Javaharlal nehru
-
నెహ్రూ, గాంధీ కుటుంబ పాలనలో... రాజ్యాంగానికి గాయం
కాంగ్రెస్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్‌సభ సాక్షిగా మరోసారి నిప్పులు చెరిగారు. ‘‘గాంధీ–నెహ్రూ కుటుంబం 50 ఏళ్లపాటు రాజ్యాంగం రక్తాన్ని కళ్లజూసింది. ఇప్పటికీ ఆ ఆనవాయితీని కాంగ్రెస్ కొనసాగిస్తూనే ఉంది. రాజ్యాంగ స్ఫూర్తిని పదేపదే గాయపరుస్తూనే ఉంది’’ అంటూ ధ్వజమెత్తారు. రాజ్యాంగాన్ని ఆమోదించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా లోక్‌సభలో రెండు రోజుల పాటు జరిగిన ప్రత్యేక చర్చకు మోదీ శనివారం సమాధానమిచ్చారు. కేంద్రంలో కాంగ్రెస్ గత ప్రభుత్వాల తీరుపై మండిపడ్డారు. ‘‘అవి దేశ వైవిధ్యానికి గొడ్డలిపెట్టు వంటి విషపు విత్తనాలు నాటాయి. దేశ ఐక్యతనే దెబ్బతీశాయి. ముఖ్యంగా రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేయడానికి నెహ్రూ–గాంధీ కుటుంబం చేయని ప్రయత్నమంటూ లేదు. ప్రతి స్థాయిలోనూ రాజ్యాంగాన్ని ఆ కుటుంబం సవాలు చేసింది. అందుకే 55 ఏళ్లు అధికారం వెలగబెట్టిన నెహ్రూ–కుటుంబాన్ని ఓడించి ఇంటిబాట పట్టించాం’’ అని చెప్పారు. రాజ్యాంగాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తోందని ప్రధాని అన్నారు. ‘‘2014 నుంచి మా నిర్ణయాలు, విధానాలన్నీ ఆ దిశగానే సాగుతున్నాయి. రాజ్యాంగం నిర్దేశించిన బాటలో నడుస్తున్నాం. దేశ శక్తి సామర్థ్యాలను, ఐక్యతను పెంపొందించాలన్నదే మా ఆశయం’’ అని చెప్పారు. రాజ్యాంగాన్ని ఇష్టారాజ్యంగా మార్చేశారు రాజ్యాంగాన్ని దెబ్బకొట్టడానికి నెహ్రూ–గాంధీ కుటుంబం ఎన్నో కుట్రలు చేసిందని మోదీ ఆరోపించారు. ‘‘నెహ్రూ, ఇందిర, రాజీవ్ గాంధీ ప్రధానులుగా రాజ్యాంగాన్ని దెబ్బ తీయాలని చూశారు. భావ ప్రకటన స్వేచ్ఛకు సంకెళ్లు వేసేలా రాజ్యాంగాన్ని నెహ్రూ సవరించారు. ఇక ఆయన కుమార్తె ఇందిర ఏకంగా సుప్రీంకోర్టు తీర్పును ధిక్కరిస్తూ ఎమర్జెన్సీ విధించారు. ప్రజాస్వామ్యం గొంతు నులిమేశారు. రాజ్యాంగాన్ని అపహాస్యం చేశారు. పదవులు కాపాడుకోవడానికి రాజ్యాంగంలో సవరణ చేశారు. న్యాయ వ్యవస్థ గొంతు కోశారు. దేశాన్నే జైలుగా మార్చేశారు. ఎమర్జెన్సీ మచ్చ ఎన్నటికీ చెరిగేది కాదు. ఆమె కుమారుడు రాజీవ్ కూడా రాజ్యాంగాన్ని గౌరవించకుండా ఇష్టానికి సవరణలు తెచ్చారు. నెహ్రూ–గాంధీ కుటుంబానికి చెందిన తర్వాతి తరమూ రాజ్యాంగంపై అదే ఆట ఆడుతోంది. మన్మోహన్ సింగ్ ప్రభుత్వ నిర్ణయానికి సంబంధించిన జీవోను ఓ అహంకారి (రాహుల్) ఏకంగా చించిపారేశారు. యూపీఏ హయాంలో సోనియా నేతృత్వంలోని జాతీయ సలహా మండలి రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించింది. ప్రధాని మన్మోహన్‌ను మించిన అధికారులు చలాయించింది. దేశ ఐక్యత, సమగ్రతను దృష్టిలో పెట్టుకొని మతం, విశ్వాసం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వొద్దన్న ప్రతిపాదనను రాజ్యాంగ రూపకర్తలు పరిగణనలోకి తీసుకున్నారు. కాంగ్రెస్ మాత్రం అధికార యావతో, ఓటు బ్యాంకు రాజకీయాలతో రాజ్యాంగ స్ఫూర్తిని ఉల్లంఘిస్తోంది’’ అంటూ తూర్పారబట్టారు. ఆ నినాదం.. అతిపెద్ద మోసం కాంగ్రెస్ ఇచి్చన గరీబీ హఠావో నినాదాన్ని దేశ చరిత్రలోనే అతిపెద్ద మోసంగా మోదీ అభివరి్ణంచారు. ‘‘ఆ నినాదం లేకుండా కాంగ్రెస్ బతకలేదు. నాలుగు తరాలుగా దాన్నే నిత్యం వినిపిస్తున్నారు. కానీ ఆ నినాదంతో కాంగ్రెస్ రాజకీయంగా లాభ పడింది తప్ప పేదలకు ఒరిగిందేమీ లేదు. కాంగ్రెస్ పాలనలో ప్రజలకు కనీసం మరుగుదొడ్లు కూడా నిర్మించలేదు. మా ప్రభుత్వం వచ్చాక మరుగుదొడ్ల నిర్మాణాన్ని ఉద్యమంలా చేపట్టాం. కాంగ్రెస్ నాయకులు పేదలను, పేదరికాన్ని కేవలం టీవీల్లో, పేపర్లలో చూసుంటారంతే. అసలైన పేదలు, అసలైన పేదరికం అంటే ఏమిటో వారికి తెలియదు’’ అని ఎద్దేవా చేశారు. రాజ్యాంగమే ఐక్యతా సాధనం సాధారణ కుటుంబాల్లో జని్మంచిన తనవంటి ఎంతోమంది ఉన్నత స్థానాలకు చేరారంటే రాజ్యాంగ బలమే కారణమని మోదీ అన్నారు. ‘‘స్వాతంత్య్రం వచ్చాక దేశం ముక్కలవుతుందన్న భయాలుండేవి. వాటిని అధిగమించి ఐక్యంగా ఈ స్థాయికి చేరామంటే ఆ ఘనత రాజ్యాంగానిదే. రాజ్యాంగాన్ని ఆమోదించుకున్నాక దేశ ప్రయాణం అద్భుతంగా, అసాధారణంగా సాగింది. మన ప్రాచీన ప్రజాస్వామ్య మూలాలు ప్రపంచానికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి. మన అతిపెద్ద ప్రజాస్వామ్యం ప్రపంచ ప్రజాస్వామ్యాలకే తల్లి వంటిది. మన ఐక్యతకు నిస్సందేహంగా రాజ్యాంగమే ఆధారం. మహిళలకు ఓటు హక్కు రాజ్యాంగం వల్లే వచ్చింది. మహిళల ఆధ్వర్యంలోనే దేశం ప్రగతి పథంలో పరుగులు పెడుతోంది’’ అని ఉద్ఘాటించారు. ‘‘నేను గుజరాత్ సీఎంగా ఉండగా రాజ్యాంగ 60 ఏళ్ల వేడుకలను ఘనంగా నిర్వహించాం. రాజ్యాంగ ప్రతిని ఏనుగుపై ఊరేగించాం. రాజ్యాంగ ఔన్నత్యాన్ని గౌరవిస్తూ చెప్పుల్లేకుండా ఏనుగు వెంట నడిచా’’ అని గుర్తు చేసుకున్నారు. 11 తీర్మానాలు ప్రధాని మోదీ లోక్‌సభలో 11 తీర్మానాలు ప్రతిపాదించారు. 1. ప్రతి ఒక్కరూ సక్రమంగా బాధ్యతలు నిర్వర్తించాలి. అధికార యంత్రాంగం విధులకు కట్టుబడి ఉండాలి. 2. అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాల సమీకృతాభివృద్ధికి కృషి చేయాలి. సబ్కా సాత్, సబ్కా వికాస్ స్ఫూర్తిని అందిపుచ్చుకోవాలి. 3. అవినీతిని తిరస్కరించాలి. దానిపై యుద్ధం చేయాలి. అవినీతిపరులకు సమాజంలో స్థానం లేదు. 4. మన చట్టాలను, నియమ నిబంధనలను గర్వకారణంగా భావించాలి. దేశ ఆకాంక్షలను ప్రతిబింబిస్తున్న చట్టాలను అంతా గౌరవించాలి. 5. వలసవాదానికి తలవంచే మనస్తత్వం నుంచి బయటకు పడాలి. మన సంస్కృతి సంప్రదాయాలు, వారసత్వం మనకు గర్వకారణం. 6. వారసత్వ రాజకీయాలకు ముగింపు పలకాలి. పాలనలో బంధుప్రీతిని పక్కనపెట్టి ప్రతిభావంతులకే అవకాశం కలి్పంచాలి. 7. రాజ్యాంగాన్ని అందరూ గౌరవించాలి. రాజకీయ ప్రయోజనాల కోసం దాన్ని దుర్వినియోగం చేయకూడదు. 8. బడుగు బలహీన వర్గాల రిజర్వేషన్లను తొలగించే ప్రసక్తే లేదు. మతాధారిత రిజర్వేషన్లకు కొందరు చేస్తున్న ప్రయత్నాలను వ్యతిరేకించాలి. 9. లింగ సమనత్వాన్ని, మహిళల నాయకత్వాన్ని ప్రోత్సహించాలి. 10. ప్రాంతీయాభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యం. ఇదే మన మంత్రం. 11. ఏక్ భారత్, శ్రేష్ట్ భారత్. దేశం ఎప్పటికీ ఐక్యంగా ఉండాలి. ప్రజలంతా కలిసుంటేనే భారత్ గొప్పదేశంగా మారుతుంది. -
నెహ్రూ హవా
స్వాతంత్య్రం సిద్ధించి అప్పటికి దశాబ్దం గడిచింది. నెహ్రూ పాలనే సాగుతోంది. ముప్పిరిగొన్న సమస్యల నడుమే రెండో లోక్‌సభ ఎన్నికలు ముంచుకొచ్చాయి. ప్రజలకు ఓటు విలువ తెలియజెప్పి ఓటేసేలా చేయడం ఎన్నికల సంఘానికి కీలక సవాలుగా నిలిచింది. అయితే 1952 తొలి ఎన్నికల నిర్వహణ తాలూకు అనుభవం ఈసారి బాగా పనికొచి్చంది. పాకిస్తాన్ రాజ్యాంగ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతూ ఉండగానే మనం రెండో ఎన్నికలు కూడా విజయవంతంగా నిర్వహించుకున్నాం. దేశంలో ప్రజాస్వామ్యం గట్టిగా వేళ్లూనుకుందని ప్రపంచానికి చాటాం. దేశాన్ని ఎన్నో సమస్యలు వేధిస్తున్నప్పటికీ రెండో లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు మరోసారి నెహ్రూకే పట్టం కట్టారు. బలమైన ప్రతిపక్షం లేకపోవడమే దీనికి కారణం. 1952లో తొలి ఎన్నికల్లో 364 లోక్‌సభ సీట్లు గెలిచిన కాంగ్రెస్ బలం ఈసారి 371 స్థానాలకు పెరిగింది. ఓట్ల శాతం కూడా 45 శాతం నుంచి 47.8 శాతానికి పెరిగింది. సీపీఐ 27 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. 1952తో పోలిస్తే 11 స్థానాలు పెరిగినా ఓట్ల శాతం మాత్రం 32.65 నుంచి 24.55కు క్షీణించింది. కాంగ్రెస్ తర్వాత అధిక స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులే నెగ్గడం విశేషం! వారు 19.3 శాతం ఓటింగ్‌తో 42 స్థానాలు గెలుచుకున్నారు. రాష్ట్రాల స్థాయిలో జనతా, ఫార్వార్డ్ బ్లాక్, గణతంత్ర పరిషత్, అఖిల భారతీయ హిందూ మహాసభ, జార్ఖండ్ పార్టీ, పీపుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్, ప్రజాపార్టీ, పీసెంట్స్ అండ్ వర్కర్స్ పార్టీ, అఖిల భారతీయ రామ్ రాజ్య పరిషత్, రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ, ఆల్ ఇండియా షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ పోటీ చేశాయి. సమస్యలు ఎన్నున్నా... నిరుద్యోగం, ఆహార కొరత, నిత్యావసరాల ధరల పెరుగుదల, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ విషయంలో ప్రజల్లో అసంతృప్తి, అవినీతి, ఆశ్రిత పక్షపాతం, ఆశించిన అభివృద్ధి లేకపోవడం, భూ సంస్కరణల నత్తనడక, రాష్ట్రాల్లో పాలనా సామర్థ్యం లోపించడం, ఉత్తరాధి ఆధిపత్యంపై దక్షిణ భారతీయుల్లో ఆగ్రహం... ఇలాంటి పలు సమస్యలను రెండో లోక్‌సభ ఎన్నికల సందర్భంగా పార్టీలు బలంగా ప్రజల ముందుకు తీసుకెళ్లాయి. ఇన్ని సమస్యలున్నా కాంగ్రెస్‌ను ఢీకొట్టే బలమైన ప్రతిపక్షం లేకపోవడంతో పోటీ ఏకపక్షమేనని ముందే తేలిపోయింది. నెహ్రూ సర్కారుకు ఎన్ని స్థానాలొస్తాయన్నదే కాస్త ఆసక్తి కలిగించిన అంశం. అయితే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వచి్చన సీట్లలో మూడింట రెండొంతులు ఉత్తరాది చలవే! ఒక్క యూపీయే కాంగ్రెస్‌కు ఏకంగా 70 సీట్లు కట్టబెట్టింది! ఒక స్థానం.. ఇద్దరు ప్రజాప్రతినిధులు బహుళ అభ్యర్థుల నియోజకర్గాలకు చివరి ఎన్నికలుగా 1957 లోక్‌సభ ఎన్నికలు చరిత్రలో గుర్తుండిపోతాయి. 1957లో 91 స్థానాలు ద్వంద్వ నియోజకవర్గాలున్నాయి. జనరల్ కోటా నుంచి ఒకరు, ఎస్సీ/ఎస్టీ కోటా నుంచి ఒకరు చొప్పున ఆ స్థానాల్లో ఇద్దరు విజేతలుండేవారు. ఆ తర్వాత ఈ విధానాన్ని తొలగించారు. 1952 తొలి ఎన్నికల్లోనైతే పశి్చమబెంగాల్లో ముగ్గురు అభ్యర్థులు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం కూడా ఉంది...! వాజ్‌పేయి అరంగేట్రం... దిగ్గజ నాయకుడు అటల్ బిహారీ వాజ్‌పేయి 1957 ఎన్నికల్లో నెగ్గి తొలిసారి లోక్‌సభలో అడుగుపెట్టారు. ఆయనను గొప్ప వక్తగా నెహ్రూ కొనియాడారు. అంతేకాదు, ‘ఏదో ఒక రోజు ప్రధాని అవుతాడు’ అంటూ కచి్చతంగా భవిష్యద్దర్శనం కూడా చేశారు! ఇక, సీఈసీగా వరుసగా రెండుసార్లు సార్వత్రిక ఎన్నికలను విజయవంతంగా నిర్వహించిన సుకుమార్ సేన్ 1958 డిసెంబర్ 19న కన్నుమూశారు. విశేషాలు ఎన్నెన్నో ... ► 1957లో రెండో లోక్‌సభ ఎన్నికలు మొత్తం 14 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో జరిగాయి. ► ఆంధ్రప్రదేశ్, అసోం, బిహార్, బాంబే, కేరళ, మధ్యప్రదేశ్, మద్రాస్, మైసూరు, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పశి్చమబెంగాల్, జమ్మూ అండ్ కశీ్మర్‌తో పాటు కేంద్రపాలిత ప్రాంతాలైన ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, త్రిపుర, అండమాన్ నికోబార్, లక్షద్వీప్–మినీకాయ్– మినిందివిల్లో పోలింగ్ జరిగింది. ► మొత్తం 494 లోక్‌సభ స్థానాలకు గాను ఒక్కో చోట సగటు ముగ్గురు అభ్యర్థుల కంటే బరిలో లేరు. ► కాంగ్రెస్ మినహా మరో బలమైన జాతీయ పార్టీ లేనే లేదు. ప్రాంతీయ పార్టీలు అప్పుడప్పుడే మొగ్గ తొడుగుతున్నాయి. ► జాతీయ స్థాయిలో నాలుగే పార్టీలు ఎన్నికల్లో పాల్గొన్నాయి. రాష్ట్రాల్లో మరో 15 పార్టీలు అదృష్టాన్ని పరీక్షించుకున్నాయి. ► 1957 ఫిబ్రవరి 24 నుంచి జూన్ 9 దాకా మూడున్నర నెలల పాటు ఎన్నికల నిర్వహణ క్రతువు సాగింది. ► ఓటు ప్రాధాన్యతపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఈసీ ఎంతో కృషి చేసినా పెద్దగా ఫలితం కనిపించలేదు. ► 1952 తొలి ఎన్నికల్లో 44.87 శాతం ఓటింగ్ నమోదవగా 1957లో 45.44 శాతానికి పెరిగింది. 19,36,52,179 మంది ఓటేశారు. ► ఈ ఎన్నికలూ తొలి ఎన్నికల ప్రధాన కమిషనర్ సుకుమార్ సేన్ సారథ్యంలోనే జరిగాయి. ► ఎన్నికల నిర్వహణ వ్యయాన్ని బాగా తగ్గించడంతో పాటు వాటిని మరింత సమర్థంగా నిర్వహించారాయన. ► దాంతో సుడాన్ తమ తొలి ఎన్నికల నిర్వహణ బాధ్యతలను సేన్‌కే అప్పగించడం విశేషం...! ► పోలింగ్ బూత్‌లను ఆక్రమించే పెడ ధోరణి 1957 ఎన్నికల్లోనే తొలిసారిగా కనిపించింది! -
పేర్లు తొలగిస్తే చరిత్ర మారదు
శ్రీనగర్: ప్రముఖ ప్రాంతాలు, కట్టడాలకున్న నెహ్రూ, ఇందిరాగాంధీ వంటి పేర్లను తొలగించినంత మాత్రాన చరిత్ర దాగదు, మారదని జమ్మూకశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) చీఫ్ ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తమ పార్టీకి చెందని ప్రతి నేత పేరును కనిపించకుండా చేస్తోందని ఆయన విమర్శించారు. అయితే, చరిత్ర ఎన్నటికీ మారదు, శాశ్వతంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. తన తండ్రి, ఎన్సీ వ్యవస్థాపకుడు షేక్ మహ్మద్ అబ్దుల్లాను అందరూ పిలుచుకునే షేర్ అనే పేరును ‘షేర్–ఇ–కశ్మీర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్’నుంచి అధికారులు తొలగించడంపై ఆయన పై వ్యాఖ్యలు చేశారు. ‘కేంద్ర ప్రభుత్వం మొఘలుల 800 ఏళ్ల పాలనను చరిత్ర పుస్తకాల నుంచి తొలగించింది. దానర్థం వారు లేనట్లేనా? తాజ్ మహల్, ఎర్రకోట, జామా మసీదు, కుతుబ్‌మినార్.. తదితర చారిత్రక నిర్మాణాలకు కారకులెవరని చెబుతారు?, మనం, వాళ్లు శాశ్వతం కాదు. చరిత్ర శాశ్వతం, అది మారదు. ఎప్పటికీ అలాగే ఉంటుంది’అని అబ్దుల్లా పేర్కొన్నారు. -
‘నెహ్రూ వారసత్వం దీపస్తంభం వంటిది’
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని నెహ్రూ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఘనంగా నివాళులర్పించారు. నెహ్రూ వారసత్వం దీపస్తంభంలా నిలిచిపోతుందని, భారతదేశ ఆదర్శం, స్వేచ్ఛ, ప్రజాస్వామ్య విలువలను ప్రకాశింప జేస్తుందని రాహుల్ పేర్కొన్నారు. నెహ్రూ దూరదృష్టి, విలువలు ఎల్లప్పుడూ మనకు మార్గదర్శకాలుగా నిలుస్తాయని ట్వీట్ చేశారు. కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, రాహుల్ తదితరులు శనివారం శాంతివన్‌లోని నెహ్రూ స్మారకాన్ని సందర్శించి పుష్పాంజలి ఘటించారు. ‘మన మాజీ ప్రధాని నెహ్రూకు వర్ధంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నా’అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. -
Azadi Ka Amrit Mahotsav: విభజన నెహ్రూ పుణ్యమే బీజేపీ వ్యాఖ్యలు.. మండిపడ్డ కాంగ్రెస్
న్యూఢిల్లీ: విభజన గాయాల స్మారక దినం సందర్భంగా ఆదివారం బీజేపీ విడుదల చేసిన వీడియో వివాదానికి దారి తీసింది. 1947లో దేశ విభజనకు దారి తీసిన ఘట్టాలను అందులో చూపించారు. పాకిస్తాన్‌ను ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయాలన్న ముస్లిం లీగ్ డిమాండ్‌కు నెహ్రూ తలొగ్గారంటూ ఆరోపించారు. వీడియో అంతా పదే పదే నెహ్రూ విజువల్స్ చూపించారు. ఈ వీడియోపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఆధునిక సావర్కర్లు, జిన్నాలు ఇప్పటికీ జాతిని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ మండిపడ్డారు. విద్వేషాలను రెచ్చగొట్టేందుకు విభజన విషాదాన్ని వాడుకుంటూ ప్రధాని మోదీ రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. రెండు దేశాల థియరీని తెరపైకి తెచ్చింది బీజేపీ ఆరాధించే సావర్కరేనని ఆరోపించారు. దాన్ని జిన్నా అందుకున్నారన్నారు. విభజనకు ఒప్పుకోకుంటే చిన్న చిన్న భాగాలుగా విడిపోయి దేశం సర్వనాశనం అయ్యేదన్నారు. భారతావనని ఏకతాటిపైకి తెచ్చేది ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీయేనని జైరాం అన్నారు. -
సర్దార్ పటేల్ మరికొంత కాలం బతికుంటే.. గోవా విమోచన ముందే జరిగేది
పనాజి: సర్దార్ వల్లబ్‌భాయ్ పటేల్ మరికొంత కాలం బతికుంటే పోర్చుగీసు పాలన నుంచి గోవా విమోచన ముందే జరిగేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మనకు 1947 స్వాతంత్య్రం వచ్చినప్పటికీ గోవా చాలాకాలం పోర్చుగీసు పాలనలోనే ఉండిపోయింది. భారత సైన్యం ‘ఆపరేషన్ విజయ్’ను చేపట్టి 1961 డిసెంబరు 19న గోవాకు వలసపాలన నుంచి విముక్తి కల్పించింది. గోవా భారత్‌లో భాగమైంది. ఆదివారం 60వ గోవా విమోచన దినోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన మోదీ మాట్లాడుతూ... సర్దార్ పటేల్ గనక మరికొన్ని రోజులు బతికి ఉంటే గోవా ప్రజలు 1961 కంటే చాలాముందుగానే స్వేచ్ఛావాయువులు పీల్చేవారని అన్నారు. జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వంలో ఉప ప్రధానిగా, హోంమంత్రిగా పనిచేసిన పటేల్ 1950 డిసెంబరు 15న తుదిశ్వాస విడిచారు. నిజాం పాలనలోని ప్రస్తుత తెలంగాణ, మరఠ్వాడా, కల్యాణ కర్ణాటక (ఐదు జిల్లాలు)తో సహా దేశంలోని పలు సంస్థానాలను భారత్‌లో విలీనం చేసి పటేల్ ఉక్కుమనిషిగా పేరొందారు. గోవా విమోచన ఆలస్యం కావడానికి నెహ్రూయే కారణమని గతంలో పలువురు బీజేపీ అన్నారు. గోవా విమోచన కోసం పోరాడిన స్థానికులకు, ఇతర ప్రాంతాల వారికి నివాళులర్పించిన మోదీ వారి కృషిని కొనియాడారు. భారత స్వాతంత్య్రంతో గోవా విమోచన పోరాటం ఆగిపోకుండా నాటి సమరయోధులు చూసుకున్నారన్నారు. స్వాతంత్య్రం వచ్చినా... దేశంలోని ఒక భాగమైన గోవా (డయ్యూ– డామన్తో కలిసి) ఇంకా పరాయిపాలనలోనే ఉందనే భావనతో స్వతంత్ర ఫలాలను భారతీయులు పూర్తిగా ఆస్వాదించలేకపోయారన్నారు. అందుకే పలువురు స్వాతంత్య్ర సమరయోధులు సర్వస్వం వదిలి గోవా ప్రజలతో కలిసి విమోచన కోసం పోరాడారన్నారు. శతాబ్దాల తరబడి వలస పాలకుల ఆధీనంలో ఉన్నప్పటికీ గోవా ప్రజలు తమ భారతీయతను మర్చిపోలేదన్నారు. అలాగే మొఘలాయిల పాలనలో మగ్గిన భారత్ కూడా గోవాను ఏనాడూ మరువలేదన్నారు. సుపరిపాలనలో పలు అంశాల్లో ముందంజలో ఉన్నందుకు గోవా ప్రభుత్వాన్ని ప్రధాని అభినందించారు. తలసరి ఆదాయం, బడుల్లో బాలికలకు ప్రత్యేక మరుగుదొడ్లు, ఇంటింటికీ నల్లాల ద్వారా తాగునీరు, ప్రతి గడపకూ వెళ్లి చెత్త సేకరణ, ఆహార భద్రత అంశాల్లో గోవా అగ్రస్థానాన ఉందని మోదీ వివరించారు. దివంగత మాజీ సీఎం మనోహర్ పారిక్కర్‌ను గుర్తుచేసుకున్నారు. గోవాకు ఉన్న వనరులు, అవకాశాలను చక్కగా గుర్తించి అభివృద్ధి పథాన నడిపారని పారిక్కర్‌ను కొనియాడారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మోదీ మిరామర్‌లో వాయుసేన, నావికాదళ విన్యాసాలను తిలకించారు. -
ద్రవ్యోల్బణానికి కారణం నెహ్రూ ప్రసంగం
భోపాల్: ద్రవ్యోల్బణం అనే సమస్య నిన్న మొన్న పుట్టుకొచ్చింది కాదని, 1947 ఆగస్టు 15న ఎర్రకోట పైనుంచి తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ చేసిన ప్రసంగంతోనే దేశంలో ఆర్థిక వ్యవస్థ పతనం మొదలయ్యిందని మధ్యప్రదేశ్ వైద్య విద్య శాఖ మంత్రి, బీజేపీ నేత విశ్వాస్ సారంగ్ ఆరోపించారు. ఈ ప్రసంగంలో ఎన్నో తప్పిదాలు దొర్లాయని అన్నారు. ఆర్థిక వ్యవస్థ అనేది ప్రధానంగా వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉంటుందని, నెహ్రూ ఆ రంగాన్ని తీవ్రంగా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. సారంగ్ శనివారం భోపాల్‌లో మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితికి నెహ్రూ అనుసరించిన తప్పుడు విధానాలే కారణమన్నారు. ధరల పెరుగుదలపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆర్థిక పరిస్థితి దిగజారి, ద్రవ్యోల్బణం పెరిగిందని, ఈ ఘనత నెహ్రూ కుటుంబానికే చెందుతుందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏడేళ్లుగా శ్రమిస్తోందని చెప్పారు. బీజేపీ పాలనలో ద్రవ్యోల్బణం తగ్గుతోందని, ప్రజల ఆదాయం పెరుగుతోందని విశ్వాస్ సారంగ్ ఉద్ఘాటించారు. దేశాభివృద్ధికి పారిశ్రామికీకరణ అవసరమే అయినప్పటికీ అది వ్యవసాయ ఆధారితమై ఉండాలన్నారు. కశ్మీర్ వివాదం, అంతర్గత భద్రతకు సవాళ్లు, సరిహద్దు గొడవలు నెహ్రూ కాలం నుంచే కొనసాగుతున్నాయని గుర్తుచేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడానికి ఇవి కూడా కారణమేనని పేర్కొన్నారు. -
నెహ్రూ తప్పును మోదీ సరిదిద్దారు
అహ్మదాబాద్: స్వాతంత్య్రానంతరం కశ్మీర్ విషయంలో భారత తొలి ప్రధాని నెహ్రూ చేసింది తప్పనీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసింది సరైనదనీ కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వ్యాఖ్యానించారు. ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీర్ స్వయంప్రతిపత్తిని రద్దు చేసి ప్రధాని మోదీ అలనాటి చారిత్రక తప్పిదాన్ని సరిచేశారన్నారు. ఆర్టికల్ 370 విషయంలో నెహ్రూ చేసిన తప్పిదాన్ని సరిదిద్దేందుకు మోదీ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారన్నారు. కశ్మీర్ స్వయంప్రతిపత్తి రద్దు విషయంలో భారత ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు అభినందించాయన్నారు. భారత్ చర్యని బ్రిటన్, రష్యా, అమెరికా, ఫ్రాన్స్‌లు అభినందించాయని గుర్తుచేశారు. చివరకు చైనా సైతం భారత్ నిర్ణయాన్ని బహిరంగంగా విమర్శించలేకపోయిందన్నారు. కశ్మీర్ అంశంలో కాంగ్రెస్ అభిప్రాయం ఏమిటన్నది ఇప్పటి వరకు అర్థం కాలేదని ఎద్దేవా చేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ముజఫరాబాద్‌లో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ భారీ బహిరంగ సభ ఏర్పాటుపై చేసిన ప్రకటన పట్ల స్పందిస్తూ ముందు ఆ ప్రాంతంలో నివసిస్తోన్న ప్రజల ప్రజాస్వామిక హక్కులను గురించి మాట్లాడాలని పాక్ ప్రధానికి సూచించారు. పాక్ఆక్రమిత కశ్మీర్లో నివసిస్తోన్న ప్రజలకు నిజంగా ప్రజాస్వామిక హక్కులున్నాయా? అని ఆయన ప్రశ్నించారు. వారికి ఉపాధి అవకాశాలు కల్పించారా? అని ఇమ్రాన్‌ను ప్రశ్నించారు. -
ఆ మ్యూజియం వద్దన్నందుకు ఉద్వాసన
న్యూఢిల్లీ: నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ సొసైటీకి చెందిన ముగ్గురు సభ్యులకు కేంద్రం ఉద్వాసన పలికింది. ఇక్కడి తీన్‌మూర్తి ఎస్టేట్‌లో భారత ప్రధాన మంత్రులందరి స్మృత్యర్థం మ్యూజియం నిర్మించాలన్న ప్రతిపాదనను వ్యతిరేకించిన ఆర్థికవేత్త నితిన్ దేశాయ్, ప్రొఫెసర్ ఉదయన్ మిశ్రా, మాజీ ప్రభుత్వ ఉద్యోగి బీపీ సింగ్‌లను తొలగిస్తూ శనివారం ఉత్తర్వులు జారీచేసింది. వీరి స్థానంలో టీవీ జర్నలిస్ట్ అర్ణబ్ గోస్వామి, మాజీ విదేశాంగ కార్యదర్శి ఎస్.జైశంకర్, బీజేపీ ఎంపీ వినయ్ సహస్రబుద్ధేతో పాటు ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్ చైర్మన్ రామ్‌బహదూర్ రాయ్‌ను నియమించింది. -
నెహ్రూ ప్రతిష్టను తగ్గించేందుకే..
సాక్షి, న్యూఢిల్లీ : నెహ్రూ మెమోరియల్ మ్యూజియం (ఎన్ఎంఎంఎల్), తీన్‌మూర్తి కాంప్లెక్స్‌ల స్వరూపం మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. నెహ్రూ కేవలం కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి మాత్రమే కాదని, ఆయన దేశానికి నేతని ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. తీన్‌మూర్తి కాంప్లెక్స్‌లో ఎలాంటి మార్పులూ చేపట్టరాదని కోరారు. ఆరేళ్ల పాటు ప్రధానిగా వ్యవహరించిన అటల్ బిహారి వాజ్‌పేయి హయాంలో ఎన్ఎంఎంఎల్, తీన్‌మూర్తి కాంప్లెక్స్ స్వభావం, రూపురేఖల్లో ఎలాంటి మార్పులు చేపట్టలేదని, అయితే ఇప్పుడు ప్రభుత్వ అజెండాలో మార్పు వచ్చినట్టు కనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. తీన్‌మూర్తి కాంప్లెక్స్‌లో ప్రధానులందరి మ్యూజియం నెలకొల్పాలని ప్రభుత్వం యోచిస్తోందనే వార్తల నేపథ్యంలో మన్మోహన్ సింగ్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. నెహ్రూ ప్రాధాన్యాన్ని తగ్గించేందుకే మోదీ సర్కార్ ఇలాంటి చర్యలకు దిగుతోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. దేశానికి నెహ్రూ సేవలను ఎవరూ తగ్గించలేరని లేఖలో మన్మోహన్ సింగ్ స్పష్టం చేశారు. దేశ తొలి ప్రధాని మెమోరియల్‌గా తీన్‌మూర్తి భవన్‌ను వదిలివేయాలని, అప్పుడే మనం చరిత్రను, ఘన వారసత్వాన్ని గౌరవించినట్లవుతుందని పేర్కొన్నారు. -
‘తండ్రిని రాముడిగా, కూతుర్ని దుర్గగా వర్ణించారు’
న్యూఢిల్లీ : రాజకీయాల్లో అజాతశత్రవుగా ఎదిగిన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి కన్నుమూశారు. పదిసార్లు లోక్‌సభకు, రెండు సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. నిక్కచ్చిగా, సూటిగా మాట్లాడే వాజ్‌పేయి అంటే విపక్ష నేతలకు కూడా అభిమానమే. జవహర్లాల్ నెహ్రూ అంటే తనకు చాలా ఇష్టమని బహిరంగంగానే ప్రకటించేవారు వాజ్‌పేయి. రాజకీయ రంగంలో ఆయన ఒక్కో మెట్టూ ఎక్కుతూ ప్రధాని పీఠాన్ని అధిష్టించారు. అయితే వాజ్‌పేయి ప్రధాని అవుతారని నెహ్రూ ఎప్పుడో జోస్యం చెప్పారు. అతనికి గొప్ప భవిష్యత్తు ఉంది వివరాలు.. 1957లో వాజ్‌పేయి తొలిసారిగా ఉత్తర ప్రదేశ్ బలరాంపూర్ నుంచి రెండో లోక్‌సభకు ఎన్నికయ్యారు. ప్రతిపక్ష నేతగా లోక్‌సభలో క్రీయాశీలంగా ఉండేవారు వాజ్‌పేయి. ఆయన ఉత్సాహం నెహ్రూను ఎంతో ఆకర్షించింది. ఒకసారి నెహ్రూ, వాజ్‌పేయిని బ్రిటీష్ ప్రధానికి పరిచయం చేస్తూ.. ‘ఇతను మా లోక్‌సభలో యువ ప్రతిపక్ష నేత. నన్ను ఎప్పుడూ విమర్శిస్తుంటాడు. నాకు మాత్రం ఇతనికి గొప్ప భవిష్యత్తు ఉండబోతోందనిపిస్తోంది. మా దేశంలో వికసిస్తోన్న యువ పార్లమెంటేరియన్లకు ఇతను ప్రతీక’ అంటూ వాజ్‌పేయి భవిష్యత్తు గురించి స్వయంగా నెహ్రూ అనాడే జోస్యం చెప్పారు. వ్యక్తిగతంగా అభిమాని.. రాజకీయాల్లో ప్రత్యర్థి ఒకసారి వాజ్‌పేయి నెహ్రూని విమర్శిస్తూ.. ‘పండిట్జీ మీరు శీర్షాసనం వేస్తారని నాకు తెలుసు. ఆరోగ్యానికి అది ఎంతో మేలు చేస్తుంది కూడా. కానీ దేశంలో జరిగే విషయాలను కూడా అలా తలకిందులుగానే చూస్తానంటే కుదరదం’టూ విమర్శించారు. వ్యక్తిగతంగా నెహ్రూ అంటే ఎంతో అభిమానమున్నప్పటికీ ప్రతిపక్ష నేతగా ఉన్న వాజ్‌పేయి తన బాధ్యతలను విస్మరించేవారు కారు. అందువల్లే నెహ్రూ 1961లో ఏర్పాటు చేసిన జాతీయ సమగ్రతా మండలీలో వాజ్‌పేయిని నియమించారు. ఆయన శ్రీరాముడిలాంటి వారు నెహ్రూ పట్ల తన గౌరవాన్ని చూపించడంలో వాజ్‌పేయి ఎవరికి భయపడేవారు కారు. 1964లో నెహ్రూ మరణించినప్పడు వాజ్‌పేయి మాట్లాడుతూ.. ‘ఒక కల చెదిరిపోయింది.. విశ్వంలో ఒక జ్వాల మరుగునపడిపోయింది. ఆకలి, భయమంటే తెలియని ప్రపంచం గురించి కలగన్న గులాబీ నేడు రాలిపోయింది. చీకటితో పొరాడి మాకు దారి చూపిన వెలుగు అస్తమించిందం’టూ నివాళులు అర్పించారు. అంతేకాక నెహ్రూ చాలా నిజాయితీ గల వ్యక్తి, చర్చలంటే భయపడే వారు కారంటూ నెహ్రూను, వాజ్‌పేయి శ్రీరామునితో పోల్చారు. కూతురితోనూ ఢీ... అయితే వాజ్‌పేయికి నెహ్రూతో ఉన్నంత మంచి సంబంధాలు ఆయన కూతురు ఇందిరా గాంధీతో లేవు. 1970లో ఒకసారి పార్లమెంట్లో వాడివేడి చర్చలు జరుగుతున్న సందర్భంలో ఇందిరా గాంధీ జన్ సంఘ్‌ను ముస్లిం వ్యతిరేకిగా చిత్రీకరిస్తూ విమర్శలు చేశారు. అంతేకాక తాను తల్చుకుంటే జన్‌సంఘ్‌ను 5 నిమిషాల్లో నాశనం చేస్తానంటూ ఆవేశపూరితంగా మాట్లాడారు ఇందిరా గాంధీ. అయితే తర్వాత మాట్లాడిన వాజ్‌పేయి ప్రధాని ఇందిరా గాంధీ మాటలకు ధీటుగా బదులిస్తూ ‘ప్రజాస్వామ్య దేశంలో ఒక ప్రధాని ఇలా మాట్లాడటం సమంజసమేనా’ అంటూ విమర్శించారు. అంతేకాక ఆమె(ప్రధాని ఇందిర) జన్‌సంఘ్‌ను కేవలం 5 నిమిషాల్లో నాశనం చేస్తానని అన్నారు... 5 నిమిషాల్లో ఆవిడ తన జుట్టునే సరిచేసుకోలేరు అలాంటిది జన్‌సంఘ్‌ను ఎలా మారుస్తారంటూ’ వాజ్‌పేయి ప్రశ్నించారు. అంతేకాక నెహ్రూజీ కూడా కోప్పడేవారని, కానీ ఇలా మాత్రం మాట్లాడేవారు కారంటూ గుర్తు చేశారు. ఇందిరను దుర్గా దేవిగా అయితే మంచి పనులు చేసినప్పుడు కాంగ్రెస్ నాయకులను పొగడటానికి వాజ్‌పేయి ఏ మాత్రం సిగ్గుపడే వారు కారు. అందుకే1971 పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో భారత్ విజయం సాధించడంతో వాజ్‌పేయి, పార్లమెంట్ సాక్షిగా ఇందిరా గాంధీని దుర్గామాతాతో పోల్చారు. అలానే కాంగ్రెస్ నేత, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతోను వాజ్‌పేయికి మంచి స్నేహం ఉండేది. వాజ్‌పేయి చివరి వరకూ నమ్మిన సిద్ధాంతం ‘రాజకీయ చదరంగం కొనసాగుతూనే ఉంటుంది. పార్టీలు, ప్రభుత్వాలు ఏర్పడతాయి, పడిపోతాయి. కానీ ఈ దేశం, ప్రజస్వామ్యం ఎన్నటికి నిలిచి ఉంటాయి’. -
భావప్రకటనా స్వేచ్ఛకు నెహ్రూ తూట్లు : జైట్లీ
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూను ఉద్దేశించి శుక్రవారం సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ చేశారు. భావప్రకటనా స్వేచ్ఛను హరించేలా భారత ప్రధాని నెహ్రూ తొలి రాజ్యాంగ సవరణను చేపట్టారని గుర్తుచేశారు. దీన్ని అప్పట్లో ఎవరైనా కోర్టులో సవాల్ చేస్తే నిలబడేది కాదని ట్వీట్ చేశారు. తన రాజకీయ ప్రత్యర్థి శ్యామా ప్రసాద్ ముఖర్జీ ప్రసంగాలను నిలువరించే ఉద్దేశంతోనే నెహ్రూ ఇలా వ్యవహరించారని అన్నారు. శ్యామా ప్రసాద్ ముఖర్జీ విమర్శలను నెహ్రూ జీర్ణించుకోలేకపోయారని, ముఖర్జీ నినాదమైన అఖండ్ భారత్ భావనను నెహ్రూ వ్యతిరేకించే వారన్నారు. భారతీయ జనసంఘ్ వ్యవస్ధాపకులు ముఖర్జీ జయంతోత్సవాల నేపథ్యంలో జైట్లీ ఈ మేరకు ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. 1950లో భారత రాజ్యాంగం అమలైన అనంతరం తొలి సవరణను భావప్రకటనా స్వేచ్ఛపై పరిమితి విధించేందుకు చేపట్టారని ఇందుకు దారితీసిన పరిస్థితులను తన సుదీర్ఘ పోస్ట్‌లో ఆయన ప్రస్తావించారు. రాజ్యాంగంలో భావప్రకటనా స్వేచ్ఛను ప్రాధమిక హక్కుగా పొందుపరిస్తే 1951లో చేపట్టిన సవరణలో భావప్రకటనా స్వేచ్ఛ సహేతుక నియంత్రణలకు లోబడి ఉండాలని మార్పు చేశారన్నారు. ఈ సవరణ రాజ్యాంగ విరుద్ధమని జైట్లీ పేర్కొన్నారు. -
‘నవంబర్ 14 అంకుల్ డే..’
సాక్షి, న్యూఢిల్లీ : బాలల దినోత్సవాన్ని నవంబర్ 14కు బదులు డిసెంబర్ 26న నిర్వహించాలని వంద మందికి పైగా బీజేపీ ఎంపీలు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. నవంబర్ 14న బాలల సంక్షేమం కంటే జవహర్లాల్ నెహ్రూకు చిన్నారులపై ప్రేమ గురించిన ప్రస్తావనే అధికమవుతోందని వారు ఆక్షేపించారు. మొఘలులకు వ్యతిరేకంగా గురు గోవింద్ సింగ్ మైనర్ కుమారులు షహిజద అజిత్ సింగ్ (18), జుజార్ సింగ్ (14), జోర్వార్ సింగ్ (9), ఫతే సింగ్ (7)ల ప్రాణ త్యాగానికి ప్రతీకగా డిసెంబర్ 26న బాలల దినోత్సవం నిర్వహించాలని కోరారు. జవహర్లాల్ నెహ్రూ జయంతైన నవంబర్ 14ను ‘అంకుల్ డే’ లేదా ‘చాచా దివస్’గా జరపాలని లేఖలో ప్రధానిని కోరారు. గురు గోవింద్ సింగ్ కుమారుల బలిదానాల స్ఫూర్తిని చిన్నారుల్లో నింపేందుకు డిసెంబర్ 26ను బాలల దినోత్సవంగా జరపడం సముచితమని పేర్కొన్నారు. -
సమాజ సేవతో మానవ సంబంధాలు మెరుగు
షాబాద్(చేవెళ్ల): యువత సమాజ సేవతో పాటు మానవ సంబంధాలు పెంచుకోవాలని మనస్తత్వ శాస్త్రవేత్త జవహర్లాల్ నెహ్రూ పేర్కొన్నారు. గురువారం షాబాద్ మండలంలోని రేగడిదోస్వాడ గ్రామంలో కేశవ మెమోరియల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కామర్స్ అండర్ సైన్సెస్ ఆధ్యర్యంలో విద్యార్థులచే ఎన్ఎస్ఎస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విద్యార్థులు చదవడమే కాకుండా సామాజిక అవగాహన కలిగి ఉండాలని సూచించారు. యువత స్వచ్ఛందంగా గ్రామాల్లో సేవా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. తమ కళాశాల ఆధ్వర్యంలో గత వారం రోజులుగా రేగడిదోస్వాడ గ్రామంలో వివిధ రకాల కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మల్లారెడ్డి, ఎంపీటీసీ పద్మమ్మ, కళాశాల ప్రిన్సిపాల్ నాగేశ్వర్రావు, ఎస్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ సంజయ్‌రాజ్, ఫిజికల్ డైరెక్టర్ పోచప్ప, మాజీ సర్పంచ్ కిషన్‌రావు, విద్యార్థులు పాల్గొన్నారు. -
జనం మెచ్చిన జర్నలిస్టు
‘చలపతిరావు భారతదేశంలో అత్యంత సమర్థుడైన పాత్రికేయుడు, అతడి నైతిక ప్రవర్తన ప్రశ్నించడానికి వీలులేనిది’ అన్నారు జవహర్లాల్ నెహ్రూ. నేషనల్ హెరాల్డ్ పత్రిక రజతోత్సవాలు(1963) లక్నోలో జరిగినప్పుడు నెహ్రూ పైవిధంగా కితాబునిచ్చారు. నెహ్రూ యాజమాన్యంలోని నేషనల్ హెరాల్డ్ అనగానే సంపాదకుడు ఎంసీ (మనికొండ చలపతిరావు) గుర్తుకు వస్తారు. ఎంసీయే నేషనల్ హెరాల్డ్గా, నేషనల్ హెరాల్డ్ ఎంసీగా వర్ధిల్లింది. ఆంగ్ల పత్రికారంగాన్ని నాలుగు దశాబ్దాలపాటు శాసించిన మహావ్యక్తి. చరిత్ర, సాహిత్యం, రాజనీతిశాస్త్రాల్లో ఆయన నిష్ణాతుడు. సాహితీవేత్త, మానవతావాది. భారతీయ జర్నలిస్టుల ఉద్యమానికి శంఖారావం పూరించింది ఆయనే. ప్రతిరంగంలో విశేష పరిజ్ఞానం, అభినివేశం, స్పష్టమైన చారిత్రక దృక్పథం, ఆంగ్లభాషపై మంచి పట్టు ఎంసీని మేరునగధీరునిగా నిలిపింది. ఆయన ఆజన్మ బ్రహ్మచారి. ఎంసీ శ్రీకాకుళం చిన్న బజారులోని మాదివారి సందు కోవెల సమీపంలో ఓ సంపన్న కుటుంబంలో 1908, ఆగస్టు 11న జన్మించారు. అయితే ఆయన బాల్యం, యవ్వన దశకు విశాఖపట్నం వేదిక అయింది. ఎంఏ (ఆంగ్లం), బీఎల్ మద్రాస్ ప్రెసిడెన్సీ కళాశాలలో పూర్తి చేశారు. విశాఖలో కొంతకాలం న్యాయవాదిగా పనిచేశారు. ‘ఎథేనియం’ అనే సాంస్కృతిక సంస్థను ప్రారంభించారు. దానికి ఎంసీ కార్యదర్శిగా, డా॥సర్వేపల్లి రాధాకృష్ణన్ అధ్యక్షులుగా ఉండేవారు. మద్రాసు నుంచి వెలువడుతుండే ‘పీపుల్స్ వాయిస్’, అలహాబాద్‌కు చెందిన ‘వీక్ ఎండ్’ పత్రికకు సహాయ సంపాదకునిగా పని చేశారు. ‘త్రివేణి’ పత్రికలో ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ప్రత్యేక కథనాలు రాసేవారు. 1938లో నెహ్రూ ‘నేషనల్ హెరాల్డ్’ పత్రికను లక్నోలో ప్రారంభించారు. ఎంసీ సహాయ సంపాదకునిగా, సంపాదకీయ రచయితగా పనిచేశారు. 1942లో ‘నేషనల్ హెరాల్డ్’ ఆంగ్ల ప్రభుత్వ నిషేధానికి గురైనప్పుడు హిందుస్తాన్ టైమ్స్’లో కొన్నేళ్లపాటు పనిచేశారు. 1945లో తిరిగి ఢిల్లీలో ప్రారంభమైన ‘నేషనల్ హెరాల్డ్’లో చేరి, ఆ మరుసటి ఏడాది సంపాదకునిగా పదోన్నతి పొందారు. నెహ్రూ ఉపన్యాసాలను ఖరారు చేయడంలో ఎంసీదే కీలక భూమిక. అయితే డెస్క్‌లో కూర్చున్నప్పుడు పలు సందర్భాల్లో నెహ్రూ అభిమతానికి భిన్నంగా సంపాదకీయాలు రాసిన సాహసి ఆయన. ఓ సారి నెహ్రూ ప్రశ్నిస్తే ఎంసీ నుంచి మౌనమే సమాధానంగా వచ్చింది. అప్పటి నుంచి ఆయన తన రాజీనామా లేఖను జేబులో ఉంచుకుని కార్యాలయానికి వెళ్లేవారు. కానీ నెహ్రూకు ఆయన పట్ల సానుకూల దృక్పథమే ఉండేది. అంతరాత్జీయ సమస్యలపైన, వర్తమాన రాజకీయ పరిస్థితులు, పరిణామక్రమంపైన, రెండో ప్రపంచ యుద్ధ పరిణామాలను బేరీజు వేయడంలోను, ఆయన సాధికారిక వ్యాఖ్యానాలు ఆ రోజుల్లో సంచ లనం రేకెత్తించాయి. పత్రికా రచయితల సంక్షేమం, హక్కుల పరిరక్ష ణకు 1950లో ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఐఎఫ్ డబ్ల్యూజే) సంస్థను స్థాపించారు. 1959 వరకు దానికి జాతీయ అధ్యక్షు నిగా ప్రముఖ ప్రాత పోషించారు. 1952లో కేంద్ర ప్రభుత్వం ప్రెస్ కమిషన్ ఏర్పాటు చేయడానికి ఎంసీ ప్రధాన కారకుడు. ‘ది ప్రెస్ ఆఫ్ ఇండియా’’ ‘‘ది ప్రెస్ అండ్ ది రొమాన్స్ ఆఫ్ ది న్యూస్ పేపర్’’ ఫ్రాగ్మంట్స్ ఆఫ్ ఎ రివల్యూషన్’’ ‘‘గాంధీ అండ్ నెహ్రూ’’ వంటి గ్రంథాలను ఆంగ్లంలో రాశారు. పత్రికా రచన విధానాలపై ‘ఆఫ్ ది రికార్డు, మెన్ ఫ్రమ్ మేవార్’ పుస్తకం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఎంసీ 1983 మార్చి 25న న్యూఢిల్లీలో కారులో ప్రయాణం చేస్తుండగా గుండెపోటుతో మృతి చెందారు. ఆయన స్మృతి చిహ్నంగా హైదరాబాద్ జూబ్లీహాల్ కూడలి వద్ద 2007 డిసెంబర్ 31న ఎంసీ విగ్రహాన్ని నాటి సీఎం వై.ఎస్.రాజశేఖర రెడ్డి ఆవిష్కరించారు. న్యాయస్థానాల తీర్పుల్లో జస్టిస్ వి.ఆర్.కృష్ణయ్యర్ ఎలాగో ఆంగ్ల సంపాదకీయ రచనల్లో ఎంసీ అంతటి గొప్పవారని మేధావులు పేర్కొంటారు. ఆయన జాతి గర్వించదగ్గ పాత్రికేయుడు. - (నేడు ఎం.చలపతిరావు 33వ వర్థంతి సందర్భంగా) వాండ్రంగి కొండలరావు, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ 9490528730