తాజా అధికారిక ఉద్యోగాల కల్పన జూన్‌లో వరుసగా మూడవ నెలలోనూ పెరుగుదలను నమోదు చేసింది. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌ఓ) తాజా డేటా ప్రకారం జూన్ 2023లో 17.89 లక్షల కొత్త సభ్యులను చేర్చుకుంది. కార్మిక మంత్రిత్వ శాఖ ఆదివారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఆగస్టు 2022 తర్వాత అత్యధికమని డేటా తెలిపింది. మొత్తం చెల్లింపులు 11 నెలల గరిష్టమని పేర్కొంది.
3,491 సంస్థలు తమ ఉద్యోగులకు ఈ నెలలో తొలి ఈసీఆర్‌ని చెల్లించడం ద్వారా సామాజిక భద్రతా కవరేజీని అందించాయని పేర్కొంది.మే నెలతో పోలిస్తే జూన్ నెలలో సభ్యుల సంఖ్య 9.71 శాతం పెరిగింది. జూన్‌లో 10.14 లక్షల మంది కొత్త సభ్యులు ఈపీఎఫ్‌వోలో చేరారు.సుమారు 12.65 లక్షల మంది సభ్యులు నిష్క్రమించినా మళ్లీ చేరినట్లు పేరోల్ డేటా సూచిస్తుంది. (వరుసగా నాలుగో వారం క్షీణించిన బంగారం ధర..కానీ!)
జూన్‌లో చేరిన మొత్తం సభ్యులలో 18 -25 సంవత్సరాల వయస్సు గలవారు, 57.87 శాతంగా ఉన్నారు. అలాగే 10.14 లక్షల మంది కొత్త సభ్యులలో, సుమారు 2.81 లక్షల మంది మహిళా సభ్యులు,తొలిసారిగా ఈపీఎఫ్‌లో చేరారు. వర్క్‌ఫోర్స్‌లో చేరిన మహిళా సభ్యుల శాతం గత 11 నెలలతో పోలిస్తేఇదే అత్యధికం.
Comments
Please login to add a commentAdd a comment