
సాక్షి, విజయవాడ: టెలీ హెల్త్ సర్వీస్ ద్వారా భారీగా ప్రభుత్వ నిధులను దారి మళ్లించారని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది కాసా జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. టెలీ హెల్త్ సర్వీస్‌తో ఎంవోయూ చేసుకోవాలని, ఈఎస్‌ఐ డైరెక్టర్లను ఆదేశిస్తూ అచ్చెన్నాయుడు లేఖ రాశారని ఆయన తెలిపారు. తెలంగాణకు చెందినవారిని ఏపీ రికార్డుల్లో నమోదు చేయించారని చెప్పారు. శుక్రవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘రూ.లక్షకు మించి కాంట్రాక్ట్ ఇవ్వాల్సి ఉంటే టెండర్లు పిలవాల్సి ఉంటుంది. ఆ నిబంధనలను కూడా పట్టించుకోలేదు. టెలీ హెల్త్ సర్వీసెస్‌కు రూ.3కోట్లు అక్రమంగా చెల్లించారు.
ఈసీజీలకు చెల్లించే మొత్తాన్ని కూడా రూ.480కి పెంచారు. దీని వల్ల రూ.280 అదనంగా చెల్లించిన పరిస్థితి. ఈసీజీల పేరుతో మరో రూ.4వేల కోట్లు దుర్వినియోగం జరిగింది. మందుల కొనుగోళ్లలో కూడా ఈఎస్‌ఐ నిబంధనలను పాటించలేదు. ఈ- ప్రొక్యూర్‌మెంట్‌లో టెండర్లు పిలవకుండా.. తమకు నచ్చినవారికి కాంట్రాక్ట్‌లు ఇచ్చుకున్నారు. మార్కెట్‌లో ధర కంటే 50 శాతం అదనంగా చెల్లించి మందులు కొనుగోలు చేశారు. ఫేక్ కొటేషన్లను కూడా కొనుగోళ్ల ప్రక్రియలో ఉపయోగించారు. ఈ మొత్తం రూ.160 కోట్ల కుంభకోణం జరిగినట్లుగా ఆధారాలున్నాయి’అని ఆయన పేర్కొన్నారు. (చదవండి: అచ్చెన్నాయుడుకు చుక్కెదురు)
Comments
Please login to add a commentAdd a comment