కరోనా లక్షణాలు లేనివారిలో‌.. వెరీ డేంజర్‌!  | Center for DNA Fingerprints Survey On Corona Pandemic | Sakshi
Sakshi News home page

కరోనా లక్షణాలు లేనివారిలో‌.. వెరీ డేంజర్‌! 

Published Mon, Sep 21 2020 6:10 AM | Last Updated on Mon, Sep 21 2020 12:51 PM

Center for DNA Fingerprints Survey On Corona Pandemic - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: కోవిడ్‌ లక్షణాలు ఉన్నవారి కంటే...ఏ లక్షణాలు లేని అసింప్టమేటిక్‌ బాధితుల్లోనే వైరస్‌ లోడు ఎక్కువగా ఉన్నట్లు హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ డీఎన్‌ఏ ఫింగర్‌ ప్రింట్స్‌ సర్వేలో స్పష్టమైంది. అంతేకాదు 95 శాతం మందిలో 20 బి క్లేడ్‌ స్ట్రెయిట్‌ రకం వైరస్‌ ఉన్నట్లు తేలింది. మే, జూన్‌ మాసాల్లో గ్రేటర్‌ సహా...శివారు ప్రాంతాల్లో కోవిడ్‌ బారిన పడిన 210 మంది డేటాను సేకరించి, విశ్లేషించగా ఈ విషయం స్పష్టమైంది. వైరస్‌లోడుకు తోడు...అదేస్థాయిలో ఇమ్యునిటీ లెవ ల్స్‌ ఉండటం వల్లే వారంతా ఆరోగ్యంగా ఉన్నట్లు బయటికి కనిపిస్తున్నట్లు స్పష్టం చేసింది. వీరి నుంచి ఇమ్యునిటీ లెవల్స్‌ తక్కువగా ఉన్న వారికి వైరస్‌ వ్యాపించి, వారి మృత్యువాతకు కారణమవుతున్నట్లు గుర్తించింది. 
  
70 శాతం మందిలో ఏ లక్షణాలు లేవు 
జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇప్పటి వరకు 57 వేల మంది వైరస్‌ బారిన పడ్డారు. వీరిలో 70 శాతం మందిలో ఎలాంటి లక్షణాలు కనిపించలేదు. కేవలం 30 శాతం మందిలోనే జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలు కన్పించాయి. కోవిడ్‌ లక్షణాలు ఉన్న వారితో పోలిస్తే...ఏ లక్షణాలు లేని అసింప్టమాటిక్‌ బాధితుల్లోనే వైరస్‌ లోడు ఎక్కువగా ఉన్నట్లు సెంటర్‌ ఫర్‌ డీఎన్‌ఏ ఫింగర్‌ ప్రింట్స్‌ శాస్త్రవేత్తలు గుర్తించారు. వీరి నుంచి వృద్ధులు, పిల్లలు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి వైరస్‌ విస్తరించి, పరోక్షంగా వారి మృత్యువాతకు కారణమవుతున్నట్లు తేలింది. ఈ పరిశోధన వివరాలు ‘బయో ఆరెక్సీవ్‌’ అనే ప్రీప్రింట్‌ రీపాజిటరీలో ఇటీవల పబ్లిష్‌ కావడం గమనార్హం.   (ఫార్మా పేరుతో రియల్‌ వ్యాపారం)

ఐదు శాతం మందిలోనే ఇతర వైరస్‌ 
నగరంలోని కోవిడ్‌ బాధితుల నుంచి సేకరించిన నమూనాల్లోని జీనోమ్‌ సీక్వెన్స్‌ డేటాను పరీక్షించగా, వైరస్‌ జీనోమ్‌లో ఎక్కువ మ్యుటేషన్లు జరిగినట్లు గుర్తించారు. 95 శాతం మందిలో 20 బిక్లేడ్‌ అనే స్ట్రెయిన్‌కు చెందిన కరోనా వైరస్‌ ఉన్నట్లు నిర్ధారించారు. కేవలం ఐదు శాతం మందిలో మాత్రమే ఇతర స్ట్రెయిన్‌లకు చెందిన వైరస్‌ ఉన్నట్లు తేలింది. మొదట్లో రెండు మూడు రకాల వైరస్‌ నిర్ధారణ అయినప్పటికీ..మే జూన్‌ మాసాల్లో అత్యధికంగా ఈ బిక్లేడ్‌ స్ట్రేయిన్‌కు చెందిన వైరస్సే ఉన్నట్లు గుర్తించడం విశేషం. 

జీహెచ్‌ఎంసీ పరిధిలో కోవిడ్‌ కేసులు ఇలా 
మాసం    పాజిటివ్‌కేసులు 
మార్చి      74 
ఏప్రిల్‌      527 
మే           1015 
జూన్‌        11080 
జులై         26082 
ఆగస్టు      12599 
సెప్టెంబర్    5532  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement