ఈపీఎఫ్‌ఓ ఖాతాదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. ఖాతాదారులు ఎలాంటి ప్రీమియం చెల్లించకుండా రూ.7లక్షల వరకు ప్రయోజనం పొందే అవకాశాల్ని కల్పిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.
ఎంప్లాయిస్ డిపాజిట్ లింక్‌డ్ ఇన్స్యూరెన్స్ (EDLI) స్కీమ్ లో భాగంగా 1976 సంవత్సారానికి చెందిన ప్రతి ఒక్క ప్రావిడెంట్ ఫండ్ లబ్ధి దారులకు రూ.7 లక్షల వరకు ప్రయోజనం చేకూర్చనున్నట్లు ఈపీఎఫ్‌ఓ అధికారికంగా ట్వీట్ చేసింది. ఈ ప్రయోజనం కేవలం బీమాకే కాకుండా ఇతర ప్రయోజనాలకు వర్తిస్తాయని ట్వీట్‌లో పేర్కొంది.
బీమా ప్రయోజనాలు
ఈపీఎఫ్ ఖాతాదారుడు మరణిస్తే , ఆ ఖాతాదారుడి చట్టపరమైన వారసుడు లేదా నామినీకి రూ. 7 లక్షల వరకు ప్రయోజనాలు చెల్లించబడతాయి. ప్రయోజనాలపై పరిమితి ఏప్రిల్ 2021 నుండి రూ.6 లక్షల నుండి రూ.7 లక్షలకు పెంచబడింది.
Salient Features of Employees' Deposit Linked Insurance (EDLI) Scheme, 1976.#EPFO #SocialSecurity #PF #Employees #ईपीएफओ #पीएफ #Services @byadavbjp @Rameswar_Teli @PMOIndia @DDNewslive @airnewsalerts @PIBHindi @PIB_India @MIB_India @mygovindia @PTI_News pic.twitter.com/eV3WCspEp0
— EPFO (@socialepfo) October 17, 2021
కనీస హామీ ప్రయోజనాలు
ఈడీఎల్‌ఐ పథకం 1976 కింద కనీస హామీ ప్రయోజనం కింద ఉద్యోగి మరణించిన తరువాత సంవత్సరం పాటు రూ. 2.5 లక్షలు చెల్లింపు ఉంటుంది.
7 లక్షల వరకు ఉచిత ప్రయోజనాలు
ఇక బీమా పథకం ప్రయోజనాలను పొందేందుకు ఉద్యోగులు ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. ఈపీఎఫ్, పీఎఫ్ ఖతాదారులకు ఇది ఉచితంగా అందిస్తుంది. ఈ బీమా పథకానికి సంబంధించిన ప్రీమియం యజమాని ద్వారా చెల్లించబడుతుంది. నెలవారీ వేతనంలో 0.50 శాతం రూ. 15,000 పరిమితితో ఉంటుంది.
పీఎఫ్ ఖాతాదారు/ఈపీఎఫ్
ఈపీఎఫ్‌ఓ సభ్యులు ఈ పథకం కింద ప్రయోజనం పొందేందుకు అప్లయ్ చేయాల్సిన అవసరం లేదు. సభ్యులు ఈపీఎఫ్ సభ్యులు లేదా చందాదారులు అయిన తర్వాత ఈడీఎల్‌ఐ స్కీమ్ ప్రయోజనాలకు అర్హులు.
డైరెక్ట్ బ్యాంక్ బదిలీ
ఈడీఎల్‌ఐ పథకం ప్రయోజనాలు నేరుగా నామినీ లేదా ఉద్యోగి యొక్క చట్టపరమైన వారసుని బ్యాంక్ ఖాతాకు లింక్ చేయబడతాయి. ఈపీఎఫ్ ఖాతాదారులు మరణించిన సందర్భంలో ప్రయోజనాలు నేరుగా ఈ బ్యాంక్ ఖాతాకు జమ చేయబడతాయి. అయితే, స్కీమ్ నామినీ లేదా చట్టపరమైన వారసుడు యొక్క ప్రయోజనాల క్లెయిమ్‌లను పొందడానికి ఫారమ్ 51F నింపి, ఈపీఎఫ్‌ఓకి సమర్పించాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment