సాక్షి,అమరావతి: ‘నిన్న ఎవరో ఒకాయన నేనే ఈ రాష్ట్రానికి హోం మంత్రిని అవుతానని అంటున్నాడు. ఎవరికి హోం మంత్రివి అవుతావయ్యా.. చంద్రబాబు హోంకి హోం మంత్రివి అవుతావా’ అంటూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుని ఉద్దేశించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఎద్దేవా చేశారు. టీడీపీకి చెందిన పలువురు మండల స్థాయి నాయకులు గురువారం సోము వీర్రాజు ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలను సీఎం చేసే దమ్ము బీజేపీకే ఉందన్నారు. ఎవర్నో సీఎం చేయడానికి రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలనుకోవడం లేదని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment