇల్లును అద్దెకు ఇచ్చారు. అప్పటి నుంచి రోజూ ఒక ఆటోలో రెండు కేన్లతో పాలు తీసుకువస్తుండగా వెళ్లేటపుడు మాత్రం ఎనిమిది కేన్లలో పాలు తీసుకువెళుతున్నారు. వారం రోజుల నుంచి ఇదే విధంగా జరుగుతుండటంతో స్థానిక యువకులకు అనుమానం వచ్చి గ్రామస్తుల సహకారంతో మంగళవారం తయారీదారులను నిలదీశారు. దీనిపై పొంతన లేని సమాధానాలు చెప్పడంతో గ్రామస్తులు ఇంట్లోకి వెళ్లి చూడగా కల్తీ పాల బండారం బయటపడింది. కల్తీ పాల తయారీకి వినియోగిస్తున్న పదార్థాలు, మిక్సీలు కంటబడటంతో స్థానికులు అవాక్కయ్యారు. తమను వదిలేస్తే ఊరు విడిచివెళ్లిపోతామని నిందితులు గ్రామస్తులను బతిమలాడారు. అయితే స్థానిక యువకులు వీరిని పోలీసులకు పట్టించారు.వ్యర్థాలు, రసాయనాలతో కల్తీ పాల తయారీ పంచదార, ఉప్పు, దుస్తులు ఉతికేందుకు వినియోగించే సర్ఫ్‌పొడి, తవుడుతో తయారు చేసిన వంటనూనెను తగిన మోతాదులో కలిపి కల్తీపాలను తయారు చేస్తారని తెలుస్తోంది. ఈ మిశ్రమాన్ని మిక్సీలో కొద్దిసేపు తిప్పితే పాలుగా మారతాయని, వాటిలో రసాయనాలు కలిపితే చిక్కటి పాలు తయారవుతాయని చెబుతున్నారు. అయితే మిశ్రమం తయారీలో ప్లాస్టిక్ వ్యర్థాలు వినియోగిస్తున్నట్టు అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి తెలుస్తోంది. తయారు చేసిన కల్తీపాలను అసలు పాలతో కలిపి వీటిని బయటకు తరలిస్తారు. లీటరు కల్తీపాల తయారీకి రూ.5 నుంచి రూ.8 ఖర్చవుతుందని తెలిసింది. కొన్ని పట్టణాల్లోని హోటళ్లకు పాలను విక్రయిస్తున్నామని నిందితులు నాగేశ్వరరావు, ఫణికుమార్‌లు పోలీసులకు తెలిపారు. తయారీలో వినియోగిస్తున్న పదార్థాలు స్వాధీనం కల్తీ పాల తయారీలో వినియోగిస్తున్న సుమారు 50 కేజీల పంచదార, 20 కేజీల ఉప్పు, 30 కేజీల సర్ఫ్‌పొడి, 25 లీటర్ల తవుడు ఆయిల్ ప్యాకెట్లు, పాల డబ్బాలు, ఎనిమిది పాలకేన్లతో పాటు కల్తీ తయారీ మిశ్రమానికి వినియోగిస్తున్న ఐదు మిక్సీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అప్పటికే తయారు చేసిన సుమారు 50 లీటర్ల కల్తీపాలను సీజ్ చేశారు. కల్తీపాలను హోటళ్లకు సరఫరా చేస్తున్న ఆటోడ్రైవర్ బి.సత్తిపండుతో పాటు నిందితులైన నాగేశ్వరరావు, ఫణికుమార్‌లను ఎస్సై ఎం.శేఖర్‌బాబు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. కల్తీపాలను పరీక్షల నిమిత్తం పుడ్ సేఫ్టీ అధికారుల వద్దకు పంపిస్తామన్నారు. నిందితులు కల్తీపాలను, కోవాను ఇక్కడే చేస్తున్నారా లేక ఇతర ప్రాంతాల్లో బ్రాంచీలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. -
‘ఫోర్జరీ’ బాగోతానికి తెర
కుత్బుల్లాపూర్: ‘ఫోర్జరీ పనుల’ కుంభకోణానికి పోలీసులు తెర దింపారు. కేసులోని ప్రధాన సూత్రధారితో పాటు పాత్రధారులను శుక్రవారం అదుపులోకి తీసుకుని, వీరి వద్ద నుంచి రూ.7 లక్షలు రికవరీ చేసి రిమాండ్‌కు తరలించారు. సీఐ చంద్రశేఖర్, ఎస్ఐ లింగ్యానాయక్ల కథనం ప్రకారం.. కుత్బుల్లాపూర్ సర్కిల్-15లో కాంట్రాక్టర్లుగా పనులు నిర్వహించే మాధురి, లక్ష్మణ్‌రాజు, మల్లేశ్, రాజు, రేక్యానాయక్, సుధీర్‌లు పనులు చేయకుండానే చెక్కుల ద్వారా రూ.46.35 లక్షలు డ్రా చేశారు. ఇది గుర్తించిన ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ చెన్నారెడ్డి సదరు వ్యక్తులపై ఈ నెల 4న జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. గోప్యంగా ఉంచిన ఈ విషయంపై ‘ఫోర్జరీ పనులు’ శీర్షికతో ఈ నెల 6న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం చర్చనీయాంశంగా మారింది. దీంతో కాంట్రాక్టర్లపై వివిధ సెక్షన్ల కింద కేసు చేసిన జీడిమెట్ల సీఐ చంద్రశేఖర్ దర్యాప్తు బాధ్యతను ఎస్ఐ లింగ్యానాయక్‌కు అప్పగించారు. ఆరుగురికి రిమాండ్.. ఈ కేసులో నార్త్ జోన్ ఆడిటర్ వెంకటస్వామితో పాటు కాంట్రాక్టర్లు లక్ష్మణ్‌రాజు, మల్లేశ్‌ల వద్ద సూపర్వైజర్లుగా పని చేసే నవీన్‌రెడ్డి, మజర్, వర్క్ఇన్స్పెక్టర్లు ఉపేందర్‌రెడ్డి, విజయ్, కంప్యూటర్ ఆపరేటర్ లింగయ్యలను శుక్రవారం అరెస్టు చేసి మేడ్చల్ కోర్టుకు రిమాండ్ చేశారు. వెంకటస్వామి నుంచి రూ.5 లక్షలు, ఇతర సిబ్బంది నుంచి రూ.2 లక్షలు రికవరీ చేసినట్లు పోలీసులు తెలిపారు. -
విలేకరి అక్షయ్ సింగ్ ఆకస్మిక మృతి
జబువా (మధ్యప్రదేశ్): మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకున్న వృత్తిపరీక్షల బోర్డు(వ్యాపమ్) కుంభకోణంపై వార్తలు అందిస్తున్న అక్షయ్ సింగ్ అనే విలేకరి శనివారం ఆకస్మికంగా మృతి చెందారు. టీవీ టుడే టీవీ చానల్ విలేకరిగా పనిచేస్తున్న అక్షయ్ మధ్యప్రదేశ్‌లోని మేఘ్‌నగర్‌లో హఠాత్తుగా అనారోగ్యానికి గురై కన్నుమూశారు. ఢిల్లీలో పనిచేస్తున్న ఆయన అనుమానాస్పదంగా మృతిచెందిన ఈ స్కాం నిందితురాలు నమ్రతా దామోర్ తల్లిదండ్రులతో మాట్లాడేందుకుశనివారం మేఘ్‌నగర్ వచ్చారు. నమ్రత తండ్రి మెహతాబ్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. అక్షయ్, మరో ఇద్దరు మెహతాబ్ ఇంటికి వెళ్లారు. ఇంటర్వ్యూ అయిపోయాక ఏవో కాగితాలను జిరాక్స్ చేయించేందుకు ఒక వ్యక్తిని పంపారు. అక్షయ్ ఆ ఇంటి వెలుపల వేచిచూస్తుండగా హఠాత్తుగా నోట్లోంచి నురగ వచ్చింది. ఆయనను దగ్గర్లోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఫలితం లేకపోవంతో దగ్గర్లోనే ఉన్న దాహోద్(గుజరాత్)కు తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆయన చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఈ స్కాంలో లబ్ధి పొందినట్లు భావిస్తున్న నమ్రత మృతదేహం 2012లో రైలు పట్టాలపై కనిపించింది. అక్షయ్ మృతిపై కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ సందేహాలు లేవనెత్తారు. పోస్ట్‌మార్టంను వీడియోలో చిత్రీకరించాలని డిమాండ్ చేశారు. -
బొగ్గు స్కామ్‌లో మధు కోడాకు బెయిల్
న్యూఢిల్లీ : బొగ్గు బ్లాకుల కేటాయింపు కుంభకోణంలో జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధు కోడాకు బెయిల్ లభించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో ఏడుగురికి కూడా బుధవారం ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బొగ్గుశాఖ మాజీ కార్యదర్శి హెచ్‌సీ గుప్తా, జార్ఖండ్ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అశోక్ కుమార్ బసులు బెయిల్ లభించినవారిలో ఉన్నారు. ఈ కేసులో ఎనిమిది మందికి బెయిల్ మంజూరు చేసినట్లు సీబీఐ ప్రత్యేక జడ్జి ప్రభాత్ ప్రశార్ పేర్కొన్నారు. ఒక్కొక్కరు లక్షరూపాయల వ్యక్తిగత బాండ్లు, అంతే మొత్తంలో పూచీకత్తు సమర్పించాలని షరతు విధించారు. ఈ కేసు తదుపరి విచారణను మార్చి 4కు వాయిదా వేశారు. వాదనల సందర్భంగా వీరికి బెయిల్ ఇవ్వకూడదని సీబీఐ కోర్టును కోరింది. వీరంతా అధికార దుర్వినియోగంతోపాటు కుట్రపూరిత చర్యలకు పాల్పడ్డారని, వినీ ఐరన్ అండ్ స్టీల్ ఉద్యోగ్ లిమిటెడ్ అనే కంపెనీకి అనుకూలంగా వ్యవహరించారని సీబీఐ వాదించింది. వీరికి బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశముందని తెలిపింది. ఇందులో హెచ్‌సీ గుప్తా గతంలో ప్రధాని కార్యాలయాన్ని కూడా తప్పుదోవ పట్టించారని సీబీఐ, ప్రత్యేక కోర్టు దృష్టికి తీసుకువచ్చింది. -
ఆరోగ్యశాఖ సిబ్బందిపై వేటు!
అంతర్గత విచారణ పూర్తి డెరైక్టర్ ఆఫ్ హెల్త్‌కు నివేదిక నాటి 420 జీవోయే మూలమని నిర్ధారణ {sెజరీ కుంభకోణం విశాఖపట్నం: చింతపల్లి ట్రెజరీలో వెలుగుచూసిన కుంభకోణానికి వైద్యఆరోగ్యశాఖలో బాధ్యులైన వారిపై చర్యలకు ఆశాఖ ఉన్నతాధికారులు రంగంసిద్ధం చేస్తున్నారు. ఆశాఖ కమిషనర్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆదేశాలమేరకు ఆ శాఖకు చెందిన చీఫ్అకౌంట్స్ఆఫీసర్ మూడు రోజులు జిల్లాలో మకాం వేసి అసలు ఏం జరిగింది, ఈ భారీ కుంభ కోణంలో ఎవరెవరిపాత్ర ఉంది? ఏఏ స్థాయి అధికారుల భాగస్వామ్యంతో ఈ వ్యవహారం సాగింది అనే కోణాలపై అంతర్గత విచారణ నిర్వహించారు. ఇందులో అప్పటి రాష్ర్టస్థాయి ఉన్నతాధికారుల పాత్ర కూడా ఉండి ఉండవచ్చుననే అభిప్రాయానికి విచారణాధికారి వచ్చినట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ స్థాయి నుంచి చింతపల్లిస్థాయి వరకు చాలా మంది అధికారులు,సిబ్బంది పాత్ర ఉన్నట్టుగా గుర్తించారు. వైద్య ఆరోగ్య శాఖలో సుమారు 20 మంది వరకు ఈ కుంభకోణం పాత్ర ఉన్నట్టగా నిర్ధారణకు వచ్చినట్టు తెలియవచ్చింది. అప్పటి డీఎంఅండ్‌హెచ్‌వో పాత్ర ఈ కుంభకోణంలో కీలకమని భావిస్తున్నారు. ఈ అవినీతికి 2012లోనే ఆజ్యం పడినట్టుగా గుర్తించారు. అప్పట్లో నియామకాలు, బదిలీలు, పదోన్నతులతో పాటు జీతభత్యాల డ్రాయింగ్ , డిస్బర్స్ మెంట్స్‌కు సంబంధించి ఏజెన్సీ వైద్య ఆరోగ్యశాఖలో కీలక అధికారికి దఖలు పరుస్తూ అప్పటి ప్రభుత్వం జీవో ఎంఎస్-420ను జారీ చేసింది. ఈ జీవోను అడ్డంపెట్టుకునే ఈ అవినీతి, అవకలకు జరిగినట్టుగా విచారణలో గుర్తించారు. 2011-12లో 40మంది సిబ్బంది జీతభత్యాల కోసం రూ.80 లక్షల బడ్జెట్ కేటాయింపులు జరిపితే 2012-13కు వచ్చేసరికి ఏకంగా రూ.2.8కోట్ల మేర కేటాయింపులు జరిగాయి. ఇక 2013-14 ఆర్థిక సంవత్సరంలో ఈ మొత్తం కాస్తా ఏకంగా ఐదు కోట్లకు చేరింది. ఒక మారుమూల ఏజెన్సీ ప్రాంతంలో పనిచేసే కాంట్రాక్టు సిబ్బంది జీతభత్యాల నిమిత్తం ఇంతపెద్ద ఎత్తున బడ్జెట్ కేటాయింపులు జరిపితే పైనుంచి కింద వరకు ఏ ఒక్కరూ పసిగట్టకపోవడం చూస్తుంటే అందరి ప్రమేయం ఈ కుంభఖోణంలో ఉన్నట్టుగా అనుమానించాల్సి వస్తున్నదని విచారణాధికారి కామెంట్ చేసినట్టు చెబుతున్నారు. అసలు సిబ్బందే లేకుండా జరిపిన ఈ నకిలీ నియామకాలన్నీ సదరు జీవో ఎంఎస్-420ను ఆధారంగా జరిగినట్టుగా విచారణలో గుర్తించారు. విచారణ నివేదికను వైద్యఆరోగ్యశాఖ కమిషనర్‌కు సమర్పించనున్నట్టుగా చెబుతున్నారు. ఈ నివేదిక ఆధారంగా చేసుకుని అవసరమైన వారిపై చర్యలకు ఉపక్రమించే అవకాశాలు కన్పిస్తున్నాయి. వీరిపై శాఖపరంగా సస్పెన్షన్లు విధించడంతో పాటు వారిపై క్రిమిన ల్ కేసులు నమోదుకు ఆదేశాలు జారీ చేసే అవకాశాలున్నాయని అంటున్నారు. -
కుంభకోణం కంచికేనా ?
తాడేపల్లి రూరల్ : రూ. కోటీ 76 లక్షల కుంభకోణం పీడబ్ల్యూడీ వర్క్‌షాప్ కార్మికులందరినీ కలవరపాటుకు గురిచేసింది. జీడీసీసీ బ్యాంక్ అధికారులను సైతం షాక్ తినిపించింది. సొసైటీ యాక్ట్ 51 విచారణతో మొదలై పోలీసుల వద్దకు చేరింది. మేమే బాధ్యులమంటూ కొందరు తెరపైకి వచ్చారు. ఆ తరువాత కనుమరుగయ్యారు. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మిన్నకుండిపోయారు. బాధితులు మాత్రం ఎవరో వస్తారు, ఏదో చేస్తారనే ఆశతోఎదురు చూస్తూనే ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సీతానగరం పీడబ్ల్యూడీ కో-ఆపరేటివ్ సొసైటీ కుంభకోణం కంచికి చేరినట్టేనా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. తాడేపల్లి పట్టణం సీతానగరం పీడబ్ల్యూడీ వర్క్ షాపు కో-ఆపరేటివ్ కన్జ్యూమర్ సొసైటీలో కోటీ 76 లక్షల రూపాయల కుంభకోణం జరిగిన విషయం తెలిసిందే. కార్మికులకు సంబంధం లేకుండా సొసైటీ ప్రెసిడెంట్ కెకెడి ప్రసాద్, గుమస్తా వెంకటేశ్వరరావులు ఈ అవినీతి బాగోతంలో భాగస్వామ్యులు అంటూ జీడీసీసీ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పట్లో తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. వర్క్‌షాపులో పని చేస్తున్న 94 మంది కార్మికుల సంతకాలను ఫోర్జరీ చేసి ప్రెసిడెంట్, గుమస్తా కలసి సొమ్ము స్వాహా చేసినట్టు విచారణలో తేలింది. కార్మికులు తమ అవసరాల కోసం కో-ఆపరేటివ్ సొసైటీలో రుణాలు పొందేవారు. ఈవ్యవహారాన్ని సొసైటీ ప్రెసిడెంట్, గుమస్తాలు చూస్తుంటారు. తిరిగి చెల్లించిన రుణాలు సక్రమంగా జమ కాకపోవటంతో బకాయి ఉన్నారంటూ జీడీసీసీ బ్యాంకు నుంచి కార్మికులకు నోటీసులు అందాయి. ఈ క్రమంలో బాధిత కార్మికులు సొసైటీ ప్రెసిడెంట్, గుమస్తాలను నిలదీయగా కుంభ కోణం బయటపడింది. దీనిపై జీడీసీసీ బ్యాంక్ చైర్మన్, అధికారులు విచారణ చేపట్టారు. ప్రెసిడెంట్, గుమస్తాలే రూ. కోటి 76 లక్షల కుంభకోణానికి బాధ్యులని తేల్చి, సొసైటీ యాక్ట్ 51 ఎంక్వైరీ ద్వారా పూర్తి వివరాలు సేకరించాలని ప్రత్యేక అధికారిని నియమించారు. కార్మికులు తాము చెల్లించిన రశీదులతో కూడిన వినతి పత్రాలను సదరు అధికారికి అందించారు. ప్రెసిడెంట్, గుమస్తాలు మాత్రం తిరిగి సొమ్ము చెల్లించేందుకు నిరాకరించటంతో బ్యాంకు అధికారులు స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదైన మరుక్షణమే ప్రెసిడెంట్, గుమస్తా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కుటుంబ సభ్యులను విచారించటంతో కలుగులో నుంచి అవినీతి ఎలుకలు బయట కొచ్చాయి. స్వాహా చేసిన సొమ్ము విడతల వారీగా చెల్లించేందుకు ప్రెసిడెంట్, గుమస్తాలు అంగీకరించారు. తొలి విడతగా పోలీసుల సమక్షంలో కొంత సొమ్ము జమ చేశారు. మిగిలిన సొమ్ము మరో 15 రోజుల్లో జమ చేస్తామంటూ నమ్మబలికారు.బాధిత కార్మికులు సైతం గండం గట్టెక్కిందని ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం ఈ కుంభకోణంపై పోలీసులుగానీ, బ్యాంక్ అధికారులుగానీ ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ఇది జరిగి మూడు నెలలు గడిచినా ప్రెసిడెంట్, గుమస్తాలు మిగిలిన సొమ్ము చెల్లించకపోవడంతో కార్మికులు ఆందోళనకు గురవుతున్నారు. -
ఫోర్జరీ సంతకాల్లో సూత్రధారులెవరు ?
మధిర : శ్రీ పవన్‌సాయి కోల్డ్‌స్టోరేజీ రుణాల కుంభకోణంలో బాధితర రైతులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 2013లో శ్రీ పవన్‌సాయి కోల్డ్‌స్టోరేజిలో మిర్చి బస్తాలను నిల్వ చేయనప్పటికీ, విజయవాడ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్‌బ్రాంచిలో రుణాలు తీసుకోకపోయినప్పటికీ బ్యాంకు అధికారులు రైతులకు నోటీసులు ఇవ్వటం, పత్రికాప్రకటనలలో జప్తు చేస్తామని ప్రకటించటంతో వారు ఆందోళన చెందుతున్నారు. కోల్డ్ స్టోరేజిలో నిల్వ ఉంచిన మిర్చి బస్తాలపై రుణాలు ఇవ్వాలంటే ఎన్ని బస్తాలను, ఏ ఛాంబర్లో రైతులు నిల్వ చేశారో స్వయంగా బ్యాంకు అధికారులు తనిఖీ చేయాలి. అందుకు సంబంధించిన ధ్రువీకరణపత్రాలను తయారుచేసి రుణం తీసుకునే రైతు ఫొటోలతో పాటు అతనికి సంబంధించిన రేషన్‌కార్డు, పాస్‌పుస్తకాల జిరాక్స్‌లు తదితర పత్రాలపై రైతుల సంతకాలు తీసుకోవాలి. అనంతరం బ్యాంకు అధికారులు రుణాలు మంజూరు చేయాలి. అయితే కోల్డ్‌స్టోరేజిలో మిర్చి బస్తాలు నిల్వ చేయకపోయినప్పటికీ, సంబంధిత పత్రాలు అందకచేయపోయినప్పటికీ, రైతులు సంతకాలు చేయనప్పటికీ రుణాలు ఇవ్వటంలో బ్యాంక్ అధికారుల పాత్ర ఉందని చెబుతున్నారు. 2011లో శ్రీ పవన్‌సాయి కోల్డ్‌స్టోరేజిలో మిర్చి నిల్వ చేసి రుణాలు తీసుకుని తిరిగి చెల్లించినప్పటికీ అప్పట్లో ఇచ్చిన ధృవీకరణపత్రాలను కోల్డ్‌స్టోరేజీ యాజమాన్యం తమకు ఇవ్వలేదని రైతులు చెబుతున్నారు. ఖమ్మం, కృష్ణా జిల్లాల పరిధిలోని 63మంది రైతులకు ఒకే రోజు(2013, మార్చి 28న) బ్యాంకు ఖాతాలు ప్రారంభించి బినామీపేర్లతో సుమారు రూ.6కోట్లకు పైగా రుణాలు ఏ విధంగా ఇచ్చారని బాధితరైతులు బ్యాంకు అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఒక రైతుకు రుణం మంజూరు చేయాలంటే నో డ్యూస్, ఆస్తుల తాకట్టు తదితర ధృవీకరణ పత్రాలు అడగటంతోపాటు రోజుల తరుబడి బ్యాంకు చుట్టూ తిప్పుకోవటం చేసే అధికారులు ఈ విషయంలో రుణాలు ఎలా ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు. ఈ కుంభకోణంలో వాస్తవ విషయాలు నిగ్గుతేలాలంటే బ్యాంకు ఉన్నతాధికారులు, పోలీస్ ఉన్నతాధికారులు పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.