
సాక్షి, హైదరాబాద్: ఈఎస్‌ఐ కుంభకోణం కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సోదాలు చేపట్టింది. ఉదయం నుంచి ఒకేసారి 10 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తోంది. దివంగత మంత్రి నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాస్‌రెడ్డి, నాయిని వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన ముకుంద రెడ్డి, దేవికా రాణి, ఇతర నిందితుల ఇళ్లల్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి. సంచలనం సృష్టించిన ఈఎస్‌ఐ కుంభకోణంలో వైద్య కిట్లు, మందుల కొనుగోళ్ల వ్యవహారంలో నకిలీ బిల్లులు సృష్టించి రూ.6.5 కోట్లు కుంభకోణం జరిగినట్టు ఏసీబీ గుర్తించిన సంగతి తెలిసిందే. ఈ స్కామ్‌లో ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ దేవికారాణి సహా తొమ్మిది మందిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.
చదవండి:
ముగ్గురు మాయ లేడీలు.. భలే దోపిడీలు!
కన్నీరు తుడవంగ.. సొంతింట్లోకి సగర్వంగా
Comments
Please login to add a commentAdd a comment