Rs 100
-
పసిడి ధరలు వెల వెల
న్యూఢిల్లీ: దేశీ మార్కెట్లో బంగారం ధర వెలవెలబోతోంది. వరుసగా సెషన్లుగా క్షీణిస్తున్న పుత్తడి ధరలు మంగళవారం మరింత దిగి వచ్చాయి. విదేశీ ధోరణి, స్థానిక నగల దుకాణదారుల నుంచి డిమాండ్ తగ్గడంతో పసిడి దిగి వస్తోంది. అయితే వెండి ధరలుమాత్రం స్థిరంగా ఉన్నాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటున్న కారణంగా ఇకపై ద్రవ్యోల్బణం బలపడనున్నట్లు ఫెడ్ అధికారులు తాజాగా పేర్కొనడంతో డాలరు ఇండెక్స్ 97కు బలపడింది. ఇది పరోక్షంగా దేశీయ కరెన్సీ, పసిడిలో అమ్మకాలకు కారణమైంది. అటు ఫ్రాన్స్‌లోనూ సుస్థిర ప్రభుత్వం ఏర్పాటుకావడం, బ్రెక్సిట్ చర్చలు మొదలుకావడం వంటి అంశాలు స్టాక్ మార్కెట్లకు ప్రోత్సాహాన్నివ్వగా పసిడిపట్ల విముఖతను పెంచుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. దేశ రాజధానిలో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత పది గ్రాముల ధర రూ. 100 తగ్గి రూ. 29,000, రూ .28,850 వద్ద ఉన్నాయి. నిన్న రూ. 70 పడిపోయింది. అయితే సావరిన్ ఎనిమిది గ్రాముల బంగారం ధర రూ. 24,400 గా నమోదైంది. మరోవైపు వెండి కేజీ ధర రూ. 38,700 వద్ద ఉంది. వారాంతపు ఆధారిత డెలివరీ ధర రూ.60 పెరిగి కు రూ .38,300 కి చేరుకుంది. అటు ఎంసీఎక్స్ మార్కెట్ లో పది గ్రా. బంగారం ధర రూ. 28, 547 వద్ద ఉంది. -
ఐడియా ‘జాక్‌పాట్’ ఆఫర్
న్యూఢిల్లీ: సమ్మర్ సర్ప్రైజ్ అంటూ ఖాతాదారులను ఊరించిన రిలయన్స్ జియోకు ట్రాయ్ షాకిస్తే.. మరో టాప్ టెలికాం ఆపరేటర్ ఐడియా సెల్యులర్ మాత్రం కూల్ కూల్ ఆఫర్ తో దూసుకువచ్చింది. తన పోస్ట్ పెయిడ్ కస్టమర్లకోసం 'డేటా జాక్‌పాట్' ఆఫర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్ ప్రకారం నెలకు రూ.100కే 10 జీబీ డాటాను అందించనుంది. పరిమిత కాలానికి దీన్ని లాంచ్ చేసింది. ఈ ప్రమోషనల్ ఆఫర్ గా లాంచ్ చేసిన ఈ జాక్‌పాట్ ఆఫర్ కేవలం మూడు నెలల కాలానికి చెల్లుబాటులో ఉంటుంది. ఇందులో రూ.100కి నెలకు 10 జీబీ డేటా, రూ .300కు నెలకు 30జీబీ అందించనున్నట్టు ఐడియా ప్రకటించింది. అంతేకాదు ఈ మూడు నెలల కాలం అయిపోయిన తరువాత కూడా ఫ్రీ డేటా ఆఫర్ కంటిన్యూ అవుతుంది. ఎలా అంటే..రూ.100రీచార్జ్‌పై 1జీబీ డేటాను అదనంగా అందించనుంది. మై ఐడియా యాప్ ద్వారా మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. అయితే ఈ ప్రయోజనాలు ఆయా ప్రాంతాల్లో భిన్నంగా ఉండొచ్చని తెలిపింది. -
త్వరలో రూ.100, రూ.50 కూడా..
న్యూఢిల్లీ: భారత కరెన్సీలో మరి కొన్ని నోట్లు మారనున్నాయి. ఇప్పటికే రూ.500, రూ.1000 నోట్లు రద్దయిపోయి వాటి స్థానంలో కొత్తగా రూపొందించిన రూ.500 నోట్లు, రూ.2000 నోట్లు వస్తుండగా త్వరలోనే రూ.50, రూ.100 నోట్లు కూడా మారనున్నాయి. కొత్త డిజైన్, కొత్త కలర్‌తోపాటు కొన్ని రక్షణ సంబంధమైన సదుపాయాలతో ఈ నోట్లు విడుదల కానున్నాయి. పెద్ద నోట్ల రద్దు చేసి కొత్త నోట్లు ఇస్తున్నప్పటికీ పలు చోట్ల ఇంకా అనుమానాలు ఉన్న నేపథ్యంలో గురువారం కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ, ఆర్థిక కార్యదర్శి శక్తికాంతా దాస్ మీడియాతో మాట్లాడుతూ వివరణలు ఇచ్చారు. బ్లాక్ మనీని తుడిచిపెట్టేందుకు తాజా నిర్ణయం అని మరోసారి పునరుద్ఘాంటించారు. కొత్త రక్షణ చర్యలతో సరికొత్త డిజైన్‌తో త్వరలోనే రూ.1000నోట్లు మళ్లీ వస్తాయని, ఆ తర్వాత రూ.100, రూ.50 నోట్లు మారతాయని చెప్పారు. ప్రస్తుతానికి ఉన్న నోట్లను నిరభ్యంతరంగా ఉపయోగించుకోవచ్చని కూడా తెలిపారు. -
విమానయానం...భారత్‌లోనే చౌక