
సాక్షి, తూర్పుగోదావరి: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు పెద్ద అవినీతి తిమింగలమని వ్యాఖ్యానించారు. నిధులను స్వాహా చేయడంలో చంద్రబాబు దిట్ట అని అన్నారు. హౌసింగ్, నీరు-చెట్టు సహా అన్నింటిలోనూ అవినీతి జరిగిందని సోము వీర్రాజు ఆరోపించారు. అచ్చెన్నాయుడు అప్రూవర్‌గా మారితే టీడీపీలో చాలా మంది జైలుకు వెళ్తారని ఆయన జోస్యం చెప్పారు. కాగా, ఈఎస్‌ఐ కుంభకోణం కేసులో శుక్రవారం అరెస్టైన కార్మిక శాఖ మాజీ మంత్రి, టెక్కలి టీడీపీ ఎమ్మెల్యే కె.అచ్చెన్నాయుడుకు ఏసీబీ న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే.
(చదవండి: ఈఎస్‌ఐ స్కాం మూలాలపై కన్ను)
Comments
Please login to add a commentAdd a comment