
సాక్షి, హైదరాబాద్: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసుపై ఈడీ విచారణ చేపట్టింది. విచారణకు మాజీ ఐఏఎస్ లక్ష్మీనారాయణ హాజరయ్యారు. గతంలో స్కిల్ డెవలప్‌మెంట్ డైరెక్టర్‌గా ఆయన కొనసాగారు. చంద్రబాబు హయాంలో స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో భారీ కుంభకోణం జరిగింది.
స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌తో సీమెన్స్ సంస్థ రూ.3,350 కోట్ల ఒప్పందం కుదుర్చుకుంది. అందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ.370 కోట్లు కాగా, ప్రభుత్వ వాటాలోని రూ.370 కోట్లలో రూ.241 కోట్లు దారి మళ్లించారని.. స్కిల్ డెవలప్‌మెంట్‌లో నిర్వహించిన ఫోరెనిక్స్ ఆడిట్‌లోనిర్థారణ అయ్యింది.
నకిలీ బిల్లులు, ఇన్‌వాయిస్ ద్వారా జీఎస్టీకి గండికొట్టారనే ఆరోపణలు ఉన్నాయి. స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్, డైరెక్టర్లు సహా పలువురిపై సీఐడీ కేసులు నమోదు చేసింది. మాజీ ఛైర్మన్ ఘంటా సుబ్బారావు, లక్ష్మీనారాయణ సహా 26 మందికి నోటీసులు జారీ చేసింది. ఇన్‌వెబ్ సర్వీసు నుంచి సీమెన్స్ కంపెనీలకు నిధులు మళ్లించినట్లు గుర్తించారు. షెల్ కంపెనీలు క్రియేట్ చేసి నిధులు దారి మళ్లించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
చదవండి: ఆంధ్రప్రదేశ్–తెలంగాణ రాష్ట్రాల మధ్య మరో హైవే.. కేంద్రం గ్రీన్ సిగ్నల్
Comments
Please login to add a commentAdd a comment