అధిక పెన్షన్ కోసం దరఖాస్తు గడువు తేదీని పొడిగిస్తూ ఈపీఎఫ్‌వో కీలక నిర్ణయం తీసుకుంది. ధరఖాస్తు గడువును జూన్ 26 వరకు పెంచుతున్నట్లు తెలిపింది.
గత ఏడాది నవంబర్ 4న అధిక పెన్షన్ కోసం ధరఖాస్తు చేసుకోవాలని కేంద్రం కీలక ఉత్తర్వులను వెలువరించింది. అందుకు వీటిని ఆన్‌లైన్‌లో సమర్పించడానికి మార్చి 3 వరకు గడువు పెట్టగా.. తర్వాత చందాదారుల విజ్ఞప్తులు, సాంకేతిక కారణాల నేపథ్యంలో గడువును మే3 వరకు పొడిగించింది. తాజాగా దీనిని జూన్ 26 వరకూ పొడిగించినట్లు ఈపీఎఫ్‌వో తెలిపింది. కాగా, ఇప్పటివరకు 12 లక్షల దరఖాస్తులు వచ్చినట్టు వెల్లడించింది.
సమస్యల్ని పరిష్కరిస్తారా?
ఈపీఎఫ్‌వో అధిక పెన్షన్ కోసం అప్లయ్ చేస్తున్న చందదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. తాజా నిబంధనలకు అనుగుణంగా ఈపీఎఫ్‌వో పాస్‌బుక్‌లను అప్‌డేట్ చేసింది. కొత్త పాస్‌బుక్‌లను అందుబాటులో ఉంచింది. చందాదారులు యూఏఎన్ నంబర్ ద్వారా లాగిన్ అయి..కొత్త పాస్‌బుక్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. కానీ డౌన్‌లోడ్ కావడం లేదని చందదారులు వాపోతున్నారు. సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment