​Provident Fund Alert: How to Employees Provident Fund Account Transfer From EPFO Portal - Sakshi
Sakshi News home page

Employees Provident Fund: అకౌంట్‌ను ఈజీగా ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవచ్చు

Published Sat, Sep 11 2021 5:09 PM | Last Updated on Sat, Sep 18 2021 5:37 PM

​how To Employees Provident Fund Account Transfer From Epfo Portal    - Sakshi

ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. ఈపీఎఫ్‌ఓ అకౌంట్‌ను ఈజీగా ట్రాన్స్‌ఫర్‌ చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది.  

సాధారణంగా ఉద్యోగి ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మారినప్పుడు ఎంప్లాయ్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ అకౌంట్‌ను మార్చుకోవాలి. ఈ పద్దతి ఉద్యోగులకు తలకు మించిన భారంగా ఉండేది. అకౌంట్‌ను ట్రాన్స్‌ఫర్‌ చేయించుకోవడంతో పాటు డబ్బుల్ని విత్‌ డ్రాల్‌ చేసుకోవడం మరింత కష్టతరంగా మారింది. ఇప్పుడు ఆ సమస్యను పరిష్కరిస్తూ కేంద్రం ఎంప్లాయి ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ (ఈపీఎఫ్‌ఓ) కొత్త మార్గదర్శకాల్నిఅందుబాటులోకి తెచ్చింది. ఆ ప్రొసీజర్ ఫాలో అయితే చాలు సులభంగా ఉద్యోగులు ఈపీఎఫ్‌ అకౌంట్‌ను మార్చుకోవచ్చు.

అంతకంటే ముందు
మీ ఈపీఎఫ్‌ఓ అకౌంట్‌ను ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మార్చుకునేందుకు ముందు ఈ రూల్స్‌ను పాటించాల్సి ఉంటుంది.  రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ యాక్టివ్‌గా ఉండాలి. అకౌంట్‌ హోల్డర్‌  మునుపటి లేదా ప్రస్తుత సంస్థ EPFO​​లో డిజిటల్ రిజిస్టర్డ్  సంతకాలు కలిగి ఉండాలి. ఇది కాకుండా బ్యాంక్ కేవైసీ సరిగ్గా ఉందో? లేదో? చెక్‌ చేసుకోవాలి. ఆ తర్వాతనే అకౌంట్‌ను ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవచ్చు.    
      
అకౌంట్‌ను ఎలా ట్రాన్స్‌ఫర్‌ చేయాలి

• ఉద్యోగులు ముందుగా https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ వెబ్‌ సైట్‌ను ఓపెన్‌ చేయాలి.
 ఓపెన్‌ చేసి  యూఏఎన్‌(Universal Account Number),పాస్‌వర్డ్‌ను టైప్‌ చేసి ఎంటర్‌ బటన్‌ ను క్లిక్‌ చేయాలి.
 
• క్లిక్‌ చేసిన వెంటనే మనకు ఆన్‌ లైన్‌ సర్వీస్‌ ఆప్షన్‌ కనిపిస్తుంది. ఆ ఆప్షన్‌ను క్లిక్‌ చేసి'వన్‌ మెంబర్‌ - వన్‌ ఈపీఎఫ్‌ అకౌంట్‌పై క్లిక్‌ చేసి ట్రాన్స్‌ఫర్‌ రిక్వెస్ట్‌ పెట్టుకోవాలి

• రిక్వెస్ట్‌ తర్వాత గెట్‌ డీటెయిల్స్‌ ఆప్షన్‌ పై ట్యాప్‌ చేయాలి. 

• గెట్‌ డీటెయిల్స్‌ ఆప్షన్‌ క్లిక్‌ చేస్తే మీరు పాత సంస్థ ఈపీఎఫ్‌ఓ వివరాలు డిస్‌ ప్లే అవుతాయి.  

• ఆ తర్వాత ట్రాన్స్‌ ఫర్‌ చేసుకునేందుకు ధృవీకరణ ఫారం కోసం మునుపటి సంస్థ లేదా ప్రస్తుత సంస్థ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. 

• అనంతరం యూఏఎన్‌ రిజిస్ట్రర్డ్‌ మొబైల్‌ నెంబర్‌ కు ఓటీపీ వస్తుంది.  

• మొబైల్‌ నెంబర్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్‌ చేసి సబ‍్మిట్‌ బటన్‌ పై క్లిక్‌ చేయాలి.అలా క్లిక్‌ చేస్తే చాలు మీ అకౌంట్‌ ట్రాన్స్‌ఫర్‌ వెరిఫికేషన్‌ వెళుతుంది. అనంతరం ట్రాన్స్‌ఫర్‌ అవుతుంది. 

చదవండి: హ్యాకర్స్‌ రూట్‌ మార్చారు, స్కూల్‌ పిల్లల్ని టార్గెట్‌ చేస్తున్నారు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement