labour ministry
-
EPFO 3.0: భారీ సంస్కరణలు.. అధికంగా పీఎఫ్ సొమ్ము!
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) 3.0 వెర్షన్లో మెగా పునరుద్ధరణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల ప్రయోజనాలు లక్ష్యంగా కార్యక్రమాలను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. 12 శాతం ఉద్యోగుల కాంట్రిబ్యూషన్ పరిమితిని తొలగించడంతో సహా ఈపీఎఫ్‌వో సేవల్లో భారీ సంస్కరణలను కార్మిక మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోంది.ఉద్యోగుల 12 శాతం కాంట్రిబ్యూషన్ పరిమితిని ఈపీఎఫ్ఓ సమీక్షించే అవకాశం ఉందని ఈటీ నౌ మూలాధారాలను ఉటంకిస్తూ రిపోర్ట్ చేసింది. ఉద్యోగులు తమ కాంట్రిబ్యూషన్‌ను పెంచుకోవడం ద్వారా మరింత సొమ్మును పీఎఫ్‌కు జమ చేసుకునేందుకు వీలు కలగనుందని నివేదిక పేర్కొంది. అయితే, యాజమాన్యం వంతుగా జమ చేసే మొత్తం ఉద్యోగి జీతంపై ఆధారపడి ఉంటుంది.మొత్తంమీద, ఈపీఎఫ్‌వో తీసుకుంటున్న చర్యలను ఉద్యోగుల పొదుపును పెంచే ప్రయత్నంగా చూడవచ్చు. అదనంగా ఉద్యోగులు తమ ప్రావిడెంట్ ఫండ్ బ్యాలెన్స్‌ను వారి సమ్మతితో పెన్షన్‌గా మార్చడానికి అనుమతించాలని కూడా ప్రభుత్వం యోచిస్తోంది. అంటే ఏ సమయంలోనైనా ఉద్యోగులు తమ ప్రావిడెంట్ ఫండ్ మొత్తాన్ని పెన్షన్‌గా మార్చుకునే అవకాశం ఉంటుంది. -
కార్మికశాఖ ఒప్పందం.. 5 లక్షల మందికి ప్రయోజనం
న్యూఢిల్లీ: మరింత మందికి ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ, మానవ వననరుల సేవలను అందించే టీమ్‌లీజ్ ఎడ్టెక్ చేతులు కలిపాయి. యూనివర్సిటీ విద్యార్థులకు నూతన కెరీర్ అవకాశాలు కల్పించేందుకు వీలుగా అవగాహన ఒప్పందం కుదిరింది.ఉపాధి ఆధారిత డిగ్రీ కార్యక్రమాలను ఆఫర్ చేయనున్నట్టు టీమ్‌లీజ్ ఎడ్టెక్ ప్రకటించింది. కేంద్ర ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ కెరీర్ సర్వీస్(ఎన్సీసీ) పోర్టల్‌పై 200 వరకు ఉపాధి ఆధారిత డిగ్రీ పోగ్రామ్‌లను అందించనున్నట్టు తెలిపింది. ప్రతి ప్రోగ్రామ్ విడిగా 5 లక్షల మందికి పైగా ఇంటర్న్‌షిప్ అవకాశాలతో అధ్యయన అవకాశాలు కల్పించనుంది.ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాండవీయ మాట్లాడుతూ.. టీమ్‌లీజ్ సహకారంతో అందించే డిగ్రీ ప్రోగ్రామ్‌లు అభ్యాసంతోపాటు, ప్రత్యక్ష అనుభవాన్ని సమన్వయం చేస్తుందని, యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. -
4,800 మంది బాధితులు.. ఆ ఐటీ కంపెనీపై చర్యలు తీసుకోండి
ఐటీ కంపెనీ డీఎక్స్‌సీ టెక్నాలజీపై ఐటీ ఉద్యోగుల యూనియన్ కార్మిక శాఖకు ఫిర్యాదు చేసింది. 4,800 మందికి పైగా క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌ను ఆన్‌బోర్డ్ చేయడంలో జాప్యం చేసిన డీఎక్స్‌సీ టెక్నాలజీపై చర్యలు తీసుకోవాలని పుణెకు చెందిన ఐటీ ప్రొఫెషనల్ యూనియన్ నాన్యూసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (ఎన్ఐటీఈఎస్) కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖను కోరింది.రెండేళ్లకు పైగా కొనసాగిన ఈ జాప్యం ఫ్రెషర్లకు తీవ్ర ఇబ్బందులను కలిగించిందని ఎన్ఐటీఈఎస్ అధ్యక్షుడు హర్‌ప్రీత్ సింగ్ సలూజా ఒక ప్రకటనలో తెలిపారు. కంపెనీ హామీలను నమ్మిన ఫ్రెషర్లలో చాలా మంది ఇతర ఉద్యోగ ఆఫర్లను తిరస్కరించారని యూనియన్ తెలిపింది. ప్రస్తుతం ఈ అభ్యర్థులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని, ఇంకా ఉద్యోగంలోకి చేర్చుకోకపోవడంతో భవిష్యత్తుపై స్పష్టత లేదని యూనియన్ పేర్కొంది.ఆన్‌బోర్డింగ్ జాప్యంపై ఐటీ ఎంప్లాయీస్ గతంలోనూ పలు కంపెనీలపై కార్మికశాఖకు ఫిర్యాదు చేసింది. 2,000 మందికి పైగా క్యాంపస్ రిక్రూట్మెంట్లను ఆన్‌బోర్డ్ చేయడంలో పదేపదే జాప్యం చేస్తోందంటూ ఇన్ఫోసిస్‌పై దర్యాప్తు జరపాలని గత జూన్ నెల ప్రారంభంలో కోరింది. అంతకు ముందు 2023 జూలైలో టీసీఎస్ 200 మందికి పైగా లేటరల్ రిక్రూట్మెంట్లను ఆలస్యం చేస్తోందని కార్మిక శాఖకు యూనియన్ ఫిర్యాదు చేసింది. -
అది నమ్మక ద్రోహమే.. ఇన్ఫోసిస్‌పై ఐటీ ఉద్యోగుల కంప్లైంట్
దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌పై ఐటీ ఉద్యోగుల సంఘం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (ఎన్ఐటీఈఎస్) కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసింది. సుమారు 2,000 మంది క్యాంపస్ రిక్రూట్మెంట్లకు ఆన్‌బోర్డింగ్ ప్రక్రియను ఈ ఐటీ కంపెనీ పదేపదే ఆలస్యం చేస్తోందని, ఇది ఉద్యోగులకు ఆర్థిక, మానసిక ఇబ్బందులను కలిగిస్తోందని యూనియన్ ఆరోపించింది.దీర్ఘకాలిక జాప్యంతో ఆర్థిక ఇబ్బందులుఇన్ఫోసిస్లో రెండేళ్లుగా ఆన్‌బోర్డింగ్ జాప్యం కొనసాగుతోందని, దీంతో బాధితులు అనిశ్చితి, ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డారని యూనియన్ పేర్కొంది. ‘‘ఇన్ఫోసిస్ ఆఫర్ లెటర్లపై ఆధారపడి చాలా మంది ఇతర ఉద్యోగ ఆఫర్లను తిరస్కరించారు. ఇప్పుడు ఆదాయంతోపాటు స్పష్టమైన ఆన్‌బోర్డింగ్ టైమ్‌లైన్ లేకపోవడంతో వారు ఆర్థిక ఇబ్బందులు, అనిశ్చితిని ఎదుర్కొంటున్నారు' అని ఎన్ఐటీఈఎస్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇన్ఫోసిస్ చర్యలు తీవ్రమైన నమ్మక ద్రోహాన్ని సూచిస్తున్నాయని, కంపెనీ ద్వారా తమ కెరీర్లు సజావుగా ప్రారంభమవుతాయని యువ నిపుణులు విశ్వసించారని యూనియన్ వాదిస్తోంది.ప్రభుత్వ జోక్యానికి విజ్ఞప్తినియామకాలకు మద్దతు ఇవ్వాల్సిన నైతిక బాధ్యత ఇన్ఫోసిస్ కు ఉందని, దీనిపై జోక్యం చేసుకోవాలని కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖను ఎన్ఐటీఈఎస్ కోరుతోంది. అనిశ్చితి వల్ల ఏర్పడిన మానసిక, భావోద్వేగ ఒత్తిడిని పరిష్కరించాలని, జాప్యం జరిగిన కాలానికి పూర్తి వేతనాలు చెల్లించాలని యూనియన్ డిమాండ్ చేస్తోంది. అంతేకాక, ఆన్‌బోర్డింగ్ ఇలాగే కొనసాగితే, సంస్థలో ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలను కనుగొనడంలో నియామకాలకు ఇన్ఫోసిస్ బాధితులకు సహాయం అందించాలని ఎన్ఐటీఈఎస్ కోరుతోంది.ఇలాంటి అంశాల్లో ఐటీ సంస్థలపై ఎన్ఐటీఈఎస్ చర్యలు తీసుకోవడం ఇదే తొలిసారి కాదు. టీసీఎస్ 200 లేటరల్ రిక్రూట్మెంట్లను ఆలస్యం చేసిందని ఎన్ఐటీఈఎస్ దాఖలు చేసిన ఫిర్యాదుపై టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)కు మహారాష్ట్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ గత అక్టోబర్‌లో నోటీసులు జారీ చేసింది. కొత్త నియామకాల్లో జాప్యం దేశీయ ఐటీ సేవల పరిశ్రమలో విస్తృత ధోరణిని ప్రతిబింబిస్తోంది. కంపెనీలు క్యాంపస్ నియామకాలను తగ్గించాయి. దీంతో యువ, తక్కువ వేతనంతో కూడిన ఉద్యోగుల సంఖ్య తగ్గిపోతోంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో యువ ఉద్యోగుల నిష్పత్తి టీసీఎస్‌లో ఐదేళ్ల కనిష్టానికి, ఇన్ఫోసిస్‌లో దశాబ్ద కనిష్ఠానికి పడిపోయాయి. -
తెలంగాణలో నవంబర్ 30న వేతనంతో కూడిన సెలవు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పోలింగ్ తేదీ నవంబర్ 30న వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని కార్మిక శాఖ నిర్ణయించింది. ఈనేపథ్యంలో కర్మాగారాలు, దుకాణాలు, పరిశ్రమల్లో పనిచేసే సిబ్బందికి వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని కార్మిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అందరూ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కార్మిక శాఖ ప్రకటనలో పేర్కొంది. -
టీసీఎస్‌కు కార్మిక శాఖ నోటీసులు.. ఎందుకంటే..
దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ (TCS)కి మహారాష్ట్ర కార్మిక శాఖ నోటీసులు జారీ చేసింది. 200 లేటరల్ రిక్రూట్ల ఆన్‌బోర్డింగ్ ఆలస్యం ఫిర్యాదుపై మహారాష్ట్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ టీసీఎస్ కంపెనీకి నోటీసు జారీ చేసినట్లు ‘మనీకంట్రోల్’ నివేదిక తెలిపింది. నవంబర్ 2న పుణె కార్మిక శాఖ కార్యాలయంలో డిపార్ట్మెంట్ అధికారులతో సమావేశమై చర్చించాలని కార్మిక శాఖ టీసీఎస్ అధికారులకు నోటీసు జారీ చేసింది. టీసీఎస్ చేపట్టిన 200 మందికి పైగా లేటరల్ రిక్రూట్లను ఆన్‌బోర్డింగ్ చేయడంలో జాప్యం జరిగిందంటూ నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (NITES) గత జులైలో కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసింది. తర్వాత కేంద్ర కార్మిక శాఖ దీన్ని మహారాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేసింది. వివిధ అనుభవ స్థాయిలు కలిగిన నిపుణులు ఆన్‌బోర్డింగ్ కోసం ఎదురుచూస్తున్నారని నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ ఫిర్యాదులో పేర్కొంది. ఈ విషయంలో జోక్యం చేసుకుని టీసీఎస్‌కు నిర్దిష్ట ఆదేశాలు జారీ చేయాలని కార్మిక శాఖను కోరింది. 1.8 సంవత్సరాల నుంచి 15 ఏళ్ల వరకు వివిధ స్థాయిల అనుభవమున్న ఉద్యోగులు ఇప్పుడు ఉద్యోగాలు లేకుండా, ఆదాయ వనరులు లేకుండా మిగిలిపోయారని వాపోయింది. ప్రస్తుతం ఉన్న టాలెంట్ పూల్‌ను వినియోగాన్ని మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో నియామకాలపై నెమ్మదిగా వెళ్తున్నట్లు టీసీఎస్ ఇటీవల తెలిపింది. ఈ లేటరల్ రిక్రూట్లను ఈ సంవత్సరం జనవరి, ఏప్రిల్ మధ్య టీసీఎస్ నియమించుకుంది. జులై 10న చాలా మందికి జాయినింగ్ తేదీలు ఇవ్వగా తాజాగా వాటిని అక్టోబర్‌కు వాయిదా వేస్తున్నట్లు అభ్యర్థులకు ఈమెయిల్స్ వచ్చాయి. లేటరల్ రిక్రూట్మెంట్ అంటే.. ఇప్పటికే మరో కంపెనీలో ఇదే హోదాలో పనిచేస్తున్న ఉద్యోగులను నియమించుకునే ప్రక్రియనే లాటరల్ రిక్రూట్మెంట్ అంటారు. నిర్దిష్ట నైపుణ్యం లేదా అనుభవం అవసరమయ్యే స్థానాలను భర్తీ చేయడం కష్టసాధ్యం అయినప్పుడు ఈ నియామక ప్రక్రియను అనుసరిస్తారు. -
గుడ్‌న్యూస్:11 నెలల గరిష్టానికి ఈపీఎఫ్‌వో సభ్యులు
తాజా అధికారిక ఉద్యోగాల కల్పన జూన్‌లో వరుసగా మూడవ నెలలోనూ పెరుగుదలను నమోదు చేసింది. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) తాజా డేటా ప్రకారం జూన్ 2023లో 17.89 లక్షల కొత్త సభ్యులను చేర్చుకుంది. కార్మిక మంత్రిత్వ శాఖ ఆదివారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఆగస్టు 2022 తర్వాత అత్యధికమని డేటా తెలిపింది. మొత్తం చెల్లింపులు 11 నెలల గరిష్టమని పేర్కొంది. 3,491 సంస్థలు తమ ఉద్యోగులకు ఈ నెలలో తొలి ఈసీఆర్ని చెల్లించడం ద్వారా సామాజిక భద్రతా కవరేజీని అందించాయని పేర్కొంది.మే నెలతో పోలిస్తే జూన్ నెలలో సభ్యుల సంఖ్య 9.71 శాతం పెరిగింది. జూన్‌లో 10.14 లక్షల మంది కొత్త సభ్యులు ఈపీఎఫ్‌వోలో చేరారు.సుమారు 12.65 లక్షల మంది సభ్యులు నిష్క్రమించినా మళ్లీ చేరినట్లు పేరోల్ డేటా సూచిస్తుంది. (వరుసగా నాలుగో వారం క్షీణించిన బంగారం ధర..కానీ!) జూన్‌లో చేరిన మొత్తం సభ్యులలో 18 -25 సంవత్సరాల వయస్సు గలవారు, 57.87 శాతంగా ఉన్నారు. అలాగే 10.14 లక్షల మంది కొత్త సభ్యులలో, సుమారు 2.81 లక్షల మంది మహిళా సభ్యులు,తొలిసారిగా ఈపీఎఫ్‌లో చేరారు. వర్క్‌ఫోర్స్‌లో చేరిన మహిళా సభ్యుల శాతం గత 11 నెలలతో పోలిస్తేఇదే అత్యధికం. -
కార్మిక శాఖను ఆశ్రయించిన ఐటీ ఉద్యోగులు..
ప్రసిద్ధ ఐటీ సేవల కంపెనీ హెచ్‌సీఎల్ టెక్(HCLTech)కి వ్యతిరేకంగా ఐటీ ఉద్యోగుల యూనియన్ కార్మిక శాఖను ఆశ్రయించింది. 2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎంగేజ్మెంట్ పెర్ఫార్మెన్స్ బోనస్ (ఈపీబీ) చెల్లింపు విధానాన్ని అప్డేట్ చేసిన హెచ్‌సీఎస్ టెక్ సంస్థపై ఐటీ ఉద్యోగుల యూనియన్ ‘నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్’ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసింది. భారీగా తగ్గిన జీతాలు త్రైమాసిక పనితీరు రేటింగ్ ప్రాతిపదికన ఈపీబీ చెల్లించే విధానాన్ని హెచ్‌సీఎస్ టెక్ ఇటీవల సవరించింది. కోవిడ్ కంటే ముందున్న ఫార్మాట్‌ను అమలు చేస్తోంది. కోవిడ్ సమయంలో ఆ తర్వాత ఇప్పటి వరకు కూడా ఉద్యోగులకు రేటింగ్‌తో సంబంధం లేకుండా అందరికీ అంటే బెంచ్ మీద ఉన్న ఉద్యోగులకు కూడా 100 శాతం ఈపీబీని కంపెనీ చెల్లించేది. కానీ దీన్ని పాత విధానంలోనే ఉద్యోగుల పెర్ఫార్మెన్స్ రేటింగ్‌కు అనుగుణంగా బోనస్ చెల్లించునున్నట్లు కంపెనీ ఉద్యోగులకు తెలియజేసింది. ఏప్రిల్ 1 నుంచే పాత విధానాన్ని అమల్లోకి తెచ్చిన కంపెనీ ఉద్యోగులకు ఒక రోజు ముందు దీని గురించి ఈ-మెయిల్స్ పంపినట్లు తెలిసింది. పాత ఈపీబీ) చెల్లింపు విధానంతో ఉద్యోగుల జీతాలు భారీగా తగ్గాయి. ఉద్యోగుల ఆక్షేపణలు ఇవి.. నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ ప్రెసిడెంట్ హర్‌ప్రీత్ సింగ్ సలూజా మాట్లాడుతూ ‘గత పాలసీ ప్రకారం, ఉద్యోగులు బెంచ్‌లో ఉన్నప్పటికీ, నెలవారీ ప్రాతిపదికన స్థిరమైన రేటుతో ఎంగేజ్మెంట్ పెర్ఫార్మెన్స్ బోనస్ (ఈపీబీ) చెల్లిస్తామని హెసీఎల్ కంపెనీ ఉద్యోగులకు హామీ ఇచ్చింది. అయితే ఇప్పుడు ఈపీబీ చెల్లింపులను నిర్ణయించడానికి త్రైమాసిక పనితీరు సమీక్ష ప్రక్రియను అమలు చేస్తూ కంపెనీ ఆకస్మికంగా పాలసీని మార్చింది’ అన్నారు. మార్చిన విధానం ప్రకారం.. ఉద్యోగుల పెర్ఫార్మెన్స్ రేటింగ్ ఆధారంగా ఈపీబీని కంపెనీ చెల్లిస్తుంది. అంటే అత్యుత్తమ పనితీరు రేటింగ్ ఉన్న వారికి గరిష్టంగా 80-90 శాతం, తక్కువ రేటింగ్ ఉన్నవారికి కేవలం 30-40 శాతం వరకు ఉంటుందని వివరించారు. ఇదీ చదవండి ► ఈ ఐటీ కంపెనీ సూపర్! వెయ్యికిపైగా ఉద్యోగాలు.. 800 మంది భారత్ నుంచే.. -
EPFO: డిసెంబర్లో కార్యాలయాల కళకళ..!
న్యూఢిల్లీ: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ)లో డిసెంబర్ 2022లో 14.93 లక్షల మంది కొత్త సభ్యత్వం నమోదయ్యింది. 2021 ఇదే నెలతో పోల్చితే ఇది 2 శాతం (32,635 మంది) అధికమని కార్మిక మంత్రిత్వశాఖ 2022 డిసెంబర్‌కు సంబంధించి విడుదల చేసిన (తొలి) గణాంకాలు పేర్కొన్నాయి. గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ► ఈపీఎఫ్ఓలో చేరిన 14.93 లక్షల మందిలో దాదాపు 8.02 లక్షల మంది కొత్త ఉద్యోగులు. వీరు మొదటిసారి సామాజిక భద్రతా వ్యవస్థ– ఈపీఎఫ్ఓ పరిధిలోకి వచ్చారు. అంటే మొదటిసారి వ్యవస్థాగతమైన ఉపాధిని వీరు పొందారన్నమాట. ► కొత్తగా చేరిన 8.02 లక్షల మందిలో 18 నుంచి 21 సంవత్సరాల మధ్య వయస్కులు 2.39 లక్షల మంది. 22–25 సంవత్సరాల మధ్య వారు 2.08 లక్షల మంది. 18 నుంచి 25 సంవ త్సరాల మధ్య వయస్సు కలవారు మొత్తం సంఖ్యలో (8.02 లక్షల మంది) 55.64% మంది. ► సమీక్షా నెల్లో 3.84 లక్షల మంది ఈపీఎఫ్ఓ నుంచి బయటకు వెళ్లగా, 10.74 లక్షల మంది బయ టకు వెళ్లి మళ్లీ కొత్త ఉద్యోగాల్లో చేరారు. తద్వా రా తిరిగి ఈపీఎఫ్ఓలో సభ్యత్వం పొందారు. ఈఎస్ఐసీలోనూ భారీ పెరుగుదల కాగా, ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ)లో కూడా 2022 డిసెంబర్లో కొత్త ఉద్యోగులు 18.03 లక్షల మంది చేరాయి. 2021 డిసంబర్‌తో పోల్చితే ఈ సంఖ్య 14.52 లక్షలు పెరగడం గమనార్హం. ఈఎస్ఐసీ కింద డిసెంబర్ 2022లో 27,700 కొత్త సంస్థలు రిజిస్టరయ్యాయి. కొత్తగా చేరిన 18.03 లక్షల మంది ఉద్యోగుల్లో 25 సంవత్సరాలపైబడినవారు 8.30 లక్షల మంది. దేశంలో యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈఎస్ఐ స్కీమ్‌లో చేరినవారిలో 80 మంది ట్రాన్స్జెండర్లు. సభ్యులకు బహుళ ప్రయోజనాలు... ఉద్యోగి రికార్డుల నవీకరణ నిరంతర ప్రక్రియ. ఈ ప్రాతిపదికన పేరోల్ డేటాను తాత్కాలికమైనదిగా పరిగణించాలి. మునుపటి డేటా ప్రతి నెలా మారుతుంది. ఏప్రిల్ 2018 నుండి (సెప్టెంబర్ 2017 తరువాత కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటూ) పేరోల్ డేటా విడుదలవుతోంది. ఈపీఎఫ్ఓ తన సభ్యులకు సభ్యులకు ఈపీఎఫ్, ఎంపీ చట్టం, 1952 చట్టం కింద లభించే పలు ప్రయోజనాలను అందించడానికి బాధ్యత వహించే సామాజిక భద్రతా సంస్థ. ఇది సభ్యులకు వారి పదవీ విరమణపై భవిష్య నిధి, పెన్షన్ ప్రయోజనాలు అలాగే సభ్యుడు అకాల మరణం సంభవించినప్పుడు వారి కుటుంబాలకు కుటుంబ పెన్షన్, బీమా ప్రయోజనాలను అందిస్తుంది. ఈపీఎఫ్ఓ దాదాపు 6 కోట్ల మందికి పైగా చందాదారులతో రూ.12 లక్షల కోట్ల పెట్టుబడులను కలిగి ఉంది. పటిష్టమైన స్థాయిలో రూ.300 కోట్లకు పైగా మిగులునూ నిర్వహిస్తోంది. ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) డిపాజిట్లపై 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 8.1 శాతం వడ్డీ రేటు చెల్లించడానికి కేంద్రం ఆమోదముద్ర వేసింది. గడచిన నాలుగు దశాబ్దాల కాలంలో (1977–78లో ఈపీఎఫ్ 8 శాతం) కనిష్ట వడ్డీరేటు ఇది. డెట్ ఇన్వెస్ట్మెంట్ నుంచి పొందిన వడ్డీ అలాగే ఈక్విటీ పెట్టుబడుల నుంచి వచ్చిన ఆదాయ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈపీఎఫ్ఓ అత్యున్నత స్థాయి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) వడ్డీరేటును నిర్ణయిస్తుంది. 2015–16లో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులను ఈపీఎఫ్ఓ ప్రారంభించింది. ఈక్విటీల్లో తన మొత్తం నిధుల్లో 5 శాతంతో ప్రారంభమైన ఈపీఎఫ్ఓ పెట్టుబడులు, ప్రస్తుతం 15 శాతానికి చేరాయి. -
‘వారంతా 18-25 ఏళ్ల వయస్సు వాళ్లే’.. దేశంలో పెరిగి పోతున్న ఉద్యోగం చేసే వారి సంఖ్య
న్యూఢిల్లీ: ఉపాధి కల్పనకు సంబంధించి నవంబర్ సానుకూల సంకేతం ఇచ్చింది. 2022 నవంబర్‌లో నికరంగా 16.26 లక్షల మంది చందాదారులు చేరినట్లు కార్మిక మంత్రిత్వశాఖ ప్రకటన ఒకటి తెలిపింది. 2021 ఇదే నెలతో పోల్చితే ఈ సంఖ్య 16.5 శాతం అధికంగా ఉండడం గమనార్హం. ఇక 2022 అక్టోబర్‌తో పోల్చితే ఈ గణాంకాలు ఏకంగా 25.67 శాతం అధికంగా ఉన్నాయి. తాజా గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ► నవంబర్‌లో 16.26 లక్షల మంది నికరంగా ఈపీఎఫ్ఓ చందాదారులగా చేరితే అందులో 8.99 లక్ష మంది మొదటి సారి చేరినవారు. ఇలా చేరిన వారు అక్టోబర్‌తో (7.28 లక్షలు) పోల్చితే 1.71 లక్షల మంది అధికం. ► కొత్తగా ఆర్గనైజేషన్‌లో చేరిన వారిలో 18 నుంచి 21 సంవత్సరాల మధ్య వయస్సువారు 2.77 లక్షల మంది. 22–25 మధ్య వయస్సు వారు 2.32 లక్షల మంది. మొత్తం కొత్త సభ్యుల్లో 18 నుంచి 25 మధ్య వయస్కుల వారి వెయిటేజ్ 56.60 శాతంగా ఉంది. మొదటిసారి ఉద్యోగంలో చేరినవారు భారీగా సంఘటిత రంగంలోనే నమోదయినట్లు ఈ గణాంకాలు పేర్కొనడం సానుకూల అంశం. ► ఇక దాదాపు 11.21 లక్షల మంది సభ్యులు ఈపీఎఫ్ఓమెంబర్షిప్లో తిరిగి చేరారని కూడా డేటా పేర్కొంది. ఉద్యోగాల మార్పు, ఈపీఎఫ్ఓ కింద ఉన్న సంస్థల్లో తిరిగి చేరడం, తుది పరిష్కారం కోసం దరఖాస్తు చేయడానికి బదులుగా సామాజిక భద్రతా రక్షణను పొడిగిస్తూ వారి నిధిని బదిలీ చేసుకోవడం వంటి నిర్ణయాలు తీసుకున్నవారు ఇందులో ఉన్నారు. ► ఈపీఎఫ్ఓ గణాంకాల ప్రకారం, నవంబర్ 2022లో నికర మహిళా సభ్యుల నమోదు సంఖ్య 3.19 లక్షలు. అక్టోబర్ 2022కు సంబంధించి 2.63 లక్షల మందితో పోల్చితే ఇది 0.56 శాతం అధికం. ఈఎస్ఐ స్కీమ్ గణాంకాలు ఇలా... ఉద్యోగుల స్టేట్ ఇన్సూరెన్స్ స్కీమ్ (ఈఎస్ఐ స్కీమ్) తొలి విడత 2022 నవంబర్ పేరోల్ డేటాను కూడా కార్మిక మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఇందులో సమీక్షా నెల్లో 18.86 లక్షల మంది కొత్త ఉద్యోగులు జతయ్యారు. 2021 నవంబర్‌తో పోల్చితే ఈ సంఖ్య నికరంగా 5.24 లక్షలు పెరిగింది. డేటా ప్రకారం, ఉద్యోగుల స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కింద తమ ఉద్యోగులకు సామాజిక భద్రత కవరేజీని అందజేయడానికి ఉద్దేశించి నవంబర్ 2022 నెలలో దాదాపు 21,953 కొత్త సంస్థలు రిజిస్టర్ అయ్యాయి. ఈఎస్ఐ కింద నవంబర్‌లో జతయిన 18.86 లక్షల మంది కొత్త ఉద్యోగుల్లో 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్కులు 8.78 లక్షల మంది. నమోదయిన నికర మహిళా సభ్యుల సంఖ్య 3.51 లక్షలు. నవంబర్‌లో మొత్తం 63 మంది ట్రాన్స్‌జెండర్ ఉద్యోగులు కూడా ఈఎస్ఐ స్కీమ్‌లో నమోదు చేసుకున్నట్లు డేటా పేర్కొంది. సభ్యులకు బహుళ ప్రయోజనాలు... ఉద్యోగి రికార్డుల నవీకరణ నిరంతర ప్రక్రియ. ఈ ప్రాతిపదికన పేరోల్ డేటాను తాత్కాలికమైనదిగా పరిగణించాలి. మునుపటి డేటా ప్రతి నెలా మారుతుంది. ఏప్రిల్ 2018 నుండి ( సెప్టెంబర్ 2017 తరువాత కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటూ) పేరోల్ డేటా విడుదలవుతోంది. ఈపీఎఫ్ఓ తన సభ్యులకు సభ్యులకు ఈపీఎఫ్, ఎంపీ చట్టం, 1952 చట్టం కింద లభించే పలు ప్రయోజనాలను అందించడానికి బాధ్యత వహించే సామాజిక భద్రతా సంస్థ. ఇది సభ్యులకు వారి పదవీ విరమణపై భవిష్య నిధి, పెన్షన్ ప్రయోజనాలు అలాగే సభ్యుడు అకాల మరణం సంభవించినప్పుడు వారి కుటుంబాలకు కుటుంబ పెన్షన్, బీమా ప్రయోజనాలను అందిస్తుంది. ఈపీఎఫ్ఓ దాదాపు 6 కోట్ల మందికి పైగా చందాదారులతో రూ.12 లక్షల కోట్ల పెట్టుబడులను కలిగి ఉంది. పటిష్టమైన స్థాయిలో రూ.300 కోట్ల మిగులునూ నిర్వహిస్తోంది. ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) డిపాజిట్లపై 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 8.1 శాతం వడ్డీ రేటు చెల్లించడానికి ఇటీవలే కేంద్రం ఆమోదముద్ర వేసింది. గడచిన నాలుగు దశాబ్దాల కాలంలో (1977–78లో ఈపీఎఫ్ 8 శాతం) కనిష్ట వడ్డీరేటు ఇది. డెట్ ఇన్వెస్ట్మెంట్ నుంచి పొందిన వడ్డీ అలాగే ఈక్విటీ పెట్టుబడుల నుంచి వచ్చిన ఆదాయ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈపీఎఫ్ఓ అత్యున్నత స్థాయి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) వడ్డీరేటును నిర్ణయిస్తుంది. 2015–16లో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులను ఈపీఎఫ్ఓ ప్రారంభించింది. ఈక్విటీల్లో తన మొత్తం నిధుల్లో 5 శాతంతో ప్రారంభమైన ఈపీఎఫ్ఓ పెట్టుబడులు, ప్రస్తుతం 15 శాతానికి చేరాయి. -
Amazon Layoffs అమెజాన్ కొత్త ఎత్తుగడ, కేంద్రం భారీ షాక్!
న్యూఢిల్లీ: టెక్, ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ 10వేల ఉద్యోగాల కోత ప్రకటన తరువాత వచ్చే పరిణామాలను ఎదుర్కొ నేందుకు మల్లగుల్లాలు పడుతోంది. ఈ మేరకు స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని ఇండియన్ టెకీలను వేడు కుంటోంది. అంతేకాదు అలా చేసిన వారికి భారీ ప్రయోజనాలు అందిస్తామని కూడా ప్రకటించింది. దీంతో ఈ అంశం హాట్‌టాపిక్‌గా నిలిచింది. (మరో టెక్ దిగ్గజం సంచలన నిర్ణయం: ఉద్యోగులకు ఇక గడ్డుకాలమేనా?) అమెజాన్ ఎక్స్పీరియన్స్ అండ్ టెక్నాలజీ టీమ్‌లో L1 నుండి L7 బ్యాండ్‌లో పని చేస్తున్న భారతీయ ఉద్యోగులు కంపెనీ వాలంటరీ సెపరేషన్ ప్రోగ్రామ్‌కు అర్హులని పేర్కొంది. ఈ పథకం కింద ఈ సంవత్సరం నవంబర్ 30 లోపు రాజీనామా చేస్తే వారికి కొన్ని ప్రయోజనాలు కల్పిస్తామని హామీ ఇస్తోంది. దీంతో పలువరు ఇండియన్ ఉద్యోగులు స్వచ్ఛంద రాజీనామాలను ప్రారంభించినట్టు తెలుస్తోంది. (దోమలను తోలేసినంత తేలిగ్గా ఉద్యోగ కోతలు, ఎన్నాళ్లీ వేట?) కార్మిక మంత్రిత్వ శాఖ సమన్లు భారతీయఉద్యోగులను స్వచ్ఛంద పదవీ విమరణకు అమెజాన్ ప్రయత్నాలపై భారత ప్రభుత్వం స్పందించింది. ఈ మేరకు అమెజాన్‌కు కార్మిక మంత్రిత్వ శాఖ నోటీసు లిచ్చింది. దీనిపై విచారణకు హాజరు కావాలని మంగళవారం డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ ఏ అంజనప్ప కంపెనీకి నోటీసులు పంపారు. భారతదేశంలో అమెజాన్ చేసిన తొలగింపులపై ఉద్యోగుల సంఘం నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (NITES) ఫిర్యాదు మేరకు, బెంగళూరులోని ఈకామర్స్ దిగ్గజం సీనియర్ పబ్లిక్ పాలసీ మేనేజర్ స్మితా శర్మను (బుధవారం నవంబర్ 23న జరిగే) విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఐటి/ఐటిఇఎస్ ఉద్యోగుల యూనియన్ గత వారం కేంద్ర కార్మిక మంత్రి భూపేందర్ యాదవ్‌కు రాసిన లేఖలో, దేశంలోని అమెజాన్ ఉద్యోగులను స్వచ్ఛందంగా కంపెనీ నుండి వైదొలగాల్సి వస్తోందన్న ఫిర్యాదులు అందాయని పేర్కొంది. దేశంలోని కార్మిక చట్టాలను అమెజాన్ ఉల్లంఘిస్తోందని ఆరోపించింది. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా తొలగించిన ఉద్యోగులకు భారీ పరిహారం అందించాల్సి ఉంటుంది. అందుకే నవంబర్ 30, 2022న భారత ప్రామాణిక కాలమానం ప్రకారం ఉదయం 6:30 గంటలలోపు స్మార్ట్ ఫారమ్‌ల ద్వారా స్వచ్ఛందంగా రాజీనామా చేయాలంటూ ఉద్యోగులకు ఒక నోట్ పంపింది. అయితే ఉద్యోగులు రాజీనామా చేసిన తర్వాత ఎంత సమయంలోపు ఈ పరిహారం అందిస్తుంది అనేది అమెజాన్ స్పష్టం చేయలేదు. ఈ స్కీం కింద 22 వారాల బేస్ పే; అలాగే ప్రతి ఆరు నెలల సర్వీస్‌కు ఒక వారం మూల వేతనం (సమీప 6 నెలల వరకు ఉంటుంది) గరిష్ట ప్రయోజనం ఇరవై వారాల వరకు చెల్లింపు, బీమా బెనిఫిట్ పాలసీ ప్రకారం 6 నెలల పాటు మెడికల్ ఇన్సూరెన్స్ కవరేజ్ లేదా దానికి బదులుగా సమానమైన బీమా ప్రీమియం మొత్తం తదితర ప్రయోజనాలను ఆఫర్ చేసింది.ఒక ఉద్యోగిని కంపెనీ తొలగించినట్లయితే, తొలగింపును చట్టపరంగా సవాలు చేయవచ్చు. కానీ ఒక ఉద్యోగి స్వచ్ఛందంగా రాజీనామా చేసినప్పుడు, న్యాయస్థానంలో ఉద్యోగం కోల్పోవడంపై సవాలు చేసే హక్కును కోల్పోతారు. ఇదే కంపెనీ ఎత్తుగడ అని లానోజిఎమ్బిహెచ్ ఎంప్లాయిమెంట్ లా ప్రాక్టీషనర్, జనరల్ కౌన్సెల్ భాగ్యశ్రీ పాంచోలో వ్యాఖ్యానించారు. కాగా ఆర్థికమందగమనం, ఆదాయాలు క్షీణత నేపథ్యంలో తన గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌ను విభాగాల్లో 10,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ప్రకటించింది. అంతేకాదు వచ్చే ఏడాది కూడా ఈ తొలగింపుల ప్రక్రియ కొనసాగుతుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. (ఉద్యోగుల నెత్తిన మరో పిడుగు: అమెజాన్ కీలక నిర్ణయం) -
ఈసారి బుద్దుడు అడ్డొచ్చాడు.. ఇన్ఫోసిస్ ఏం చేయబోతోంది?
నాన్ కాంపిట్ అగ్రిమెంట్ వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఇటు ఇన్ఫోసిస్, అటు ఉద్యోగులు వెనక్కి తగ్గకపోవడంతో ఇరువర్గాల మధ్య పీటముడి బిగుస్తుంది. మరోవైపు ఈ వివాదం పరిష్కారం కోసం రంగంలోకి దిగిన కేంద్ర కార్మిక శాఖకు సైతం చుక్కలు కనిపిస్తున్నాయ్! తగ్గేదేలే నాన్ కాంపిట్ అగ్రిమెంట్ విషయంలో ఒక్క అడుగు కూడా వెనక్కి తగ్గేది లేదన్నట్టుగా ఉంది ఇన్ఫోసిస్ వ్యవహారం. ఈ అంశంపై చర్చించేందుకు కేంద్ర కార్మిక శాఖ రెండోసారి ఏర్పాటు చేసిన సమావేశానికి ఇన్ఫోసిస్ డుమ్మా కొట్టింది. ఢిల్లీలోని కార్మిక భవన్లో ఏర్పాటు చేసిన సమావేశానికి ఇన్ఫోసిస్ ప్రతినిధులు ఎవ్వరూ హాజరు కాలేదు. అయితే బుద్ద పూర్ణిమ కాబట్టి సమావేశం నిర్వహించేలదంటూ కార్మిక శాఖ వివరణ ఇచ్చింది. అంతేకాదు ఐటీ ఉద్యోగులు, ఇన్ఫోసిస్‌ల మధ్య చర్చలు జరిపేందుకు మరో కొత్త తేదిని ఖరారు చేసింది. మూడోసారైనా? నాన్ కాంపిట్ అగ్రిమెంట్ అంశంపై చర్చించేందుకు కేంద్ర కార్మిఖ శాఖ ఏప్రిల్ 28న ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేసింది. అయితే సమయాభావం వల్ల ఇన్ఫోసిస్ ఈ సమావేవానికి హాజరు కాలేదంటూ కార్మిక శాఖ తెలిపింది. దీంతో మే 16న రెండోసారి చర్చలకు తేదీని ఖరారు చేసింది కార్మికశాఖ. అయితే అప్పుడు కూడా ఇన్ఫోసిస్ నుంచి సానుకూల స్పందన రాలేదు. దీంతో ముచ్చటగా మూడోసారి మే 26వ తేదిని నిర్ణయించింది కార్మికశా; ఇన్ఫోసిస్, నాసెంట్‌లతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కారిస్తామని నమ్మకంగా ఉంది కార్మిక శాఖ. వాట్‌నెక్ట్స్ నాసెంట్ అగ్రిమెంట్ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కార్పొరేట్ సెక్టార్ నుంచి కొంత మేరకు మద్దతు లభిస్తుండగా.. ఉద్యోగ సంఘాలైతే ఇది సరైన విధానం కాదని అంటున్నాయి. మరోవైపు కేంద్ర కార్మిక శాఖ సీన్లోకి ఎంటరైంది. ఇప్పటికయితే రెండుసార్లు ఏర్పాటు చేసిన సమావేశాలకు ఇన్ఫోసిస్ హాజరు కాకుండా ఉంది. కానీ కేంద్ర కార్మిక శాఖతో ఎంతోకాలం ఇలా వ్యవహరించడం వీలుకాని పని. దీంతో మే 26న ఇన్ఫోసిస్ ఈ సమస్యకు ఎటువంటి సొల్యూషన్ చూపిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. మూడుముక్కలాట తమ సంస్థలో పని మానేసిన ఉద్యోగులు ఏడాది పాటు పోటీ సంస్థల్లో ఉద్యోగాలు చేయడానికి వీలు లేదంటూ నాన్ కాంపిట్ అగ్రిమెంట్‌ను ఇన్ఫోసిస్ తెర మీదకు తెచ్చింది. ఇది తమ హక్కులను కాలరాయడమే అంటూ ఉద్యోగులు నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయిస్ సెనేట్ (నైట్స్)గా ఏర్పడి పోరాటం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ కేంద్ర కార్మిఖ శాఖకు ఫిర్యాదు చేశారు. దీంతో నాసెంట్, ఇన్ఫోసిస్, కేంద్ర కార్మిక శాఖల మధ్య ఈ అంశం చక్కర్లు కొడుతోంది. చదవండి: ఉద్యోగుల షాక్, ఇన్ఫోసిస్‌కు కేంద్రం నోటీసులు! -
కేంద్రం వర్సెస్ ఇన్ఫోసిస్.. బిగుస్తున్న పీటముడి
ఉద్యోగుల వలస నియంత్రించేందుకు ఇన్ఫోసిస్ కొత్తగా తీసుకువచ్చిన నిబంధన పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. ముందుగా ఉద్యోగులు యాజమాన్యం మధ్యన మొదలైన వివాదంలోకి ఇప్పుడు కేంద్ర కార్మిక శాఖ ఎంట్రీ ఇచ్చింది. ఇన్పోసిస్ ఉద్యోగుల సమాఖ్య లేవనెత్తిన ఆరోపణలపై మే 2022 మే 16లోపు రాత పూర్వక సమాధానం ఇవ్వాలని, అదే విధంగా మే 17న జరిగే సమావేశానికి స్వయంగా ఇన్ఫోసిస్ ప్రతినిధులు హాజరు కావాలంటూ స్ఫష్టమైన ఆదేశాలు జారీ చేసింది. తమ సంస్థలో రాజీనామా చేసిన ఉద్యోగులు పోటీ సంస్థల్లో ఏడాది పాటు ఉద్యోగాలు చేయొద్దంటూ ఇన్ఫోసిస్ విధించిన నియమంతో వివాదం రాజుకుంది. ఏడాది ఉద్యోగాలు చేయకుండా ఇన్ఫోసిస్ తమ హక్కులను కాలరాస్తుందంటూ ఉద్యోగుల సమాఖ్య నాసెంట్ ఐటీ ఎంపాయిస్ సెనెట్ కేంద్ర కార్మిక శాఖను ఆశ్రయించింది. నాసెంట్ ఫిర్యాదుపై స్పందించిన కార్మిక శాఖ ఈ అంశంపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన సమావేశానికి రావాల్సిందిగా ఇన్ఫోసిస్ని కోరింది. అయితే కార్మిక శాఖ కోరినట్టుగా 2022 ఏప్రిల్ 28న తాము ఆ సమావేశానికి హాజరు కాలేమంటూ ఇన్ఫోసిస్ తెలిపింది. అంతేకాదు అసలు నాసెంట్ నుంచి తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని తెలిపింది. ఇన్ఫోసిస్ మొదటి దఫా చర్చలకు గైర్హాజరు కావడంతో ఈ సారి కేంద్ర కార్మిక శాఖ ఈ అంశంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఇన్ఫోసిస్ హెచ్ఆర్ గ్లోబల్ హెడ్ క్రిష్ శంకర్‌కి కేంద్ర కార్మిక శాఖ డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ రెమిస్ తిరు నేరుగా లేఖ రాశారు. నాసెంట్ పేర్కొన్న ఫిర్యాదులపై రాత పూర్వకంగా మే 16లోపు సమాధానం ఇవ్వాలని, అంతేకాకుండా మే 17 ఏర్పాటు చేసిన సమావేశానికి తప్పనిసరిగా ఇన్ఫోసిస్ ప్రతినిధులు హాజరు కావాలంటూ ఆ లేఖలో స్పష్టం చేశారు. దీనిపై ఇన్ఫోసిస్ ఎలా స్పందిస్తుందో చూడాలి. చదవండి: ఇన్ఫోసిస్ ధిక్కార స్వరం.. కేంద్రంతో చర్చలకు దూరం -
ఇన్ఫోసిస్ ధిక్కార స్వరం.. కేంద్రంతో చర్చలకు దూరం
రాజీనామా చేసిన ఉద్యోగులు తమకు పోటీగా ఉన్న సంస్థల్లో ఏడాది పాటు ఉద్యోగం చేయకూడదంటూ ఇన్ఫోసిస్ విధించిన నిబంధన చినికి చినికి గాలివానగా మారుతోంది. ఈ వివాదంపై ఇటు ఉద్యోగ సంఘాలు, ఇన్ఫోసిస్ మేనేజ్మెంట్ వెవక్కి తగ్గడం లేదు. ఆఖరికి ఇన్ఫోసిస్ ఉద్యోగులు, ఆ సంస్థ మధ్య తలెత్తిన విభేదాలు పరిష్కరించేందుకు 2022 ఏప్రిల్ 28న కేంద్ర కార్మిక శాఖ ఏర్పాటు చేసిన సమావేశానికి ఇన్పోసిస్ గైర్హాజరవడంతో వివాదం మరింత బిగుసుకుంది. ప్రముఖ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ కార్మిక చట్టాలను ఉల్లంఘించిందని ఆరోపిస్తూ ఉద్యోగుల సంఘం నాసెంట్ ఐటీ ఎంప్లాయీ సెనేట్ (ఎన్ఐటీఈఎస్) కేంద్రానికి ఫిర్యాదు చేసింది. దీంతో రాజీనామా చేసిన ఉద్యోగులు తిరిగి వేరే కంపెనీలో ఏడాది పాటు చేరకూడదనే నిబంధనపై చర్చించేందుకు కేంద్ర కార్మిక శాఖ ఇన్ఫోసిస్‌కు నోటీసులు జారీ చేసింది. దీని ప్రకారం 2022 ఏప్రిల్ 28న కార్మిక శాఖ, ఉద్యోగ సంఘాలు, ఇన్ఫోసిస్ యాజమాన్యం చర్చించాల్సి ఉంది. కానీ ఈ సమావేశానికి హాజరుకాలేమంటూ ఇన్ఫోసిస్ ప్రతినిధులు తెలిపారు. దీంతో కనీసం జూమ్‌లో అయినా చర్చలో పాల్గొనాలని కోరగా దానికి కూడా ఇన్ఫోసిస్ నుంచి సానుకూల స్పందన రాలేదు. దీంతో మే 16న మరోసారి ఈ అంశంపై చర్చిద్దామంటూ కార్మిక శాఖ కొత్త తేదీని నిర్ణయించింది. దేశంలోనే దిగ్గజ ఐటీ కంపెనీల్లో ఒకటిగా ఉన్న ఇన్ఫోసిస్ తాను తీసుకున్న నిర్ణయంపై వెనక్కి తగ్గే సూచనలు కనిపించడం లేదు. మరోవైపు తమ సహాజ హక్కులను ఇన్ఫోసిస్ కాలరాస్తోందని ఉద్యోగులు అంటున్నారు. దీంతో ఈ వివాదం మరింతగా ముదురుతోంది. ఇన్ఫోసిస్ తరహాలోనే మరిన్ని కంపెనీలు ఇలాంటి నిర్ణయం తీసుకుంటే కార్మికులు, ఉద్యోగుల రక్షణ మాటేమిటనే వాదన వినిపిస్తోంది. మరోవైపు ప్రభుత్వాల జోక్యం పెరిగితే కార్పొరేట్ కంపెనీలు ఎలా స్పందిస్తాయనే అనుమానాలు పీకుతున్నాయి. దీంతో ఈ వివాదం తర్వాత ఏ మలుపు తీసుకుంటుందో చూడాలంటూ 2022 మే 16 వరకు ఆగాల్సిందే. చదవండి: ఉద్యోగుల షాక్, ఇన్ఫోసిస్‌కు కేంద్రం నోటీసులు! చదవండి: ఇన్ఫోసిస్ షాకింగ్ నిర్ణయం..కేంద్రం తలుపుతట్టిన ఐటీ ఉద్యోగులు..! -
ఇన్ఫోసిస్ షాకింగ్ నిర్ణయం..కేంద్రం తలుపుతట్టిన ఐటీ ఉద్యోగులు..!
ప్రముఖ దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సంచలన నిర్ణయం తీసుకుంది. టాప్-5 భారతీయ ఐటీ సంస్థలలో ఒకటైన ఇన్ఫోసిస్ తమ కంపెనీ నుంచి రాజీనామా చేసిన ఉద్యోగులందరికీ కొత్త నియమాన్ని విధించింది. రాజీనామా చేసిన ఉద్యోగులు ఆరు నెలల పాటు ఇన్ఫోసిస్‌తో సమానమైన టీసీఎస్, యాక్సెంచర్, ఐబీఎం, కాగ్నిజెంట్, విప్రో లాంటి పేరున్న కంపెనీల్లో పనిచేయకూడదని ఉద్యోగులకు ఇన్ఫోసిస్ కొత్త నిబంధనను తెచ్చింది. రాజీనామా చేసిన ఉద్యోగులకే కాకుండా కొత్తగా ఇన్ఫోసిస్‌లో జాయిన్ అయ్యే ఉద్యోగుల ఆఫర్ లెటర్లో కూడా ఈ నిబంధనను జోడించింది. ఆందోళనలో ఐటీ ఉద్యోగులు..! ఇన్ఫోసిస్ తెచ్చిన కొత్త నిబంధనపై ఐటీ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇన్ఫోసిస్‌కు వ్యతిరేకంగా ఐటీ ఉద్యోగుల సంఘం కేంద్రం తలుపుతట్టింది. ఇన్ఫోసిస్ నిర్ణయంపై కార్మిక మంత్రిత్వశాఖకు ప్రముఖ ఐటీ ఉద్యోగుల సంఘం నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్(NITES) ఫిర్యాదు చేసింది.ఇన్ఫోసిస్ తెచ్చిన క్రూర నిబంధనపై సమీక్షించాలని కేంద్రాన్ని కోరింది. నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ ప్రెసిడెంట్ హర్‌ప్రీత్ సలూజా ఈ ఫిర్యాదును దాఖలు చేశారు. ఈ ఫిర్యాదులో ఇన్ఫోసిస్ తెచ్చిన నిబంధన కాంట్రాక్ట్ చట్టంలోని సెక్షన్ 27 ప్రకారం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. ఇది ఉద్యోగుల హక్కులను నైతికంగా దెబ్బతీస్తోందని ఆరోపించారు. వలసలను ఆపేందుకు గానే..! భారత ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల అట్రిషన్ రేటు గణనీయంగా పెరిగింది. ఇన్ఫోసిస్‌లో కూడా అట్రిషన్ రేటు భారీగా ఉంది. గత 3 నెలల్లో 80,000 మందికి పైగా ఉద్యోగులు ఇన్ఫోసిస్‌కు రాజీనామా చేశారని తెలుస్తోంది. ఇక కంపెనీ అట్రిషన్ రేటు గణనీయంగా 27శాతంకు పెరిగింది. ఇన్ఫోసిస్ నుంచి ఉద్యోగుల వలసలను ఆపేందుకు గాను కంపెనీ ఈ కఠిన నిబంధనను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా భారత్‌లోని అన్నీ ఐటీ కంపెనీల్లో అట్రిషన్ రేటు ఇదే స్థాయిలో ఉండడం గమనార్హం. చదవండి: వరుసగా మూడోసారి రిలయన్స్ జియోకు గట్టి షాకిచ్చిన యూజర్లు..! జోష్‌లో ఎయిర్టెల్ -
వర్క్‌ఫ్రమ్ హోం.. శాలరీ స్ట్రక్చర్ ఓ కొలిక్కి!
దేశంలో వర్క్‌ఫ్రమ్ హోం విధానంలో కొనసాగే ఉద్యోగుల జీతభత్యాల రూపకల్పనకు సంబంధించిన కసరత్తులు తుది అంకానికి చేరుకున్నాయి. ఈ మేరకు కేంద్రం కార్మిక మంత్రిత్వ శాఖ, పరిశ్రమల విభాగం జరుపుతున్న చర్చలు ‘శాలరీ స్ట్రక్చర్’ని ఓ కొలిక్కి తీసుకొచ్చినట్లు సమాచారం. వర్క్‌ఫ్రమ్ హోంలో కొనసాగే ఉద్యోగులకు బేసిక్ శాలరీ, హైకులు, బోనస్‌ల నిర్ణయాలు పూర్తిగా కంపెనీవే. తాజాగా ‘తక్కువ ఇంటి అద్దె భత్యం నుంచి కొత్త తగ్గింపుల వరకు’.. కొన్ని ప్రతిపాదనలపై కేంద్రం, కంపెనీల ప్రతినిధుల మధ్య చర్చలు నడిచాయి. కొత్త వర్క్ మోడల్‌కు సరిపోయేలా ఒక లీగల్ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించే క్రమంలోనే ఇలా పారిశ్రామిక ప్రతినిధులతో కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ వరుస భేటీలు నిర్వహిస్తోందని ఒక ఉన్నతాధికారి వెల్లడించారు. హెచ్ఆర్ఏ మీదే.. వర్క్‌ఫ్రమ్ హోం ఎఫెక్ట్‌తో సొంతూళ్లకే పరిమితమైన ఉద్యోగుల కారణంగా ఇంటి అద్దె భత్యంలో తగ్గింపు, వైఫై-కరెంట్ బిల్లులపై రీయంబర్స్మెంట్ను ప్రవేశపెట్టడం గురించి తాజా భేటీలో చర్చించినట్లు తెలుస్తోంది. అయితే House Rent Allowance శాతం తగ్గించడంపై ఇంకా తుది నిర్ణయానికి రాలేదని, మరో భేటీలో ఈ అంశంపై స్పష్టత రావొచ్చని చెప్తున్నారు. ఆపై సిద్ధం చేసిన డ్రాఫ్ట్‌ను ఆర్థిక మంత్రిత్వ శాఖకు పంపిస్తారు. తద్వారా ట్యాక్స్ చట్టాలకు అవసరమైన సవరణలకు లైన్ క్లియర్ అవుతుంది. ఈ మేరకు బడ్జెట్-2022లో ఈ విషయాల్ని పొందుపరుస్తారనే ప్రచారం నడుస్తున్నప్పటికీ.. అంత సమయం లేకపోవడంతో జరిగేది కష్టమేననే అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. ఇబ్బందులు లేకుండా చూడండి ఇదిలా ఉంటే జనవరి 13న భారత్‌కు చెందిన కొన్ని కంపెనీల హెచ్ఆర్ హెడ్స్, సీఈవోలతో కార్మిక మంతత్రిత్వ శాఖ భేటీ జరిపింది. కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో.. ఉపాధి కల్పనను పెంపొందించడం, శ్రామిక శక్తి యొక్క భవిష్యత్తు నైపుణ్యాన్ని పెంపొందించడం, ఉత్పాదకతను పెంపొందించడంతో పాటు వర్క్‌ఫ్రమ్ హోం విధి విధానాలపై చర్చ జరిగిందని సమాచారం. యజమానులు- ఉద్యోగుల మధ్య వివాదాల పరిష్కారం, ఏర్పడబోయే ఇబ్బందుల్ని తొలగించడానికి వర్క్ ఫ్రమ్ హోమ్ మోడల్ కోసం ‘‘సమగ్ర’’ నియమాలు, నిబంధనలను రూపొందించాలని వారు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇదివరకే.. గత ఏడాది జనవరిలో ప్రభుత్వం స్టాండింగ్ ఆర్డర్ ద్వారా సర్వీస్‌సెక్టార్‌కి ఇంటి నుండి పనిని లాంఛనప్రాయంగా చేసింది. యజమానులు మరియు ఉద్యోగులు పని గంటలు మరియు ఇతర సేవా పరిస్థితులపై పరస్పరం నిర్ణయించుకునేలా చేసింది. అయితే కరోనా పరిస్థితులు కొనసాగుతున్న తరుణంలో ప్రభుత్వం ఇప్పుడు అన్ని రంగాలకు సమగ్ర అధికారిక నిర్మాణాన్ని తీసుకురావాలని యోచిస్తోంది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా కూడా ప్రభుత్వం తన ప్రీ-బడ్జెట్ మెమోరాండమ్‌లో పని నుండి ఇంటి ఖర్చులపై పన్ను మినహాయింపు ఇవ్వాలని సిఫారసు చేసింది. ‘‘ఫర్నీచర్/ఇతర సెటప్ ఛార్జీల కోసం అయ్యే ఖర్చులు ప్రత్యేకంగా మినహాయింపొచ్చు’’ అని ICAI సూచించింది. కన్సల్టెన్సీ సంస్థ డెలాయిట్ ఇండియా యొక్క ప్రీ-బడ్జెట్ ఎక్స్పెక్టేషన్ 2022 నివేదిక ఉద్యోగుల కోసం ‘‘వర్క్ ఫ్రమ్ హోమ్’’ ఖర్చులపై మరిన్ని తగ్గింపులను సూచించింది. ‘‘ప్రస్తుత పరిస్థితిని పరిగణనలోకి తీసుకుంటే, ఉద్యోగులు వ్యాపారాలలో ఇంటి నుండి పని చేస్తున్నారు’’’అని అకౌంటింగ్ విభాగం పేర్కొంది, ఉద్యోగులకు అదనంగా రూ. 50,000 WFH భత్యాన్ని సిఫార్సు చేసింది. మరోవైపు పరిశ్రమల సంస్థ నాస్కామ్.. వర్క్‌ఫ్రమ్ హోంకు మద్దతుగా ప్రభుత్వం లేబర్ చట్టాల్లో చేయగల ఆరు చర్యలను సిఫార్సు చేసింది. పని గంటలు, షిఫ్ట్ సమయాలను మార్చేయడం లాంటి కార్మిక చట్టాలలో మార్పుల్ని నాస్కామ్ పేర్కొంది. అంతేకాదు ఉద్యోగులు చేసే ఖర్చుల నుండి ఆదాయపు పన్ను చట్టాలలో మార్పులను సిఫార్సు చేసింది. ప్రధానంగా ఇంటి నుండి పనిని వ్యాపార ఖర్చులుగా పరిగణించాలని సూచించింది. నాస్కామ్ సమర్పించిన సిఫార్సుల నివేదికను కిందటి ఏడాది మే నెలలోనే.. పరిశ్రమల ప్రతినిధులతో ప్రభుత్వ అధికారుల చర్చించి.. ఆపై ఆ నివేదికను కార్మిక మంత్రిత్వ శాఖ, టెలికమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖకు పంపారు. చదవండి: ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ఐటీ కంపెనీల కీలక నిర్ణయం! -
Minimum Wages: జీతాలు పెరగబోతున్నాయా ?
న్యూఢిల్లీ: పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, కోవిడ్ ఎఫెక్ట్ కారణంగా తగ్గిన ఆదాయంతో సతమతం అవుతున్న ప్రైవేటు రంగంలోని ఉద్యోగులు, కార్మికుల కష్టాలు తీర్చేందుకు ఢిల్లీ సర్కారు ముందుకు వచ్చింది. కనీస వేతనం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. స్కిల్డ్, సెమీ స్కిల్డ్, అన్‌స్కిల్డ్ అందరికీ కరువు భత్యం పెంచుతున్నట్టు ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా శనివారం ప్రకటించారు. 2021 ఏప్రిల్ 21 నుంచి ఈ పెంపు వర్తిస్తుందని తెలిపారు. ఢిల్లీ ప్రభుత్వ నిర్ణయంతో ఒక్కసారిగా కార్మిక లోకంలో సంతోషం వెల్లివిరుస్తోంది. కేంద్రం సైతం మరోవైపు కనీస వేతనాలపై కేంద్రం కూడా స్పందించింది. ఇటీవల కార్మికులకు కనీస వేతనాలు పెంచేందుకు ఇటీవల ఆర్థిక వేత్త అజిత్ మిశ్రా నేతృత్వంలో కేంద్రం కమిటీని నియమించింది. ఈ కమిటీ కాలపరిమితి మూడేళ్లు. అయితే కనీస వేతనాలపై ఢిల్లీ ప్రభుత్వం నుంచి ప్రకటన రాగానే కేంద్రంపై ఒత్తిడి పెరిగింది. కేవలం కాలయాపన చేసేందుకే అజిత్ మిశ్రా కమిటీ వేశారంటూ విమర్శలు వచ్చాయి. దీంతో కేంద్రం స్పందించింది. కమిటీ పేరుతో కాలయాపన చేయబోమని కనీస వేతనాలపై త్వరగానే నిర్ణయం తీసుకుంటామంటూ కేంద్ర కార్మిక శాఖ నుంచి ప్రకటన వచ్చింది. జూన్ 29న కనీస వేతనాలకు సంబంధించి జూన 14న అజిత్ మిశ్రా కమిటీ ఓసారి సమావేశమైంది. జూన్ 29న రెండో సారి సమావేశం కావాల్సి ఉంది. కోవిడ్ ఇబ్బందుల నేపథ్యంలో మిశ్రా కమిటీ నుంచి త్వరగానే నివేదిక తెప్పించుకుని కేంద్రం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. -
నిరుద్యోగుల కోసం టీసీఎస్ శిక్షణ
న్యూఢిల్లీ: దేశంలోని నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు కార్మిక శాఖ చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)తో ఒప్పందం కుదుర్చుకుంది. ముఖ్యంగా నిరుద్యోగులకు ఉచిత నైపుణ్య శిక్షణను అందించడమే టీసీఎస్ అయాన్ కోర్సు లక్క్ష్యమని ఐటీ దిగ్గజం టీసీఎస్ పేర్కొంది. అయితే శిక్షణకు హాజరయ్యే వారు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నేషనల్ కెరీర్ సర్వీస్ (ఎన్సీఎస్) పోర్టల్‌లో పేరును నమోదు చేసుకోవాలని కార్మిక శాఖ పేర్కొంది. టీసీఎస్ స్పందిస్తూ.. అభ్యర్థులు ఒత్తిడికి గురికాకుండా వ్యక్తిత్వ వికాసం, జీవ నైపుణ్యాలకు కోర్సులో అధిక ప్రాధాన్యత కల్పించామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. శిక్షణలో కోర్సుకు సంబంధించిన వివిధ మాడ్యూల్స్, కార్పొరేట్ వ్యవస్థ, భావోద్వేగ నియంత్రణ, అత్యాధునిక సాంకేతికత అంశాలపై శిక్షణ ఇస్తామని టీసీఎస్ స్పష్టం చేసింది. విద్యార్థుల నుంచి కంపెనీలు ఆశించే నైపుణ్యాల ఆధారంగానే కోర్సును రూపకల్పన చేశామని సంస్థ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. టీసీఎస్ అయాన్ కోర్సును హిందీ, ఇంగ్లీష్ భాషలలో బోధిస్తామని టీసీఎస్ తెలిపింది. ఎన్సీఎస్ పోర్టల్‌లో ఇప్పటి వరకు కోటి మంది నమోదు చేసుకోగా.. 73 లక్షల మందికి ఉపాధి కల్పించామని కార్మిక శాఖ వెల్లడించింది. ఎన్‌సీఎస్‌లో ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,000 ఉపాధి ఎక్స్చేంజ్లు, 200 మోడల్ ఉపాధి కేంద్రాలు నమోదు చేసుకున్నట్లు కార్మిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. కాగా కేంద్ర కార్మిక శాఖతో కలిసి పనిచేయడం పట్ల టీసీఎస్ హర్షం వ్యక్తం చేసింది. చదవండి: వారికి భారీ జీతాలు సమంజసమే - టీసీఎస్ -
వేతన ఫిర్యాదుల పరిష్కారానికి 20 కంట్రోల్ రూమ్‌లు
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కార్మికులకు ఎదురవుతున్న పలు సమస్యల పరిష్కారానికి గాను కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ చీఫ్ లేబర్ కమిషనర్(సీఎల్సీ) (సీ) నేతృత్వంలో దేశవ్యాప్తంగా 20 కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసింది. కేంద్ర పరిధిలో పనిచేసే కార్మికుల వేతన సంబంధిత ఫిర్యాదులను పరిష్కరించడం, దేశంలోని వివిధ రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో వలస కార్మికుల సమస్యలను తగ్గించడం వంటి లక్ష్యాలతో వీటిని ఏర్పాటు చేశారు. ఈ కంట్రోల్ రూమ్‌లను లేబర్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్లు, అసిస్టెంట్ లేబర్ కమిషనర్లు, ప్రాంతీయ కార్మిక కమిషనర్లు, ఆయా ప్రాంతాల డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ల ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. ఈ కాల్ సెంటర్లను కార్మికులు వివిధ సమస్యల నిమిత్తం ఫోన్ చేయడం లేదా వాట్సాప్, ఈ–మెయిల్స్ ద్వారా కూడా సంప్రదించవచ్చు. ఈ మొత్తం 20 కాల్ సెంటర్ల పనితీరును ప్రతిరోజూ కేంద్ర కార్యాలయం నుంచి చీఫ్ లేబర్ కమిషనర్ (సీ) పర్యవేక్షిస్తున్నారు. కాల్ సెంటర్లు ఇవే.. హైదరాబాద్, అహ్మదాబాద్, అజ్మీర్, బెంగళూరు, చండీగఢ్, అసన్సోల్, భువనేశ్వర్, కొచ్చి, చెన్నై, డెహ్రాడూన్, ధన్‌బాద్, గువాహటి, జబల్పూర్, కాన్పూర్, ముంబై, నాగ్‌పూర్, పట్నా, రాయ్‌పూర్‌లో ఈ కాల్ సెంటర్లను ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాలకు హైదరాబాద్ కేంద్రంగా కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, యానాం, పుదుచ్చేరి ప్రాంతాల్లో ఉన్న కార్మికులు లాక్డౌన్ సమయంలో ఎదురవుతున్న సమస్యలను గురించి అధికారులు వీటీ థామస్ (ఫోన్ నం: 94962 04401), పి.లక్ష్మణ్ (ఫోన్ నం: 83285 04888), ఎ.చతుర్వేది (ఫోన్ నం: 85520 08109)లకు తెలియజేస్తే అధికారులు తగిన పరిష్కారం చూపుతారని కార్మిక శాఖ తెలిపింది. -
4 కోట్ల ఈఎస్ఐ లబ్దిదారులకు గుడ్ న్యూస్
సాక్షి, న్యూఢిల్లీ : ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ (ఇఎస్ఐసీ) ఉద్యోగుల రాజ్య బీమా సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. ఆరోగ్య బీమా కోసం ఉద్యోగులు, యాజమాన్యం చెల్లిస్తున్న మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం భారీగా తగ్గించింది. సంయుక్తంగా దీన్ని 6.5 శాతం నుంచి 4 శాతానికి తగ్గిస్తున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు గురువారం కేంద్ర కార్మిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం వచ్చే నెల (జూలై) ఒకటవ తేదీ నుంచి అమలులోకి రానుంది. దాదాపు 22 ఏళ్ల తర్వాత ఈఎస్ఐపై కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకోవడం విశేషం. ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ యాక్ట్ కింద 6.5 శాతం నుండి 4 శాతానికి తగ్గించేందుకు ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటి వరకు 6 శాతం చెల్లింపు వాటాలో ఎంప్లాయర్ (యజమాని) 4.75 శాతం, ఉద్యోగి 1.75 శాతం చెల్లించేవారు. తాజా ఆదేశాల ప్రకారం జూలై 1వ తేదీ నుంచి యాజమాన్యం వాటా 4.75 నుంచి 3.25 శాతానికి, ఉద్యోగి వాటా శాతం 1.75 నుంచి 0.75 శాతానికి తగ్గనుంది. ఈ నిర్ణయం వల్ల 3.6 కోట్ల మంది ఉద్యోగులకు, 12.85 లక్షల యాజమాన్యాలకు ప్రయోజనం చేకూరనుంది. దీని వల్ల సంబంధిత ఇండస్ట్రీకి ఏడాదికి రూ.5,000 కోట్లు ఆదా కానున్నాయని కార్మిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఒక ప్రకటనలో వెల్లడించింది. ఉద్యోగులు, యాజమాన్యాలు చెల్లించే మొత్తాన్ని తగ్గించడం ద్వారా మరింత మంది ఈఎస్ఐలో చేరే అవకాశం ఉందని, దీనివల్ల వారు కూడా సంఘటిత రంగ కార్మికులుగా మారతారని మంత్రిత్వ శాఖ పేర్కొంది. సులభతర వాణిజ్యాన్ని ప్రోత్సహించాలన్న లక్ష్యంలో భాగంగా యాజమాన్యాలపై భారం తగ్గించాలని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఈఎస్ఐకి చందాల రూపంలో రూ.22,279 కోట్లు సమకూరాయి. కాగా జనవరి 1, 2017 నుంచి అప్పటివరకూ రూ. 15 వేలుగా ఉన్న వేతన పరిమితిని 21 వేలకు పెంచింది. దీంతో ప్రస్తుతం నెలకు రూ.21,000 వరకు వచ్చేవారు ఈఎస్ఐ బెనిఫిట్స్‌కు అర్హులు. నెలకు రూ. 21వేల లోపు జీతం ఉన్నవారు ఈఎస్ఐలో చేరితే వారికి అనారోగ్య సమయంలో వైద్యసేవలతో పాటు, సందర్భాన్నిబట్టి నగదు సాయం కూడా లభిస్తుంది. -
45 ఏళ్ల గరిష్టానికి నిరుద్యోగిత..!
న్యూఢిల్లీ: కేంద్రంలో గురువారం కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ప్రధాని నరేంద్రమోదీతో సహా 58 మంది కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేశారు. ఇక ఎన్నికల ముందు తయారైన జాతీయ నమూనా సర్వే సంస్థ(ఎన్ఎస్ఎస్ఓ) నిర్వహించిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పీఎల్ఎఫ్ఎస్) వివరాలు వెల్లడయ్యాయి. సర్వే వివరాలను కేంద్ర కార్మిక శాఖ శుక్రవారం బహిర్గతం చేసింది. 2017–18 సంవత్సరంలో దేశంలో నిరుద్యోగం రేటు 6.1 శాతంగా ఉందని తెలిపింది. ఇది గడిచిన 45 ఏళ్లలో గరిష్టమని వెల్లడించింది. గత ఏడాది(2017–18) పట్టణ ప్రాంత పురుషుల్లో 7.8 శాతం, మహిళల్లో 5.3 శాతం నిరుద్యోగంలో ఉన్నారని తెలిపింది. ఇక దేశవ్యాప్తంగా గత ఏడాది (2017–18) పురుషుల్లో 6.2 శాతం, మహిళల్లో 5.7 శాతం నిరుద్యోగిత ఉందని సర్వే పేర్కొంది. ఇక ఎన్నికలకు ముందే పీఎల్ఎఫ్ఎస్ పూర్తయింది. సర్వే వివరాలు కూడా అనధికారికంగా ఫిబ్రవరిలోనే వెల్లడయ్యాయి. అయితే, ప్రజల్లోకి ప్రతికూల సంకేతాలు వెళతాయనే ఉద్దేశంతో సర్వే వివరాలను ప్రభుత్వం బయటపెట్టలేదు. ఈ నివేదిక ముసాయిదా మాత్రమేననీ, దీనిని ప్రభుత్వం ఇంకా ఆమోదించలేదని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ తెలిపారు. (50 ఏళ్ల గరిష్టానికి నిరుద్యోగం) -
తగ్గనున్న ఈపీఎఫ్.. పెరగనున్న వేతనాలు
న్యూఢిల్లీ : టేక్-హోమ్ శాలరీ చాలా తక్కువగా వస్తోందని బాధపడుతున్నారా? అయితే ఇక ఆ దిగులును ప్రభుత్వం కాస్త తగ్గించబోతుంది. ఉద్యోగుల టేక్-హోమ్ శాలరీని పెంచాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోంది. దీని కోసం ఉద్యోగుల వేతనాల్లోంచి తీసుకునే సామాజిక భద్రత సహకారం(సోషల్ సెక్యురిటీ కాంట్రిబ్యూషన్)ను తగ్గించేందుకు ప్రతిపాదనలు రూపొందిస్తోంది. దేశంలో ఉన్న ఉద్యోగులందరికీ ఒకే విధమైన సామాజిక భద్రత సహకారం ఉండేలా కార్మిక మంత్రిత్వ శాఖ కమిటీ పనిచేస్తుందని.. ప్రస్తుతమున్న సీలింగ్ 24 శాతాన్ని, 2 శాతం తగ్గించాలని ప్రభుత్వం ప్రతిపాదనలను తయారు చేస్తుందని ఓ సీనియర్ ప్రభుత్వ అధికారి తెలిపారు. ప్రస్తుతం ఉద్యోగుల సహకారం కింద వారి బేసిక్ వేతనం నుంచి 12 శాతాన్ని ఈపీఎఫ్‌కి అందిస్తున్నారు. అంతేకాక ఆర్గనైజేషన్స్ కూడా ఉద్యోగుల బేసిక్ వేతనం నుంచి 3.67 శాతాన్ని తమ సహకారం కింద ఈపీఎఫ్‌లో క్రెడిట్ చేస్తున్నాయి. ఈపీఎస్ లేదా ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్ కింద 8.33 శాతం మైనస్ అవుతుంది. ఇవన్నీ కలిపి మొత్తంగా 24 శాతం ఉద్యోగుల బేసిక్ వేతనం నుంచి కట్ అవుతుంది. తాజాగా ఉద్యోగుల ఈపీఎఫ్ సహకారాన్ని 12 శాతం నుంచి 10 శాతానికి తగ్గించాలని ప్రభుత్వం చూస్తోంది. దీంతో ఉద్యోగుల టేక్-హోమ్ శాలరీ పెరగబోతుంది. ప్రస్తుతం 20 మంది కంటే తక్కువ ఉద్యోగులున్న సంస్థలకు కేవలం 10 శాతం మాత్రమే ఈపీఎఫ్ సహకారం ఉంది. ఇదే విధానాన్ని అన్ని ఆర్గనైజేషన్లకు అమలు చేయాలని ప్రభుత్వం ఈ ప్రతిపాదనలు రూపొందిస్తోంది. దీంతో 10 కోట్ల మంది ఈపీఎఫ్ఓ సబ్స్క్రైబర్లకు లబ్ది చేకూరనుంది. ఒక్కసారి కార్మిక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన కమిటీ ఈ ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే, ఆ మంత్రిత్వ శాఖ వాటాదారులతో సంప్రదింపులు జరుపుతుంది. ప్రస్తుతం సామాజిక భద్రత స్కీమ్ కింద 10 కోట్ల మంది ఉద్యోగులున్నారు. వీరిని 5 రెట్లు అంటే 50 కోట్లకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. సామాజిక భద్రత సహకారం తగ్గితే, ఇటు ఉద్యోగులు, అటు ఆర్గనైజేషన్లకు రెండింటికీ ప్రయోజనం చేకూరనుందని ప్రభుత్వ అధికారులు చెప్పారు. -
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో బొనాంజ
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరో బంపర్ బొనాంజ పొందబోతున్నారు. వేతన కమిషన్ బొనాంజతో ఇప్పటికే 2 శాతం పెరిగిన డియర్నెస్ అలవెన్స్(డీఏ), మరో విడత వేతన పెంపు ఉండబోతుందని తెలుస్తోంది. డీఏను గణించడానికి ఇండెక్స్‌ను, బేస్ ఇయర్‌ను ప్రభుత్వ సవరించబోతుంది. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరోసారి వేతనం పెరగబోతుందని తెలుస్తోంది. కార్మికుల డీఏను నిర్ణయించడానికి ... ఇండస్ట్రియల్ వర్కర్ల కోసం కొత్త సిరీస్ వినియోగదారుల ధరల సూచీపై కార్మిక మంత్రిత్వ శాఖ పనిచేస్తోందని తెలిసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రభుత్వ రంగ ఉద్యోగులకు, పెన్షనర్లకు జీవన సర్దుబాటు భత్యం ఖర్చు కింద డీఏను చెల్లిస్తారు. బేస్ ఇయర్ 2016తో కొత్త సీపీఐ-ఐడబ్ల్యూను కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ కింద పనిచేసే లేబర్ బ్యూరో ఖరారు చేసిందని ప్రభుత్వ రంగ సీనియర్ అధికారి చెప్పారు. జీవన ఖర్చులు మారుతుండటంతో, ప్రతి ఆరేళ్లకు ఒక్కసారి ఈ బేస్‌ను కూడా మార్చాలని ప్రతిపాదించామని తెలిపారు. ప్రస్తుతమున్న సీపీఐ-ఐడబ్ల్యూ 2001 బేస్ ఇయర్ అని పేర్కొన్నారు. బేస్ ఇయర్‌ను మార్చడంతో, ప్రస్తుతం 1.1 కోట్ల మంది ఉద్యోగులకు, పెన్షనర్లకు లబ్ది చేకూరనుంది. గతంలో 2006లో బేస్ ఇయర్‌ను మార్చారు. కాగ, 7వ వేతన కమిషన్ ప్రతిపాదనల మేరకు మార్చిలోనే కేంద్ర కేబినెట్ డీఏను 5 శాతం నుంచి 7 శాతానికి పెంచింది. ఈ పెంచిన డీఏ 2018 జనవరి నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో 48.41 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 61.17 లక్షల మంది పెన్షనర్లు లబ్ది పొందుతున్నారు. -
ఈపీఎఫ్ ఉపసంహరణలపై మరో మెలిక
న్యూఢిల్లీ: ఉద్యోగుల ప్రావిడెండ్ ఫండ్ (భవిష్య నిధి) విత్ డ్రాయల్స్‌పై ప్రతిపాదించిన పన్నుపై వెనక్కి తగ్గిన కేంద్ర ప్రభుత్వం, ఉపసంహరణలపై మరో మెలిక పెట్టింది. సోమవారం ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ సహకారం ఉపసంహరణకు సంబంధించిన పరిమితులను సడలిస్తూ కార్మిక శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇకముందు కొన్ని ప్రత్యేక కారణాలతో ఈపీఎఫ్ ఖాతాలోని పూర్తి సొమ్ము ఉపసంహరణకు అనుమతినిస్తున్నట్టు ప్రకటించింది. ఈ తాజా మార్పుల ప్రకారం ఇకముందు ఈపీఎఫ్ సొమ్ము ఉపసంహరణకు ఖాతాదారుడు ఇల్లు కట్టుకోవడం, లేదా కొనడం, (హౌసింగ్) స్వీయ లేదా కుటుంబ సభ్యులు, పిల్లలకు దంత వైద్యం సహా ఇతర వైద్య ఖర్చులు నిమిత్తం, ఇంజనీరింగ్ విద్యకు లాంటి కారణాలపై మాత్రమే అనుమతిని మంజూరు చేసింది. దీంతోపాటుగా చందాదారుని పెళ్లి సమయంలో కూడా ఈ సొమ్ము విత్ డ్రా కు అనుమతి వుంది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చందాదారులు (అతడు లేక ఆమె) పూర్తి సంతృప్తికర సమాచారాన్ని అందించిన తరువాత, అప్పటివరకు ఖాతాలో ఉన్న సొమ్మును వడ్డీతో సహా చెల్లిస్తామని మంత్రిత్వ వర్గాలు ప్రకటించాయి. కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సభ్యులకు, సహాయక ప్రావిడెంట్ ఫండ్ లేదా వృద్ధాప్య పెన్షన్ల సభ్యులకు ఇది విస్తరించబడిందనీ, ఈ ఆగస్టు నుంచి ఈ నిబంధనలను అమలులోకి వస్తాయని తెలిపింది. కార్మిక సంఘాల ప్రాతినిధులతో, కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ చేసిన విజ్ఞప్తి మేరకు మార్పులు చేసినట్టు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కాగా ఈపీఎఫ్ లో ఏప్రిల్ 1 తర్వాత నుంచి దాచుకొనే మొత్తాలను వెనక్కి తీసుకోవాలనుకున్నప్పుడు 60 శాతం మొత్తం మీద ఆదాయ పన్ను ఉంటుందని కేంద్ర ఆర్థిక బడ్జెట్ లో మంత్రి అరుణ్ జైట్టీ పేర్కొన్నారు. దీనిపై దేశంలోని ఆరున్నర కోట్ల ఈపీఎఫ్ చందాదారులు ఆందోళనకు దిగడంతో ఆ ప్రతిపాదను విరమించుకున్న సంగతి తెలిసిందే. -
డ్రైవర్ల కుటుంబాల సంక్షేమానికి చర్యలు
విజయవాడ: డ్రైవర్ల కుటుంబాలలోని పిల్లలకు స్కాలర్షిప్లు అందించేందుకు వారి పూర్తి వివరాల సేకరణకు వెంటనే కాల్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులను ఆదేశించారు. శుక్రవారం విజయవాడలో చంద్రబాబు కార్మిక శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ప్రతి కార్మికుడికి అంతర్జాతీయ స్థాయిలో నైపుణ్యం పెంపొందాలని ఆయన ఆకాంక్షించారు. సంక్షేమ కార్యక్రమాల అమలులో జాప్యాన్ని సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. డ్రైవర్లకు ప్రమాద బీమా పథకం అమలులో జాప్యంపై చంద్రబాబు ఈ సందర్భంగా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ధవళేశ్వరం ప్రమాదంలో మృతి చెందిన డ్రైవర్ల కుటుంబాలకు వారం రోజుల్లో బీమా పరిహారం అందించినట్లే రాష్ట్రవ్యాప్తంగా ఇదే చొరవ, స్పందన చూపాలని చంద్రబాబు ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు.