Rs 50
-
రూ.50 నకిలీ నోట్ల చలామణి
చేబ్రోలు: మండలంలో రూ.50ల నకిలీ నోట్ల చెలామణీ యథేచ్ఛగా కొనసాగుతుంది. రూ.500, రూ. వెయ్యి నోట్ల నకిలీ నోట్లు విచ్చలవిడిగా వస్తున్నాయనే కారణంతో 2016 నవంబర్‌లో వాటిని రద్దు చేసి కొత్త నోట్లను చలామణిలో తీసుకువచ్చారు. రూ.2వేలు, రూ.500ల నోట్ల మీద ప్రతి ఒక్కరికి నిఘా ఉండటం బ్యాంకుల్లోను యంత్రాల్లో పరిశీలిస్తుండటంతో పెద్ద నోట్లను వదిలిపెట్టి అక్రమార్కులు చిన్నపాటి నోట్లపై దృష్టి సారించారు. పెట్రోలు బంకులు, కిళ్లీ బంకులు, కిరాణా షాపులు, మెడికల్ షాపులు, బట్టల షాపులు ఇలా ప్రతి షాపుల్లోనూ నకిలీ నోట్ల చలామణి సాఫీగా సాగిపోతుంది. చేబ్రోలులో ఒక షాపులో నకిలీ రూ.50ల నోట్లను షాపు యజమాని గుర్తించి తీసుకోకపోవటంతో విషయం వెలుగులోకి వచ్చింది.నకిలీ నోట్లు అసలు నోటు మాదిరిగానే ఉండటంతో అధికారులు, ఉద్యోగులు కూడా గుర్తించలేని విధంగా అక్రమార్కులకు తయారు చేస్తున్నారు. బ్యాంకుల్లో, షాపుల్లో కూడా నకిలీ నోట్లు మారుతుండటం విశేషం. నకిలీ నోట్లు గుర్తించడం ఇలా... రూ.50 నోటు గాంధీ బొమ్మ వైపు ఆర్బీఐ పేరుతో వెండిగీత కనిపిస్తుండగా నకిలీ నోటుపై ఇవి కనిపించటం లేదు. అసలు నోటుపై భాగంలో చుక్కలు కనిపిస్తుండగా నకిలీ నోటులో ఉండటం లేదు. రూ.50ల అసలు నోటుకు పక్కన చుక్కలు, పద్మం లాగా ఉంది. కింద తయారీ సంవత్సరం ఉంది. నకిలీ నోటుకు అంచున పువ్వు గుర్తు మాత్రమే ఉండి చుక్కలు లేకుండా ఉన్నాయి. పార్లమెంటు బొమ్మ కింద ఉండాల్సిన ప్రింట్ అయిన సంవత్సరం ఉండటం లేదు. ఇలా తీక్షణంగా పరిశీలిస్తే అసలు నోటు నకిలీ నోటును గుర్తించవచ్చు. -
ఈపీఎఫ్ఓ సభ్యులకు 50వేల రూపాయలు
న్యూఢిల్లీ : రిటైర్మెంట్ ఫండ్ బాడీ ఈపీఎఫ్ఓ తన సబ్స్క్రైబర్లకు లోయల్టి కమ్ లైఫ్ బెనిఫిట్ ను ప్రకటించింది. దీని కింద రిటైర్మెంట్ సమయంలో 50వేల రూపాయల వరకు అందించనున్నట్టు తెలిపింది. అయితే ఈ స్కీమ్ లో 20 ఏళ్లపాటు ఫండ్ ను కంట్రిబ్యూట్ చేసి ఉండాల్సి ఉంటుంది. దివ్యాంగులైతే 20 కంటే తక్కువ ఏళ్లు ఫండ్ కంట్రిబ్యూట్ చేసినప్పటికీ 50 వేల రూపాయల బెనిఫిట్ ను అందించాలని ఈపీఎఫ్ఓ బోర్డు నిర్ణయించింది. చనిపోయిన సబ్స్క్రైబర్లకు కనీసం రూ.2.5 లక్షల మొత్తాన్ని ఇవ్వాలని ఈపీఎఫ్ఓ అత్యున్నత నిర్ణయ విభాగం, ట్రస్టీల కేంద్ర బోర్డు నిర్ణయించినట్టు తెలిసింది. ప్రభుత్వ ఆమోదం అనంతరం ఈ ప్రయోజనాలను తమ సభ్యులకు అందుబాటులో ఉంచనుంది. ఈ ప్రతిపాదన ప్రకారం 20 ఏళ్ల పాటు స్కీమ్ లో కంట్రిబ్యూట్ చేసిన పదవి విరమణ చేసే సభ్యులందరికీ ఈ లోయల్టి-కమ్-బెనిఫిట్స్ ను అందుబాటులో ఉంచుతామని సీనియర్ అధికారులు చెప్పారు. బేసిక్ వేతనం 5వేల రూపాయల వరకు ఉన్నవారికి 30వేల రూపాయల బెనిఫిట్ ను, 5001-10000 రూపాయల వేతనం ఉన్న వారికి 40వేల రూపాయల బెనిఫిట్ ను ఈపీఎఫ్ఓ అందించనుంది. 10వేల కంటే ఎక్కువ వేతనం ఉన్నవారు 50వేల రూపాయల బెనిఫిట్ కు అర్హులని ఈపీఎఫ్ఓ ప్రకటించింది. -
పెంపుడు జంతువులతో రోడ్లపైకి వస్తే బాదుడే !
-
కంటెంట్ ఇస్తే నెలకు రూ. 50వేలు
టాప్ కంటెంట్ రైటర్లకు యూసీవెబ్ ఆఫర్ న్యూఢిల్లీ: చైనా వ్యాపార దిగ్గజం ఆలీబాబా గ్రూప్ సంస్థ యూసీవెబ్ తాజాగా తమ వుయ్ మీడియా ప్లాట్‌ఫాంకి నాణ్యమైన కంటెంట్ అందజేసేవారికి నెలకు కనీసం రూ. 50,000 చెల్లించనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుత సంవత్సరంలో యూసీ న్యూస్ కోసం అత్యుత్తమ నైపుణ్యం గల 1,000 మంది కంటెంట్ క్రియేటర్స్, రైటర్స్‌ను ఎంపిక చేయనున్నట్లు యూసీ వెబ్ సహ వ్యవస్థాపకుడు హె షియావోపెంగ్ తెలిపారు. వుయ్ మీడియాలో నమోదు చేసుకున్న యూజర్లు తమ సొంత కథనాలు, ఫొటోలు, వీడియోలు మొదలైనవి పోస్ట్ చేయొచ్చు. ఇంటర్నెట్ దిగ్గజాలు గూగుల్, ఫేస్బుక్ మొదలైన వాటితో యూసీవెబ్ పోటీపడుతోంది. ఇందులో భాగంగా కంటెంట్ అందించేలా భారత యూజర్లను ప్రోత్సహించేందుకు దాదాపు రూ. 5 కోట్లు కేటాయించింది. రాబోయే రెండేళ్లలో భారత్‌లో కంటెంట్ పంపిణీ కోసం సుమారు రూ. 200 కోట్లు ఇన్వెస్ట్ చేస్తోంది. -
పన్నువడ్డింపుపై క్లారిటీ!
న్యూఢిల్లీ: నగదు లావాదేవీలపై వడ్డించనున్న పన్నులపై ఆర్థిక శాఖ వివరణ ఇచ్చింది. ముఖ్యమంత్రుల కమిటీ ఇచ్చిన సిఫారసులపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని మంత్రిత్వశాఖ బుధవారం తెలిపింది. రూ50 వేలు, ఆ పైన నగదు లావాదేవీలపై పన్ను విధించే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని స్పష్టం చేసింది. కమిటీ ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక సమర్పించింది. ప్రభుత్వం ఇంకా సంఘం సిఫారసులపై తుది అభిప్రాయాన్ని తీసుకోలేదని తెలిపింది. కమిటీ సిఫారసుల ను జాగ్రత్తగా పరిశీలించినమీదట తగిన నిర్ణయంతీసుకుంటామని ఒక ప్రకటలో మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కమిటీ రూ.50వేలకు పైన విత్ డ్రాల పై పన్ను విధించాల్సిందిగా మంగళవారం కేంద్రానికి సిఫారసు చేసింది. అలాగే క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్ పై వడ్డీని రద్దుచేయాలని, తద్వారా డిజిటల్ లావాదేవీలకు ప్రోత్సాహకాలు అందించాలని తెలిపింది. అన్ని లావాదేవీలను పూర్తి ఉచితంగా నిర్వహించాలని, నగదు చెల్లింపులకంటే డిజిటల్ చెల్లింపులు లాభదాయకంగా ఉండేలా ప్రోత్సహించాలని కోరింది. ఎవరైనా కొంత భాగాన్ని డిజిటల్ రూపంలో ఖర్చు చేసే వినియోగదారులకు ఆ మేరకు పన్ను వెనక్కు ఇవ్వాలని సూచించింది. మెట్రో నగరాల్లోని బస్సులు, సబర్బన్ రైళ్లలో కాంటాక్ట్‌లెస్ చెల్లింపులను ప్రోత్సహించాలని సూచించాలని కోరారు. అలాగే, ఐటీ పరిధిలోకి రానివారికి స్మార్ట్‌ఫోన్ కొనుగోలుకు రూ.వెయ్యి, బయోమెట్రిక్ కొనుగోలుకు రూ.వెయ్యి రాయితీ ఇవ్వాలని చెప్పింది. అప్పుడే ప్రజలు నగదు రహిత లావాదేవీలకు ఆకర్షితులవుతారని పేర్కొన్న సంగతి తెలిసిందే. -
విమానయాన సంస్థలకు షాకిచ్చిన ఎన్జీటీ
న్యూఢిల్లీ: విమానయాన సంస్థలకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ షాకిచ్చింద. విమానాల్లోని మానవ వ్యర్థాలను గృహాలపై విడిచిపెట్టడంపై మండి పడింది. దీనికి సంబంధించి సర్క్యులర్ జారీ చేయాల్సిందిగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఎ) ని ఆదేశించింది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం పరిసర ప్రాంతంలో నివిసించే మాజీ సైనిక అధికారి లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) సాత్వంత్ సింగ్ దహియా దాఖలు చేసిన పిటీషన్ పై విమానయాన సంస్థలకు షాకిచ్చిన ఎన్జీటీ అధ్యక్షుడు స్వతంత్ర కుమార్ ఈ ఆదేశాలిచ్చారు.. స్వచ్ఛ్ భారత్ అభియాన్ కి విమానయాన సంస్థ చర్యలు విఘాతం కలిగిస్తున్నాయన్న సైనిక అధికారి వాదనలను ట్రిబ్యునల్ సమర్ధించింది. విమానాల టాయిలెట్ ట్యాంకులను గాల్లోనే ఖాళీచేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎన్జీటీ డీజీసీఎ కి కొన్ని సూచనలు చేసింది. ముఖ్యంగా ఇలా వ్యవహరించే విమానయాన సంస్థలకు రూ .50,000 జరిమానా విధించాలని డీజీసీఏ ని కోరింది. జరిమానా ద్వారా సేకరించిన సొమ్మను సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు(సీపీసీబీ) వద్ద డిపాజిట్ చేయాలని కోరింది. సంబంధిత ఫిర్యాదులకో్సం ఒక హెల్ప్ లైన్ , ఈ మెయిల్ క్రియేట్ చేయాల్సిందిగా ఆదేశించింది. మరోవైపు సీపీసీబీ కూడా ఎయిర్ లైన్స్ చర్యపై విస్మయం వ్యక్తంచేసింది. ఫిర్యాదు దారు ఇంటిదగ్గర సేకరించిన సాంపిల్స్ ను పరీక్షించగా, అవి మానవ వ్యర్థాలుగా తేలిందని పేర్కొన్నారు. విమానాలు ల్యాండ్ అయినపుడు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో టాయిలెట్ ట్యాంకులు ఖాళీగా ఉండడం గమనించామని తెలిపింది. అయితే ఈ ఆరోపణలను విమాన మంత్రిత్వ శాఖ ఖండించింది. విమానం ల్యాండ్అయిన తరువాత సాధారణంగా వాటిని శుభ్రం చేస్తారని పేర్కొంది. అయితే ఏవియేషన్ అధికారులు టాయిలెట్ ట్యాంక్ లీక్ అయివుండంచ్చని తెలపడం విశేషం. -
త్వరలో రూ.100, రూ.50 కూడా..
న్యూఢిల్లీ: భారత కరెన్సీలో మరి కొన్ని నోట్లు మారనున్నాయి. ఇప్పటికే రూ.500, రూ.1000 నోట్లు రద్దయిపోయి వాటి స్థానంలో కొత్తగా రూపొందించిన రూ.500 నోట్లు, రూ.2000 నోట్లు వస్తుండగా త్వరలోనే రూ.50, రూ.100 నోట్లు కూడా మారనున్నాయి. కొత్త డిజైన్, కొత్త కలర్‌తోపాటు కొన్ని రక్షణ సంబంధమైన సదుపాయాలతో ఈ నోట్లు విడుదల కానున్నాయి. పెద్ద నోట్ల రద్దు చేసి కొత్త నోట్లు ఇస్తున్నప్పటికీ పలు చోట్ల ఇంకా అనుమానాలు ఉన్న నేపథ్యంలో గురువారం కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ, ఆర్థిక కార్యదర్శి శక్తికాంతా దాస్ మీడియాతో మాట్లాడుతూ వివరణలు ఇచ్చారు. బ్లాక్ మనీని తుడిచిపెట్టేందుకు తాజా నిర్ణయం అని మరోసారి పునరుద్ఘాంటించారు. కొత్త రక్షణ చర్యలతో సరికొత్త డిజైన్‌తో త్వరలోనే రూ.1000నోట్లు మళ్లీ వస్తాయని, ఆ తర్వాత రూ.100, రూ.50 నోట్లు మారతాయని చెప్పారు. ప్రస్తుతానికి ఉన్న నోట్లను నిరభ్యంతరంగా ఉపయోగించుకోవచ్చని కూడా తెలిపారు. -
మెట్రో చార్జీ రూ.50కి పెంపు
కేకే.నగర్: కోయంబేడు విమానాశ్రయానికి మెట్రో రైలు చార్జీలను రూ.50గా నిర్ణయించారు. చెన్నైలోని మెట్రో రైలు సేవలు మొదటి విడతగా ఆలందూర్ - కోయంబేడు మార్గంలో నడుస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మెట్రో రైలు వంతెనపైన నడుస్తున్నాయి. పది కిలోమీటర్ల దూరం గల ఈ రైలు సేవలకు ప్రారంభం రూ.10 నుంచి రూ.40గా నిర్ణయించారు. ఈ చార్జీల ధర అధికంగా ఉందని మెట్రో రైలు ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు. ఇతర నగరాలలో కంటే చెన్నైలో ఈ చార్జీలు అధికంగా ఉన్నాయని ప్రజలు తెలిపారు. పలు వర్గాల వారు చార్జీలు అధికంగా ఉన్నాయని వాటిని తగ్గించాలని కోరినా మెట్రో రైలు నిర్వాహకం చార్జీలను తగ్గించలేదు. ఈ స్థితిలో చిన్నమలై - విమానాశ్రయం మధ్య 2వ విడత మెట్రో రైలు సేవలను త్వరలో ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సేవలు ప్రారంభించే పక్షంలో కోయంబేడు - విమానాశ్రయం వరకు 15 కి.మీ దూరానికి కొత్త చార్జీలను నిర్ణయించనున్నారు. ప్రస్తుతం గల చార్జీల కంటే అదనంగా రూ.10 కలిపి రూ.50గా నిర్ణయించడంపై పరిశీలనలు జరుగుతున్నాయి. దీనిపై అధికారి ఒకరు కోయంబేడు నుంచి చెన్నై విమానాశ్రయానికి వెళ్లడానికి రూ.50 చార్జీగా నిర్ణయించడం న్యాయమైన విషయమని అది ఎక్కువ ధర కాదని అన్నారు. -
కులాంతర పెళ్లికి 50 వేల పన్ను
కతిహార్: భిన్నంగా వ్యవహరిస్తూ మరోసారి బీహార్ కు చెందిన ఓ పంచాయతీ తీరు వార్తల్లోకి ఎక్కింది. కులాంతర వివాహం చేసుకున్న ఓ యువజంటకు అక్షరాల రూ.50 వేల రూపాయల పన్ను వేసింది. కతిహార్ జిల్లాలోని గోగ్రా గ్రామానికి చెందిన చోటు యాదవ్ తన పక్క గ్రామం అయిన రోహియాకు చెందిన సోని కుమాయ్ అనే మరో కులానికి చెందిన అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. అనంతరం వారిద్దరు కతిహార్ లోకల్ కోర్టులో వివాహం చేసుకున్నారు. ఇదే కోర్టులోని హోటల్లో చోటు పనిచేస్తాడు. ఈ పెళ్లికి ముందు పెద్దల నుంచి సమస్యలు వచ్చినా తదనంతరం అంగీకరించారు. అయితే, తాజాగా వారు సొంత గ్రామానికి వచ్చినప్పుడు మాత్రం అసలు సమస్య మొదలైంది. గత నెలలో ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసిన పంచాయతీ పెద్దలు కులాంతర వివాహం చేసుకున్నవారిరువురికి రూ.50 వేలు ట్యాక్స్ వేశారట. అది చెల్లించకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కూడా నోటీసులు జారీ చేశారట. దీంతో చోటు యాదవ్ బుధవారం ఈ వివరాలు మీడియాకు తెలిపాడు. తాము చాలా పేదవాళ్లమని, అంత డబ్బు చెల్లించలేమని చెప్పినా వినకుండా బెదిరించి మరి ఫైన్ వేశారని వాపోయాడు.