ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) నవంబర్ 2024 తాత్కాలిక పేరోల్ డేటాను విడుదల చేసింది. నవంబర్‌లో 14.63 లక్షల మంది సభ్యులు చేరినట్లు ఈపీఎఫ్ఓ తెలిపింది. 2024 అక్టోబర్‌తో పోలిస్తే ఇది 9.07 శాతం అధికం. 2023 నవంబర్‌తో పోలిస్తే ఈ సంఖ్యలో 4.88 శాతం పెరుగుదల నమోదైంది.
ఈపీఎప్‌వో తెలిపిన వివరాల ప్రకారం..
2024 నవంబర్‌లో సుమారు 8.74 లక్షల మంది ఈపీఎఫ్‌లో కొత్త సభ్యులు నమోదు చేసుకున్నారు. ఇది అక్టోబర్ 2024తో పోలిస్తే 16.58 శాతం అధికం.
18-25 సంవత్సరాల మధ్య వయసువారు అత్యధికంగా 4.81 లక్షల మంది కొత్తగా సభ్యులుగా చేరారు. ఇది మొత్తం కొత్త సభ్యుల్లో 54.97%గా ఉంది.
సుమారు 2.40 లక్షల మంది మహిళా సభ్యులు కొత్తగా చేరారు. ఇది అక్టోబర్ 2024తో పోలిస్తే 14.94% పెరుగుదలను సూచించింది.
ఇటీవల కొత్తగా చేరిన మొత్తం సభ్యుల్లో 20.86% వాటాతో మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలిచింది.
ఇదీ చదవండి: అమెరికా చమురు ఎగుమతులు పెంపు
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌ఓ) 7.6 కోట్లకుపైగా చందాదార్లకు ఇటీవల కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. యాజమాన్యం (కంపెనీ) నుంచి తనిఖీ లేదా ఈపీఎఫ్‌ఓ ఆమోదం లేకుండా ఉద్యోగులే వారి పేరు, పుట్టిన తేదీ, జాతీయత, లింగం, తల్లి/తండ్రి పేరు, జీవిత భాగస్వామి పేరు, కంపెనీలో చేరిన/రాజీనామా చేసిన తేదీ వంటి వ్యక్తిగత వివరాలను ఆన్‌లైన్‌లో మార్చుకునే వెసులుబాటును తెచ్చింది. అంతేగాక ఆధార్ ఓటీపీ సాయంతో ఈపీఎఫ్ ఖాతాను కొత్త కంపెనీకి బదిలీ చేసుకోవచ్చు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నట్టయితే యజమాని వద్ద పెండింగ్‌లో ఉన్న బదిలీ క్లెయిమ్ అభ్యర్థనను తొలగించి.. చందాదార్లు నేరుగా ఈపీఎఫ్‌ఓకు క్లెయిమ్‌ను సమర్పించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment