
ఎన్‌ఎస్‌ఎస్ కార్యక్రమంలో మాట్లాడుతున్న శాస్త్రవేత్త జవహర్‌లాల్ నెహ్రూ
షాబాద్(చేవెళ్ల): యువత సమాజ సేవతో పాటు మానవ సంబంధాలు పెంచుకోవాలని మనస్తత్వ శాస్త్రవేత్త జవహర్‌లాల్ నెహ్రూ పేర్కొన్నారు. గురువారం షాబాద్ మండలంలోని రేగడిదోస్వాడ గ్రామంలో కేశవ మెమోరియల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కామర్స్ అండర్ సైన్సెస్ ఆధ్యర్యంలో విద్యార్థులచే ఎన్‌ఎస్‌ఎస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విద్యార్థులు చదవడమే కాకుండా సామాజిక అవగాహన కలిగి ఉండాలని సూచించారు.
యువత స్వచ్ఛందంగా గ్రామాల్లో సేవా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. తమ కళాశాల ఆధ్వర్యంలో గత వారం రోజులుగా రేగడిదోస్వాడ గ్రామంలో వివిధ రకాల కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మల్లారెడ్డి, ఎంపీటీసీ పద్మమ్మ, కళాశాల ప్రిన్సిపాల్ నాగేశ్వర్‌రావు, ఎస్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ సంజయ్‌రాజ్, ఫిజికల్ డైరెక్టర్ పోచప్ప, మాజీ సర్పంచ్ కిషన్‌రావు, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment