హైదరాబాద్: లోన్‌యాప్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరెట్(ఈడీ)దర్యాప్తును వేగవంతం చేసింది. ఫైనాన్స్ కంపెనీ పీసీ ఫైనాన్షియల్ సర్వీసెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన మరో రూ.131 కోట్లను ఈడీ జప్తు చేసింది. క్యాష్ బీన్ మొబైల్ యాప్ ద్వారా రుణాలను పీఎస్‌ఎఫ్‌ఎస్ రుణాలు ఇచ్చినట్లు ఈడీ గుర్తించింది. చైనాకు చెందిన జో యాహుయ్ ఆధీనంలో పీఎస్‌ఎఫ్‌ఎస్ పనిచేస్తోందని ఈడీ తెలిపింది.
బోగస్ సాఫ్ట్‌వేర్ ఎగుమతుల పేరిట చైనా, హాంకాంగ్, తైవాన్, యూఎస్, సింగపూర్‌లకు నిధులు మళ్లించినట్లు ఈడీ వెల్లడించింది. ప్రధానంగా.. ఫెమా నిబంధలను పీసీఎఫ్‌ఎస్ పూర్తిగా ఉల్లంఘించిందని ఈడీ గుర్తించింది. కాగా, ఈడీ గతంలో పీసీఎఫ్ఎస్‌కు చెందిన రూ.106 కోట్లను జప్తు చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment