సాక్షి, గుంటూరు : ఈఎస్‌ఐ కుంభకోణం కేసులో అరెస్టైన మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు తొలి రోజు విచారణ కొద్ది రోజుల కిందట ముగిసింది. కోర్టు ఆదేశాల మేరకు ఏసీబీ అధికారులు గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో అచ్చెన్నను విచారించారు. దాదాపు మూడు గంటల పాటు ఈ విచారణ కొనసాగింది. అయితే అచ్చెన్నాయుడు విచారణకు సహకరించారని అధికారులు తెలిపారు. అచ్చెన్న ఆరోగ్యం బాగానే ఉందని ఏసీబీ డీఎస్పీ ప్రసాద్ వెల్లడించారు.
మరోవైపు ఈ కేసులో మిగిలిన నలుగురు నిందితులను ఏసీబీ అధికారులు రాజమండ్రి నుంచి విజయవాడ తరలించి విచారణ చేపట్టారు. ఈ స్కామ్‌కు సంబంధించి మరికొన్ని కీలక ఆధరాలు సేకరించనున్నారు. కాగా, మరో రెండు రోజుల పాటు ఏసీబీ అధికారులు ఈ కేసులో నిందితులను విచారించనున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment