సాక్షి, హైదరాబాద్: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో.. స్కిల్ డెవలప్‌మెంట్ మాజీ డైరెక్టర్, మాజీ ఐఏఎస్ లక్ష్మీ నారాయణ విచారణ ముగిసింది. సోమవారం ఉదయం 11 గంటలకు నగరంలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆఫీస్‌కు ఆయన విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. సుమారు ఏడు గంటలపాటు ఆయన్ని విచారించింది ఈడీ.
ఆపై విచారణ పూర్తికాగానే.. మీడియా కంట పడకుండా సైలెంట్‌గా అక్కడి నుంచి జారుకున్నారు ఆయన. మరోవైపు ఇదే స్కాంలో విచారణకు హాజరైన పలు కంపెనీల ప్రతినిధులను సైతం ఈడీ దీర్ఘంగా విచారించింది. ఇదిలా ఉంటే.. గతంలో స్కిల్ డెవలప్‌మెంట్ డైరెక్టర్‌గా లక్ష్మీ నారాయణ కొనసాగారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో భారీ కుంభకోణం జరిగిందన్న అభియోగాలు నమోదు అయ్యాయి.
స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌తో సీమెన్స్ సంస్థ రూ.3,350 కోట్ల ఒప్పందం కుదుర్చుకుంది. అందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ.370 కోట్లు కాగా, ప్రభుత్వ వాటాలోని రూ.370 కోట్లలో రూ.241 కోట్లు దారి మళ్లించారని.. స్కిల్ డెవలప్‌మెంట్‌లో నిర్వహించిన ఫోరెనిక్స్ ఆడిట్‌లోనిర్థారణ అయ్యింది. నకిలీ బిల్లులు, ఇన్‌వాయిస్ ద్వారా జీఎస్టీకి గండికొట్టారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్, డైరెక్టర్లు సహా పలువురిపై సీఐడీ కేసులు నమోదు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment