ఈపీఎఫ్ఓ సభ్యులకు 50వేల రూపాయలు
ఈపీఎఫ్ఓ సభ్యులకు 50వేల రూపాయలు
Published Thu, Apr 13 2017 12:20 PM | Last Updated on Tue, Sep 5 2017 8:41 AM
న్యూఢిల్లీ : రిటైర్మెంట్ ఫండ్ బాడీ ఈపీఎఫ్ఓ తన సబ్స్క్రైబర్లకు లోయల్టి కమ్ లైఫ్ బెనిఫిట్ ను ప్రకటించింది. దీని కింద రిటైర్మెంట్ సమయంలో 50వేల రూపాయల వరకు అందించనున్నట్టు తెలిపింది. అయితే ఈ స్కీమ్ లో 20 ఏళ్లపాటు ఫండ్ ను కంట్రిబ్యూట్ చేసి ఉండాల్సి ఉంటుంది. దివ్యాంగులైతే 20 కంటే తక్కువ ఏళ్లు ఫండ్ కంట్రిబ్యూట్ చేసినప్పటికీ 50 వేల రూపాయల బెనిఫిట్ ను అందించాలని ఈపీఎఫ్ఓ బోర్డు నిర్ణయించింది. చనిపోయిన సబ్స్క్రైబర్లకు కనీసం రూ.2.5 లక్షల మొత్తాన్ని ఇవ్వాలని ఈపీఎఫ్ఓ అత్యున్నత నిర్ణయ విభాగం, ట్రస్టీల కేంద్ర బోర్డు నిర్ణయించినట్టు తెలిసింది.
ప్రభుత్వ ఆమోదం అనంతరం ఈ ప్రయోజనాలను తమ సభ్యులకు అందుబాటులో ఉంచనుంది. ఈ ప్రతిపాదన ప్రకారం 20 ఏళ్ల పాటు స్కీమ్ లో కంట్రిబ్యూట్ చేసిన పదవి విరమణ చేసే సభ్యులందరికీ ఈ లోయల్టి-కమ్-బెనిఫిట్స్ ను అందుబాటులో ఉంచుతామని సీనియర్ అధికారులు చెప్పారు. బేసిక్ వేతనం 5వేల రూపాయల వరకు ఉన్నవారికి 30వేల రూపాయల బెనిఫిట్ ను, 5001-10000 రూపాయల వేతనం ఉన్న వారికి 40వేల రూపాయల బెనిఫిట్ ను ఈపీఎఫ్ఓ అందించనుంది. 10వేల కంటే ఎక్కువ వేతనం ఉన్నవారు 50వేల రూపాయల బెనిఫిట్ కు అర్హులని ఈపీఎఫ్ఓ ప్రకటించింది.
Advertisement