
అమీర్‌పేట: కరోనా బారినపడి ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన వైద్యం అందక రోగులు విలవిల్లాడుతుండగా పాజిటివ్ మృతదేహాల దాహన సంస్కారంలోనూ జీహెచ్‌ఎంసీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈఎస్‌ఐ హరిశ్చంద్ర శ్మశాన వాటికలో మృతదేహాలు పూర్తిగా కాలిపోకముందే వాటిని వదిలేసి వెళ్లిపోతున్నారు. దీంతో కుక్కలకు పాజిటివ్ మృతదేహాల విడిభాగాలు ఆహారంగా మారుతులన్నాయి. ఆదివారం వీధి కుక్కలు పాజిటివ్ మృతదేహాల విడిభాగాలను పీక్కుతుంటుండటాన్ని గుర్తించిన స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.దీని వల్ల కొత్త సమస్యలు తలెత్తే ప్రమాదముందని వారు వాపోతున్నారు. ప్రతి రోజు 10 నుంచి 18 కరోనా మృతదేహాలు శ్మశానవాటికకు వస్తున్నట్లు సమాచారం.
శ్మశాన వాటిలో పనిచేసే కాటికాపరి కాకుండా జీహెచ్‌ఎంసీ సిబ్బంది చేత అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. అర్ధరాత్రి తరువాత మృతదేహాలను తీసుకు వస్తుండటం, ఆ సమయంలో విద్యుత్ దహనవాటిక పనిచేయకపోవడంతో కట్టెలు పేర్చి చితి మంటలు వెలిగించి అక్కడి నుంచి వెళ్లిపోతున్నారు. ఉదయం అక్కడికి చేరుకుంటున్న కుక్కలు కాలకుండా ఉన్న శరీర భాగాలను లాక్కెళుతున్నాయి. ఇళ్ల మధ్య తిగిగే కుక్కలు వాటిని మనుషుల్ని కరిస్తే పరిస్థితి ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా జీహెచ్‌ఎంసీ అధికారులు స్పందించి విద్యుత్ దాహన వాటికలోనే పాజిటివ్ మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment