
న్యూఢిల్లీ: మరింత మందికి ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ, మానవ వననరుల సేవలను అందించే టీమ్‌లీజ్ ఎడ్‌టెక్ చేతులు కలిపాయి. యూనివర్సిటీ విద్యార్థులకు నూతన కెరీర్ అవకాశాలు కల్పించేందుకు వీలుగా అవగాహన ఒప్పందం కుదిరింది.
ఉపాధి ఆధారిత డిగ్రీ కార్యక్రమాలను ఆఫర్ చేయనున్నట్టు టీమ్‌లీజ్ ఎడ్‌టెక్ ప్రకటించింది. కేంద్ర ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ కెరీర్ సర్వీస్(ఎన్‌సీసీ) పోర్టల్‌పై 200 వరకు ఉపాధి ఆధారిత డిగ్రీ పోగ్రామ్‌లను అందించనున్నట్టు తెలిపింది. ప్రతి ప్రోగ్రామ్ విడిగా 5 లక్షల మందికి పైగా ఇంటర్న్‌షిప్ అవకాశాలతో అధ్యయన అవకాశాలు కల్పించనుంది.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాండవీయ మాట్లాడుతూ.. టీమ్‌లీజ్ సహకారంతో అందించే డిగ్రీ ప్రోగ్రామ్‌లు అభ్యాసంతోపాటు, ప్రత్యక్ష అనుభవాన్ని సమన్వయం చేస్తుందని, యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు.