ఐడియా ‘జాక్‌పాట్’ ఆఫర్‌‌ | Idea Data Jackpot offer gives 10GB data for Rs 100, takes on Jio Summer Surprise | Sakshi
Sakshi News home page

ఐడియా ‘జాక్‌పాట్’ ఆఫర్‌‌

Published Fri, Apr 7 2017 8:36 AM | Last Updated on Tue, Sep 5 2017 8:11 AM

ఐడియా ‘జాక్‌పాట్’ ఆఫర్‌‌

ఐడియా ‘జాక్‌పాట్’ ఆఫర్‌‌

న్యూఢిల్లీ:   సమ్మర్‌ సర్‌ప్రైజ్‌ అంటూ  ఖాతాదారులను ఊరించిన  రిలయన్స్‌ జియోకు   ట్రాయ్‌ షాకిస్తే.. మరో టాప్‌ టెలికాం ఆపరేటర్ ఐడియా సెల్యులర్‌ మాత్రం కూల్‌ కూల్‌ ఆఫర్‌ తో దూసుకువచ్చింది.  తన పోస్ట్ పెయిడ్‌ కస్టమర్లకోసం  'డేటా జాక్‌పాట్' ఆఫర్  ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌  ప్రకారం నెలకు రూ.100కే 10 జీబీ డాటాను అందించనుంది.   పరిమిత కాలానికి  దీన్ని లాంచ్‌ చేసింది.
 
ఈ ప్రమోషనల్‌ ఆఫర్‌ గా లాంచ్‌ చేసిన ఈ జాక్‌పాట్‌ ఆఫర్‌ కేవలం మూడు నెలల కాలానికి చెల్లుబాటులో ఉంటుంది. ఇందులో రూ.100కి నెలకు 10 జీబీ డేటా,  రూ .300కు నెలకు  30జీబీ అందించనున్నట్టు   ఐడియా ప్రకటించింది. అంతేకాదు  ఈ మూడు నెలల కాలం అయిపోయిన తరువాత కూడా  ఫ్రీ డేటా ఆఫర్‌ కంటిన్యూ అవుతుంది.  ఎలా అంటే..రూ.100రీచార్జ్‌పై 1జీబీ డేటాను అదనంగా అందించనుంది.

మై ఐడియా యాప్‌ ద్వారా మాత్రమే ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుంది. అయితే  ఈ ప్రయోజనాలు  ఆయా ప్రాంతాల్లో భిన్నంగా ఉండొచ్చని తెలిపింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement