
సాక్షి, హైదరాబాద్: సంచలనం సృష్టించిన ఈఎస్‌ఐ కుంభకోణంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈఎస్‌ఐ మాజీ డైరెక్టర్‌తో పాటు ఉన్నతాధికారులను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈఎస్‌ఐలో వందల కోట్ల స్కాం జరిగినట్లు ఈడీ గుర్తించింది. రూ.వందల కోట్ల నిధుల దారి మళ్లింపుపై ఈడీ ఆరా తీస్తోంది. మనీ లాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు చేపట్టింది.
కాగా, నిబంధనలకు విరుద్ధంగా మెడికల్ కిట్లు, ఫార్మా కంపెనీలకు మందుల సరఫరా కాంట్రాక్టుల అప్పగింతలో జరిగిన అవకతవకల్లో రూ.కోట్ల మేర ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందంటూ గతంలో ఏసీబీ కేసు ఆధారంగా ఈడీ విచారణ జరిపిన సంగతి తెలిసిందే.
చదవండి: కేసీఆర్ మెదక్ పర్యటన వాయిదా.. కారణం ఇదే..
Comments
Please login to add a commentAdd a comment