న్యూఢిల్లీ: ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు శుభవార్త తెలిపింది కేంద్రం. ఉద్యోగులకు పెద్ద ఉపశమనం కలిగించే విధంగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో చాలా మంది ఉద్యోగులు కంపెనీ మారే సందర్భంలో ప్రావిడెంట్ ఫండ్ ఖాతాను కొత్త సంస్థకు బదిలీచేయడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొనేవారు. కొత్త సంస్థకు పీఎఫ్ డబ్బులు బదిలీ చేయాలంటే తప్పని సరిగా పాత కంపెనీలో చివరి తేదీని నమోదు చేయాల్సి ఉంటుంది. కానీ కంపెనీలు కావాలనే ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేస్తుంటాయి. అయితే ఈ సమస్యకు పరిష్కారంగా ఈపీఎఫ్ఓ ఖాతాదారులు కంపెనీ మారినప్పుడు వారే స్వయంగా పాత కంపెనీలో పని చేసిన చివరి తేదీని ఈపీఎఫ్ఓ వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేసుకునే అవకాశం అందుబాటులోకి తీసుకొచ్చింది. పాత కంపెనీలో జాబ్ మానేసి వెళ్లిపోయిన రెండు నెలల తర్వాతే ఎగ్జిట్ డేట్ వివరాలు ఆప్‌డేట్ చేసుకోవడం సాధ్యం అవుతుంది.
ఈపీఎఫ్ఓ వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేసుకునే విధానం:
దశ 1: ఉద్యోగులు ఈపీఎఫ్ఓ వెబ్‌సైట్‌లో తమ యూఏఎన్ నంబర్, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వాలి.
దశ 2: ‘మేనేజ్’ ఆప్షన్‌లో కనిపించే ‘మార్క్ ఎగ్జిట్’ మీద క్లిక్ చేయాలి.
దశ 3: మీ పాత పిఎఫ్ ఖాతాను ఎంచుకోవాలి.
దశ 4: గతంలో పనిచేసిన కంపెనీలో ఉద్యోగం మానేయడానిక గల కారణాన్ని, చివరిగా పని చేసిన తేదీని నమోదు చేయాలి.
దశ 5: ‘రిక్వెస్ట్ ఓటీపీ’ మీద క్లిక్ చేస్తే ఆధార్‌తో లింక్ చేసిన మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని చెక్ బాక్స్‌లో అప్‌డేట్ చేయాలి.
దశ 6: ఓకే బటన్ మీద క్లిక్ చేస్తే క్లోజింగ్ డేట్ ప్రక్రియ పూర్తవుతుంది.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment