ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: లోన్ యాప్‌ల కేసులో దర్యాప్తును ఈడీ ముమ్మరం చేసింది. పీసీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన రూ.106 కోట్లు అధికారులు జప్తు చేశారు. క్యాష్ బీన్ మొబైల్ యాప్ ద్వారా రుణాలు ఇచ్చిన పీసీఎఫ్ఎస్.. చైనాకు చెందిన జో యాహుయ్ ఆధీనంలో పనిచేస్తోందని ఈడీ తెలిపింది. బోగస్ సాఫ్ట్‌వేర్ ఎగుమతుల పేరిట విదేశాలకు నిధులు మళ్లించినట్లు ఈడీ గుర్తించింది. చైనా, హాంకాంగ్, తైవాన్, యూఎస్, సింగపూర్‌కు నిధులు తరలించినట్లు ఈడీ వెల్లడించింది. ఫెమా నిబంధనలు ఉల్లంఘించినందుకు పీసీఎఫ్ఎస్ సొమ్ము జప్తు చేసినట్లు ఈడీ పేర్కొంది.
ఇవీ చదవండి:
వరుస పేలుళ్ల కలకలం, 13 మంది మృతి
సముద్రంలో అల్లకల్లోలం: ముందుకొచ్చి.. వెనక్కి మళ్లి..
Comments
Please login to add a commentAdd a comment