human relationships
-
మనుషులు చేజారుతారు
‘హమ్ తుమ్ ఏక్ కమరే మే బంద్ హో’.... భారత సినీ ప్రేక్షకుల్ని ఉర్రూతలూపిన ‘బాబీ’ మొన్నటి సెప్టెంబర్ 28కి యాభై ఏళ్లు పూర్తి చేసుకుంది. ఇవాళ్టికీ దేశంలోని అన్ని భాషల్లో ఏదైనా టీనేజ్ ప్రేమకథ తీస్తూంటే గనక అది ఏదో ఒక మేరకు ‘బాబీ’కి కాపీ. ఆ సినిమా ఇచ్చిన ఫార్ములాతో వందలాది కథలు వచ్చాయి. వస్తాయి. ‘మేరా నామ్ జోకర్’ తీసి నిండా మునిగిన రాజ్‌కపూర్‌ను కుబేరుణ్ణి చేసిన సినిమా అది. ఆ సంపద వచ్చిన సందర్భంలోనే రాజ్‌కపూర్ ఒక మనిషిని చేజార్చుకున్నాడు. తెలిశా.. తెలియకనా? ‘బాబీ’ని కనీస ఖర్చుతో తీద్దామనుకున్నాడు రాజ్‌కపూర్. హీరో తన కొడుకే రిషికపూర్. హీరోయిన్ కొత్తమ్మాయి డింపుల్ కపాడియా. ముఖ్య పాత్రలు ప్రేమ్‌నాథ్, ప్రేమ్చోప్రా భార్య తరఫు బంధువులు. లక్ష్మీకాంత్– ప్యారేలాల్ ఇంకా కెరీర్ ప్రారంభంలో ఉండి రాజ్‌కపూర్‌తో మొదటి సినిమా చేయడమే వరం అనుకునే రకం. ఖర్చేముంది? ఒక్కటి ఉంది... ప్రాణ్ రెమ్యూనరేషన్ . ఆ రోజుల్లో ప్రాణ్ సినిమాకు రెండు, మూడు లక్షలు తీసుకుంటున్నాడు. రాజ్‌కపూర్‌తో అప్పటికి నలభై ఏళ్లుగా ప్రాణస్నేహం. ‘ఒక్కరూపాయి తీసుకొని చేస్తా. సినిమా ఆడితే ఇవ్వు. ఆడకపోతే మర్చిపో’ అన్నాడు ప్రాణ్. అన్నమాట ప్రకారం ఒక్క రూపాయికే చేశాడు. సినిమా రిలీజ్ అయ్యింది. ఇరవై పాతిక లక్షలు పెట్టి తీస్తే దేశంలో, బయట కలిపి 30 కోట్లు వచ్చాయి. నేటి లెక్కల ప్రకారం 1200 కోట్లు! రాజ్‌కపూర్ ప్రాణ్‌ని పిలిచి మంచి పార్టీ ఇస్తే బాగుండేది. థ్యాంక్స్ చెప్పి అడిగినంత ఇచ్చి ఉంటే బాగుండేది. ఇవ్వకపోయినా బాగుండేది. కాని రాజ్‌కపూర్ లక్ష రూపాయల చెక్ పంపాడు. లక్ష? తను అడగలేదే? పోనీ తాను అందరి దగ్గరా తీసుకునేంత కూడా కాదే. ప్రాణ్ ఆ చెక్ వెనక్కు పంపాడు. మళ్లీ జీవితంలో రాజ్కపూర్ని కలవలేదు. జారిపోయాడు. ‘షోలే’ రిలీజ్ అయితే మొదటి రెండు వారాలు ఫ్లాప్‌టాక్. రాసిన సలీమ్–జావేద్ ఆందోళన చెందారు. ఫ్లాప్ కావడానికి స్క్రిప్ట్ కారణమనే చెడ్డపేరు ఎక్కడ వస్తుందోనని బెంబేలెత్తారు. మాటల్లో మాటగా దర్శకుడు రమేష్ సిప్పీతో ‘గబ్బర్‌సింగ్ వేషం వేసిన అంజాద్‌ఖాన్ వల్లే సినిమా పోయింది. అతడు ఆనలేదు’ అన్నారు. అప్పటికే తన తొలి సినిమాకు ఇలాంటి టాక్ రావడం ఏమిటా అని చాలా వర్రీగా ఉన్న అంజాద్‌ఖాన్ బ్లేమ్ గేమ్‌లో తనను బలి చేయబోతున్నారని తెలిసి హతాశుడయ్యాడు. తీవ్రంగా కలత చెందాడు. కాని సినిమా కోలుకుంది. ఎలా? అలాంటి కలెక్షన్లు ఇప్పటికీ లేవు. అతి గొప్ప విలన్ గా అంజాద్‌ఖాన్ ఎన్నో సినిమాలు చేశారు. కాని ఒకనాటి మిత్రులైన సలీమ్–జావేద్ రాసిన ఏ స్క్రిప్ట్‌లోనూ మళ్లీ యాక్ట్ చేయలేదు. చేజారిపోయాడు. దాసరి నారాయణరావు తొలి రోజుల్లో నటుడు నాగభూషణాన్ని ఎంతో నమ్ముకున్నాడు. అభిమానించాడు. నాగభూషణం దాసరికి దర్శకుణ్ణి చేస్తానని చెప్పి చాలా పని చేయించుకున్నాడు. చివరి నిమిషంలో వేరొకరిని పెట్టుకున్నాడు. దాసరి ఆ తర్వాత పెద్ద దర్శకుడయ్యి 150 సినిమాలు చేశాడు. వందల పాత్రలు రాశాడు. కాని దాసరి కలం నుంచి ఒక్క పాత్ర కూడా నాగభూషణం కోసం సృజించబడలేదు. దాసరి సినిమాల్లో నాగభూషణం ఎప్పుడూ లేడు. రామానాయుడు అవకాశం ఇస్తే ఎంతో కష్టం మీద ‘ప్రేమఖైదీ’ సినిమాకు దర్శకత్వం వహించాడు ఇ.వి.వి.సత్యనారాయణ. అప్పటికి అతని మొదటి సినిమా ఫ్లాప్. ఈ సినిమా కూడా పోతే భవిష్యత్తు లేదు. ఫస్ట్ కాపీ చూసిన పరుచూరి బ్రదర్స్ ఏ మూడ్‌లో ఉన్నారో ‘మా స్క్రిప్ట్‌ను చెడగొట్టినట్టున్నాడే’ అనే అర్థంలో రామానాయుడు దగ్గర హడావిడి చేశారు. వారు స్టార్‌రైటర్స్. వారి మాట మీద రామానాయుడుకు గురి. ఇ.వి.వి హడలిపోయాడు. స్క్రిప్ట్‌ను తన బుర్రతో ఆలోచించి మెరుగుపెట్టి తీస్తే ఇలా అంటారేమిటి అని సిగరెట్లు తెగ కాల్చాడు. సినిమాను మూలపడేస్తే ఇంతే సంగతులే అని కుంగిపోయాడు. కాని సినిమా రిలీజయ్యి సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత 51 సినిమాలు తీశాడు ఇ.వి.వి. ఒక్కదానికీ గురు సమానులైన పరుచూరి సోదరుల స్క్రిప్ట్ వాడాలనుకోలేదు. బాగా చనువుగా, ఆత్మీయంగా ఉండే మనుషుల పట్ల కొందరికి హఠాత్తుగా చిన్నచూపు వస్తుంది. ఆ.. ఏముందిలే అనుకోబుద్ధవుతుంది. వారితో మనం ఎలా వ్యవహరించినా చెల్లుబాటవుతుందిలే అనిపిస్తుంది. వారితో చెప్పకుండా ఫలానా పని చేద్దాం... శుభలేఖ ఆఖరున పంపుదాం... కష్టంలో ఉన్నారని తెలిసినా చూసీ చూడనట్టు ఉందాం... ఇచ్చిన మాటను తేలిగ్గా తీసుకుందాం... వారి వీపు మీద విస్తరి పరిచి భోం చేద్దాం... అనుకుంటే ఆ క్షణంలో ఆ సదరు వారు మనం చెప్పింది విన్నట్టుగా కనపడతారు. నవ్వుతున్నట్టే ఉంటారు. కాని వారి లోపల మనసు చిట్లుతున్న చప్పుడు మన చెవిన పడకుండా జాగ్రత్త పడతారు. ఆ తర్వాత వారు మనకు కనిపించరు. జారిపోతారు. చేజారిపోతారు. మనుషులు చేజారితే ఏమవుతుంది? వారితో మాత్రమే సాధ్యమయ్యే జీవన సందర్భాలన్నీ నాశనమవుతాయి. వారితో నిర్మించుకున్న గతం తుడిచిపెట్టుకుపోతుంది. వారితో వీలైన భవిష్యత్తు నష్టమవుతుంది. ఉంటే బాగుండు అనుకునే క్షణాల్లో వారు ఉండరు. డబ్బు, దస్కం, పలుకుబడి, క్షమాపణ ఏదీ వారిని మళ్లీ వెనక్కు తీసుకురాదు. హాయ్, హలో బాపతు సవాలక్ష దొరుకుతారు. ఈ నిజమైన ఆత్మీయులను కాపాడుకుంటున్నారా? అసలు మీరెంత మందిని చేజార్చుకున్నారో ఎప్పుడైనా లెక్క చూసుకున్నారా? -
ఆఫీసుల నుంచే విధులు: విప్రో
ముంబై: మరింతమంది ఉద్యోగులు ఇళ్ల నుంచి కాకుండా కార్యాలయాల నుంచి పనిచేయవలసి ఉంటుందని సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ తాజాగా పేర్కొన్నారు. కార్యాలయాలకు రావడం ద్వారా సిబ్బంది మధ్య దగ్గరతనం ఏర్పడుతుందని, సంబంధాలు మెరుగుపడతాయని తెలియజేశారు. మానవులకు ఇవి కీలకమని, ఇందుకు ఎలాంటి టెక్నాలజీ దోహదం చేయదని స్పష్టం చేశారు. 2023 ఎన్టీఎల్ఎఫ్ సదస్సులో ప్రసంగిస్తూ రిషద్ ఎంతటి ఆధునిక టెక్నాలజీ అయినా మానవ సంబంధాలను నిర్మించలేదని వ్యాఖ్యానించారు. తిరిగి ఆఫీసులకు వచ్చి పనిచేయాలన్న సిద్ధాంతాన్ని తాను సంపూర్ణంగా విశ్వసిస్తున్నట్లు చెప్పారు. అటు ఆఫీసులు, ఇటు ఇళ్లవద్ద నుంచి పనిచేసే హైబ్రిడ్ వర్కింగే భవిష్యత్ విధానమని ఆయన తెలిపారు. టెక్నాలజీ రంగంలోనే ఇలాంటి విధానాలు వీలవుతాయని రిషద్ చెప్పారు. అయితే, ఉద్యోగులు ఇంటి నుంచే కాకుండా.. కార్యాలయాలకు సైతం వచ్చి పనిచేయడానికి సన్నద్ధంగా ఉండాలని సూచించారు. కరోనా మహమ్మారి కారణంగా సిబ్బంది ఇంటి నుంచే పని (వర్క్ ఫ్రమ్ హోమ్) చేసినప్పటికీ గత రెండేళ్లలో ఉద్యోగవలస భారీగా పెరిగిపోయిందని రిషద్ పేర్కొన్నారు. దీంతో 60 శాతం మంది ఉద్యోగులు కొత్తగా చేరినవారేనని వెల్లడించారు. వెరసి వీరంతా ఆర్గనైజేషన్ సంస్కృతిని తెలుసుకోవలసి ఉంటుందని అభిప్రాయపడ్డారు. -
సంసారంలో ‘స్మార్ట్’ తిప్పలు.. టెన్షన్ పెడుతున్న రిపోర్టు!
సాక్షి, హైదరాబాద్: స్మార్ట్ఫోన్ల మితిమీరిన వినియోగంతో తిప్పలు తప్పడం లేదు. అర్ధరాత్రి, అపరాత్రి అనే తేడా లేకుండా మొబైళ్లను విచ్చలవిడిగా ఉపయోగించడంతో భార్యాభర్తలు, అతి సన్నిహితుల మధ్య సంబంధాలు దెబ్బతింటున్నాయి. అవసరమున్నా, లేకపోయినా సమయం, సందర్భం లేకుండా స్మార్ట్ఫోన్లలో మునిగిపోవడం చాలా మందికి అలవాటు అయ్యింది. కొంతమందిలో వ్యసనంగా మారడంతో పరిణామాలు సమాజాన్ని కలవర పరుస్తున్నాయి. ఆధునిక సాంకేతికత ఒక వరంగా వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాల్లో ఎన్నో అవసరాలను తీరుస్తోంది. ఐతే ఈ టెక్నాలజీని మితిమీరి ఉపయోగిస్తే పెనుసమస్యగా మారుతోంది. మానవ సంబంధాలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఈ నేపథ్యంలో స్మార్ట్ఫోన్ల అతి వినియోగం వల్ల వివాహిత జంటల సంబంధాల్లో, మానసికంగా చూపుతున్న ప్రభావం, స్వభావంలో వస్తున్న మార్పులపై ‘స్మార్ట్‌ఫోన్స్ అండ్ దెయిర్ ఇంపాక్ట్ ఆన్ హ్యూమన్ రిలేషన్షిప్స్–2022’అనే అంశంపై వీవో–సైబర్ మీడియా పరిశోధన చేసింది. అందులో వెల్లడైన ఆసక్తికరమైన విషయాలను ఫోర్త్ ఎడిషన్ ఆఫ్ స్విచ్ఛాఫ్ స్టడీలో వెలువరించింది. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్, పుణేలలోని స్మార్ట్ఫోన్ల వినియోగదారులపై ఈ అధ్యయనం నిర్వహించారు. ఫోన్ వాడకంలో వస్తున్న ట్రెండ్స్, అతి వినియోగంతో వస్తున్న మార్పులను విశ్లేషించింది. జెండర్‌తో సంబంధం లేకుండా భర్త/భార్య సగటున రోజుకు 4.7గంటలు స్మార్ట్‌ఫోన్ వినియోగిస్తున్నారు. తమతో కాకుండా ఫోన్‌తో గడుపుతున్నారంటూ తమ జీవిత భాగస్వామి తరచూ ఫిర్యాదు చేస్తుంటారని 73శాతం మంది అంగీకరించారు. ఇంకా మరెన్నో విషయాలను అధ్యయనం వెల్లడించింది. రిపోర్టులోని ముఖ్యాంశాలు - అవకాశమున్నా కూడా తమ భార్య/భర్తతో కాకుండా ఎక్కువ సమయం మొబైళ్లతోనే సమయం గడుపుతున్నామన్న 89% మంది. - స్మార్ట్ఫోన్లలో మునిగిపోయి కొన్నిసార్లు తమ చుట్టూ పరిసరాలనూ మరిచిపోయామన్న 72 శాతం మంది. - తమ వారితో సమయం గడుపుతున్నపుడు కూడా ఫోన్లను చూస్తున్నామన్న 67% మంది. - స్మార్ట్ఫోన్ల మితిమీరి వినియోగం వల్ల తమ భాగస్వాములతో సంబంధాలు బలహీనపడినట్టు 66 శాతం మంది అంగీకారం. - అతిగా ఫోన్ వాడకంతో మానసికమైన మార్పులు వస్తున్నాయని, స్మార్ట్‌ఫోన్ వాడుతున్నప్పుడు భార్య కలగజేసుకుంటే ఆవేశానికి లోనవుతున్నామన్న 70 శాతం - ఫోన్ కారణంగా భార్యతో మాట్లాడుతున్నపుడు కూడా మనసు లగ్నం చేయలేకపోతున్నామన్న 69 శాతం మంది. - భోజనం చేస్తున్నపుడు కూడా ఫోన్లను ఉపయోగిస్తున్నామన్న 58 శాతం మంది. - లివింగ్‌రూమ్‌లో స్మార్ట్ఫోన్లను వినియోగిస్తున్న వారు 60 శాతం - రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు కూడా ఫోన్లు చూస్తున్నవారు 86 శాతం - జీవితంలో ఒకభాగమై పోయిన స్మార్ట్ఫోన్లను వేరు చేయలేమన్న 84 శాతం - తీరిక సమయం దొరికితే చాలు 89% మంది ఫోన్లలో మునిగిపోతున్నారు - రిలాక్స్ కావడానికి కూడా మొబైళ్లనే సాధనంగా 90% మంది ఎంచుకుంటున్నారు. స్క్రీన్‌టైమ్‌పై స్వీయ నియంత్రణ అవసరం.. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆకర్షణకు లోనయ్యే, గంటలు గంటలు అందులోనే మునిగేపోయేలా చేసే గుణం స్మార్ట్ ఫోన్లలో ఉంది. అది ‘అటెన్షెన్ సీకింగ్ డివైస్’కావడంతో బయటకెళ్లినా, ఇంట్లో ఉన్నా పది నిమిషాలు కాకుండానే మొబైళ్లను చెక్ చేస్తుంటాం. వాడకపోతే కొంపలు మునిగేదేమీ లేకపోయినా అదో వ్యసనంగా మారింది. బహిరంగ ప్రదేశాల్లోనూ తాము బిజీగా ఉన్నామని చూపెట్టేందుకు సెల్ఫోన్లు ఉపయోగిస్తుంటారు. ఆఫీసుల నుంచి ఇంటికి వచ్చాక అత్యవసరమైతే తప్ప మొబైళ్లు ఉపయోగించరాదనే నిబంధన వివాహితులు పెట్టుకోవాలి. బెడ్రూమ్లో ఫోన్లు వినియోగించరాదనే నియమం ఉండాలి. రోజుకు ఇన్ని గంటలు మాత్రమే సెల్‌ఫోన్ వాడాలనే నిబంధన పెట్టుకోవాలి. ఉపవాసం మాదిరిగా వారానికి ఒకరోజు అత్యవసరమైతే తప్ప ఫోన్ ఉపయోగించకుండా చూసుకోవాలి. మొబైల్ అధిక వినియోగ ప్రభావం తమ జీవితాలపై, సంబంధాలపై ఏ మేరకు పడుతోందనే జ్ఞానోదయమైతే ఈ సమస్యను సులభంగా పరిష్కరించుకోవచ్చు. – సి.వీరేందర్, సీనియర్ సైకాలజిస్ట్ . -
జీవితం ఏ నిర్వచనానికి లొంగనిది..!
‘తాతగారు, మీరు పెద్దగా చదువుకోలేదు. అయినా, ఎంతో ఆనందంగా ఉంటారు. అమ్మ నాన్నలు పెద్ద చదువులు చదివారు. పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు కానీ సంతోషంగా ఉండరు. ఎందుకని?‘ అమాయకంగా తన పదేళ్ల మనవడడిగిన ప్రశ్నకు పెద్దగా నవ్వేశారా తాతగారు. ‘నానీ, నేను జీవితాన్ని జీవిస్తున్నాను. వాళ్ళు బతుకుతున్నారు. అంతే’ అన్నారాయన. ప్రశ్న అమాయకమైనదే కానీ, సమాధానం ఎంతో లోతైనది. వేదాంతులు, తాత్వికులు చెప్పేటంత, చెప్పినంత సాంద్రమైనది. గాఢమైనది. అనేకానేక అనుభవాల పొరలను తనలో ఇముడ్చుకుని, తమాయించుకుని, తెప్పరిల్లి జీవితార్ణవపు సుఖ దుఃఖాల ఆటుపోట్లను సమంగా తీసుకోగలిగిన స్థితప్రజ్ఞత ధ్వనిస్తోంది ఆ సమాధానం లో. ఆ తాతగారి జీవితానంద ఆస్వాదనకు, కొడుకు, కోడలి ఆందోళనకు, ఆశాంతికి భేదమదే. జీవితాన్ని జీవించాలి. అంటే..? జీవితంలోని సుఖాలను ఎలా హాయిగా అనుభవిస్తున్నామో, దుఃఖాలనూ అలాగే స్వీకరించగలగాలి. జీవితం పట్ల ఒక అవగాహన ఏర్పరుచుకోవాలి. హిమం ఒక వాతావరణంలో కరిగిపోవటం, మరొక వాతావరణంలో ఘనీభవించటం, సూర్యోదయ సూర్యాస్తమాయాలు ఏర్పడం ఎంత సహజమో /జీవితంలోని ఎత్తు పల్లాలు అంతే. మనిషికి ఆలోచనా శక్తి, ఒక మనస్సు దానికి స్పందన ఉన్నాయి. సుఖాన్ని తీసుకున్నంత హాయిగా ఆహ్లాదంగా మనస్సు దుఃఖాన్ని తీసుకోలేదు. రెండిటిని సమానంగా తీసుకోవాలని బుద్ధికి తెలుస్తుంది. కాని మనస్సుకు తెలియదు. బుద్ధి అనంతమైన భావాలకు / ఆలోచనలకు ఆవాసం. వాటికి స్పందించేది మనస్సు. అది దాని లక్షణం. సుఖదుఖాల భావన రెండిటికి సమానంగా తెలియాలి. అపుడే జీవితంలోని ఆహ్లాద ఘటనలను, జీవితాన్ని అతలాకుతలం చేసే అనూహ్య సంఘటనలను అక్కున చేర్చుకోగలం. ఆ స్థితికి చేరుకున్నప్పుడే జీవితాన్ని జీవించగలం మనోస్థైర్యంతో. అంతటి కుదురైన మనస్సు మన జీవిత కుదుళ్లను పెకలించలేదు. అన్ని వేళలా మనస్సును స్థిరంగా ఉంచుకోవటమే స్టితప్రజ్ఞతంటే. ఆ తాతగారికి ఉన్న గొప్ప లక్షణం అదే. కొంతమందికది సహజాభరణం. కొందరు ప్రయత్నించి సాధిస్తారు. ఇంకొందరికి జీవితం నేర్పుతుంది. కొందరికి జీవితంలో ఒంటపట్టదు. మనిషి వివేచనను, విచక్షణలను సంయోగం చేయగలిగితే చాలు. అది చిక్కుతుంది. ఒక మనిషి జీవితంలో పైకి రావటమనేది అతని తెలివితేటల మీద ఆధారపడి ఉంటుంది. ఒక మార్గాన్ని ఎంపిక చేసుకుని దానిలో పయనించి తను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలడు. అది ఒక ఉద్యోగం కావచ్చు లేదా వ్యాపారం కావచ్చు. జీవితంలో చక్కగా స్థిరపడి, ఆర్థికం గా పరిపుష్టుడై సమాజంలో గౌరవం, గుర్తింపు తెచ్చుకుంటాడు. అయినా ఇతనికి తృప్తి లేనట్లయితే ఆశాంతికి లోనవుతుంటాడు. దీనికి భిన్నంగా అంతే తెలివితేటలున్న మరొక వ్యక్తి మంచి ఆవకాశాలు రాక సాధారణ జీవితం గడుపుతూ ఉండచ్చు. సమాజం అతన్ని అసమర్థుడుగా భావించవచ్చు. కాని, ఈ వ్యక్తి తనలోని అద్భుత గుణమైన తృప్తితో తనకున్న దానితో, తను గడుపుతున్న జీవితంతో ఆనందంగా ఉండచ్చు. ఈ ఆనందమే మనిషిని జీవితాన్ని ప్రేమించేటట్లు చేసి నిజంగా జీవించేటట్టు చేస్తుంది. మొదటి వ్యక్తి అంత సాధించినా తృప్తి అనే గుణం లేనందువల్ల ఆశాంతికి గురవుతాడు. మనసు కు ఓ స్థిరత్వం ఉన్నప్పుడే తృప్తి అనే గుణం మనిషి వ్యక్తిత్వంలో ఒదిగిపోతుంది. అది ఉన్నవారే జీవితాన్ని ఆనందంగా గడపగలరు. చాలామంది తమ జీవితాన్ని ఇతరుల జీవితం తో పోల్చుకుంటారు. ఒకింత స్ఫూర్తికి, అలా తామూ ఎదగాలనే భావన లేదా/ ఆలోచనకు, అది అవసరం. అదీ ఒక స్థాయి వరకు మాత్రమే అభిలషణీయం/ హర్షదాయకం. కానీ అనుచితమైన పోలిక మన ప్రశాంత చిత్తమనే నదిలో పడ్డ రాయి లాంటిది. జీవితాన్ని ఆనందంగా గడపాలంటే చిన్న, చిన్న విషయాలను ఆస్వాదించటం అలవరచుకోవాలి. నారింజ రంగులో ఉండే సూర్యోదయం, అరుణ వర్ణపు సూర్యాస్తమయం, సప్తవర్ణ శోభిత హరివిల్లు, మంచు బిందువులు ముద్దిస్తున్న పుష్పాలు, ఎంత పని ఒత్తిడిలో ఉన్నా కుటుంబంతో కొంత సమయాన్ని గడపటం, ఒక పుస్తకం చదవటం, మొక్కలకు నీళ్లు పోయటం ఒకరి దప్పికను తీర్చటం, ఒకరి ఆకలిని తీర్చటం... వీటిలో ఏదైనా కావచ్చు. మరేవైనా వారి వారి అభిరుచిని బట్టి అలవాటు చేసుకోవచ్చు. ఇదీ మన జీవితాన్ని ఆనందభరితం చేస్తుంది. ఇవే మనల్ని నిజంగా జీవింప చేస్తాయి. బాహ్య చక్షువులతోపాటు ఆనందం, ఆస్వాదన అనే మనో నేత్రాలు కావాలి. మనమే వాటిని పొందాలి/ సంపాదించుకో వాలి. అప్పుడు జీవితాన్ని ఎంత మనోజ్ఞంగా ఉంటుందో అనుభవంలోకి వస్తుంది. ఎంతోమంది రుషులు, వేదాంతులు, తత్త్వ వేత్తలు, మహానుభావులు జీవితాన్ని నిర్వచించారు. దాని లోతుపాతులు శోధన చేసి, సాధన చేసి తమ జీవితానుభావాన్ని జోడించి జీవితమంటే ఇది అని చెప్పారు. వాస్తవానికి అది వారి భావన, వారి దార్శనికత. వారి శక్తి, ప్రతిభా వ్యుత్పత్తుల మనోదారుఢ్యం మీద జీవితం/ జీవితపు కొలతలు ఆధారపడి ఉంటాయి. సామాన్యులు వాటిని అర్థం చేసుకోవటానికి వారి జిజ్ఞాసకు కృషి, సాధనల తోడు తప్పనిసరిగా కావాలి. వీరే కాక ప్రతి ఒక్కరు జీవితం అంటే ఇది, ఇదే అంటూ ఎన్నో మాటలు చెపుతుంటారు. ఇక్కడే మనం అప్రమత్తం కావాల్సింది ఉంటుంది. మన ఇంగిత జ్ఞానమూ ఉపయోగించాలి. ఈ ప్రతి నిర్వచనం వారి వారి జీవిత నేపథ్యం నుండి వచ్చింది. ఆ నిర్వచనాన్ని మన జీవితాలకు అన్వయించుకునే ముందు మనకా నేప«థ్యం ఉందా లేదా అని తెలుసుకోవాలి. ఒకవేళ ఉన్నా, ఆ పరిస్థితులలో ఆ వ్యక్తులు చూపిన గుండె నిబ్బరం, తెగువ, శక్తులు మనకున్నాయో లేదో అంచనా వేసుకోవాలి. అపుడే వాటిని స్వీకరించాలి. అయితే, అన్ని జీవిత నిర్వచనాలలో ఉండే సామ్యత చూడగలగాలి. మన జ్ఞానవివేకాలను సంయోగం చేసి ఎంతవరకు మన జీవితాలకు ఉపయోగించుకోవచ్చో నిర్ణయించుకోవాలి. ఇది చాలా ముఖ్యం. ఈ పరిశీలనకు మన చదువుల సారాన్ని కలపాలి. జీవితాన్ని ప్రేమించాలి. మనకు లభించిన జీవితాన్ని చక్కగా, హాయిగా జీవించాలి. ఈర్ష్య, అసూయలకు, అహంకారానికి, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ లనే భావనకు, అసంతృప్తికి, అనవసరపు ప్రాధాన్యతలకు, ఆడంబరాలకు దూరంగా ఉండగలగాలి. ఆ స్థితికి మనం చేరుకున్న క్షణం మనస్సు ఎంతో నిర్మలమవుతుంది. అదే మనలను స్థిరచిత్తులను చేస్తుంది. ఆ దశలో కష్టసుఖాలను సమానంగా తీసుకునే మానసిక శక్తి సహజంగా ఒనగురుతుంది. ఈ పరిపక్వత కోసమే మనం తపించి, సాధించ గలగాలి. అపుడే జీవిత వజ్రాయుధ ఘాతాలను తట్టుకుని నిబ్బరించుకోగలం. జీవితం ఉల్లాసం గా జీవించగలం. జీవితాన్ని జీవించటమంటే అదే. ఆ తాతగారు తన మనవడికి చెప్పిన మాటలు అందరకు శిరోధార్యమే. – బొడ్డపాటి చంద్రశేఖర్. అంగ్లోపన్యాసకులు -
గోడలు మొలిచి.. గొడవలు పెరిగి!
విలువలు బోధించని నేటి విద్యా విధానం, నిఘా–నియంత్రణ లోపించిన టీవీ కార్యక్రమాలు, సామాజిక మాధ్యమ వేదికల్ని చేరువ చేసిన మొబైల్, ప్రపంచీకరణలో పెరుగుతున్న ఆర్థిక అంతరాలు... ఇవన్నీ కూడా మానవ సంబంధాల్ని చెదరగొడుతున్నాయి. విలువల్ని హరించి, జుగుప్సాకరమైన అట్టడుగుస్థాయికి చేరుస్తున్నాయి. వేధింపులు, బ్లాక్మెయిల్ బెదిరింపులు, డబ్బు గుంజడం, హింస, హత్యలు వంటి నేరాలకు ఇది దారితీస్తోంది. ఇంతటి వేదన, అశాంతి, హింసకు కారణమౌతున్న మూలాలను ఎవరూ పట్టించుకోవడం లేదు. వీటిని ఒట్టి నేరాలుగానే చూడకుండా, నేపథ్యంలో ఉన్న సామాజికార్థికాంశాల్నీ పరిశీలించాలి. మూల కారణాల్ని వెతికి, తగిన సామాజిక, చట్టపరమైన చికిత్స చేయాల్సిన అవసరముంది. ఈ ఉపేక్ష సమాజానికి ఎన్నో రెట్ల నష్టం చేస్తోంది. ఈ సమస్యను ఇకనైనా పట్టించుకోవాలి. సాంకేతిక పరిజ్ఙానం ఆకాశపు అంచులు తాకుతుంటే మానవతా విలువలు పాతా ళాన్ని అంటుతున్నాయి. మానవ సంబంధాలు రోజు రోజుకు పలుచ బారి భవిష్యత్తు భయంకరంగా కనిపిస్తోంది. కనుచూపు మేర పరి ష్కారం కనిపించనంత అయోమయం నెలకొంది. స్థలం కోసం తలి దండ్రుల్ని తగులబెట్టి చంపే కొడుకు–మనవలు, ప్రియుడి చేతిలో కీలుబొమ్మై కన్న తల్లిని కడతేర్చే కూతుళ్లు, నిద్రపోయే తండ్రికి ఆస్తి యావతో నిప్పంటించే తనయులు, బడిపిల్లల్ని గర్భవతులు చేసే నవ కీచకులు... ఇవన్నీ అక్కడక్కడ జరిగే ఒకటీ, అరా అరుదైన ఘటన లుగా చూడటంలోనే లోపముంది. ఈ దారుణాల్ని కేవలం నేర ఘట నలుగా పోలీసు కేసు–దర్యాప్తులు, కోర్టు విచారణ–తీర్పులు, జరి మానా–శిక్షలు... ఈ దృష్టికోణంలో పరిశీలించడమే మన సమాజం పాలిట శాపమౌతోంది. ఇంతటి వేదన, అశాంతి, హింసకు కారణమౌ తున్న మూలాలను ఎవరూ పట్టించుకోవడం లేదు. సమాజాన్ని ఈ దుస్థితిలోకి నెడుతున్న ప్రభావకాల గురించి ఆలోచించడమే లేదు. లోతైన పరిశీలన, ఓ చర్చ, దిద్దుబాటు చర్యలు... ఏమీ లేవు. ఇవి కేవలం నేర ఘటనలు కావు, వాటి వెనుక బలమైన సామాజిక, ఆర్థిక కారణాలున్నాయన్న స్పృహే లేకుండా పోతోంది. ప్రాధాన్యతలు మారిన ప్రభుత్వాలకివి ఆనవు. పాలకులకివి జలజల ఓట్లు రాల్చే అంశాలే కావు కనుక పట్టదు. పేరుకుపోయిన కేసుల ఒత్తిళ్లలో నలిగే కోర్టులు సకాలంలో సరైన న్యాయం చేసే ఆస్కారం లేదు. సామాజిక వేత్తలు, విద్యావంతులు, మేధావి వర్గం తీవ్రంగా ఆలోచించాల్సిన పరిణామాలివి. సామాజిక సమిష్ఠి బాధ్యత కరువౌతోంది. డబ్బు డబ్బును పెంచినట్టే నేరం నేర ప్రవృత్తిని, సంస్కృతిని పెంచుతోంది. మన నేర–న్యాయ వ్యవస్థ లొసుగులు మనుషుల్లో విచ్చలవిడితనాన్ని ప్రేరేపిస్తున్నాయి. కుదేలయిన కుటుంబం బలమైన కుటుంబం ఓ మంచి సమాజానికి మూల స్తంభం. రక రకాల కారణాలు ఈ రోజున కుటుంబాన్ని చిద్రం చేశాయి. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కనుమరుగవుతోంది. ఇంటి సభ్యుల కష్టనష్టాలకు అనునయింపు, తప్పిదాలకు దిద్దుబాటో, సర్దుబాటో చేసే కుషన్ సమిష్ఠి కుటుంబ వ్యవస్థలో దొరికేది. విలువలు, మానవ సత్సంబం ధాలు కూడా వారసత్వంగా లభించేవి. కానీ, సామాజిక–ఆర్థిక కార ణాల వల్ల ఉమ్మడి కుటుంబాలు క్రమంగా తగ్గుతున్నాయి. చిన్న కుటుంబాలు, భార్య–భర్త, చిన్న పిల్లలు మాత్రమే ఉండే క్యూబికల్ ప్యామిలీ నమూనా బలపడుతోంది. ఇది ఇంట్లో ఉండే వృద్ధుల పాలిట శాపమౌతోంది. స్థాయి, స్థోమత ఉన్న వారు కూడా తలి దండ్రుల్ని నిర్దయగా వృద్ధాశ్రమాల పాల్జేస్తున్నారు. అవి సౌకర్యంగా ఉండి, వృద్ధులు సమ్మతితో వెళితే వేరు! కానీ, బలవంతంగా పంపే సందర్భాలు, ఆశ్రమాల్లో వసతులు లేక వారు అల్లాడే దయనీయ పరిస్థితులే ఎక్కువ. వేర్వేరు సమాజాల మధ్య, సమూహాల మధ్య, కుటుంబాల మధ్య, చివరకు వ్యక్తుల మధ్య సంబంధాలు సన్న గిల్లాయి. ఇందుకు సామాజిక, ఆర్థికాంశాలే ప్రధాన కారణం. ముఖ్యంగా పట్టణ, నగర ప్రాంతాల్లో ఈ ‘ఇరుగుపొరుగు పట్టని తనం’(సోషల్ అన్కన్సెర్న్నెస్) బాగా పెరిగిపోయింది. ఆ ఇంట్లో ఏం జరుగుతోందో ఈ ఇంటి వారికి పట్టదు. పొరుగువారి ఆర్థిక స్థితి, సాధకబాధకాల సంగతలా ఉంచి ఆయా ఇళ్లకు ఎవరు వచ్చి వెళు తున్నారు? ఇంట్లో వాళ్లెలా ఉంటున్నారు అన్నది కూడా తెలియని పరిస్థితి. తలుపేసి ఉంచిన ఇంట్లోని వారు ఏ కారణంగానో చనిపోతే, శవం కుళ్లి వాసనపట్టే వరకు అటువైపు తొంగి చూసే వారుండరు. పలు రెట్లుగా భూముల విలువ పెరిగిపోవడం కుటుంబాల్లో నిప్పులు పోసి, మానవ సంబంధాల్ని మంట కలుపుతోంది. గుంటూరు జిల్లాలో తల్లిని తనయ చంపిన తాజా ఘటన ఇందుకు నిలువెత్తు సాక్ష్యం. భర్తను, కొడుకును పోగొట్టుకున్న ఓ తల్లికి కన్నకూతురే హంతకురాలవడం క్షీణించిన మానవ సంబంధాలకు పరాకాష్ట! భూమి విలువల పెరుగుదల రాజధాని అమరావతి పరిసరాల్లోని ఎన్నో కుటుంబాల్లో అశాంతి రగిలిస్తోంది. తలిదండ్రులు–పిల్లల మధ్య, అన్నదమ్ములు–అక్కచెల్లెల్ల మధ్య గోడలు మొలుస్తున్నాయి, గొడవలు పెరుగుతున్నాయి. సంపద ఘర్షణ, ఆస్తి తగాదాలు, భూవ్యాజ్యాలతో లిటిగేషన్ పెరిగింది. సివిల్ తగాదాలు క్రిమినల్ ఘటనలవుతున్నాయి, వచ్చి పోలీసుస్టేషన్లలో కేసులై వాలుతు న్నాయి. ఈ జాప్యం కూడా సహించనప్పుడు భౌతిక దాడులు, దారుణ హత్యలకు తలపడుతున్నారు. ఆజ్యం పోస్తున్న అసమానతలు ఆర్థిక అసమానతలు అధికంగా ఉన్న సమాజాల్లో మానవ సంబం ధాల పరమైన నేరాలు పెరిగాయి. ఎక్కడికక్కడ హింస, అశాంతి ప్రబలుతోంది. మధ్య, దిగువ మధ్యతరగతి ఉన్నపళంగా దనవంతు లైన చోట వ్యత్యాసాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. సంపన్నులు, వారి సౌఖ్యాలను పోల్చుకొని నయా సంపన్నులూ పరుగెడుతున్నారు. నిర్హేతుకంగా పెరిగిన వస్తువ్యామోహం స్థాయిని మించిన ఆశలు రేపి, తప్పుటడుగులు వేయిస్తోంది. సంపన్న–పేద కుటుంబ వ్యక్తుల మధ్య పోలికలు అశాంతినే కాక నేర ప్రవృత్తినీ ప్రేరేపిస్తు న్నాయి. కక్ష–కార్పణ్యాలకు, పశుప్రవృత్తికి కారణమవుతున్నాయి. హయత్‌నగర్‌లో ఓ మహిళ వివాహేతర సంబంధం నెరపుతున్న వ్యక్తి పనుపున కన్నతల్లినే హతమార్చిన దుర్ఘటన దీనికి నిదర్శనం. ఈ కేసులో నిందితుడు ఏ సంపాదనా లేని జులాయిగా ఉండీ... ఓ కారు, ప్రియురాలు, సౌఖ్యాలు అనుభవిస్తున్నాడు. ఇంకేదో ఆశిస్తున్నాడు. సఖ్యతతో ఉన్న యువతితో పెళ్లిపైనే కాక, తల్లి ఆస్తిపై కన్నేశాడు. భర్తెలాగూ తాగుబోతు, ఇక ఆమె అడ్డుతొలిగితే ఆస్తినెలాగయినా దక్కించుకోవచ్చన్న కుట్రకోణం దర్యాప్తులో వెల్లడవుతోంది. నమ్ము కున్న యువతిపై బ్లాక్‌మెయిల్‌కూ తలపడ్డాడు. అతని చేతిలో కీలు బొమ్మయిన ఆమె తన తల్లి హత్యకూ వెనుకాడలేదు. ఇంకో ఘట నలో, భార్యాభర్తా కూడబలుక్కొని, ఓ సంపన్నుడిని లైంగికంగా ముగ్గులోకి దించారు. రహస్యంగా తీసిన వీడియోతో బ్లాక్మెయిల్ చేసి డబ్బు గుంజడం వంటివి దేనికి సంకేతం? ప్రభావకాలపై కన్నేయాలి విలువలు బోధించని నేటి విద్యా విధానం, నిఘా–నియంత్రణ లోపించిన టీవీ కార్యక్రమాలు, సామాజిక మాధ్యమ వేదికల్ని చేరువ చేసిన మొబైల్, ప్రపంచీకరణలో పెరుగుతున్న ఆర్థిక అంతరాలు... ఇవన్నీ కూడా మానవ సంబంధాల్ని చెదరగొడుతున్నాయి. విలువల్ని హరించి, జుగుప్సాకరమైన అట్టడుగుస్థాయికి చేరుస్తున్నాయి. వేధిం పులు, బ్లాక్మెయిల్ బెదిరింపులు, డబ్బు గుంజడం, హింస, హత్యలు వంటి నేరాలకు ఇది దారితీస్తోంది. వీటిని ఒట్టి నేరాలుగానే చూడకుండా, నేపథ్యంలో ఉన్న సామాజికార్థికాంశాల్నీ పరిశీలించాలి. మూల కారణాల్ని వెతికి, తగిన సామాజిక, చట్టపరమైన చికిత్స చేయాల్సిన అవసరముంది. నక్సలైట్ల హింసను శాంతిభద్రతల అంశంగా కాక సామాజికార్థికాంశంగా చూడాలని చెప్పే మేధావి వర్గం ఇక్కడెందుకో దృష్టి సారించడం లేదు. ఈ ఉపేక్ష సమాజానికి ఎన్నో రెట్ల నష్టం చేస్తోంది. విద్య ఫక్తు వ్యాపారమైన తర్వాత విలువల్ని బోధించడం కనుమరుగైంది. పాఠాలు బట్టీ పెట్టించి, ఫలితాలు సాధించి, ఉద్యోగాలు పట్టిచ్చే పరుగు పందెమయింది విద్య. టీవీ వినోద కార్యక్రమాల ముసుగులో వస్తున్న సీరియళ్లు మానవ సంబంధాలపై గొడ్డలి వేటు. ఆస్తి తగాదాలు, ఆధిపత్య పోరాటాలు, వివాహేతర సంబంధాలు, కక్ష–కార్పణ్యాలు, పగతీర్చు కునే హింస–దౌర్జన్యాలు, దారుణ హత్యలు... ఇవి లేకుండా వస్తున్న సీరియల్స్ ఎన్ని? మహిళను కేంద్ర బిందువు చేసి ఈ కాల్పనిక దౌష్ట్యాల్ని రుద్దితే, మహిళల్ని ఎక్కువగా ఆకట్టుకొని టీఆర్పీలు సాధించొచ్చనే కక్కుర్తి వారికి కలిసివస్తోంది. ఎక్కువ మహిళలు ఇవే చూస్తున్నారు. ఆ క్రమంలో ఇది ఎదిగే పిల్లలపై దుష్ప్రభావం చూపు తోంది. వారూ అనుకరిస్తున్నారు, వాటినే అనుసరిస్తున్నారు. మానవ సంబంధాలపై ప్రతికూల ప్రభావం పడుతోంది. ఇలా ఉండకూడదనే చర్చ గానీ, మార్గదర్శకాలు గానీ, చట్టపరమైన ప్రతిబంధకాలు గానీ లేవు. ఏ నియంత్రణా లేదు. ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ వంటి సామా జిక మాధ్యమ వేదికల్ని యువతకు చేరువ చేసిన మొబైల్ ఈ విష యంలో మేలు కన్నా కీడే ఎక్కువ చేస్తోంది. వీటన్నింటిపై లోతైన అధ్యయనం చేసి తగు పరిష్కారం కనుక్కోకుంటే నష్టం మరింత వేగంగా, తీవ్రంగా జరిగే ప్రమాదం పొంచి ఉంది. తస్మాత్ జాగ్రత్త! దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
‘నాన్నా.. నువ్విలానా..’
నాన్న మంచివాడు కాదు! మనసు ఎన్ని నరాలను తెంపుకుంటే అనుకోగలిగిన మాట. కొడుకు వేరు. కూతుళ్లు నాన్న గురించి ఒక్క చెడ్డమాటైనా వినేందుకు పుట్టనట్లుగా పెరుగుతారు. నాన్న తప్పా అది, మనుషుల్లోంచి దూరంగా లాగి, నాన్నను ఊహల్లో పెంచుకున్న కూతుళ్ల తప్పా? నాన్న మంచివాడు కాకపోతే కలిగే బాధ కన్నా, నాన్న మంచివాడు కాదు అనుకోవలసి వచ్చిన బాధ ఇంకా ఎక్కువ. అమ్మెప్పుడూ నాన్న మీద పిల్లలకు కంప్లయింట్ చెయ్యదు. ‘పిల్లలు చూస్తున్నారు’ అని జాగ్రత్త పడుతుంది. అమ్మపై చెయ్యేత్తేటప్పుడు పిల్లలున్నారేమోనని నాన్నెప్పుడూ చూసుకోడు. అప్పుడూ అమ్మే జాగ్రత్త పడుతుంది. అప్పుడైనా తప్పించుకుని పిల్లల్లోకి వచ్చేయడం కాదు అమ్మపడే జాగ్రత్త. పిల్లలకు నాన్న కనిపించకుండా తలుపులు దగ్గరగా వేస్తుంది. పిల్లల ముందు నాన్న పలుచన కాకూడదని ఆత్మాభిమానాన్ని గొంతులోనే దిగమింగేస్తుంది. అమ్మ జాగ్రత్తలు తీసుకున్నంత వరకే నాన్న మంచితనం. జీవితాంతం అమ్మ జాగ్రత్తలూ తీసుకుంటూ ఉంటే జీవితాంతం నాన్న మంచివాడే. ఎంత జాగ్రత్తగా ఉండే అమ్మయినా, అమ్మ జాగ్రత్తగా లేకపోయిన రోజొకటొస్తే పిల్లల మనసుల్లోని మంచినాన్న తప్పించుకోలేడు. ‘నాన్నా.. నువ్విలానా..’ అనే నమ్మలేనితనం నుంచి పిల్లలూ తప్పించుకోలేరు. మానసకు పదిహేడేళ్లు. పీయూసీ చదువుతోంది. భూమిక పదిహేనేళ్లమ్మాయి. టెన్త్ స్టూడెంట్. అమ్మ రాజేశ్వరి (43). నాన్న సిద్దయ్య. వీళ్ల కుటుంబం ఉండడం బెంగళూరు దగ్గరి శ్రీనగరలో. పందొమ్మిదేళ్ల క్రితం సిద్ధయ్యను పెళ్లి చేసుకున్నాక చామరాజనగర్ నుంచి భర్తతో పాటు శ్రీనగర వచ్చేసింది రాజేశ్వరి. సిద్ధయ్య ప్రభుత్వోద్యోగి. లైన్‌మ్యాన్. రెండు రోజుల క్యాంప్‌కని చెప్పి శుక్రవారం తమిళనాడు వెళ్లాడు. వెళ్లే ముందు రాజేశ్వరికి, సిద్ధయ్యకు గొడవైంది. నాన్న ఎంత ఆలస్యంగా ఇంటికొచ్చినా గొడవ పడని అమ్మ, నాన్న తాగొచ్చినా గొడవపడని అమ్మ, నాన్న చేయి చేసుకున్నా గొడవపడని అమ్మ.. ఎందుకోసం నాన్నతో గొడవపడుతోందో కొంతకాలంగా మానస, భూమికల గ్రహింపుకు వస్తూనే ఉంది. అమ్మ అడుగుతున్న ప్రశ్నలో తప్పులేదు. అమ్మ అడుగుతున్న ప్రశ్నకు నాన్న దగ్గర సమాధానం లేదు. అమ్మ కన్నీళ్లనైతే వాళ్లు చూడగలుగుతున్నారు గానీ అమ్మ కన్నీళ్లు కడిగేస్తున్న నాన్ననే చూడలేకపోతున్నారు! చివరిసారిగా శుక్రవారం నాడు అమ్మానాన్న మధ్య పెద్ద గొడవ జరిగింది. నిజంగా చివరిసారి. రాజేశ్వరి తమ్ముడు పుట్టస్వామి అక్కడికి దగ్గర్లోనే గాంధీ బజార్ ప్రాంతంలో ఉంటాడు. అక్కంటే అతడికి ప్రాణం. అక్కపిల్లలంటే ముద్దు. బావంటే గౌరవం. అక్కాబావ గొడవపడినప్పుడు అక్కనే సర్దుకుపొమ్మని చెప్పేంత గౌరవం అతడికి బావగారి మీద! బావ క్యాంప్‌కి వెళ్లినట్లు అతడికి తెలీదు. సోమవారం వాట్సాప్‌లో మానస స్టాటస్ చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. ఒక్క ఉదుటున లేచి అక్క ఇంటికి వెళ్లాడు. ఇంటి తలుపులకు లోపల్నుంచి తాళం వేసి ఉంది. తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లాడు. ముగ్గురూ గదిలోని ఫ్యాన్‌కు వేలాడుతున్నారు! కుప్పకూలిపోయాడు పుట్టస్వామి. అక్కడేం సూయిసైడ్ నోట్ కనిపించలేదు. కానీ మానస స్టాటస్‌లో రాసుకున్న రెండే రెండు మాటల్లో అంతకంటే పెద్ద మరణ వాజ్ఞ్మూలమే ఉంది. వాజ్ఞ్మూలం కాదు. మరణధ్వని. అది గుర్తుకొస్తోంది పుట్టస్వామికి. ‘‘ప్రతి ఒక్కరికీ మంచి నాన్న ఉండాలి. ఆ వరాన్ని దేవుడు మాకు ఇవ్వలేదు’’.. మానస స్టేటస్‌లోని మాటలివి. స్టేటస్‌లో ఏదైనా ఇరవై నాలుగు గంటలే ఉంటుంది. మానస రాసుకున్న ఆ మాటలు ఏ తరానికీ చెరిగిపోనివి. సిద్ధయ్య క్యాంప్ నుంచి మధ్యలోనే వచ్చి ఉంటాడు. తను కోల్పోయింది ఏమిటో తెలుసుకుని విలపించే ఉంటాడు. భార్య ఏళ్లుగా ప్రాధేయపడుతూ వచ్చింది. ఏళ్లుగా గొడవపడుతూ వచ్చింది. అయినా అతడు మారలేదు. ఆమె, ఇద్దరు కూతుళ్లు ఆత్మహత్య చేసుకునేంత వరకు వెళ్లింది అతడి పరస్త్రీ వ్యామోహం. -
కొడుకు కాదు.. కర్కోటకుడు
తిరుపతి క్రైమ్: మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి. ఆస్తి రాయలేదనే కోపంతో కని పెంచి, పోషించిన తండ్రిపైనే దాడికి తెగబడ్డాడు ఓ ప్రబుద్ధుడు. భార్య, బావమరిది సాయంతో తండ్రి కళ్లల్లో కారం చిమ్మి చచ్చేలా కొట్టాడు. ఈ దారుణ సంఘటన తిరుపతిలో మంగళవారం చోటుచేసుకుంది. వెస్ట్ ఎస్ఐ ప్రవీణ్‌కుమార్ తెలిపిన వివరాల మేరకు.. తిరుపతి అనంతవీధిలో మునికృష్ణయ్య (80) భార్య కృష్ణవేణమ్మతో ఉంటున్నాడు. వీరికి విజయభాస్కర్, తులసీరామ్ అనే కుమారులు ఉన్నారు. కాగా, మునికృష్ణయ్య కొన్నేళ్ల క్రితం అప్పులు చేసి సొంత ఇంటిని కట్టుకున్నాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు తులసీరామ్‌ను అన్న విజయభాస్కర్, వదిన నీరజ ఇంట్లో నుంచి తరిమేశారు. అయితే.. ఇంటి కోసం చేసిన అప్పులు తీర్చలేకపోవడంతో పెద్ద కుమారుడు విజయ్‌భాస్కర్ కూడా తండ్రిని వదిలిపెట్టి వెళ్లిపోయాడు. తర్వాత చిన్న కుమారుడు తులసీరామ్ తల్లిదండ్రుల వద్దకు చేరుకుని, వారిని పోషించడంతోపాటు ఇంటి నిర్మాణం కోసం చేసిన అప్పులు తీరుస్తూ వచ్చాడు. అప్పులు తీరిపోతున్నాయని తెలుసుకున్న విజయ్‌భాస్కర్ భార్యతో కలిసి మళ్లీ తల్లిదండ్రుల వద్దకు చేరుకున్నాడు. అప్పటి నుంచి విజయ్‌భాస్కర్ తన తల్లి కృష్ణవేణమ్మ పేరుపై ఉన్న ఇంటిని తనకు రాసి ఇవ్వాలని రోజూ గొడవ పడేవాడు. ఇంటికి చేసిన అప్పుల్లో కొంత తీర్చాలని విజయ్‌భాస్కర్‌ను తండ్రి మునికృష్ణయ్య కోరాడు. దీంతో గొడవలు మరింత ఎక్కువయ్యాయి. దీనికి తోడు విజయ్‌భాస్కర్ బావమరిది వంశీకృష్ణ తన బావకు సహకరిస్తూ గొడవలు పెద్దవి చేసేవాడు. ఈ క్రమంలో మంగళవారం మునికృష్ణయ్యతో పెద్ద కుమారుడు, కోడలు వాగ్వివాదానికి దిగారు. అంతటితో ఆగక విజయ్‌భాస్కర్ చేతికందిన వస్తువులతో తండ్రిపై విచక్షణారహితంగా రక్తం వచ్చేలా దాడి చేశాడు. తానేమీ తక్కువ కాదన్నట్టు కోడలు నీరజ కూడా కారం పొడి తీసుకొచ్చి మామ కళ్లల్లో చల్లింది. సమీపంలోని ఇరుగుపొరుగు వారు ఈ దారుణాన్ని ఫొటోలు తీసి సామాజిక మాధ్యమాల్లో ఉంచడంతో నగరంలో కలకలం రేగింది. పెద్ద కుమారుడి దాడిలో తీవ్రంగా గాయపడి రక్తమోడుతున్న మునికృష్ణయ్యను స్థానికులు వైద్య చికిత్స నిమిత్తం రుయా ఆస్పత్రి అత్యవసర విభాగానికి తరలించారు. అనంతరం స్థానికులు వెస్ట్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి విజయ్‌భాస్కర్ దాష్టీకాన్ని పోలీసులకు వివరించి మునికృష్ణయ్యకు న్యాయం చేయాలని కోరారు. పోలీసులు బాధితుడి నుంచి ఫిర్యాదును స్వీకరించి విజయభాస్కర్, అతడి భార్య నీరజ, ఆమె తమ్ముడు వంశీకృష్ణపై కేసు నమోదు చేశారు. -
టీవీ సీరియల్స్ మీద కూడా సెన్సార్ బోర్డు నిఘా ఉండాలి
తూర్పు గోదావరి : 'మద్యం తాగించి.. పాఠశాలలోనే పూడ్చివేత' ఈ సంఘటనను చూస్తుంటే ఇటీవల వచ్చిన ‘దృశ్యం’ సినిమా గుర్తురాక మానదు. అయితే ఇందులో ప్రియురాలి భర్తను హత్య చేసి అతనిని కొత్తగా నిర్మించిన పాఠశాలలో పూడ్చిపెట్టారు. వివరాల్లోకి వెళితే.. కిర్లంపూడి మండలం ముక్కొల్లు గ్రామానికి చెందిన మచ్చా సత్తిబాబు, జ్యోతి దంపతులు. జ్యోతికి చంద్రమాంపల్లికి చెందిన చెక్కిడాల రాజాతో అక్రమ సంబంధం ఉంది. ఆ నేపథ్యంలో జూన్ 19న సత్తిబాబు అదృశ్యమయ్యాడు. అతని ఆచూకీ లభించకపోవడంతో అదృశ్యమైనట్టు జూన్ 26న బంధువులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల దర్యాప్తులో రాజా సత్తిబాబును చంద్రమాంపల్లి ఆహ్వానించాడు. అక్కడ మరో ఇద్దరితో కలసి గ్రామంలో నూతనంగా నిర్మించిన స్కూల్ కాంప్లెక్స్‌లో మద్యం సేవించారు. మద్యం మత్తులో ఉన్న సత్తిబాబును హత్య చేసి అదే పాఠశాలలో పూడ్చిపెట్టారు. హత్యకు ఉపయోగించిన రాడ్‌ను దివిలి గ్రామ శివారులో చెత్త కుప్పలలో పడవేశారు. బైక్‌ను జి. రాగంపేటలోని ఒక యువకుడి ఇంట్లో ఉంచారు. మంచానికి కట్టేసి.. రంగంపేట మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన వాసంశెట్టి వీర వెంకట సత్యనారాయణ కల్లు గీత కార్మికుడు. అతను వ్యవసాయం కూడా చేస్తుంటాడు. జగ్గంపేట మండలం, కాట్రావుల పల్లికి చెందిన భవానితో 9 ఏళ్ల క్రితం అతనికి వివాహం అయింది. వారికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. అతనిపొలంలో కోటపాడు గ్రామానికి చెందిన రాజా శ్రీను రెండేళ్లుగా పని చేస్తున్నాడు. రాజా శ్రీనుతో సత్యనారాయణ భార్య భవానికి వివాహేతర సంబంధం ఏర్పడింది. జూలై 25వ తేదీ రాత్రి 10 గంటలకు సత్యనారాయణ ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లో ఇద్దరూ కనిపించారు. దాంతో వారి మధ్య ఘర్షణ జరిగింది. ప్రియుడితో కలసి భవాని సత్యనారాయణను మంచానికి కట్టి వేసి దాడి చేశారు. సత్యనారాయణ అరుపులు విని పొరుగువారు బాధితుడి తల్లిని తీసుకొనివచ్చే సరికి ఇంటి తలుపులు వేసి ఉన్నాయి. సత్యనారాయణ చంపేస్తున్నారు బాబోయ్ అని అరుస్తుండడంతో గ్రామస్తులు తలుపులు పగుల గొట్టుకొని లోనికి ప్రవేశిస్తుండగా వారిని నెట్టుకుంటూ భవాని, ఆమె ప్రియుడు రాజా శ్రీను పరారయ్యారు. కొన ఊపిరితో ఉన్న సత్యనారాయణను బయటకు తీసుకువచ్చే సరికి మృతి చెందాడు. మద్యం తాగించి చున్నీతో పీక నులిమి.. రాజమహేంద్రవరం రూరల్, హుక్కుంపేట కు చెందిన వడ్డి ఇమ్మానియేలు తాపీపని చేసుకుని జీవిస్తుంటాడు. ఇమ్మానియేలుకు దేవితో వివాహం అయింది. వారికి ఇద్దరు పిల్లలు. ఇమ్మానియేలుకు పిడింగొయ్యి గ్రామానికి చెందిన గండ్రోతు శివ కుమార్‌తో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ స్నేహంగా ఉండేవారు. శివ దేవితో పరిచయం పెంచుకొని వివాహేతర సంబంధం కొనసాగించసాగాడు. వీరి అక్రమ సంబంధం తెలుసుకున్న ఇమ్మానియేలు గొడవ చేశాడు. ఆనేపథ్యంలో జూలై 26వ తేదీన సీతపల్లిలోని గండి బాపనమ్మ గుడికి వెళ్దామని ఇమ్మానియేలును శివ ఒప్పించాడు. ఇద్దరూ 26వ తేదీ మధ్యాహ్నం ద్విచక్ర వాహనంపై వెళ్లారు. ప్రియుడి సూచన మేరకు దేవి బస్సులో బయల్దేరింది. స్నేహితులు ఇద్దరూ గోకవరంలో ఒక మద్యం షాపులో మద్యం కొనుగోలు చేసి సీతపల్లి వచ్చి సమీపంలోని పోలవరం ప్రాంతంలో ఇద్దరూ మద్యం సేవించారు. ఇమ్మానియేలుతో శివ అతిగా మద్యం తాగించాడు. ఇంతలో అక్కడకు దేవి చేరుకుంది. శివ, దేవి కలసి ఇమ్మానియేలు పీకను చున్నీతో బిగించి హత్య చేసి అతనిని పెట్రోల్ పోసి కాల్చారు. సెల్ ఫోన్లో సిమ్ కార్డు తీసి అక్కడే పడవేశారు. మద్యం సీసా, సెల్ ఫోన్ ఆధారంగా నిందితులను పోలీసు అరెస్ట్ చేశారు. ఇమ్మానియేలు, దేవికి పుట్టిన ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు.మమతానురాగాలకు పుట్టిల్లు కుటుంబం. ఆ కుటుంబం.. దాంతోపాటు మానవసంబంధాలు మంటగలుస్తున్నాయి. వివాహేతర సంబంధాల ప్రభావంతో కుటుంబాలు ధ్వంసమవుతున్నాయి. భర్తలను భార్యలు, భార్యలను భర్తలు తమ ప్రియులు లేదా ప్రియురాళ్ల సహాయంతో హతమార్చేస్తున్నారు. కన్నబిడ్డలని కనికరం కూడా చూపకుండా పసివాళ్లను సైతం మట్టుబెట్టేస్తున్నారు. జిల్లాలో జరిగిన ఇలాంటి సంఘటనలు మానవత్వానికి మచ్చగా నిలిచాయి. –రాజమహేంద్రవరం క్రైం టీవీ సీరియల్స్ మీద కూడా సెన్సార్ బోర్డు నిఘా ఉండాలి దేశంలో విదేశీ సంస్కృతి పెరిగిపోయింది. టీవీ సీరియల్స్ , సినిమా ప్రభావం మహిళలపై పడుతోంది. దీంతో అక్రమ సంబంధాలు పెరిగిపోతున్నాయి. పూర్వం ఉమ్మడి కుటుంబ వ్యవస్ధ ఉండేటప్పుడు తప్పు చేస్తే పెద్దవారు దండించే వారు. ఆభయంతోనైనా సక్రమమైన మార్గంలో నడిచే వారు. ప్రస్తుతం తప్పులను సరిదిద్దే వారు లేకపోవడంతో విచ్చలవిడితనం వచ్చేసింది. అక్రమ సంబం«ధాలతోనే సుఖంగా ఉంటుందనే అపోహతో హత్యలు చేస్తూ తమ జీవితాలను చేజేతులారా సర్వనాశనం చేసుకుంటున్నారు. టీవీ సీరియల్స్ మీద కూడా సెన్సార్ బోర్డు నిఘా ఏర్పాటు చేయాలి. టీవీ సీరియల్స్‌లో అక్రమ సంబంధాల పాత్రలు నిరోధించకపోతే సమాజంలో మరిన్ని ప్రమాదకర ధోరణులు పెచ్చరిల్లుతాయి. తల్లిదండ్రులు తమ పిల్లలు వాట్సప్, ఫేస్ బుక్‌లలో ఏవిధమైన మెసెజ్‌లు చూస్తున్నారో గమనించాలి. టెక్నాలజీని దుర్వినియోగం చేస్తే జీవితాలు నాశనం అవుతాయి.–ముప్పాళ్ల సుబ్బారావు, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు నైతిక విలువలు నేర్పించాలి విద్యార్థి దశ నుంచే నైతిక విలువలతో కూడిన విద్యను అందించాలి. ఆధునిక కాలంలో విలువలు పడిపోయాయి. మోడరన్ కల్చర్‌లో విచ్చలవిడితనం పెరిగిపోయింది. పురుషులలో 90 మంది పరాయి స్త్రీతో మానసిక వ్యభిచారం చేయడం, అలాగే స్త్రీలలో 75 మంది పరాయి పురుషుడిని ఊహించుకోవడం జరుగుతుంది. 20 నుంచి 30 శాతం తప్పటడుగు వేస్తున్నారు. కొంత మందిలో వ్యక్తిత్వలోపం, చంచలత్వం ఉంటుంది. ఇలాంటి వారు ఒకరి కంటే ఎక్కువ మందితో సంబంధాలు కొనసాగిస్తారు. తమను అడ్డుంటే వారిని తొలగించుకోవడానికి కూడా వెనుకాడరు. ఇంట్లో మనుషులు చూపించే ప్రేమ కంటే బయటవారు చూపే ప్రేమలో ఎక్కువ విలువ ఉన్నట్టు అనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి పెంచి పోషించిన తల్లిదండ్రులు కంటే పార్కులో పరిచయమైన ప్రేమికుడు చెప్పినదే ఎక్కువగా ఆకర్షణగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య చక్కటి ఆనుబంధం పెరగకపోతే పరాయివారి అకర్షణకు లోనవుతారు. సాధారణంగా 10 ఏళ్ల సంసార జీవితం జరిగిన తరువాత, 40 ఏళ్లు వచ్చాక వంకర చూపులు చూస్తారు. సీరియల్స్‌లో మహిళలను విలన్‌గా చూపించే సంస్కృతి పోవాలి. విదేశాలలో మాదిరిగా కఠినమైన శిక్షలు ఉండాలి. అప్పుడే నేరాల శాతం తగ్గుతుంది.–డాక్టర్ కర్రి రామారెడ్డి, మానసిక వైద్యుడు, రాజమహేంద్రవరం -
మనుషులకు దూరమైతే ఆయుక్షీణం
మానవ సంబంధాలన్నీ ఇప్పుడు ఆన్లైన్ సంబంధాలు మాత్రమే అయ్యాయి. మనిషెవరో తెలియకుండానే, మనిషితో మాటల్లేకుండానే మన పనులన్నీ పూర్తవుతున్నాయి. అయితే ఇంతకు మించిన అనారోగ్యం లేదని పరిశోధకులు అంటున్నారు! ఆన్లైన్ అవడం అనారోగ్యం అని కాదు. మనుషులతో ఆఫ్‌లైన్ అవ్వడం అనారోగ్యం, ఆయుక్షీణం కూడా అని హెచ్చరిస్తున్నారు. కూరలమ్మా కూరలు, పళ్లమ్మా పళ్లు.. వంకాయ బెండకాయ టమాటా కొత్తిమీర కరివేపాకు.. బొత్తాయిలు, సపోటాలు, అరటిపళ్లు, కమలాలు.. ముగ్గమ్మా ముగ్గు, ఉప్పమ్మా ఉప్పు. కిరసనాయిలు, ఆముదం, పేపర్లు, సోడా... ఒకటనేమిటి.. సమస్తం ఇంటి ముందుకు వచ్చేవి ఒకప్పుడు! అప్పట్లో ప్రతి వ్యాపారికీ ఒక్కో ఇల్లు నికరంగా ఉండేది. ఆ ఇంట్లో వారందరితోనూ వ్యాపారులకు పరిచయంతో పాటు అనుబంధం ఉండేది. పెళ్లిళ్లు వస్తుంటే గాజులమ్మే వారు ఇంటిల్లిపాదికీ చేతికి సరిపడేన్ని గాజులు వేసేవారు. పూల వ్యాపారులు ఆయా ఇళ్లకు వచ్చి, ఇంట్లోని వారిని పేరుతో పిలిచేవారు. సత్యవతమ్మగారి ఇంటికి ఆదిలక్ష్మి రోజూ వచ్చేది. ప్రతి సీజన్లో వచ్చే పళ్లు తెచ్చి సత్యవతమ్మగారికి ఇచ్చి, అక్కడే ఉండి ఆ తల్లి పెట్టే అన్నం తిని సాయంత్రం వరకు అక్కడే పడుకుని, ఇంటికి వెళ్లేది. ఆదిలక్ష్మికి ఆ ఇంటితో అనుబంధం అలాంటిది. శ్రీకాకుళం నుంచి వచ్చిన ఆదిలక్ష్మికి సత్యవతమ్మగారితో అనుబంధం పళ్ల వ్యాపారం ద్వారానే. రోజూ పండ్లు ఇచ్చి, ఆప్యాయంగా పలకరించేది. ఆ ఇంట్లో జరిగిన అన్ని శుభకార్యాలకూ ఆదిలక్ష్మి పళ్లు తేవలసిందే. అరువులు.. అవసరాలు లేవు! ‘‘వదినగారూ! ఈ గ్లాసుతో పాలు ఇస్తారా. మళ్లీ రేపు ఇస్తాను. అనుకోకుండా చుట్టాలు వచ్చారు. వాళ్లకి టీ ఇద్దామంటే పాలు లేవు’’. ‘‘అయ్యో పరవాలేదు, తీసుకోండి. ఇరుగుపొరుగు అన్నాక అవసరాలు రాకుండా ఉంటాయా.. వదినగారూ’’. ‘‘రేపు అప్పడాలు ఒత్తాలనుకుంటున్నాము. సాయం చేస్తారా వదినగారూ.. పక్కింటి పిన్నిగారు కూడా వస్తానన్నారు..’’ ‘‘తప్పకుండా వస్తానండీ’’ ఇలా.. ఇరుగుపొరుగుల ఇళ్లలో ఒకరికొకరు సహాయం చేసుకోవడం ఆనవాయితీగా ఉండేది. ఒక ఇంట్లో శుభకార్యం అంటే ఆ వీధివారంతా వచ్చి తలో చెయ్యి వేసేవారు. పిన్నిగారికి అనారోగ్యం చేస్తే ఆవిడకు భరోసాగా ఉండేవారు పక్కింటివారు. ఒకరికొకరు చేదోడువాదోడుగా ఉండేవారు. ఉన్నవన్నీ ఉరుకులు పరుగులే రోజులు మారాయి. మనుషులూ మారారు. వస్తువులన్నీ ఆన్లైన్లో దొరుకుతున్నాయి. ఫోన్ కొడితే చాలు పాలు, పెరుగు, కూరలు అన్నీ ఇంటికి వచ్చేస్తున్నాయి. అపార్ట్మెంట్ కల్చర్‌లో ఇరుగుపొరుగు ఎవరున్నారో కూడా తెలియట్లేదు. పక్కింట్లో దొంగతనం జరిగినా తెలియదు, మరణాలు తెలియదు, శుభకార్యం జరిగినా కూడా లె లియదు. ఎన్ని సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయో, అంత అనారోగ్యాలూ ముంచుకొస్తున్నాయి. మనిషి ఆయుర్దాయం తగ్గిపోతోంది. అయితే నూరేళ్లు ఆరోగ్యంగా జీవించడానికి మనం అనుకునేవేవీ కారణం కావు అంటున్నారు బ్రిగామ్ యంగ్ యూనివర్సిటీకి చెందిన జూలియన్ హోల్ట్ లన్స్టాడ్ అనే పరిశోధకురాలు. వేలాదిమంది మధ్య వయస్కుల మీద నిర్వహించిన పరిశోధనల అనంతరం తన పరిశీలన అంశాలను ఆమె వెల్లడించారు. మాటల్లేవు.. మంచీచెడు లేదు! తీసుకునే ఆహారం, చేసే వ్యాయామం, వైవాహిక స్థితి, ఎంత తరచుగా వైద్యులను సందర్శిస్తున్నారు, ధూమపానం, మద్యపాన అలవాటు ఉందా, వ్యాయామం చేస్తున్నారా. ఊబకాయులా... ఇటువంటి అంశాల మీద పరీక్షలు జరిపారు హోల్ట్. అయితే మానవ జీవిత కాలం తగ్గిపోవడానికి వీటి కంటె పెద్ద కారణం వేరే ఉందని చెబుతున్నారు హోల్ట్. సమాజంతో సంబంధాలు లేకపోవడమే త్వరిత మరణాలకు కారణమని ఆమె కనిపెట్టారు! ఈ సమస్యల నుంచి వారు ఏ విధంగా బయటపడాలో చర్చించి, మరణాల సంఖ్య తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆమె.అనుబంధం, ఆత్మీయతలు బూటకాలు కావని, అవే మనిషిని ఆరోగ్యంగా ఎక్కువకాలం జీవించేలా చేస్తున్నాయని హోల్ట్ చెబుతున్నారు. ఆత్మీయ అనుబంధాలు పెంపొందించుకోవాలి, అత్యవసర సమయంలో ఇరుగుపొరుగులను డబ్బులు అడిగే చనువు ఏర్పడాలి, అకస్మాత్తుగా అనారోగ్యం వస్తే డాక్టరుని పిలిచే ఆప్తులను, ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రికి తీసుకువెళ్లగలిగేవారిని సంపాదించుకోవాలి. ఆపద్ధర్మంలో అక్కున చేర్చుకుని మాట్లాడే వ్యక్తులను దరిచేర్చుకోవాలి, మానసికంగా బలహీనంగా ఉన్న సమయంలో ఆదుకునే వారిని సమకూర్చుకోవాలి... ఇటువంటి అనుబంధాలు పెంచుకున్నవారు ఆరోగ్యంగా ఎక్కువ కాలం జీవిస్తున్నారని ఆమె పరిశోధనలో తేలిందని చెబుతున్నారు హోల్ట్. – రోహిణి సాధకబాధకాలు తెలుసుకోవాలి ఇరుగుపొరుగులతో మొదటి నుంచీ మనం పెంచుకునే అనుబంధం వల్లనే ఇవన్నీ సాధ్యపడతాయి. రోజుకి ఎంతమందితో మనసు విప్పి మాట్లాడగలుగుతున్నామో పరిశీలించుకోవాలి. కనీసం రోజూ మనకు ఎవరు కాఫీ తయారుచేసి ఇస్తున్నారు, మనకు ఉత్తరాలు తెచ్చే పోస్టుమన్ సాధకబాధకాలేంటి, మన ఇంటిముందు నుంచి వెళ్తున్న మహిళ ను మంచిచెడుల గురించి పలకరిస్తున్నామా, ప్రతిరోజూ మీ కుక్కపిల్లను దగ్గరకు తీసుకుంటున్నారా, ఆటలేమైనా ఆడుతున్నారా, తోట పని చేస్తున్నారా... ఒకసారి పరిశీలించుకోవాలి. మీరు ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించడానికి ఇవే ప్రధానం అంటున్నారు హోల్ట్. -
సమాజ సేవతో మానవ సంబంధాలు మెరుగు
షాబాద్(చేవెళ్ల): యువత సమాజ సేవతో పాటు మానవ సంబంధాలు పెంచుకోవాలని మనస్తత్వ శాస్త్రవేత్త జవహర్లాల్ నెహ్రూ పేర్కొన్నారు. గురువారం షాబాద్ మండలంలోని రేగడిదోస్వాడ గ్రామంలో కేశవ మెమోరియల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కామర్స్ అండర్ సైన్సెస్ ఆధ్యర్యంలో విద్యార్థులచే ఎన్ఎస్ఎస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విద్యార్థులు చదవడమే కాకుండా సామాజిక అవగాహన కలిగి ఉండాలని సూచించారు. యువత స్వచ్ఛందంగా గ్రామాల్లో సేవా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. తమ కళాశాల ఆధ్వర్యంలో గత వారం రోజులుగా రేగడిదోస్వాడ గ్రామంలో వివిధ రకాల కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మల్లారెడ్డి, ఎంపీటీసీ పద్మమ్మ, కళాశాల ప్రిన్సిపాల్ నాగేశ్వర్రావు, ఎస్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ సంజయ్‌రాజ్, ఫిజికల్ డైరెక్టర్ పోచప్ప, మాజీ సర్పంచ్ కిషన్‌రావు, విద్యార్థులు పాల్గొన్నారు. -
మంటగలుస్తున్న మానవత్వం..
విజయనగరం క్రైం: మానవ సంబంధాలు ఘోరంగా దెబ్బతింటున్నాయి. తమతో కలిసి జీవించే మనుషులనే అతి కిరాతకంగా హత్యలు చేస్తున్నారు. హత్యలకు అనేక కారణాలున్నప్పటికీ ప్రధానంగా రెండు, మూడు కారణాలను చెప్పుకోవచ్చు. కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాలు, అక్రమ సంబంధాల వల్లే ఎక్కువగా హత్యలు జరుగుతున్నాయి. నిందితులకు శిక్షలు పడుతున్నా సమాజాంలో అనుకున్నంత మార్పు రావడం లేదు. కారణాలేమైనప్పటికీ వరుస హత్యలతో జిల్లా వణుకుతోంది. కొన్ని కేసులు జూన్ 30న కొత్తవలస మండలం కేంద్రానికి చెందిన జి. పాపారావు అనే వ్యక్తి తన భార్య లక్ష్మీభవానీని అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ సంఘటనకు ప్రధాన కారణం అక్రమ సంబంధమేనని స్థానికులు చెబుతున్నారు. జూన్ 28న పట్టణంలోని అరుంధతీనగర్‌లో సెప్టిక్ ట్యాంకులో ఓ బాలుడు శవమై తేలాడు. తండ్రి అప్పలనాయుడు చంపేసి పడేశాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. జూన్ 14న పట్టణంలోని ప్రసాద్‌నగర్‌లో కుటుంబ కలహాలతో భార్య లక్ష్మి (26)ని భర్త కృష్ణ కత్తితో పీకకోసి హత్యచేసి పరారయ్యూడు. జూన్ నెలలో మెంటాడ మండలం పోరాం గ్రామంలో లెంక ఈశ్వరరావు అనే వ్యక్తి అత్త శీర కొండమ్మను కర్రతో మోది హత్యచేశాడు. అత్త కారణంగా భార్య దూరమైందని వేదనతో ఈ హత్య చేశాడు. ఇలాంటివెన్నో సంఘటనలో జిల్లాలో తరచూ జరుగుతున్నారుు. క్షణికావేశంలో హత్యలు చేసి చాలా మంది జైలులో దుర్భర జీవితం అనుభవిస్తున్నారు. సంఘటన జరిగిన వెంటనే ఆ ప్రాంతంలో అవగాహన సదస్సులు నిర్వహించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. సంఘటన వల్ల రెండు కుటుంబాలూ ఎంత నష్టపోయిందీ ప్రజలకు వివరిస్తే మిగిలిన వారైనా మారే అవకాశం ఉందని చెబుతున్నారు. సమస్యలు పరిష్కరించాలి చిన్న చిన్న సమస్యలను కుటుంబ పెద్దలే పరిష్కరించాలి. ఎక్కువగా అక్రమ సంబంధాల వల్లే హత్యలు జరుగుతున్నాయి. ఇటువంటి వ్యవహారాలు జరగకుండా కుటుంబ సభ్యులు దృష్టి సారించాలి. - ఎల్‌కేవీ రంగారావు, ఎస్పీ -
క్షణికావేశం..
ఆలోగా దారుణాలు మంటగలుస్తున్న మానవ సంబంధాలు పెరుగుతున్న నేరాలు స్వేచ్ఛ, డబ్బులు, ఆస్తులకే ప్రాధాన్యం భర్తను భార్య, భార్యను భర్త కడతేరుస్తున్న వైనాలు పోషించాల్సిన చేతులతోనే కుట్రలు కౌన్సెలింగ్‌తోనే మేలు కఠిన శిక్షలుంటే కొంతైనా మార్పు జోగిపేట : మానవ సంబంధాలు రోజురోజుకు సన్నగిల్లుతున్నాయి. స్వేచ్ఛ, ఆస్తులు, డబ్బులకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్న క్రమంలో ప్రేమానురాగాలకు స్థానం లేకుండా పోయింది. ఎవరికి వారు అనే రీతిలో ముందుకు వెళ్తున్నారు తప్ప ఎదుటి వారి మంచి చెడు ఆలోచించే అవకాశం లేకుండా పోయింది. స్వార్థం పెరిగిపోవడంతో అదే స్థాయిలో నేరాలు జరుగుతున్నాయి. కారణం ఏదైనా భార్యను భర్త, భర్తను భార్య, తల్లిని కొడుకు, కొడుకును తండ్రి ఇలా ఎవరికి వారు క్షణికావేశంలో చంపుకుంటున్నారు. కౌన్సెలింగ్ ద్వారానే కొంతవరకు నేరాలను అదుపు చేయవచ్చని అంటున్నారు మానసిక నిపుణులు. నిందితులకు కఠిన శిక్షలు విధిస్తే ఇలాంటి నేరాలు తగ్గుముఖం పడతాయని పోలీసు అధికారులు భావిస్తున్నారు. ఈ మధ్యకాలంలో జోగిపేట పో?స సర్కిలఖ పరిధిలో చోటుచేసుకున్న సంఘటనలు ఇలా... టేక్మాలఖ మండలంలో... టేక్మాలఖ మండలం ఎల్లుపేట పంచాయతీ పరిధిలోని మెరగోనికుంట తండాలో నవంబర్ 14న కన్న బిడ్డనే తండ్రి గొంతు నులిమి చంపాడు. తండాకు చెందిన రాజేందర్‌కు శైలజ (5), గోవర్ధనఖ (3) ఇద్దరు సంతానం. గోవర్ధనఖ మూగ, చెవిటి కావడంతో మూడో సంతానం ఆరోగ్యంగా ఉండే కొడుకు కావాలని కలలు కన్నాడు. అయితే మూడో కాన్పులో కూతురు పుట్టింది. 45 రోజుల కూతురిని గొంతు నులుమి చంపేశాడు కన్నతండ్రి. అందోలు మండలంలో... మండలంలోని నేరడిగుంటలో భార్య ఇతరుల సాయంతో భర్తను కడతేర్చింది. జీవితాంతం భర్తతో కలిసి కాపురం చేయాల్సిన భార్య వేరే వ్యక్తిపై మోజు పెంచుకుంది. ఈ వ్యవహారానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించి నవంబర్ 28వ తేదీ అర్ధరాత్రి పొట్టనపెట్టుకుంది. రేగోడ్ మండలం ఖాదిరాబాద్‌కు చెందిన నరేష చాలాకాలంగా నేరడిగుంటలోనే నివాసం ఏర్పరచుకొని ఆటో నడుపుకుంటూ జీవిస్తున్నాడు. వ్యవసాయం కూడా ఉంది. ఏడేళ్ల క్రితం సదాశివపేట మండలం నిజాంపేటకు చెందిన అంజమ్మతో వివాహం జరిగింది. అయితే ఆమె గ్రామానికి చెందిన మరోవ్యక్తితో వివాహేతర సంబంధాన్ని ఏర్పరుచుకుంది. ప్రియుడితో కలిసి భర్తను హతమార్చింది. అల్లాదుర్గంలో... అడిగినప్చడల్లా ఖర్చులకు డబ్బులు ఇవ్వడం లేదని కక్ష పెంచుకున్న కొడుకు కన్నతల్లినే హత్య చేశాడు. అల్లాదుర్గం మండలం ఐబీ తండాకు చెందిన తులసీబాయి (55)ని (నవంబర్ 29) ఆదివారం రాత్రి కొడుకు నరేష హత్య చేశాడు. జులాయిగా తిరుగుతూ వృథాగా డబ్బులు ఖర్చుపెడుతున్న కొడుకుకు అదుపులో పెట్టుకునేందుకు తల్లి ప్రయత్నించినా లాభం లేకుండా పోగా చివరకు ఆమె ప్రాణమే పోయింది. చేవెళ్ల గ్రామంలో... ఇదే మండలం చేవెళ్ల గ్రామంలో దొంగతనాలకు పాల్పడుతూ సంఘంలో పరువుతీస్తున్నాడని భావించిన పెంపుడు తల్లే సెలఖఫోనఖ చార్జర్‌ను మెడకు వేసి కొడుకును హత్య చేసింది. ఈ ఘటన గత జూలైలో జరగ్గా నవంబర్ 27న జోగిపేట పోలీసులు కేసు ఛేదించారు. పుల్కలఖ మండలంలో... పుల్కలఖ మండలం సుల్తానఖపూర్‌లో తండ్రే కన్న కొడుకును హతమార్చాడు. పనీపాట లేకుండా తిరుగుతూ డబ్బులకోసంత తరచూ వేధిస్తుండడంతో తట్టుకోలేని తండ్రి జార్జి ఆదివారం రాత్రి (నవంబర్ 29) కొడుకు రాజు(23)పై బండరాయితో మోది హత్య చేశాడు. కఠిన శిక్షలతో మార్పు సమాజంలో రానురాను మానవ సంబంధాలు తగ్గిపోతున్నాయి. యువకులు మద్యం, పేకాటకు బానిసలవుతున్నారు. డబ్బుల కోసం తల్లిదండ్రులను వేధిస్తున్నారు. చెడు వ్యసనాలకు బానిసలవుతున్న యువత తప్చడు మార్గాలను ఎంచుకొని తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. వావివరసులు లేకుండా ప్రయత్నిస్తున్నారు. అక్రమ సంబంధాల వల్ల కూడా ఎన్నో నేరాలు జరుగుతున్నాయి. తల్లిదండ్రులను వేధించడంతో వారు తట్టుకోలేక క్షణికావేశంలో వారిపై దాడులు చేస్తున్నారు. అల్లాదుర్గం, పుల్కలఖ మండలంలో జరిగిన ఘటనలు ఇందుకు నిదర్శనం. ఏదిఏమైనా నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాం. మనుషులం అన్నప్చడు ప్రేమానుభావాలు కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. - రాజారత్నం, మెదక్ డీఎస్పీ