సాక్షి, విజయవాడ : ఈఎస్‌ఐ కుంభకోణం కేసులో నిందితులను మూడు రోజుల ఏసీబీ కస్టడీకి కోర్టు అనుమతించింది. ఈ కేసులో ఏ1గా ఉన్న ఈఎస్‌ఐ మాజీ డైరెక్టర్ రమేశ్‌కుమార్, ఏ2గా ఉన్న మాజీ మంత్రి అచ్చెన్నాయుడుతోపాటుగా మరో ముగ్గురు నిందితులను కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీచేసింది. అయితే అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో ఉన్న అచ్చెన్నాయుడును ఏసీబీ అధికారులు అక్కడే విచారించనున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో మిగతా నలుగురిని కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమయ్యారు. (చదవండి : అచ్చెన్నాయుడుకు 14 రోజుల రిమాండ్)
కాగా, ఈ కేసులో ఏ2గా ఉన్న అచ్చెన్నాయుడిని అధికారులు ఈ నెల 12న అదుపులోకి తీసుకుని.. ఏసీబీ న్యాయమూర్తి ముందు హాజరుపరిచిన సంగతి తెలిసిందే. దీంతో న్యాయమూర్తి ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించారు. అయితే అనారోగ్య కారణాల దృష్ట్యా ఆయనను గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాలని న్యాయమూర్తి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment