
సాక్షి అమీర్‌పేట్: నగరంలోని ఈఎస్‌ఐ మెట్రో స్టేషన్ నుంచి దూకి ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్సార్‌నగర్ ఇన్‌స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. బోరబండ శ్రీరామ్‌నగర్ సమీపంలోని సంజయ్ నగర్‌కు చెందిన అన్వర్‌ఖాన్ ఆటో మొబైల్ దుకాణం నడుపుతున్నాడు. ఆయనకు ముగ్గురు కుమారులు, కూతురు షబ్నం బేగం (22) ఉన్నారు. షాదాన్ కాలేజీలో షబ్నం బేగం ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతోంది.
కొంతకాలంగా షబ్నం బేగం ఫోన్‌లో ఎవరితోనో చాటింగ్ చేస్తోంది. ఈ విషయం కుటుంబ సభ్యుల దృష్టికి రావడంతో మందలించారు. మనస్తాపానికి గురైన ఆమె మంగళవారం సాయంత్రం ఈఎస్‌ఐ మెట్రో స్టేషన్‌కు చేరుకుంది. మొదటి అంతస్తు పైనుంచి కిందకు దూకింది. తీవ్రంగా గాయపడిన ఆమెను స్థానికులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు.
(చదవండి: భర్తపై విషప్రయోగం చేసి హత్య)