విజయవాడ జిల్లా కారాగారానికి అచ్చెన్నాయుడు
సాక్షి, మంగళగిరి : ఈఎస్‌ఐ కుంభకోణం కేసులో ఏ2గా ఉన్న మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడికి ఏసీబీ న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. అయితే అనారోగ్య కారణాల దృష్ట్యా ఆయనను గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాలని న్యాయమూర్తి ఆదేశించారు. దీంతో అచ్చెన్నాయుడును తొలుత విజయవాడ జైలుకు తరలించారు. అనంతరం జైలు అధికారులు అనుమతితో ఆయనను జీజీహెచ్‌కు తీసుకెళ్లనున్నారు. మరోవైపు ఇదే కేసులో ఏ1గా ఉన్న ఈఎస్‌ఐ మాజీ డైరెక్టర్ రమేశ్‌కుమార్‌కు కూడా రెండు వారాల రిమాండ్ విధిస్తూ ఏసీబీ న్యాయమూర్తి ఆదేశాలు జారీచేశారు. దీంతో అధికారులు రమేష్‌కుమార్‌ను అధికారులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. (చదవండి : టీడీపీ మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్)
కాగా, ఈ కేసుకు సంబంధించి శుక్రవారం అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసిన అధికారులు.. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం మంగళగిరి ఏసీబీ న్యాయమూర్తి నివాసానికి తరలించిన సంగతి తెలిసిందే. ఆయనతోపాటు రమేశ్‌కుమార్‌ను కూడా అధికారులు న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. ఈ క్రమంలో ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి అచ్చెన్నాయుడు, రమేశ్‌కుమార్‌లకు రెండు వారాల రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీచేశారు. (చదవండి : కార్మికుల సొమ్ము.. కడుపారా!)
Comments
Please login to add a commentAdd a comment