క్షణికావేశం.. | The growing crime of human relationships | Sakshi
Sakshi News home page

క్షణికావేశం..

Published Tue, Dec 1 2015 12:02 AM | Last Updated on Sat, Aug 11 2018 8:48 PM

క్షణికావేశం.. - Sakshi

క్షణికావేశం..

ఆలోగా దారుణాలు మంటగలుస్తున్న
మానవ సంబంధాలు పెరుగుతున్న నేరాలు
స్వేచ్ఛ, డబ్బులు, ఆస్తులకే ప్రాధాన్యం
భర్తను భార్య, భార్యను భర్త కడతేరుస్తున్న వైనాలు
పోషించాల్సిన  చేతులతోనే కుట్రలు
కౌన్సెలింగ్‌తోనే మేలు కఠిన శిక్షలుంటే కొంతైనా మార్పు
జోగిపేట :
మానవ సంబంధాలు రోజురోజుకు సన్నగిల్లుతున్నాయి. స్వేచ్ఛ, ఆస్తులు, డబ్బులకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్న క్రమంలో ప్రేమానురాగాలకు స్థానం లేకుండా పోయింది. ఎవరికి వారు అనే రీతిలో ముందుకు వెళ్తున్నారు తప్ప ఎదుటి వారి మంచి చెడు ఆలోచించే అవకాశం లేకుండా పోయింది. స్వార్థం పెరిగిపోవడంతో అదే స్థాయిలో నేరాలు జరుగుతున్నాయి. కారణం ఏదైనా భార్యను భర్త, భర్తను భార్య, తల్లిని కొడుకు, కొడుకును తండ్రి ఇలా ఎవరికి వారు క్షణికావేశంలో చంపుకుంటున్నారు. కౌన్సెలింగ్ ద్వారానే కొంతవరకు నేరాలను అదుపు చేయవచ్చని అంటున్నారు మానసిక నిపుణులు. నిందితులకు కఠిన శిక్షలు విధిస్తే ఇలాంటి నేరాలు తగ్గుముఖం పడతాయని పోలీసు అధికారులు భావిస్తున్నారు. ఈ మధ్యకాలంలో జోగిపేట పో?స సర్కిలఖ పరిధిలో చోటుచేసుకున్న సంఘటనలు ఇలా...

టేక్మాలఖ మండలంలో...
టేక్మాలఖ మండలం ఎల్లుపేట పంచాయతీ పరిధిలోని మెరగోనికుంట తండాలో నవంబర్ 14న కన్న బిడ్డనే తండ్రి గొంతు నులిమి చంపాడు. తండాకు చెందిన రాజేందర్‌కు శైలజ (5), గోవర్ధనఖ (3) ఇద్దరు సంతానం. గోవర్ధనఖ మూగ, చెవిటి కావడంతో మూడో సంతానం ఆరోగ్యంగా ఉండే కొడుకు కావాలని కలలు కన్నాడు. అయితే మూడో కాన్పులో కూతురు పుట్టింది. 45 రోజుల కూతురిని గొంతు నులుమి చంపేశాడు

కన్నతండ్రి. అందోలు మండలంలో...
మండలంలోని నేరడిగుంటలో భార్య ఇతరుల సాయంతో భర్తను కడతేర్చింది. జీవితాంతం భర్తతో కలిసి కాపురం చేయాల్సిన భార్య వేరే వ్యక్తిపై మోజు పెంచుకుంది. ఈ వ్యవహారానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించి నవంబర్ 28వ తేదీ అర్ధరాత్రి పొట్టనపెట్టుకుంది. రేగోడ్ మండలం ఖాదిరాబాద్‌కు చెందిన నరేష చాలాకాలంగా నేరడిగుంటలోనే నివాసం ఏర్పరచుకొని ఆటో నడుపుకుంటూ జీవిస్తున్నాడు. వ్యవసాయం కూడా ఉంది. ఏడేళ్ల క్రితం సదాశివపేట మండలం నిజాంపేటకు చెందిన అంజమ్మతో వివాహం జరిగింది. అయితే ఆమె గ్రామానికి చెందిన మరోవ్యక్తితో వివాహేతర సంబంధాన్ని ఏర్పరుచుకుంది. ప్రియుడితో కలిసి భర్తను హతమార్చింది.

అల్లాదుర్గంలో...
అడిగినప్చడల్లా ఖర్చులకు డబ్బులు ఇవ్వడం లేదని కక్ష పెంచుకున్న కొడుకు కన్నతల్లినే హత్య చేశాడు. అల్లాదుర్గం మండలం ఐబీ తండాకు చెందిన తులసీబాయి (55)ని (నవంబర్ 29) ఆదివారం రాత్రి కొడుకు నరేష హత్య చేశాడు. జులాయిగా తిరుగుతూ వృథాగా డబ్బులు ఖర్చుపెడుతున్న కొడుకుకు అదుపులో పెట్టుకునేందుకు తల్లి ప్రయత్నించినా లాభం లేకుండా పోగా చివరకు ఆమె ప్రాణమే పోయింది.

చేవెళ్ల గ్రామంలో...
ఇదే మండలం చేవెళ్ల గ్రామంలో దొంగతనాలకు పాల్పడుతూ సంఘంలో పరువుతీస్తున్నాడని భావించిన పెంపుడు తల్లే సెలఖఫోనఖ చార్జర్‌ను మెడకు వేసి కొడుకును హత్య చేసింది. ఈ ఘటన గత జూలైలో జరగ్గా నవంబర్ 27న జోగిపేట పోలీసులు కేసు ఛేదించారు.

పుల్కలఖ మండలంలో...
పుల్కలఖ మండలం సుల్తానఖపూర్‌లో తండ్రే కన్న కొడుకును హతమార్చాడు. పనీపాట లేకుండా తిరుగుతూ డబ్బులకోసంత తరచూ వేధిస్తుండడంతో తట్టుకోలేని తండ్రి జార్జి ఆదివారం రాత్రి (నవంబర్ 29) కొడుకు రాజు(23)పై బండరాయితో మోది హత్య చేశాడు.

కఠిన శిక్షలతో మార్పు
సమాజంలో రానురాను మానవ సంబంధాలు తగ్గిపోతున్నాయి. యువకులు మద్యం, పేకాటకు బానిసలవుతున్నారు. డబ్బుల కోసం తల్లిదండ్రులను వేధిస్తున్నారు. చెడు వ్యసనాలకు బానిసలవుతున్న యువత తప్చడు మార్గాలను ఎంచుకొని తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. వావివరసులు లేకుండా ప్రయత్నిస్తున్నారు. అక్రమ సంబంధాల వల్ల కూడా ఎన్నో నేరాలు జరుగుతున్నాయి.  తల్లిదండ్రులను వేధించడంతో వారు తట్టుకోలేక క్షణికావేశంలో వారిపై దాడులు చేస్తున్నారు. అల్లాదుర్గం, పుల్కలఖ మండలంలో జరిగిన ఘటనలు ఇందుకు నిదర్శనం. ఏదిఏమైనా నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాం. మనుషులం అన్నప్చడు ప్రేమానుభావాలు కలిగి ఉండాల్సిన అవసరం ఉంది.
                                                                                                                                            - రాజారత్నం, మెదక్ డీఎస్పీ

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement