తెనాలి: ఈఎస్‌ఐ పరికరాల కొనుగోలు కుంభకోణంలో అవినీతి ఆరోపణల కేసులో జైలులో ఉన్న మాజీమంత్రి, టీడీపీ నేత అచ్చెన్నాయుడు రాసిన లేఖతో బీసీలకు ఎలాంటి సంబంధం లేదని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు బుధవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. హత్యానేరంలో జైలుకెళ్లిన మాజీమంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్ర విషయంలోనూ బీసీలకు సంబంధం లేదని తెలిపారు. బీసీ నేతలు ఏవైనా కేసుల్లో ఇరుక్కుంటే అవి స్వయంకృతాపరాధాలు మినహా బీసీ హక్కులు, ప్రయోజనాల రక్షణ కోసం చేసే త్యాగాలుగా బీసీలు భావించవద్దని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment