emplolyement scheme
-
ఈపీఎఫ్ఓలో ఫోటో ఎలా అప్లోడ్ చేయాలో తెలుసా? లేదంటే డబ్బులు రావు!
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు ముఖ్య గమనిక. ఈపీఎఫ్ఓ నుంచి డబ్బులు డ్రా చేయాలని అనుకుంటున్నారా? అయితే మీరు తప్పని సరిగా ఈ- నామినేషన్‌ను ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఈ నామినేషన్ ఫిల్ చేయకపోతే డబ్బులు డ్రా చేయలేం. కాబట్టి ఖాతాదారులు ఈ-నామినేషన్ ఫైల్ చేయాలని సంబంధిత శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే ఈ-నామినేషన్ ఫైలింగ్ చేస్తున్నా..కంప్లీట్ కావడం లేదంటే మీరు మీ అకౌంట్ ఫ్రొఫైల్‌ను అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఫ్రొఫైల్ అప్డేట్ చేయకపోతే ఈ- నామినేషన్ పూర్తి చేయలేమనే విషయాల్ని తప్పని సరిగా గుర్తుంచుకోవాలి. ప్రొఫెల్ పిక్చర్ ఎలా యాడ్ చేయాలంటే! ఈ - నామినేషన్ ఫైలింగ్‌కు ముందు అకౌంట్ ప్రొఫైల్ పిక్చర్ అప్డేట్ కోసం కొన్ని పద్దతుల్ని పాటించాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. స్టెప్1: ముందుగా యూఏఎన్ మెంబర్ ఐడీతో ఈపీఎఫ్ఓ అఫీషియల్ పోర్టల్‌లో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది సెప్ట్2: ఆ తర్వాత మెన్యూ సెక్షన్లో క్లిక్ చేస్తే ప్రొఫైల్ ఆప్షన్ కనిపిస్తుంది. స్టెప్3: ప్రొఫైల్ ఆప్షన్‌పై క్లిక్ చేసి వ్యక్తిగత వివరాల్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీకు లెప్ట్ సైడ్‌లో ప్రొఫైల్ ఫోటో ఆప్షన్ కనిపిస్తుంది. క్లిక్ చేసి ఫోటోను ఛేంజ్ చేయడం లేదంటే, అప్లోడ్ చేయాలి. స్టెప్4:ప్రొఫైల్ ఇమేజ్ మీద క్లిక్ చేసి ఈపీఎఫ్ఓలో మీ ఫోటో అప్లోడ్ చేయాలి. స్టెప్5: ఫోటో అప్లోడ్ అవ్వాలంటే మీ పాస్ పోర్ట్ ఫోటో సైజ్ 3.5సెంటీమీటర్లు* 4.5 సెంటీమీటర్లు ఉండేలా చూసుకోవాలి. స్టెప్6: మన రెండు చెవులు కనిపించేలా ఫోటో విజబుల్ 80శాతం ఉండేలా చూసుకోవాలి. స్టెప్7: ఆ ఫోటో ఇమేజ్ జేపీఈజీ,జేపీజీ,పీఎన్జీ ఫార్మాట్లో సేవ్ చేయాలి. స్టెప్8: ఆ తర్వాత అప్లోడ్ యువర్ ఫోటో మీద క్లిక్ చేసి ఓకే అనే ఆప్షన్ పై ట్యాప్ చేయాలి. దీంతో మీ ఫోటో అప్లోడ్ అవుతుంది. -
నిరుద్యోగులను వంచించిన బాబు సర్కార్
‘‘బాబు వస్తే జాబు వస్తుందన్నారు.ప్రభుత్వ ఉద్యోగాల జాతర అన్నారు. ఏడాదికో డీఎస్సీ అన్నారు. అధికారంలోకి వచ్చాక ఆ మాట మరిచారు. తీరా చూస్తే ఉద్యోగాల్లేవ్..ఇక రెండో రాగం నిరుద్యోగ భృతిని చంద్రబాబు నాలుగున్నరేళ్ల అనంతరం అందుకున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ పలు ఆంక్షలతో కంటితుడుపుగా తెరపైకి తెచ్చారు. ఇలా మాయమాటలతో నిరుద్యోగులను నిలువునా ముంచిన ఘనత సీఎం చంద్రబాబుది." సాక్షి, కాకినాడ సిటీ: 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు అధికారంలోకి రాక ముందు ప్రకటించిన నిరుద్యోగ భృతి, అధికారం చేపట్టిన నాలుగున్నరేళ్ల తర్వాత కార్యాచరణలోకి వచ్చింది. అదీ కూడా ప్రకటించిన మేరకు రూ.రెండు వేలు కాకుండా రూ. వెయ్యికే కుదించారు. రాష్ట్రంలో కోట్లలో నిరుద్యోగులుంటే సవాలక్ష ఆంక్షలు విధించి కేవలం పది లక్షల మందికే దానిని పరిమితం చేశారు. అదీ ప్రజాసాధికార సర్వేలో నమోదైతేనే అంటూ మరో మెలిక పెట్టారు. అడ్డంకులు సృష్టించి నిరుద్యోగ యువతను నిలువునా ముంచేశాడు. ఇదంతా చూడబోతే రైతు, డ్వాక్రా రుణమాఫీలను మించిన మాయగా ఉందని నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. యువనేస్తం పేరుతో నిరుద్యోగ యువతకు రిక్తహస్తం చూపారంటున్నారు. రూ.వెయ్యి చొప్పున ఇచ్చే భృతికి సవాలక్ష ఆంక్షలు పెట్టి అర్హుల సంఖ్యను తగ్గించే చర్యలు చేపట్టారని మండిపడుతున్నారు. జిల్లాలో పరిస్థితి ఇలా.. జిల్లాలో ప్రజాసాధికార సర్వేలో నమోదైన నిరుద్యోగుల 3.79 లక్షల మంది ఉంటే కేవలం 17,085 మందికే నిరుద్యోగ భృతి ఇవ్వడంపై చంద్రబాబు ప్రభుత్వ తీరుపై యువత మండిపడుతోంది. నిరుద్యోగ యువత నిన్ను నమ్మంబాబూ అంటూ నినదిస్తుంది.. నాలుగేళ్లుగా నిరాశే టీడీపీ ప్రభుత్వంలో గత నాలుగేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం ఎదురు చూసి నిరాశ చెందాం. ఆ ఎదురు చూపులకు ఫలితం లేకుండా పోయింది. నిరుద్యోగ భృతి కూడా నిరుద్యోగులకు రాలేదు. దీనికి భిన్నంగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ ప్రకటించి దానికి అనుగుణంగా భర్తీ చేస్తామనడం అభినందనీయం. -అడ్డూరి అవ్యక్త, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు, జగన్నాథపురం కాకినాడ ఉద్యోగ విప్లవం రావాలి 2014లో చంద్రబాబు ఇచ్చిన హామీ నమ్మి నిరుద్యోగులంతా మోసపోయాం. ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఐదేళ్లుగా ఎదురు చూశాం. కానీ ఉద్యోగావకాశాలు కల్పించలేదు. ఆ దిశగా ప్రయత్నాలు చేపట్టలేదు. నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. ఉద్యోగాల విప్లవం వైఎస్ జగన్‌తోనే సాధ్యం అని మేము నమ్ముతున్నాం. జె.రవితేజ, కాకినాడ నిలువునా ముంచిన ప్రభుత్వం నిరుద్యోగులను ప్రభుత్వం నిలువునా ముంచింది. 2014 ఎన్నికల్లో నిరుద్యోగులను అందలం ఎక్కిస్తాం అన్నట్టుగా ప్రచార ఆర్భాటాలు చేసి గెలిచిన తరువాత వారిని విస్మరించింది. కొందరికి మాత్రమే నిరుద్యోగ భృతి ఇచ్చి నిరుద్యోగులందరినీ ఆదుకున్నట్టు ప్రచారాలు చేస్తున్నారు. గీసాల వీరబాబు, విద్యార్థి విభాగం అధ్యక్షుడు, కాకినాడ ఉద్యోగావకాశాలు కల్పించలేదు ఇంటికో ఉద్యోగం వస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్న మా లాంటి వారికి ఉద్యోగావకాశాలు కల్పించ లేదు. కనీసం నిరుద్యోగ భృతి కూడా మంజూరు చేయలేదు. నిరుద్యోగులకు ప్రభుత్వం చేసింది శూన్యం. కనీసం ఇప్పుడైనా యువతకు ఉపాధి అవకాశాలు చూపించే ప్రభుత్వం రావాలి. బి. లక్ష్మీప్రసన్న, కాకినాడ ఆశ నిరాశైంది నేను డిగ్రీ వరకు చదివాను. చదివిన చదువుకు బయట ఎలాంటి ఉద్యోగం రాలేదు. ఉద్యోగ ప్రయత్నాలు చేసి విసిగి పోయాను. దీంతో ప్రభుత్వం ప్రకటించిన నిరుద్యోగ భృతి అందుతుందని ఆశలు పెట్టుకున్నా. కానీ ప్రభుత్వం పెట్టిన షరతుల కారణంగా భృతి అందలేదు. జే.పృథ్వీ, కాకినాడ బాబూ నిన్ను నమ్మం 2014 ఎన్నికల్లో రైతులను, డ్వాక్రా మహిళలను రుణమాఫీ పేరిట ఏమార్చిన చంద్రబాబు నిరుద్యోగ యువతను నిరుద్యోగ భృతి పేరిట నిలువునా ముంచారు. డిగ్రీలు పూర్తి చేసిన నిరుద్యోగులు ఎంతో మంది ఐదేళ్లుగా ఉద్యోగాల కోసం ఎదురుచూశారు. వారందరికీ రిక్తహస్తమే చూపారు. దీనికి తోడు నిరుద్యోగ భృతి కూడా ఇవ్వలేదు. నిరుద్యోగులు ఇక బాబును నమ్మే ప్రసక్తే లేదు. – కొత్తపల్లి గిరీష్, కాకినాడ బురిడీ కొట్టించారు నిరుద్యోగ భృతి పేరిట చంద్రబాబు అందరినీ బురిడీ కొట్టించారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీతో పాటు లక్షా యాభైవేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఇది నిరుద్యోగులకు మేలు చేసే అంశం. – జువ్వల కర్నేష్, కరప ఎన్నికల కోసమే తెలుగుదేశం ప్రభుత్వం ఐదేళ్లుగా ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వక, మరోపక్క ఇస్తానన్న నిరుద్యోగ భృతి ఇవ్వకుండా మోసం చేసింది. ఎన్నికలు వస్తుండడంతో ఆర్నెళ్ల నుంచి ఇస్తోంది. నిరుద్యోగ భృతికి సవాలక్ష నిబంధనలు పెట్టింది. ఎన్నో కొర్రీలు, మొదట రూ.1000 ఇచ్చి, ఇప్పుడు రూ.రెండు వేలు ఇస్తున్నారు. ఇదంతా ఎన్నికల కోసం చంద్రబాబు ఆడుతున్న డ్రామా. – కర్రి జగన్, కాకినాడ అంతా మోసం నేను బీటెక్ చదివాను. ఉద్యోగాలు కల్పిస్తానని చంద్రబాబు మాటిచ్చారు. ఒక వేళ ఉద్యోగం ఇవ్వకపోతే రూ.రెండు వేలు నిరుద్యోగ భృతి ఇస్తామంటే యువత అంతా చంద్రబాబుకు ఓటు వేశారు. కానీ ఉద్యోగాలు ఇవ్వలేదు. ఇప్పుడు ఎన్నికలొచ్చాయని నిరుద్యోగ భృతి ఇస్తున్నారు. అదీ కూడా కొందరికే ఇస్తున్నారు. ఇంజనీర్లు, పీజీలు, డిగ్రీలు చేసిన వారంతా కూలి పనులు చేసుకుంటున్నారు. ఇక చంద్రబాబును మ్మరు. బి.విజయ్, కాకినాడ -
కష్టఫలమేది?
పిట్లం, న్యూస్‌లైన్: ‘‘ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాలలో పనిలేని పేదలకు పనులు కల్పిస్తున్నాం.. ఇందుకు సంబంధిం చిన కూలి డబ్బులు వారంలోగా చెల్లిస్తున్నాం’’ అంటూ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రచారం చేస్తోంది. కానీ క్షేత్ర స్థాయిలో దానిని అమలు చేయడంలో విఫలమవుతోంది. అధికారుల పర్యవేక్షణ లోపమే దీనికి కారణం. ఫలితంగా ఉపాధి పనులు జరిగి నెలలు గడుస్తున్నా కూలీలకు డ బ్బులు అందడం లేదు. వారు అధికారులు, కార్యాలయాల చుట్టూ తిరిగి, తిరిగి వేసారిపోతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ వరకు పిట్లం మండలంలోని వివిధ గ్రామాలలో ఉపాధి పనులు జరిగాయి. చాలా గ్రామాలలో కూలీల కు డబ్బులు చెల్లించారు. గోద్మేగాం, రాంపూర్ కలాన్, చిన్నకొడప్గల్, కారేగాం, మార్దండ గ్రామాల కూలీల కు మాత్రం ఇప్పటికీ కూలి డబ్బులు అందలేదు . అప్ప టి టెక్నికల్ అసిస్టెంట్ విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఈ సమస్య ఏర్పడింది. ఈ ఐదు గ్రామాలలో సుమారు రెండు నుంచి మూడు వారాలపాటు పనులు జరిగాయి. కూలీలకు దాదాపు 70 లక్షల రూపాయలు రావాల్సి ఉంది. అప్పుడు టెక్నికల్ అసిస్టెంట్‌గా పనిచేసిన జ్ఞానేశ్వర్ పనికి సంబంధించిన మస్టర్లు సక్రమంగా నమోదు చేయలేదు. దీంతో చెల్లింపులు నిలిచిపోయాయి. చెమటోడ్చి కష్టపడి పనిచేసిన కూలీలు మాత్రం లబోదిబోమంటున్నారు. అధికారులకు ఈ విషయం గురించి ఎన్నిసార్లు విన్నవించినా ప్రయోజనం లేకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. దాదాపు 220 బృందాలలో ఒక్కొక్కరికీ రూ. 1600 నుంచి రూ. 2వేల వరకు రావాల్సి ఉంది. ఒక్కో బృందంలో పది నుంచి ఇరవై మంది వరకు కూలీలు ఉన్నారు. ‘ఉపాధి’ చట్టం ఏం చెబుతోంది ఉపాధి హామీ పథకం చట్టం పకడ్బందీగానే ఉంది. ఉపాధి పనులు చేసిన కూలీలకు 15 రోజులలో కూలీ చెల్లించాలనే నిబంధనలున్నాయి. అధికారులు వీటిని తుంగలో తొక్కారు. కూలీల ఆశలపై నీళ్లు చల్లారు. దరఖాస్తు చేసుకున్నవారికి పని కల్పించడంలో విఫలమైతే 25 శాతం కూలీ చెల్లిస్తామన్న అధికారులు, ఈ విషయంలో ఎందుకు బిల్లులు చేయడం లేదని కూలీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లక్షల రూపాయలు పెండింగ్‌లో ఉంటే ఎలా జీవించాలని ఆవేదన చెందుతున్నారు. బాధ్యులపై చర్యలేవీ? అపుడు ఈ పనులను సంబంధించి మస్టర్లు తయారు చేసిన టెక్నికల్ అసిస్టెంట్ జ్ఞానేశ్వర్ ఆ తర్వాత ఉద్యోగం మానేశారు. ఈ పనులను పర్యవేక్షించాల్సిన అధికారులూ పట్టించుకోలేదు. బాధ్యులపై ఎలాంటి చర్యలూ లేవు. ఇపుడూ, అపుడూ అంటూ కాలయాపన చేస్తున్నారు తప్పితే, సమస్యను పరిష్కరించే దిశగా మాత్రం ఎవ్వరూ చొరవ చూపడం లేదు. డబ్బులు చెల్లిస్తం -అప్రీం, ఈజీఎస్ ఏపీఎం గతంలో పనిచేసిన టెక్నికల్ అసిస్టెంట్ పొరపాటుతో ఇలా జరిగింది. ఈ విషయాన్ని డ్వామా పీడీ, జిల్లా కలెక్టర్‌తోపాటు, ఈజీఎస్ రాష్ట్ర డెరైక్టర్ దృష్టికీ తీసుకెళ్లాం. త్వరలోనే కూలీలకు డబ్బులు చెల్లిస్తాం. వాళ్లకు ఇబ్బంది లేకుండా చూస్తాం. బైట పనులు చేసినా పైసలొచ్చేవి ‘ఉపాధి’ కూలి పైసలు తొందరగా వస్తాయనుకున్నం. పనులు జరిగి నెలలు కావస్తున్నా రావడం లేదు. దీని కంటే బయట పని చేసినా పైసలు వచ్చేవి. ఒక్క టెక్నికల్ అధికారి పొరపాటుకు మేం ఎన్ని రోజులు బాధలు భరించాలి. అధికారులు దృష్టి సారించాలి. - శ్రీరాముల రాములు, గౌరారం ఎప్పుడూ ఇట్ల జరగలేదు రాంపూర్ గ్రామ సర్పంచ్‌గా పని చేసిన నేను ఉపాధి కోసం పనులకు వెళ్లాను. గతంలో ఎన్నో పనులను చేయించినా ఇలా జరగలేదు. లేకనే కూలికి వెళ్తున్నాం. సమ యానికి డబ్బులు రాకపోతే, ఎంతమంచి పథకం ఉన్న ఏం ప్రయోజనం. ఇప్పటికైనా అధికారులు స్పందించి కూలీల డబ్బులు చెల్లించాలి. -సార నారాయణ, గౌరారం