
సాక్షి, విజయవాడ: ఈఎస్‌ఐ స్కాం నిందితుల విచారణ రెండో రోజు ప్రారంభమయ్యింది. రాజమండ్రి జైలు నుంచి కస్టడీకి తీసుకొన్న ఏసీబీ బృందం.. ప్రధాన నిందితుల నుంచి కీలక ఆధారాలు రాబట్టే ప్రయత్నం చేస్తోంది. డొల్ల కంపెనీలకు ఆర్డర్లు, పరికరాల కొనుగోలు మాల్ పై ఏసీబీ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లు తెలిసింది. ఈ కుంభకోణం వెనుక ఎవరెవరి ఒత్తిడి ఉందన్న కోణంపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. రూ.150 కోట్ల అవినీతిలో ఎవరికి ఎంత ముట్టిందన్న దానిపై కూడా ఏసీబీ అధికారులు కూపీ లాగుతున్నారు. (ఎవరి వాటా ఎంత?)
ఈఎస్‌ఐ కుంభకోణంలో నిందితుడిగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు, మరో అయిదుగురిని ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను గురువారం ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రవికుమార్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. ఈ నెల 12న అచ్చెన్నాయుడు ఈఎస్‌ఐ స్కాంలో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. (ఆంధ్రాలో కుంభకోణం.. కోదాడలో కలకలం!)
Comments
Please login to add a commentAdd a comment