సాక్షి, విజయవాడ: ఈఎస్‌ఐ కుంభకోణం కేసులో అరెస్టైన మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని అవినీతి నిరోధక శాఖ అధికారులు విజయవాడకు తరలించారు. గొల్లపూడిలోని ఏసీబీ సెంట్రల్ ఆఫీసుకు ఏసీబీ అధికారులు ఆయనను తీసుకెళ్లారు. వైద్య పరీక్షల అనంతరం అచ్చెన్నాయుడిని ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు.