సాక్షి, అమరావతి: ఈఎస్‌ఐ స్కాంలో రూ.150 కోట్లు అవినీతి జరిగిందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి అన్నారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అప్పటి ప్రభుత్వంలో అచ్చెన్నాయుడు కార్మిక మంత్రిగా పనిచేశారని, మంత్రి స్థానంలో ఉండి ఆయన అవినీతికి పాల్పడ్డారన్నారు. ‘‘స్కాంలో అచ్చెన్నాయుడు పాత్ర ఉందని విజిలెన్స్ విచారణలో రుజువైంది. అచ్చెన్నాయుడు అరెస్ట్‌కు, బీసీలకు ఏం సంబంధం’’ అని ఆయన ప్రశ్నించారు. (కళ్లు బైర్లు కమ్మే అవినీతి, అక్రమాలు)
బీసీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. బీసీలను చంద్రబాబు ఓటు బ్యాంక్‌గానే చూశారు తప్ప.. చేసిందేమీలేదన్నారు. ఎవరు తప్పు చేసినా శిక్ష అనుభవించాల్సిందే. అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేస్తే చంద్రబాబు డ్రామా చేస్తున్నారు. అచ్చెన్న తప్పు చేసి బీసీ కార్డు వాడుకోవడం దారుణం’ అంటూ దుయ్యబట్టారు. టీడీపీ హయాంలో జరిగిన స్కాంలన్నీ బయటపడుతున్నాయని జంగా కృష్ణమూర్తి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment