త్వరలో రూ.100, రూ.50 కూడా.. | New Series of Rs 100, Rs 50 Notes With a Different Design Soon | Sakshi
Sakshi News home page

త్వరలో రూ.100, రూ.50 కూడా..

Published Thu, Nov 10 2016 3:32 PM | Last Updated on Tue, Oct 2 2018 4:19 PM

త్వరలో రూ.100, రూ.50 కూడా.. - Sakshi

త్వరలో రూ.100, రూ.50 కూడా..

న్యూఢిల్లీ: భారత కరెన్సీలో మరి కొన్ని నోట్లు మారనున్నాయి. ఇప్పటికే రూ.500, రూ.1000 నోట్లు రద్దయిపోయి వాటి స్థానంలో కొత్తగా రూపొందించిన రూ.500 నోట్లు, రూ.2000 నోట్లు వస్తుండగా త్వరలోనే రూ.50, రూ.100 నోట్లు కూడా మారనున్నాయి. కొత్త డిజైన్, కొత్త కలర్తోపాటు కొన్ని రక్షణ సంబంధమైన సదుపాయాలతో ఈ నోట్లు విడుదల కానున్నాయి.

పెద్ద నోట్ల రద్దు చేసి కొత్త నోట్లు ఇస్తున్నప్పటికీ పలు చోట్ల ఇంకా అనుమానాలు ఉన్న నేపథ్యంలో గురువారం కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ, ఆర్థిక కార్యదర్శి శక్తికాంతా దాస్ మీడియాతో మాట్లాడుతూ వివరణలు ఇచ్చారు. బ్లాక్ మనీని తుడిచిపెట్టేందుకు తాజా నిర్ణయం అని మరోసారి పునరుద్ఘాంటించారు. కొత్త రక్షణ చర్యలతో సరికొత్త డిజైన్తో త్వరలోనే రూ.1000నోట్లు మళ్లీ వస్తాయని, ఆ తర్వాత రూ.100, రూ.50 నోట్లు మారతాయని చెప్పారు. ప్రస్తుతానికి ఉన్న నోట్లను నిరభ్యంతరంగా ఉపయోగించుకోవచ్చని కూడా తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement